• English
  • Login / Register

భారతదేశంలో రాబోతున్న 2016 ఆడి ఏ4 బహిర్గతం

ఆడి ఏ4 2015-2020 కోసం raunak ద్వారా జూన్ 29, 2015 04:18 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ కొత్త ఏ4, అవుట్గోయింగ్ మోడల్ పోలిస్తే 25 మిల్లీమీటర్ల ఎక్కువ పొడవు, 12 మిల్లీమీటర్ల ఎక్కువ వీల్బేస్, ఆడి యొక్క 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ తో పాటు పాత దాని కంటే తేలికగా రాబోతుంది. అంటే సుమారు 120 కేజీల బరువు తో రాబోతుంది.

జైపూర్: ఆడి యొక్క తదుపరి తరం 2016 ఏ4 ను బహిర్గతం చేసింది. ఈ సెడాన్ ను యూరోప్ లో వచ్చే సంవత్సరం నుండి అమ్మకాలు జరుపనుంది. ఈ కొత్త ఏ4 ను భారతదేశం లో, వచ్చే సంవత్సరం లేదా ఈ సంవత్సరం చివరిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. ఈ కొత్త ఏ4, గణనీయమైన మార్పులు పొందింది, కొత్త ఫీచర్లతో పాటు శక్తివంతమైన ఇంజిన్లు మరియు ట్రాన్స్మిషన్ లతో రాబోతుంది.

డిజైన్ గురించి చెప్పాలంతే, ప్రస్తుతం ఉన్న మోడల్ కు ఫేస్లిఫ్ట్ వెర్షన్ లా కనిపించబోతుంది. అయితే, ప్రస్తుత మోడల్ ఒక పొడవైన మరియు విశాలమైన బాడీ ను కలిగి ఉంది. బాహ్య బాగం విషయానికి వస్తే, ఒక కొత్త పెద్ద సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ (క్యూ సిరీస్ లో ఉండే కొత్త పెద్ద సింగిల్ ఫ్రేమ్ గ్రిల్) తో రాబోతుంది. దీని యొక్క హెడ్ లైట్ క్లస్టర్ నవీకరించబడినది. ఎల్ఈడి మరియు మాట్రిక్స్ ఎల్ఈడి లైటింగ్ లు ఆప్షనల్ గా అందించబడతాయి. అంతేకాకుండా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు కొత్తగా అందించబడతాయి. ఈ సిడాన్ ముందు తరం దాని కంటే పదునైనది గానూ మరియు పాత దానిలో ఉండే క్రేజ్ లైన్స్ పూర్తిగా గుర్తించబడవు.

దీని వెనుక భాగం విషయానికి వస్తే, పాత దానిలో ఉండే అదే టైల్ ల్యాంప్స్ తో రాబోతుంది. దీనితో పాటుగా కొత్త ఎల్ ఈ డి గ్రాఫిక్స్ తో రాబోతుంది. ప్రత్యేకమైన ఏ4 బూట్ లిడ్ మరియు స్పాయిలర్, గతంలో కంటే పదునుగా మరియు కొత్త బంపర్ తో రాబోతుంది.

దీని యొక్క బాహ్య స్వరూపాలను ప్రక్కన పెడితే, ఏ4 యొక్క అంతర్గత భాగాలలో ఉండే క్యాబిన్ అవుట్గోయింగ్ ఏ4 సెడాన్ ను పోలి ఉంటుంది. మరియు ప్రస్తుత కారు యొక్క డాష్బోర్డ్ చూడటానికి మరింత ఆకర్షణీయంగా రాబోతుంది. దీని లో ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే, 12.3 అంగుళాల వర్చువల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ తో రాబోతుంది (దీనిని మనం కొత్త టిటి వాహనం లో చూడవచ్చు). ఆడి యొక్క ఎం ఎం ఐ సమాచార వ్యవస్థ విస్తృతంగా నవీకరించబడింది. ఈ కొత్త 2016 ఏ4 లో, కొత్త ఎంఎంఐ నావిగేషన్ ప్లస్ తో పాటు ఎంఎంఐ టచ్ మరియు ఒక భారీ 8.3-అంగుళాల డిస్ప్లే లను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు.

ఈ కొత్త సమాచార వ్యవస్థ, ఆపిల్ మరియు ఆండ్రోయిడ్ ఫోన్ల కనెక్ట్ కోసం స్మార్ట్ఫోన్ ఇంటర్ఫేస్ ను అందిస్తుంది. ముందు తరం లో ఉండే అవే డెసిబుల్స్ బ్యాంగ్ & ఓలుఫ్సన్ సౌండ్ 3డి వ్యవస్థ, దీనిలో అందించబడుతుంది. మరో ప్రధాన అంశం ఏమిటంటే, కొత్త ఏ4 డాష్బోర్డ్ పై, నిరంతర ఏసి ఏయిర్ వెంట్ లు మరియు ఒక పెద్ద స్క్రీన్ తో పాటు ఒక కొత్త ఇంటర్ఫేస్ వాతావరణం నియంత్రణ తో రాబోతుంది. అంతేకాక, దీనిలో వైర్లెస్ పోన్ల కొరకు చార్జింగ్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా, ఈ కొత్త ఏ4, 3 టి ఎస్ ఎఫ్ ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మరియు 4 టిడి ఐ డీజిల్ ఇంజన్ ల ఆప్షన్లతో అందుబాటులో ఉంది. వీటి యొక్క పెట్రోల్ ఇంజన్ లు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటాయి మరియు వీటి యొక్క డీజిల్ ఇంజన్ లు ఎస్-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టం లతో జత చేయబడి ఉంటాయి. భారతదేశం గురించి మాట్లాడటానికి వస్తే, ఈ కొత్త ఆడి ఏ4, 2.0 లీటర్ టిడి ఐ ఆప్షన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

కొలతలు

  • పొడవు - 4.73 మీటర్లు
  • వీల్బేస్ - 2.82 మీటర్లు
  • వెడల్పు - 1.84 మీటర్లు
  • ఎత్తు - 1.43 మీటర్లు
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Audi ఏ4 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience