నవీకరించిన కియా సెల్టోస్ ఇంటీరియర్ؚ రహస్య చిత్రాల వీక్షణ
కియా సెల్తోస్ కోసం tarun ద్వారా జూన్ 23, 2023 05:58 pm ప్రచురించబడింది
- 68 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
విడుదలైన నాలుగు సంవత్సరాల నుండి మొదటిసారిగా ఈ కాంపాక్ట్ SUV భారీ నవీకరణను పొందుతుంది
-
కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ మరియు డ్యూయల్-జోన్ ACతో రీడిజైన్ చేసిన ఇంటీరియర్ؚను కొత్త సెల్టోస్ పొందనుంది.
-
టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్ప్లేలను కూడా పొందవచ్చు.
-
ఇది రాడార్-ఆధారిత ADAS సాంకేతికతను పొందనున్న రెండవ కాంపాక్ట్ SUV.
-
మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలతో కొత్త, మరింత శక్తివంతమైన 160PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది.
-
రూ.11 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరను కలిగి ఉంటుంది అని అంచనా.
నవీకరించిన కియా సెల్టోస్ రహస్య చిత్రాలు మళ్ళీ కనిపించాయి, ఈ సారి ఇవి ఇంటీరియర్ వివరాలను తెలియజెస్తున్నాయి. డ్యాష్‌బోర్డ్ స్టైలింగ్ పూర్తిగా కనిపించకపోయినప్పటికి, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ స్పష్టంగా కనిపిస్తుంది, కొత్త మరియు ముఖ్యమైన ఈ సౌకర్యవంతమైన ఫీచర్ؚను నిర్ధారించింది.
కొత్త స్విచ్ؚలతో వస్తున్న కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ؚను రహస్య చిత్రాలలో చూడవచ్చు. ప్యానెల్‌కు ఇరువైపుల ఉన్న SYNC బటన్ మరియు టెంపరేచర్ కంట్రోల్ బటన్‌లు నవీకరించిన సెల్టోస్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ؚతో వస్తుంది అని నిర్ధారించాయి. ఇదేకాకుండా, ఈ ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚ రహస్య చిత్రాలలో ఆడియో కంట్రోల్ؚలు, వైర్ؚలెస్ ఛార్జింగ్ మరియు డ్రైవ్ సెలెక్టర్ చుట్టూ ఉన్న బటన్‌లలో 360-డిగ్రీ కెమెరా స్విచ్ؚను కూడా గమనించవచ్చు.
ఈ సరికొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ నిలిపివేస్తున్న సెల్టోస్‌లో ఉన్న దాని కంటే మరింత ప్రీమియంగా కనిపిస్తోంది, కానీ గ్లోబల్ నవీకరణలో అందించే ప్యానెల్ మాత్రం కాదు. సెంట్రల్ AC వెంట్ؚల రీడిజైన్ ప్రపంచవ్యాప్తంగా అందించే సెల్టోస్ؚలో ఉన్నట్లుగానే కనిపించింది, ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 10.25-అంగుళాల డిస్ప్లేతో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ స్క్రీన్ సెట్అప్‌ను అందించడానికి డ్యాష్ؚబోర్డ్‌ను అప్‌డేట్ చేసి ఉండవచ్చు.
నిలిపివేస్తున్న వర్షన్‌లో ఉన్నట్లుగానే, నవీకరించిన కియా సెల్టోస్ కూడా డ్యూయల్-టోన్ నలుపు మరియు లేత గోధుమరంగులో కవర్ చేయబడింది. ఇది రెగ్యులర్ వేరియెంట్‌లలో ఒకటి కావచ్చు, టాప్-స్పెక్ GT లైన్ వేరియెంట్ పూర్తి-నలుపు థీమ్‌ను నిలుపుకోవచ్చు. రాడార్-ఆధారిత ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సాంకేతికత ఉండటంతో భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది అని చెప్పవచ్చు.
ఇంటీరియర్ రీఫ్రెష్ చేయడంతో పాటు, ఎక్స్ؚటీరియర్ డిజైన్ؚను కూడా అప్‌డేట్ చేయవచ్చు. ఇటీవల కనిపించిన కొన్ని రహస్య చిత్రాలలో, ఈ SUV ముందు మరియు వెనుక ప్రొఫైల్ؚలు మరింత స్టైలిష్ؚగా కనిపించాయి. లుక్ పరంగా ఇది ఇంతకు ముందులాగే కనిపించింది, కానీ కొత్త సింగిల్-టోన్ అలాయ్ వీల్స్ؚను గమనించవచ్చు.
ఇది కూడా చదవండి: భారతదేశంలో కార్నివాల్ విక్రయాలను నిలిపివేసిన కియా
పవర్‌ట్రెయిన్ ఎంపికలలో మార్పు లేదు, 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚలను నిలుపుకుంటుంది. 1.4-లీటర్‌ల టర్బో-పెట్రోల్ ఇంజన్ కొద్ది రోజుల క్రితం నిలిపివేయగా, దీని స్థానంలో కేరెన్స్ؚలో అందించిన, మరింత శక్తివంతమైన 160PS పవర్ 1.5-లీటర్ యూనిట్ వస్తుంది. మూడు ఇంజన్‌లు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికను కలిగి ఉంటాయి.
నవీకరించిన కియా సెల్టోస్ ధర రూ.11 లక్షల నుండి ప్రారంభమవుతుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, MG ఆస్టర్, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్ వంటి పేరు పొందిన వాహనాలతో పోటీ పడుతుంది. విడుదల కానున్న హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ֶలతో కూడా పోటీ ఉంటుంది.
0 out of 0 found this helpful