• English
  • Login / Register

హ్యుందాయ్ సాన్ట్రో vs మారుతి సుజుకి సెలేరియో: వేరియంట్స్ పోలిక

హ్యుందాయ్ శాంత్రో కోసం cardekho ద్వారా మార్చి 27, 2019 11:28 am ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

హ్యుందాయ్ సాన్త్రో ను రూ.3.89 లక్షల ప్రారంభ ధర నుంచి రూ .5.45 లక్షల(ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా) వరకూ గల ధరతో ప్రారంభించింది. ఈ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ లోనికి దీని యొక్క రాక వలన మారుతి సెలెరియో, మారుతి వాగన్ఆర్, టాటా టియాగో, డాట్సన్ గో వంటి వాటితో పోటీ మళ్ళీ మొదలయ్యింది. ఈ ప్రస్తుత ఆర్టికల్ లో సెలేరియోతో ఎలా పోటీ పడుతుంది మరియు ఈ రెండిటిలో ఏది మీ డబ్బుకి విలువను ఇస్తుంది అనేది తెలుసుకుందాము.

కాని ముందుగా, ఈ రెండు కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ల మెకానికల్ లను పోల్చి చూద్దాం:

కొలతలు

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

సాన్త్రో మరియు సెలెరియో ఒకటే ఎత్తు మరియు బూట్ స్థలాన్ని కూడా ఒకే స్థాయిలో అందిస్తున్నాయి, కానీ హ్యుందాయ్ హాచ్బ్యాక్ విస్తృతమైంది. ఏదేమైనా, మారుతి హ్యాచ్బ్యాక్ పొడవు గలది మరియు పొడవైన వీల్ బేస్ కూడా ఉంది.

ఇంజన్

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

హ్యుందాయ్ మునుపటి సాన్ట్రా నుంచి 1.1-లీటర్ 4-సిలెండర్ ఇంజిన్ యొక్క పునర్వినియోగ వెర్షన్ తో ముందుకు వచ్చింది. మారుతి సుజుకి 1.0-లీటర్ ఇంజిన్ 3-సిలెండర్  ఇంజన్ ను ఉపయోగిస్తుంది. సెలేరియో సాన్త్రోతో పోలిస్తే 1Ps తక్కువ శక్తిని మరియు 9Nm తక్కువ టార్క్ ను మాత్రమే అందిస్తుంది. సాన్త్రో మరియు సెలెరియో కర్మాగారంతో కూడిన CNG ఆప్షన్ తో కూడా వస్తున్నాయి మరియు సెలెరియో అధిక ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది.

వేరియంట్స్ మరియు ధరలు

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

హ్యుందాయ్ సాన్త్రో ఎరా vs మారుతి సెలెరియో LXI

హ్యుందాయ్ సాన్త్రో ఎరా

రూ. 4.24 లక్షలు

మారుతి సెలెరియో LXI

రూ. 4.21 లక్షలు

తేడా

రూ. 3,000 (సాంత్రో కొంచెం ఖరీదైనది)

సాధారణ ఫీచర్లు: డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్, డోర్స్ కి సీసా హోల్డర్స్, వెనుక సీటు బెంచ్ ఫోల్డింగ్, బాడీ-రంగు బంపర్స్, పవర్ అవుట్లెట్

సెలేరియో మీద సాంత్రో అందించే లక్షణాలు: EBD తో ABS, టాకోమీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, 2.5-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, వెనుక AC వెంట్స్, ఫ్రంట్ పవర్ విండోస్

సాంత్రో మీద సెలేరియో అందించే లక్షణాలు: ఏమీ లేవు

తీర్పు: సాంత్రో కారుకి కొద్దిగా ఎక్కువ డబ్బుని చెల్లిస్తే గనుక ఎంట్రీ లెవెల్ వేరియంట్ లో సెలేరియో కంటే మంచి లక్షణాలను అందిస్తూ ఆ ధర వద్ద మంచి ప్రొడక్ట్ గా నిలుస్తుంది. సాన్ట్రో కారు సెలేరియో వలె కాకుండా EBD తో ABS వంటి భద్రతా లక్షణాలను ప్రమాణంగా అందిస్తుంది.  

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

హ్యుందాయ్ సాన్త్రో మాగ్నా vs మారుతి సెలెరియో VXI

హ్యుందాయ్ సాన్త్రో మాగ్నా

రూ. 4.57 లక్షలు

మారుతి సెలెరియో VXI

రూ. 4.54 లక్షలు

తేడా

రూ. 3,000 (సాంత్రో కొంచెం ఖరీదైనది)

సాధారణ ఫీచర్లు (మునుపటి రకాల్లో): సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్, క్రోమ్ సరౌండ్ ఫ్రంట్ గ్రిల్, డే-నైట్ IRVM, బాడీ-రంగు డోర్ హ్యాండిల్స్ మరియు ORVM లు

సెలేరియో మీద సాంత్రో అందించే లక్షణాలు: EBD తో ABS, టాకోమీటర్, గేర్ షిఫ్ట్ సూచిక, 2.5-అంగుళాల MID, వెనుక AC వెంట్స్, టికెట్ హోల్డర్

సాంత్రో మీద సెలేరియో అందించే లక్షణాలు: వెనుక సీట్ 60:40 స్ప్లిట్, 14-ఇంచ్ వీల్స్, కో-డ్రైవర్ వానిటీ మిర్రర్, ఫుల్ వీల్ కవర్లు

తీర్పు: హ్యుందాయ్ సాన్ట్రా ఇక్కడ బాగా ఖరీదైనది, కానీ మరిన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది, ముఖ్యంగా ABS మరియు వెనుక A.C వెంట్లతో వస్తుంది. సెలేరియో భద్రతా అంశాలను కోల్పోతున్నందున, సాన్త్రో ను ఎంపిక చేసుకోవచ్చు.

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

హ్యుందాయ్ సాన్త్రో స్పోర్ట్స్ vs మారుతి సెలెరియో ZXI

హ్యుందాయ్ సాన్త్రో స్పోర్ట్స్

రూ. 4.99 లక్షలు

మారుతి సెలెరియో ZXI

రూ. 4.80 లక్షలు

తేడా

రూ. 19,000 (సాంత్రో కొంచెం ఖరీదైనది)

సాధారణ ఫీచర్లు (మునుపటి రకాల్లో): ఎలక్ట్రానిక్ సర్దుబాటు ORVM లు, ముందు మరియు వెనుక స్పీకర్లు, బ్లూటూత్ మరియు USB కనెక్టివిటీ, స్టీరింగ్-మౌన్టేడ్ కంట్రోల్స్, ORVM సూచికలు, కీలెస్ ఎంట్రీ, వెనుక డిఫేజర్, 14 అంగుళాల చక్రాలు, పూర్తి చక్రాల కవర్లు.

సెలేరియో పై సాంత్రో అందించే లక్షణాలు:EBD తో ABS, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రిమోట్ ఆడియో కంట్రోల్ కోసం హ్యుందాయ్ i-బ్లూ అప్లికేషన్, ఎకో కోటింగ్ టెక్నాలజీతో ఎయిర్ కండీషనింగ్, రేర్ A.C వెంట్స్, రేర్ పార్సెల్ ట్రే, గేర్ షిఫ్ట్ ఇండికేటర్.  

సాంత్రో పై సెలేరియో అందించే లక్షణాలు: రేర్ విండో వైపర్ మరియు వాషర్, వెనుక సీటు 60:40 స్ప్లిట్, కో డ్రైవర్ తో వానిటీ మిర్రర్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్.  

తీర్పు: ఈ సందర్భంలో సాన్ట్రో చాలా ఖరీదైనది, అయితే మరింత భద్రత మరియు సౌకర్యాన్ని అలాగే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని అందిస్తుంది. సెలేరియో కీలెస్ ఎంట్రీ మరియు తక్కువ ధరలో టిల్ట్-అడ్జస్టబుల్  స్టీరింగ్ వంటి కొన్ని సులభ లక్షణాలను పొందుతుంది కానీ ABS ని కోల్పోతుంది. ఆ కారణంగా, సాన్త్రో మరోసారి విజయం సాధించింది.

హ్యుందాయ్ సాన్త్రో ఆస్టా vs మారుతి సెలెరియో ZXI (ఆప్ట్)

హ్యుందాయ్ సాన్త్రో ఆస్టా

రూ. 5.45 లక్షలు

మారుతి సెలెరియో ZXI(ఆప్ట్)

రూ. 5.28 లక్షలు

తేడా

రూ. 17,000 (సాంత్రో కొంచెం ఖరీదైనది)

సాధారణ ఫీచర్స్ (మునుపటి వేరియంట్స్ కంటే): ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, ABS, వెనుక విండో వైపర్ మరియు వాషర్, ప్రీస్టెనెనర్లు తో ఫ్రంట్ సీటు బెల్ట్, కో- డ్రైవర్ వానిటీ మిర్రర్, ప్రయాణీకుల ఎయిర్ బాగ్స్

సెలేరియో మీద సాంత్రో అందించే లక్షణాలు: వెనుక A.C వెంట్స్, ఎయిర్ కండిషన్ కోసం ఎకో కోటింగ్ టెక్నాలజీ,ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, రిమోట్ ఆడియో కంట్రోల్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్  కోసం హ్యుందాయ్ i-బ్లూ అప్లికేషన్

సాంత్రో మీద సెలేరియో అందించే లక్షణాలు: అల్లాయ్ చక్రాలు, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, వెనుక సీటు 60:40 స్ప్లిట్, టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్

Verdict: ఈ రెండు వేరియంట్స్ రెండు కార్లలోని AMT ని ఇవ్వనటువంటి టాప్ వేరియంట్స్ మరియు హ్యుందాయి హ్యాచ్బ్యాక్ దీనిలో బాగా ఖరీదు కలది, ఈ అధనపు ధర వెనుక A.C వెంట్స్ మరియు ఆధునిక ఇంఫోటైన్మెంట్ సిష్టం కోసం అందించబడుతుంది. అయితే సెలేరియో టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ మరియు డ్రైవర్ కు హైట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అందిస్తుంది. అయితే,  ఈ రెండు టాప్ వేరియంట్లు కూడా అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ యొక్క సౌకర్యాన్ని మిస్ అవుతున్నాయి. డ్రైవర్-సెంట్రిక్ అనుకూల్యాల కొరకు చూసుకుంటే, ఇక్కడ మారుతి సెలెరియో గెలుస్తుంది. అయితే, మరింత గొప్ప అనుభవం కోసం మరియు వెనుక సీట్ లో సౌకర్యాన్ని బాగా పొందాలనుకుంటే మాత్రం మా ఎంపికగా సాంత్రో ఉంటుంది.

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

హ్యుందాయ్ సాన్త్రో మాగ్నా AMT vs మారుతి సెలెరియో VXI AMT (O)

హ్యుందాయ్ సాన్త్రో మాగ్నా AMT

రూ. 5.18 లక్షలు

మారుతి సెలెరియో VXI AMT (O)

రూ. 5.13 లక్షలు

తేడా

రూ.5,000 (సాంత్రో కొంచెం ఖరీదైనది)

సాధారణ ఫీచర్లు (మునుపటి రకాల్లో): ABS, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్

సెలేరియో పై సాంత్రో అందించే లక్షణాలు: ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, బ్లూటూత్ మరుయు USB కనెక్టివిటీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఫ్రంట్ స్పీకర్స్, 2.5-అంగుళాల MID, టికెట్ హోల్డర్, వెనుక A.C వెంట్స్, హ్యుందాయై i-బ్లూ అప్లికేషన్ కోసం రిమోట్ ఆడియో కంట్రోల్.

సాంత్రో  పై సెలేరియో అందించే లక్షణాలు: ప్రయాణీకుల ఎయిర్బాగ్, వెనుక సీట్ 60:40 స్ప్లిట్, 14-ఇంచ్ వీల్స్, ప్రీ టెన్ష్నర్స్ తో ముందు సీటు బెల్ట్స్, కో- డ్రైవర్ వానిటీ మిర్రర్, ఫుల్ వీల్ కవర్లు

తీర్పు: ఈ వేరియంట్ లో సెలెరియో ఎక్కువ భద్రత లక్షణాలను అందిస్తున్నా కూడా సాన్త్రో కంటే తక్కువ వ్యయం కలిగి ఉంది. అయితే, హ్యుందాయి సంస్థ ఈ ధర వద్ద వినోదాల పరంగా మరియు సౌకర్యాల పరంగా ఎక్కువ లక్షణాలను అందిస్తుంది.  భద్రత ప్రయోజనాల గురించి చూసుకుంటే ఇది మీకు మారుతి మంచి ఎంపిక.

హ్యుందాయ్ సాన్త్రో స్పోర్ట్స్జ్ AMT vs మారుతి సెలెరియో ZXI (O) AMT

హ్యుందాయ్ సాన్త్రో స్పోర్ట్స్జ్

రూ. 5.46 లక్షలు

మారుతి సెలెరియో ZXI

రూ. 5.40 లక్షలు

తేడా

రూ.6,000 (సాంత్రో కొంచెం ఖరీదైనది)

సాధారణ ఫీచర్స్ (మునుపటి రకాల్లో): ఎలక్ట్రానిక్ సర్దుబాటు ORVMs, ముందు మరియు వెనుక స్పీకర్లు, బ్లూటూత్ మరియు USB కనెక్టివిటీ, స్టీరింగ్-మౌంట్ నియంత్రణలు, ఇండికేటర్స్ తో ORVMs, కీలెస్ ఎంట్రీ, వెనుక డీఫాగర్, 14-ఇంచ్ వీల్స్, ఫుల్ వీల్ కవర్స్

సెలేరియో మీద సాంత్రో అందించే లక్షణాలు:

ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీ తో 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రిమోట్ ఆడియో కంట్రోల్ కోసం హ్యుందాయ్ i-బ్లూ అప్లికేషన్, వెనుక A.C వెంట్స్, ఎయిర్ కండిషింగ్ కోసం ఎకో కోటింగ్ టెక్నాలజీ, రేర్ పార్సెల్ ట్రే.   

సాంత్రో మీద సెలేరియో అందించే లక్షణాలు:

వెనుక విండో వైపర్ మరియు వాషర్, వెనుక సీట్ 60:40 స్ప్లిట్, కో డ్రైవర్ వానిటీ మిర్రర్, టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్, ప్రయాణీకుల ఎయిర్బాగ్స్, ముందు సీటు బెల్ట్ ప్రీటెన్షనర్లు.

తీర్పు: సాంత్రో దీనిలో బాగా ధర కలిగినది అయినప్పటికీ సెలెరియో ఎక్కువ ఎక్కువ భద్రతా లక్షణాలు మరియు డ్రైవర్ సౌకర్యాలను అందిస్తుంది కాబట్టి ఈ రెండిటిలో సెలేరియో విజేతగా నిలిచింది.

Hyundai Santro vs Maruti Suzuki Celerio: Variants Comparison

హ్యుందాయ్ సాన్త్రో మాగ్నా CNG vs మారుతి సెలెరియో VXI CNG

హ్యుందాయ్ సాన్త్రో మాగ్నా CNG

రూ. 5.23 లక్షలు

మారుతి సెలెరియో VXI CNG

రూ. 5.16 లక్షలు

తేడా

రూ.7,000 (సాంత్రో కొంచెం ఖరీదైనది)

సాధారణ లక్షణాలు: డ్రైవర్ వైపు ఎయిర్బ్యాగ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్, వెనుక సీటు బెంచ్ ఫోల్డింగ్, పవర్ అవుట్లెట్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్, క్రోమ్ సరౌండ్ ఫ్రంట్ గ్రిల్, డే-నైట్ IRVM, బాడీ-రంగు డోర్ హ్యాండిల్స్ మరియు ORVM లు, బాడీ -రంగుల బంపర్స్

సెలేరియో మీద సాంత్రో అందించే లక్షణాలు: EBD తో ABS, టాకోమీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, 2.5-అంగుళాల MID, వెనుక AC వెంట్స్, వెనుక పార్సెల్ ట్రే, మంటలను ఆర్పేది, టికెట్ హోల్డర్

సాంత్రో మీద సెలేరియో అందించే లక్షణాలు: వెనుక సీట్ 60:40 స్ప్లిట్, 14-ఇంచ్ చక్రాలు, కో డ్రైవర్ వానిటీ మిర్రర్, ఫుల్ వీల్ కవర్లు

తీర్పు: హ్యుందాయ్ సాన్ట్రా మరోసారి ఖరీదైన కారు, మరియు ABS మరియు వెనుక AC వెంట్స్ వంటి లక్షణాలను అందిస్తుంది. సెలేరోయో ఇప్పటికీ తగినంత భద్రత లక్షణాలను అందించని కారణంగా, సాన్ట్రో  సమానమైన పెట్రోల్-ఆధారిత ఎంపికను కలిగి ఉండి మళ్ళీ ఇక్కడ సాంత్రో గెలుస్తుంది.

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai శాంత్రో

Read Full News

explore మరిన్ని on హ్యుందాయ్ శాంత్రో

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience