• English
    • Login / Register

    అనేక డిజిటల్ హంగులను పొందిన Facelifted Tata Nexon క్యాబిన్

    సెప్టెంబర్ 01, 2023 02:14 pm ansh ద్వారా ప్రచురించబడింది

    • 89 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    రాత్రి వేళలో ఇంటీరియర్ లైటింగ్ వెలుగులను చూపుతూ ఆన్ؚలైన్ؚలో కనిపించిన కొత్త నెక్సాన్ వీడియోలు

    Tata Nexon Facelift Cabin

    • 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్ؚస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బ్యాక్ؚలిట్ టాటా లోగోతో కొత్త స్టీరింగ్ వీల్ؚను పొందుతుంది. 

    • కొత్త డ్రైవ్ సెలెక్టర్ؚతో సరికొత్త సెంటర్ కన్సోల్ డిజైన్. 

    • కొత్త ఎక్స్ؚటీరియర్ రంగు మరియు ఊదారంగు క్యాబిన్ థీమ్ؚతో వస్తుంది. 

    • ఈ రెండు ఇంజన్ ఎంపికలను పొందవచ్చు: 1.5-లీటర్ డీజిల్ మరియు 1.2-లీటర్ టర్బో పెట్రోల్. 

    • ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చని అంచనా.

    విడుదలకు ముందు ఫేస్‌లిఫ్టెడ్ టాటా నెక్సాన్ సబ్‌కాంపాక్ట్ SUV యొక్క అనేక రహస్య చిత్రాలు ఆన్ؚలైన్ؚలో కనిపించాయి. ఇటీవల, డిజిటల్ హంగులతో వస్తున్న టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ క్యాబిన్ రాత్రి వేళలో ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్న కొన్ని రహస్య చిత్రాలు కనిపించాయి.

    మరింత సాంకేతికత

    Tata Nexon Facelift Touchscreen

    అవుట్‌డెటెడ్ డ్యాష్ؚబోర్డు కారణంగా ప్రస్తుత-జనరేషన్ టాటా నెక్సాన్ తరచుగా విమర్శలను ఎదుర్కొంటుంది, ఈ నవీకరణలో దీన్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ సరికొత్త భారీ టచ్ؚస్క్రీన్ డిస్ప్లేను స్పష్టంగా చూడవచ్చు, కేవలం రంగులో మాత్రం తేడాతో, ఇది హ్యారియర్ మరియు సఫారీలో ఉన్న అదే యూజర్ ఇంటర్ؚఫేస్ؚను కొనసాగిస్తుంది.

    Tata Nexon Facelift Climate Control
    Tata Nexon Facelift Digital Driver's Display

    ఇన్ఫోటైన్మెంట్ క్రింద కొత్త క్లైమేట్ కంట్రోల్ యూనిట్ ఉంది. టెంపరేచర్ మరియు ఫ్యాన్ స్పీడ్ కోసం రెండు టాగుల్ స్విచ్ؚలు ఉన్నాయి, మిగిలినవి క్లిక్ చేయగలిగిన బటన్ؚలకు బదులుగా బ్యాక్ؚలిట్ హాప్టిక్ కంట్రోల్స్ లాగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను పొందుతుంది, ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌కు ఉన్న రంగుతో వస్తుంది.

    Tata Nexon Facelift Steering Wheel

    చివరిగా, స్టీరింగ్ వీల్ؚ మధ్యలో బ్యాక్ؚలిట్ టాటా లోగో కనిపిస్తుంది మరియు స్పోక్ؚలపై స్టీరింగ్ؚకు అమర్చిన బటన్ؚలు కూడా అదే ట్రీట్మెంట్ؚను అందుకున్నాయి. 

    ఇతర డిజైన్ మార్పులు

    Tata Nexon facelift seen undisguised

    నవీకరించిన నెక్సాన్ ఎక్స్ؚటీరియర్ డిజైన్ భారీ మార్పులను పొందింది. ప్రస్తుతం ముందు భాగం కొత్త గ్రిల్ డిజైన్, పదునైన LED DRLలు మరియు నిలువుగా అమర్చిన హెడ్ؚలైట్ؚలతో నాజూకుగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ దాదాపుగా మునుపటి మోడల్‌లో ఉన్నట్లుగానే కనిపిస్తుంది అయితే కొత్త అలాయ్ వీల్స్ؚతో వస్తుంది, వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంపులు మరియు మరింత దృఢమైన డిజైన్‌తో వస్తుంది.

    Tata Nexon facelift cabin

    క్యాబిన్ లోపల కొత్త డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్, నాజూకైన AC వెంట్ؚలు మరియు కొత్త ఊదారంగు క్యాబిన్ థీమ్ؚతో నవీకరించబడింది.

    పవర్ؚట్రెయిన్

    115PS పవర్ మరియు 260Nm టార్క్‌ను అందించే ప్రస్తుత నెక్సాన్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚను టాటా కొనసాగించే అవకాశం ఉంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMTతో జోడించబడింది. DCT ఆటోమ్యాటిక్ؚతో కొత్త 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚను కూడా అందించవచ్చు. ఈ యూనిట్ 125PS పవర్ మరియు 225Nm టార్క్‌ను విడుదల చేస్తుంది, మరియు కొత్త BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడింది. 

    ఫీచర్‌లు & భద్రత

    Tata Nexon Facelift Cabin

    రహస్య చిత్రాలలో చూసినట్లు, నవీకరించిన నెక్సాన్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్,  360-డిగ్రీల కెమెరా, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేؚలను పొందుతుంది. నిలిపివేస్తున్న వెర్షన్ؚలో ఉన్న వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వెంటిలేటెడ్ ముందరి సీట్లు వంటి ఇతర ఫీచర్‌లను కొనసాగిస్తుంది.  

    ఇది కూడా చూడండి: విడుదలకు ముందు రహస్యంగా చిత్రీకరించిన టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ ఎక్స్ؚటీరియర్ డిజైన్

    ప్రయాణీకుల భద్రత విషయానికి వస్తే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు రేర్ వ్యూ కెమెరాలతో రావచ్చు. 

    విడుదల, ధర & పోటీదారులు

    Tata Nexon facelift rear seen undisguised

    నవీకరించిన నెక్సాన్ ను టాటా సెప్టెంబర్ 14వ తేదీన విడుదల చేయనుంది, దీనితో పాటుగా నెక్సాన్ EV ఫేస్ లిఫ్ట్ కూడా విడుదల అవుతుంది. దీని ప్రారంభ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చని అంచనా, ఇది కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా మరియు మహీంద్రా XUV300 వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది. 

    చిత్రం మూలం

    ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT

    was this article helpful ?

    Write your Comment on Tata నెక్సన్

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience