• English
  • Login / Register

Honda Elevate అంచనా ధరలు: పోటీదారుల ధరల కంటే తక్కువగా ఉంటుందా?

హోండా ఎలివేట్ కోసం tarun ద్వారా ఆగష్టు 30, 2023 01:34 pm ప్రచురించబడింది

  • 44 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వేరియెంట్ؚలు, ఫీచర్‌లు మరియు స్పెసిఫికేషన్ؚల వంటి ఎలివేట్ వాహన వివరాలు ఇప్పటికే దాదాపుగా వెల్లడయ్యాయి

Honda Elevate Expected Prices

క్రిక్కిరిసిన కాంపాక్ట్ SUV విభాగంలో త్వరలోనే హోండా ఎలివేట్ ప్రవేశించనుంది, దీనికి ఇప్పటికే ఏడుగురు పోటీదారులు ఉన్నారు. ఈ కారు తయారీదారు ఇప్పటికే పవర్‌ట్రెయిన్ؚలు, ఇంధన సామర్ధ్యం మరియు ముఖ్యమైన ఫీచర్‌లతో సహ చాలా వరకు అన్నీ వివరాలను వెల్లడించగా, దిని ధరలు మాత్రం సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించనున్నారు. అందుబాటులో ఉన్న పూర్తి సమాచారం ప్రకారం, విడుదలకు ముందు హోండా ఎలివేట్ SUV వేరియెంట్-వారీ ధరలను మేం అంచనా వేశాము.

ముందుగా, దీని పవర్‌ట్రెయిన్ؚలు మరియు ఫీచర్‌లను చూద్దాం: 

స్పెక్స్

హోండా ఎలివేట్

ఇంజన్

1.5-లీటర్ పెట్రోల్

పవర్

121PS

టార్క్

145Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్ MT / CVT

మైలేజీ

15.31kmpl / 16.92kmpl

సిటీ సెడాన్ؚలో ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ఇంజన్ ఎలివేట్ؚకు శక్తిని అందిస్తుంది, అయితే దీన్ని డీజిల్ లేదా పెట్రోల్-హైబ్రిడ్ ఎంపికలలో అందించడం లేదు. 

ఫీచర్‌ల పరంగా ఎలివేట్ؚ లో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు లేన్ వాచ్ కెమెరా వంటివి ఉన్నాయి. ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా మరియు ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటివి భద్రతా ఫీచర్‌లలో ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ వేరియెంట్-వారీ ఫీచర్‌లను చూడండి

హోండా ఎలివేట్ అంచనా ధరలను చూద్దాం: 

ఎలివేట్

MT

CVT

SV

రూ. 10.99 లక్షలు

N.A.

V

రూ. 11.90 లక్షలు

రూ. 13.15 లక్షలు

VX

రూ. 13 లక్షలు

రూ. 14.25 లక్షలు

ZX

రూ. 14.25 లక్షలు

రూ. 15.50 లక్షలు

ఎలివేట్ పరిచయ ధరలు, దాని పోటీదారుల ధరలకు సమానంగా సుమారు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి అని అంచనా. CVT వేరియెంట్ؚల ధరలు సుమారు రూ.1.25 లక్షలు ఎక్కువగా ఉండవచ్చు, వేరియెంట్-వారీ ధరల తేడా రూ.1 లక్ష కంటే ఎక్కువ ఉంటుంది.

MG Astor vs Hyundai Creta vs Skoda Kushaq: Space And Practicality Compared

ఎలివేట్ అంచనా ధరలు దాని పోటీదారుల ధరలతో పోలిస్తే ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాం:

      హోండా ఎలివేట్                      ((     (అంచనా) 

 

మారుతి గ్రాండ్ 

విటారా 

టయోటా 

హైరైడర్

హ్యుందాయ్ 

క్రెటా 

కియా సెల్టోస్ 

స్కోడా కుషాక్ 

వోక్స్వ్యాగన్

టైగూన్ 

MG ఆస్టర్ 

రూ. 11 లక్షల నుండి రూ.15.50 లక్షల వరకు  

R రూ.10.70 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు

రూ. 10.86 లక్షల నుడి రూ. 19.99 లక్షల వరకు

రూ. 10.87 లక్షల నుండి రూ.19.20 లక్షల వరకు

రూ.10.90 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు 

రూ. 11.59 లక్షల నుండి రూ. 19.69 లక్షల వరకు

రూ. 11.62 లక్షల నుండి రూ. 19.46 లక్షల వరకు

రూ. 10.82 లక్షల నుండి రూ. 18.69 లక్షల వరకు 

*అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు

హోండా ఎలివేట్ టాప్-ఎండ్ వేరియెంట్ؚల ధరలు పోటీదారుల టాప్-స్పెక్ వేరియెంట్ؚల ధరల కంటే, గణనీయంగా తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాము. అయితే, ఎలివేట్ؚను సింగిల్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో అందించనున్నారు, దీని పోటీదారులు కనీసం రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందాయి, టర్బోఛార్జెడ్ పర్ఫార్మెన్స్ కాకుండా హైబ్రిడ్ సామర్ధ్యాన్ని అందించేది మారుతి-టయోటా జంట మాత్రమే అనేది కూడా మనం పరిగణించాలి.

Honda Elevate 10.25-inch touchscreen

అంతేకాకుండా, పోటీదారులతో పోలిస్తే ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్ؚలు, పనోరమిక్ సన్ؚరూఫ్, 360-డిగ్రీ కెమెరా మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్‌లు ఎలివేట్ؚలో లేవు. 

హోండా ఎలివేట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి మరియు ఈ SUV డీలర్ షిప్ؚల వద్ద ఇప్పటికే చేరుకుంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda ఎలివేట్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience