కామెట్ EVని రూ. 7.98 లక్షలతో ప్రారంభించిన MG; టాటా టియాగో EV కంటే తక్కువ ధర

ఎంజి కామెట్ ఈవి కోసం tarun ద్వారా ఏప్రిల్ 26, 2023 04:33 pm ప్రచురించబడింది

  • 49 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది విస్తృతమైన అనుకూలీకరణ ఎంపికలతో పూర్తిగా లోడ్ చేయబడిన ఒకే ఒక వేరియంట్లో అందుబాటులో ఉంది

MG Comet EV

MG కామెట్ EV ధరలు విడుదల చేయబడ్డాయి! ఈ రెండు-డోర్ల అల్ట్రా-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ రూ. 7.98 లక్షలకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ప్రస్తుతానికి ప్రారంభ ధరలు మాత్రమే వెల్లడి చేయబడ్డాయి, వేరియంట్ వారీగా ధరలు మే లో విడుదల కానున్నాయి. బుకింగ్‌లు మే 15 నుండి తెరవబడతాయి అలాగే టెస్ట్ డ్రైవ్‌లు ఏప్రిల్ 27 నుండి ప్రారంభమవుతాయి.

కొలతలు      

పొడవు

2974మి.మీ

వెడల్పు

1505మి.మీ

ఎత్తు

1640మి.మీ

వీల్ బేస్

2010మి.మీ

కామెట్ EV అనేది ఉప-3-మీటర్ల ఎంపిక, ఈరోజుల్లో కొనుగోలుదారులు ఎంచుకునే వాహనాలలో ఇది అతి చిన్న కారుగా ఉంది అలాగే నగరాలలో ప్రయాణాలకు తగినదిగా కూడా ఉంది. ఇది రెండు-డోర్ల హ్యాచ్‌బ్యాక్, దీనిలో నలుగురు వ్యక్తులు కూర్చునే అవకాశం ఉంది. దీని కొలతలను చూసినట్లయితే, పొడవు టాటా నానో (3099 మిమీ) కంటే చిన్నది కానీ ఆల్టో 800 (1490 మిమీ) కంటే వెడల్పుగా ఉంది. నిజానికి దీనిలో బూట్ స్పేస్ లేదు కానీ అవసరం అయినప్పుడు వెనుక సీట్లు మడవటం ద్వారా బూట్ స్పేస్ ను సృష్టించుకోవచ్చు.

MG Comet EV

బ్యాటరీ, పరిధి మరియు ఇతర స్పెసిఫికేషన్‌లు

బ్యాటరీ

17.3kWh

పరిధి (క్లెయిమ్ చేయబడింది)

230 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ మోటార్

42పిఎస్

టార్క్

110ఎన్ఎమ్

3.3kW ఛార్జర్‌తో 0-100 శాతం ఛార్జ్

7 గంటలు

3.3kW ఛార్జర్‌తో 10-80 శాతం ఛార్జ్

5 గంటలు

కామెట్ EV ఒక బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, దీని పరిధి 230 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది రేర్-యాక్సిల్ మౌంటెడ్ మోటారును కలిగి ఉంది, ఇది 42PS వరకు పవర్ ను విడుదల చేస్తుంది. దాదాపు ఏడు గంటల్లో 3.3kW ఛార్జర్‌ ని ఉపయోగించి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే ఛార్జర్ తో 10-80 శాతం ఛార్జ్ చేయడానికి ఐదు గంటల వరకు సమయం పడుతుంది. ఇది వేగంగా ఛార్జింగ్ అయ్యే సామర్థ్యాలను కలిగి లేదు, కానీ మీరు అత్యవసర పరిస్థితులలో తక్కువ సామర్థ్యంతో కూడిన పబ్లిక్ స్టేషన్‌లలో ఉండే సాకెట్లతో కూడా ఛార్జ్ చేయవచ్చు.

MG Comet EV

లక్షణాలు

ఫీచర్ల పరంగా, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అన్ని MGల మాదిరిగానే అనేక ఫీచర్ల జాబితాను పొందుతుంది: అవి వరుసగా 

  • LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌ల్యాంప్‌లు
  • టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డ్రైవర్ డిస్‌ప్లే కోసం డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే
  • 55 కనెక్టెడ్ కారు ఫీచర్లు - వాయిస్ కమాండ్, రిమోట్ ఆపరేషన్, డిజిటల్ కీ మరియు మరిన్ని
  • రిమోట్ సెంట్రల్ లాకింగ్
  • కీలెస్ ఎంట్రీ
  • టిల్ట్ సర్దుబాటుతో లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్
  • ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3 USB పోర్ట్‌లు
  • పవర్ సర్దుబాటు చేయగల ORVMలు

'ఇంటర్నెట్ ఇన్‌సైడ్' బ్రాండింగ్ కామెట్ EVలో కూడా కనుగొనబడింది, ఇది హింగ్లీష్, ఆన్‌లైన్ మ్యూజిక్ యాప్, డిజిటల్ కీ, రిమోట్ ఆపరేషన్ ద్వారా AC ఆన్/ఆఫ్ మరియు అధునాతన టెలిమాటిక్స్‌లో వాయిస్ కమాండ్‌లను కలిగి ఉంటుంది.

భద్రతా లక్షణాలు

ప్రయాణీకులకు అత్యధిక భద్రతను నిర్ధారించడానికి అనేక అంశాలను కలిగి ఉంది:

  • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • EBDతో ABS
  • IP67 బ్యాటరీ
  • వెనుక పార్కింగ్ కెమెరా
  • LED వెనుక ఫాగ్ ల్యాంప్
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ వ్యవస్థ
  • నాలుగు సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ మరియు మూడు-పాయింట్ సీట్‌బెల్ట్‌లు
  • ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు
  • మాన్యువల్ డే/నైట్ IRVM

MG Comet EV

రంగులు

MG సంస్థ, కామెట్ EVని ఐదు ప్రాథమిక రంగులలో అందిస్తుంది. అవి వరుసగా- స్టార్రి బ్లాక్ రూఫ్ తో ఆపిల్ గ్రీన్, స్టార్రి బ్లాక్ రూఫ్ తో క్యాండీ వైట్, స్టార్రీ బ్లాక్, అరోరా సిల్వర్ మరియు క్యాండీ వైట్. మీ కామెట్‌ మరింత స్టైలిష్ గా కనబడటం కోసం మీరు అనేక స్టిక్కర్‌లు, గ్రాఫిక్‌లు మరియు అనుకూలీకరణ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు.

ప్రత్యర్థులు

కామెట్ EVకి ప్రత్యక్ష పోటీదారు లేరు, ఎందుకంటే ఇది అమ్మకానికి ఉన్న అతి చిన్న EV. అయితే, ధరల పరంగా, ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాటికి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎంజి Comet EV

2 వ్యాఖ్యలు
1
D
dr subhashini
Apr 29, 2023, 8:34:31 AM

Hope it captures the market and insist public to shift on EV.

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    G
    gb muthu
    Apr 27, 2023, 5:08:25 AM

    Hope it does well, to the point that Tata introduces e.nano.

    Read More...
      సమాధానం
      Write a Reply
      Read Full News

      explore మరిన్ని on ఎంజి కామెట్ ఈవి

      సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

      *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

      ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

      • పాపులర్
      • రాబోయేవి
      ×
      We need your సిటీ to customize your experience