ఫియట్ కొత్త పుంటో అబార్త్ తో ఊరిస్తోంది
published on సెప్టెంబర్ 22, 2015 12:55 pm by manish కోసం ఫియట్ పుంటో అబార్ట్
- 2 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఫియట్ ఇండియా వారు ఈ ఏడాది లో అధికంగా ఎదురు చూస్తున్న కారు ఫియట్ అబార్త్ పుంటో యొక్క బహిర్గతం విషయమై ఊరిస్తున్నారు. వారి అధికారిక వెబ్సైట్ లో కారులో ఉండబోయే డ్యువల్-టోన్ కలర్ స్కీము ని వెళ్ళడించడంతో ఈ ఉత్సాహం పెరిగింది. కారు నలుపు మరియూ ఎరుపు రంగులలో ఉన్న స్కీము తో ఉండి వెబ్సైట్ ఓపెనింగ్ పేజీలో కనిపించింది. ఈ పేజీపై "త్వరలో రానుంది" అనే శీర్షిక కూడా కనపడుతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ఈ లింకు మరింత పుంజుకుంటుంది అని అనిపిస్తొంది.
ఈ హ్యాచ్ బ్యాక్ కి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషను తో 1.4-లీటర్ T-జెట్ మోటర్ ని జత చేయబడుతుంది. ఇది 145hp మరియూ 195Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కారుని గంటకి 0-100 కీ.మీ లను 10 సెకనుల్లో తీసుకువెళ్తుంది. కారు యొక్క పొడవు 20mm తగ్గించటం అయ్యింది. ఇందు చేత మొత్తం బరువు ఇప్పుడు కేవలం 1100Kg గా ఉంది. దీని కారణంగా బరువు-శక్తి యొక్క అనుసంధానం వలన సామర్ధ్యం మరింత పెరుగుతుంది.
కారుకి 16-అంగుళాల అల్లోయ్ వీల్స్ తో 195/55 R16 టైర్లు జత చేయబడి ఉన్నాయి. గ్రిల్లుకి విభిన్నమైన రంగులు ఉండి పక్క వైపు కిందగా అబార్త్ డీకాల్స్ ఉంటాయి. కారుకి స్పాయిలర్ వెనుక భాగంలో ఉండి స్పోర్టీ రూపం సంతరించుకుంటుంది. దీనికి అబార్త్ బ్యాడ్జింగులు కూడా ఉంటాయి.
అంతర్ఘతాలు లో పుంటో ఈవో వంటి స్టైలింగ్ ఉన్నా లోపల బ్లాక్ థీం కాకుండా ఇందులో స్పోర్టీ యెల్లో మరియూ రెడ్ కుట్టు గల శైలి కనిపిస్తుంది. స్పోర్టియర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియూ అలుమినియం రేసింగ్ ఫుట్ పెడల్స్ కూడా ఉంటాయి అని అంచనా.
- Renew Fiat Abarth Punto Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful