ఎలివేట్ؚను 10 రంగుల ఎంపికలలో అందించనున్న హోండా
హోండా ఎలివేట్ కోసం ansh ద్వారా జూలై 05, 2023 04:04 pm ప్రచురించబడింది
- 188 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ కాంపాక్ట్ SUV హోండా సిటీ నుండి పొందిన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది
-
హోండా ఎలివేట్ బుకింగ్ؚలు ప్రస్తుతం రూ.5,000కు ప్రారంభం అయ్యాయి.
-
హోండా దీన్ని నాలుగు విస్తృత వేరియెంట్‌లలో అందిస్తుంది: SV, V, VX మరియు ZX.
-
ఇది సిటీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ఎంపికలలో అందిస్తున్నారు.
-
10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు సింగిల్-పేన్ సన్ؚరూఫ్ వంటి ఫీచర్‌లతో వస్తుంది.
-
ఇది రూ. 11 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) సెప్టెంబర్ؚలో విడుదల కానుంది.
ఈ జపాన్ తయారీదారు నుండి వచ్చిన ఈ సరికొత్త హోండా ఎలివేట్, గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ఆవిష్కరించబడింది. ఈ కాంపాక్ట్ SUV బుకింగ్ؚలు ప్రారంభం అయిన కొద్ది సేపటికే, హోండా వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ؚలు మరియు రంగుల ఎంపికలను వెల్లడించింది.
ఇది కూడా చదవండి: కాంపాక్ట్ SUV పోటీదారులతో పోలిస్తే హోండా ఎలివేట్ ఎంత పెద్దది?
మీరు బుక్ చేయాలనుకుంటే, వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ؚతో సహా 10 రంగుల ఎంపికలను కూడా చూడండి:
రంగుల ఎంపికలు
ఫీనిక్స్ ఆరెంజ్ పర్ల్ (VX, ZX)
ఆబ్సీడియన్ బ్లూ పర్ల్ (V, VX, ZX)
రేడియంట్ రెడ్ మెటాలిక్ (V, VX, ZX)
ప్లాటినం వైట్ పర్ల్ (SV, V, VX, ZX)
గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ (V, VX, ZX)
ల్యూనర్ సిల్వర్ మెటాలిక్ (SV, V, VX, ZX)
మిటియోరాయిడ్ గ్రే మెటాలిక్ (V, VX, ZX)
క్రిస్టల్ బ్లాక్ పర్ల్ రూఫ్ؚతో ఫీనిక్స్ ఆరెంజ్ పర్ల్ (ZX CVT)
క్రిస్టల్ బ్లాక్ పర్ల్ రూఫ్ؚతో ప్లాటినం వైట్ పర్ల్ (ZX CVT)
క్రిస్టల్ బ్లాక్ పర్ల్ రూఫ్ؚతో రేడియంట్ రెడ్ మెటాలిక్ (ZX CVT)
ఎలివేట్ రంగుల ఎంపికలు ఎంచుకున్న వేరియెంట్‌పై ఆధారపడతాయి. బేస్-స్పెక్ SUV ప్లాటినం వైట్ పర్ల్ మరియు ల్యూనర్ సిల్వర్ మెటాలిక్ వేరియెంట్ؚలలో మాత్రమే అందిస్తున్నారు. బేస్ V వేరియెంట్ؚకు పై వేరియెంట్ ఫీనిక్స్ ఆరెంజ్ పర్ల్ మినహా మిగిలిన అన్ని మోనోటోన్ రంగులలో అందిస్తున్నారు, ఫీనిక్స్ ఆరెంజ్ పర్ల్ ఆరు మోనోటోన్ రంగు ఎంపికలకు అదనంగా హయ్యర్-స్పెక్ VX మరియు ZX వేరియెంట్ؚలలో లభిస్తుంది. అయితే, మూడు డ్యూయల్-టోన్ రంగులు శ్రేణిలో అత్యున్నతమైన ZX CVT వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం.
వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ స్ప్లిట్
వేరియెంట్ |
1.5-లీటర్ పెట్రోల్ MT |
1.5-లీటర్ పెట్రోల్ CVT |
SV |
ఉంది |
లేదు |
V |
ఉంది |
లేదు |
VX |
ఉంది |
ఉంది |
ZX |
ఉంది |
ఉంది |
హోండా ఎలివేట్‌ను కేవలం సిటీ 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే అందిస్తున్నారు, ఇది 121PS పవర్ మరియు 145NM టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా CVT గేర్ؚబాక్స్ؚతో మాత్రమే జోడించబడుతుంది. బేస్-స్పెక్ SV మినహా, అన్ని ఇతర వేరియెంట్ؚలు రెండు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలను పొందనున్నాయి. ఇంతకముందు ధృవీకరించినట్లు, ఎలివేట్ؚను హోండా బలమైన-హైబ్రిడ్ పవర్ؚ ట్రెయిన్ؚతో అందించడం లేదు.
అంచనా ధర మరియు విడుదల
హోండా, ఎలివేట్ؚను ఈ సంవత్సరం సెప్టెంబర్ؚలో విడుదల చేయనుంది, దీని ధర రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా. విడుదలైన తరువాత, ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ؚతో పోటీ పడుతుంది.