భారతదేశంలో కార్నివాల్ విక్రయాలను నిలిపివేసిన కియా
కియా కార్నివాల్ 2020-2023 కోసం shreyash ద్వారా జూన్ 21, 2023 06:52 pm ప్రచురించబడింది
- 26 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త జనరేషన్ ప్రీమియం MPVని భారతదేశంలో ప్రవేశపెట్టాలా లేదా అని ఈ కారు తయారీదారు ఇప్పటికీ ఆలోచనలో ఉంది.
-
కియా ఇండియా తన వెబ్‌సైట్ నుండి కార్నివాల్‌ను తొలగించింది.
-
చివరిగా ఈ వాహనాన్ని 6- మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందించింది.
-
కార్నివాల్ 200PS పవర్ అందించే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ను కలిగి ఉంది, ఇది కొత్త రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడలేదు.
-
ఈ కార్‌ను వెబ్‌సైట్ నుండి తొలగించే ముందు, కార్నివాల్ ప్రారంభ ధర రూ.30.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.
కియా కార్నివాల్ అమ్మకాలు ప్రస్తుతం భారతదేశంలో నిలిపివేయబడ్డాయి, కారు తయారీదారు ఈ ప్రీమియం MPV కోసం రిజర్వేషన్‌లను అంగీకరించడం లేదు మరియు దీన్ని అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా తొలగించారు. 2020లో కార్నివాల్ను ప్రవేశపెట్టారు, దాని ప్రీమియం క్యాబిన్ అందరినీ ఆకట్టుకోగా, ఇది చాలా ఖరీదైన లగ్జరీ MPV విభాగంలోకి ప్రవేశించకుండా టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటి కంటే పై విభాగంలో నిలిచింది.
భారతదేశంలో విక్రయిస్తున్న కార్నివాల్ ఇప్పటికే మునుపటి-జెనరేషన్ మోడల్ అయినందున, తాజా BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా దీన్ని అప్‌డేట్ చేయకూడదని కియా నిర్ణయించుకుంది. కార్నివాల్ను 6- మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందించగా, మొత్తం మూడు విస్తృత వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో నాలుగు-వరుసల వేరియంట్ కూడా అందించారు కానీ వెంటనే దాన్ని నిలుపివేశారు. కార్నివాల్ నిలిపివేయబడే సమయానికి రూ.30.99 లక్షల నుండి రూ. 35.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరను కలిగి ఉంది.
ఇది అందించే ఫీచర్లు
కియా కార్నివాల్ క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మధ్య-వరుసలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డ్యూయల్-ప్యానెల్ సన్‌రూఫ్ మరియు మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ఈ కార్ లాంచ్ అయినప్పుడు, భారతదేశంలోని ఉత్తమ ఫీచర్స్ కలిగిన నాన్-లగ్జరీ MPVలలో ఒకటిగా ఇది నిలిచింది. ప్రస్తుతం, అనేక బ్రాండ్ల నుండి వివిధ మూడు వరుసల ఫీచర్ కలిగిన కార్లు సాంకేతికత పరంగా కార్నివాల్‌ను అధిగమించాయి.
భద్రత పరంగా, కియా ప్రీమియం MPV ఆరు వరకు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు హిల్ అసిస్ట్‌లను అందించింది.
ఇవి కూడా చదవండి: భారతదేశంలో జూలై 4న నవీకరించబడిన కియా సెల్టోస్ను పరిచయం చేయనున్న కియా.
ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్
కార్నివాల్ను 200PS పవర్ మరియు 440Nm టార్క్‌ను అందించే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో మాత్రమే అందించారు, ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.
ఇది భారతదేశానికి తిరిగి వస్తుందా?
ఢిల్లీలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో నవీకరించబడిన నాల్గవ జనరేషన్ కార్నివాల్‌ను కియా ప్రదర్శించింది. నిలిపివేస్తున్న మోడల్ కంటే దిని పరిమాణం పెద్దది మరియు భారీ టచ్‌స్క్రీన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి మెరుగైన ఫీచర్‌ల జాబితాతో వస్తుంది. కియా ఇప్పటికీ మార్కెట్‌ను అంచనా వేస్తోంది మరియు అంతా సవ్యంగా ఉంటే, కొత్త కియా కార్నివాల్ వచ్చే ఏడాది విడుదల కావొచ్చు అని అంచనా.
మరింత చదవండి: కియా కార్నివాల్ డీజిల్