Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

6 చిత్రాలలో Honda Elevate మిడ్-స్పెక్ V వేరియెంట్ వివరణ

హోండా ఎలివేట్ కోసం shreyash ద్వారా సెప్టెంబర్ 01, 2023 11:29 am సవరించబడింది

హోండా ఎలివేట్ మిడ్-స్పెక్ V వేరియెంట్, ఈ కాంపాక్ట్ SUV యొక్క ఎంట్రీ-లెవెల్ ఆటోమ్యాటిక్ వేరియెంట్

హోండా ఎలివేట్ కాంపాక్ట్ SUVల పోటీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది, రూ.5,000 ధరతో దీని బుక్ చేసుకోవచ్చు. కారు తయారీదారులు వేరియంట్ వారి ధరలను సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించనున్నారు. దానికంటే ముందే, ఈ యూనిట్‌లు హోండా డీలర్‌షిప్ؚల వద్దకు ఇప్పటికే చేరుకున్నాయి.

హోండా ఎలివేట్‌ను నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తుంది, ఈ కథనంలో, మేము ఆరు చిత్రాలలో బేస్ V కంటే ఎగువన ఉండే వేరియెంట్ؚ గురించి వివరించాము.

ముందు భాగం వివరాలతో ప్రారంభిద్దాం. ఈ మిడ్-స్పెక్ V వేరియెంట్ؚ క్రోమ్ బార్ؚతో అనుసంధానమైన LED హెడ్‌లైట్ؚలను కలిగి ఉంది, అయితే టాప్-ఎండ్ వేరియెంట్ؚలో ఉన్న భారీ గ్రిల్ డిజైన్‌ను ఈ మోడల్‌లో చూడవచ్చు, ఇందులో ఫాగ్ ల్యాంప్ؚలు లేవు. వీటిని మినహహించి ఈ SUV ముందు భాగంలో ఎటువంటి మార్పులు లేవు.

ప్రొఫైల్ؚ విషయానికి వస్తే, ఈ ప్రత్యేకమైన వేరియెంట్‌లో అలాయ్ వీల్స్ లేవు, బదులుగా ప్లాస్టిక్ కావర్‌లతో 16-అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఇందులో లేని మరొక ముఖ్యమైన అంశం రూఫ్ రెయిల్స్. అయినప్పటికీ, ఇందులో ORVMకు అమర్చిన టర్న్ ఇండికేటర్‌లు మరియు బాడీ రంగు డోర్ హ్యాండిల్ؚలు ఉన్నాయి. టాప్-స్పెక్ వేరియెంట్ؚలో క్రోమ్ డోర్ హ్యాండిల్‌లు మరియు డ్యూయల్-టోన్ కలర్ؚవేలు ఉన్నాయి.

వెనుక వైపు, ఎలివేట్ V వేరియెంట్ LED టెయిల్ ల్యాంపులు మరియు షార్క్ ఫిన్ యాంటెన్నాలను కలిగి ఉంది, అయితే రేర్ వైపర్ؚలు లేవు.

ఇది కూడా చూడండి: హోండా ఎలివేట్ అంచనా ధరలు: పోటీదారుల కంటే తక్కువ ధరలను కలిగి ఉంటుందా?

టాప్-స్పెక్ ఎలివేట్ؚలో ఉన్న గోధుమ రంగు ఇంటిరివర్‌కు భిన్నంగా, హోండా SUV V-వేరియెంట్ؚ నలుపు మరియు లేత గోధుమ రంగు థీమ్‌తో వస్తుంది. ఇందులో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ ఉంది, ఇది టాప్-స్పెక్ వేరియెంట్ؚలలో అందించే యూనిట్ కంటే చిన్నది. అయినప్పటికీ, ఇది వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే, అలాగే కనెక్టెడ్ కార్ టెక్ؚకు కూడా మాద్దతు ఇస్తుంది. ఈ వేరియెంట్, టాప్-ఎండ్ వేరియెంట్ؚలలో కనిపించే 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలకు భిన్నంగా మధ్యలో చిన్న MIDతో మరింత బేసిక్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚను పొందుతుంది.

ఇందులో ఉన్న ఇతర ఫీచర్‌లలో రేర్ AC వెంట్ؚలతో ఆటోమ్యాటిక్ AC, స్టీరింగ్ؚకు అమర్చిన ఆడియో కంట్రోల్ؚలు, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ వ్యూ కెమెరా కూడా ఉన్నాయి. సింగిల్-పేన్ సన్ؚరూఫ్, వైర్ లెస్ ఛార్జర్ మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) వంటివి హయ్యర్-ఎండ్ మోడల్‌లకు మాత్రమే పరిమితం అయ్యాయి.

పవర్ؚట్రెయిన్ పరిశీలన

హోండా ఎలివేట్ సిటీలో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందుతుంది – ఇది 121PS పవర్ మరియు 145Nm టార్క్‌ను అందిస్తుంది – 6-స్పీడ్‌ల మాన్యువల్ లేదా CVTతో జోడించబడుతుంది. దీని క్లెయిమ్ చేసిన సామర్ధ్యం మాన్యువల్ కోసం 15.31kmpl మరియు CVT కోసం 16.92kmpl.

అంచనా ధర

హోండా ఎలివేట్ మిడ్-స్పెక్ V వేరియెంట్ అత్యంత ముఖ్యమైన ఆరు వివరాలు ఇవి. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.11 లక్షల నుండి ప్రారంభం అవుతాయని అంచనా, ఇది హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది.

Share via

Write your Comment on Honda ఎలివేట్

P
peddi reddy
Sep 5, 2023, 3:16:52 PM

Simple and straightforward, this works for value and cost conscious customers. Don't expect much features

A
ali
Sep 1, 2023, 10:06:57 AM

Many features are lacking .. in v cvt varient compared to hyryder like rear seats arm rest fog lamps which are basic features

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్ఫేస్లిఫ్ట్
Rs.65.90 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.10 - 11.23 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.18.99 - 32.41 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.13.99 - 25.74 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర