• English
  • Login / Register

సరికొత్త వెర్నా డిజైన్ స్కెచ్ؚలను ప్రవేశపెట్టిన హ్యుందాయ్

హ్యుందాయ్ వెర్నా కోసం rohit ద్వారా ఫిబ్రవరి 21, 2023 07:03 pm ప్రచురించబడింది

  • 51 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రస్తుత జనరేషన్ నవీకరణతో, ఈ హ్యుందాయ్ సెడాన్ మరింత నాణ్యత, పొందికైనా డిజైన్‌తో వస్తుంది 

New Hyundai Verna front design sketch

  • హ్యుందాయ్ తన కొత్త వెర్నాను మార్చి 21న భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. 

  • ఫీచర్‌ల విషయనికి వస్తే ఈ సెడాన్ؚలో మరింత పెద్దదైన టచ్ؚస్క్రీన్ మరియు ADAS ఉన్నాయి. 

  • ఈ వాహనంతో హ్యుందాయ్ గ్రూప్ కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ؚను భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. 

  • రెండు రకాల పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది; డీజిల్ యూనిట్ పూర్తిగా నిలిపివేయబడుతుంది. 

  • ధర రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుందని అంచనా. 

హ్యుందాయ్ తమ ఆరవ-జనరేషన్ డిజైన్, కాంపాక్ట్ సెడాన్ వెర్నాను ఈ మార్చిలో (ఖచ్చితంగా చెప్పాలంటే మార్చి 21 తేదీన) భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు సిద్దంగా ఉంది. ఈ కారు తయారీదారు కొత్త మోడల్ బుకింగ్ؚలను ఇప్పటికే ప్రారంభించారు, కొత్త డిజైన్ స్కెచ్ؚలను పంచుకున్నారు.

Hyundai Staria

ఈ చిత్రాలలో సెడాన్ ముందు మరియు పక్క ప్రొఫైల్ؚలను చూడవచ్చు. కొత్త టక్సన్, ప్రపంచ వ్యాప్తంగా విక్రయించే ఏడవ-జనరేషన్ ఎలంత్రాలో ఉన్నట్లుగా ఈ ఆరవ-జనరేషన్ మోడల్ؚలో గ్రిల్ ‘పారామెట్రిక్ జ్యూవెల్’ డిజైన్ కలిగి ఉంది. ఇతర డిజైన్ ఫీచర్‌లలో, స్టారియా MPVలో కనిపించినట్లుగా ముందు భాగంలో పొడవైన LED DRL స్ట్రిప్, బంపర్ؚలో ADAS రాడార్, మూడు హెడ్ؚలైట్ యూనిట్‌లు ఉన్నాయి.  

New Hyundai Verna side design sketch

ప్రొఫైల్ؚలో, సెడాన్ బహుళ షార్ప్ లైన్‌లు మరియు డాపర్ అలాయ్ వీల్స్‌ను కలిగి ఉంది, వాలుగా ఉన్న రూఫ్‌లైన్, పెంచిన పొడవును కూడా చూడవచ్చు. వెనుక భాగం డిజైన్ స్కెచ్ؚలు స్పష్టంగా కనిపించకపోయిన ఇంతకు ముందు విడుదల అయిన టీజర్ చిత్రం ఆధారంగా కొత్త ఎలన్ట్రాలో ఉన్నట్లుగా అనుసంధానించిన LED టెయిల్‌లైట్ సెటప్ ఉన్నట్లు కనిపిస్తుంది. 

సంబంధించినది: డీజిల్ ఎంపికను SUVలకు మాత్రమే పరిమితం చేసిన హ్యుందాయ్

ఇంటీరియర్ స్కెచ్ؚలను ప్రస్తుతానికి పంచుకోలేదు. ఆరవ-జనరేషన్ వెర్నాలో, ప్రస్తుతం ఉన్న మోడల్ ఫీచర్‌ల జాబితాను కొనసాగించవచ్చు. అంతేకాకుండా పెద్దదైన టచ్ؚస్క్రీన్ యూనిట్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలను కూడా కలిగి ఉండవచ్చు. ప్రస్తుత మోడల్ؚ పరికరాలలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, సింగిల్-పేన్ సన్-రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్ؚలు ఉన్నాయి. 

కొత్త వెర్నా భద్రతా కిట్ؚలో ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) ప్రత్యేకమైనది. దీనిలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు, ముందు మరియు వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు కూడా ఉండవచ్చు. 

ఇది కూడా చదవండి: ఈ వాహన విభాగంలో, కొత్త హ్యుందాయ్ వెర్నా అత్యంత శక్తివంతమైన సెడాన్ కావచ్చు! 

ఈ జనరేషన్ అప్‌గ్రేడ్‌తో, హ్యుందాయ్ కాంపాక్ట్ సెడాన్ؚ డీజిల్ ఇంజన్ ఎంపిక పూర్తిగా నిలిచిపోతుంది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ – 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ (115PS/144Nm), ఒక కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (159PS/253Nm)తో వస్తుంది. రెండవది భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు మరియు ఇది కేవలం ఏడు-స్పీడ్‌ల DCTని కలిగి ఉండవచ్చు. మొదటిది ఆరు-స్పీడ్‌ల మాన్యువల్, CVT ఎంపికలతో రావచ్చు. 

2023 Hyundai Verna Connected Tail Lampsహ్యుందాయ్ కొత్త వెర్నాను నాలుగు వేరియెంట్‌లలో విక్రయించనుంది: EX, S, SX, SX (O). ఈ కారు తయారీదారు, ఈ కొత్త సెడాన్ؚను రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విక్రయిస్తారని అంచనా. ఈ ఆరవ-జనరేషన్ వెర్నా నవీకరించబడిన హోండా సిటీ, వోక్స్ వ్యాగన్ వర్చుస్, మారుతి సియాజ్, స్కోడా స్లేవియాలతో పోటీ పడనుంది.

was this article helpful ?

Write your Comment on Hyundai వెర్నా

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience