విడుదలకు ముందే రహస్య చిత్రాలలో పూర్తిగా కనిపించిన Tata Nexon Facelift ఎక్స్టీరియర్ డిజైన్
టాటా నెక్సన్ కోసం rohit ద్వారా ఆగష్టు 29, 2023 06:44 pm ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ ముందు మరియు వెనుక భాగం మరింత భిన్నంగా, నాజూకైన మరియు డ్యాపర్ LED లైటింగ్ సెట్అప్ؚతో రానుంది
-
నవీకరించిన టాటా నెక్సాన్ؚ సెప్టెంబర్ 14న విడుదల కానుంది.
-
బహుశా TVC షూట్ؚలో తీసిన కొత్త రహస్య చిత్రాలలో, ఈ SUV ఎటువంటి ముసుగు లేకుండా కనిపించింది.
-
క్యాబిన్ అప్ؚడేట్ؚలలో కొత్త స్టీరింగ్ వీల్ మరియు పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి.
-
360-డిగ్రీల కెమెరా, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు ఉన్నాయి.
-
టాటా దీన్ని టర్బో-పెట్రోల్, డీజిల్ మరియు EV పవర్ ట్రెయిన్ؚలలో అందిస్తుంది.
-
ప్రస్తుత నెక్సాన్ కంటే (రూ. 8 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర ఎక్కువగా ఉండవచ్చు.
టాటా నెక్సాన్ మరియు నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ؚల విడుదల తేదీని ఇటీవల ప్రకటించారు. వీటి ధరలను మరొక రెండు వారాల తరువాత ప్రకటించనున్నారు, అయితే అప్ؚడేట్ చేసిన ఈ SUV, బహుశా టెలివిజన్ ప్రకటన (TVC) షూట్ؚలో ఎటువంటి ముసుగు లేకుండా కనిపించింది.
పదునైన ముందు భాగం
పదునైన ముందు భాగం, సవరించిన LED DRLలు కలిగిన నాజూకైన గ్రిల్ؚ రూపాన్ని కొత్త నెక్సాన్ؚకు టాటా అందించింది. ఇది వంగి ఉన్నట్లు కనిపించే బంపర్ డిజైన్ؚను కలిగి ఉంది, ఇందులో నిటారుగా అమర్చిన LED హెడ్‌లైట్‌లు మరియు క్రింది సగం భాగంలో అలంకరణలు ఉన్నాయి.
వెనుక భాగం సంగతి ఏంటి?
ఈ SUV వెనుక ప్రొఫైల్ؚకు కూడా గణనీయమైన మార్పులను అందించారు. నాజూకైన LED టెయిల్ؚలైట్ సెట్అప్ (ప్రస్తుతం లైటింగ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడింది), ‘నెక్సాన్’ బ్యాడ్జింగ్ؚను కలిగి ఉండి రీడిజైన్ చేసిన టెయిల్ؚగేట్ మరియు ఫాక్స్ స్కిడ్ ؚప్లేట్ؚతో బలమైన బంపర్ؚను కలిగి ఉంది. రేర్ రిఫ్లెక్టర్ؚలను కలిగి ఉన్న విస్తరించిన వీల్ ఆర్చ్ؚలు మరింత పొడవుగా మరియు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
SUV పక్క భాగంలో చేసిన ఏకైక మార్పు సరికొత్తగా డిజైన్ చేసిన ఆలాయ్ వీల్స్. ఈ మార్పులు అన్నీ నెక్సాన్ EVలో కూడా ఉంటాయని ఆశించవచ్చు, EVకి ప్రత్యేకమైన నీలి హైలైట్‌లు మరియు క్లోజ్డ్ ఆఫ్ ప్యానెల్స్ తప్పక ఉంటాయి.
ఇది కూడా చదవండి: 2024 నుండి మొదలుకొని, భారత ప్రత్యేక కార్ؚల క్రాష్ టెస్టింగ్ పగ్గాలను భారత్ NCAPకు అప్పగించనున్న గ్లోబల్ NCAP
ఇంటీరియర్‌లో కూడా మార్పులను పొందింది
SUV ఇంటీరియర్ؚకు చేసిన వివిధ అప్ؚడేట్ؚలలో, గమనించదగిన మార్పులలో కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు టాటా కర్వ్-లాంటి 2-స్పోక్ؚ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. SUV క్యాబిన్ؚకు అందించిన పూర్తి అప్ؚడేట్ؚల గురించి తెలుసుకునేందుకు మా విస్తృతమైన కధనాన్ని చూడండి.
సాంకేతికతతో సంచలనం సృష్టిస్తోంది
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚ (ADAS), ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్‌లు మరియు 360-డిగ్రీల కెమెరా వంటి ఫీచర్‌లతో కొత్త సాంకేతికతను పొందుతుంది. ఇందులో ఉన్న ఇతర ఫీచర్‌లలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, వెంటిలేటెడ్ ముందు సీట్లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.
దీని భద్రతా ఫీచర్‌లలో ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు మరియు రివర్సింగ్ కెమెరా కూడా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: వివిధ రకాల NCAPల విశ్లేషణ: ప్రపంచ వ్యాప్తంగా ఆటోమోటివ్ సేఫ్టీ టెస్టింగ్
పవర్ؚట్రెయిన్ ఎంపికల వివరాలు
ప్రస్తుత మోడల్ؚలో ఉన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚను (115PS/160Nm) కొత్త నెక్సాన్ؚలో టాటా కొనసాగించనుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 6-స్పీడ్ AMTతో జోడించబడుతుంది. ఈ నవీకరించిన SUV టాటా ప్రవేశపెట్టిన సరికొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రో ఇంజన్‌ను (125PS/225Nm) కూడా పొందవచ్చు, ఇది కొత్త DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్) ఎంపికను పొందవచ్చు. నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ పవర్‌ట్రెయిన్ؚలకు మార్పులు ఉండకపోవచ్చు, ఇది వివిధ బ్యాటరీ సైజులలో రెండు వర్షన్‌లలో – ప్రైమ్ మరియు మ్యాక్స్ؚగా అందించబడుతుంది.
పోటీదారులు మరియు ధర తనిఖీ
ప్రస్తుత మోడల్ (రూ.8 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో పోలిస్తే టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ ధర అధికంగా ఉండవచ్చు. నవీకరించిన SUV కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్, మరియు మహీంద్రా XUV300 వంటి వాటిలో పాటు మారుతి ఫ్రాంక్స్ మరియు సిట్రోయెన్ C3 వంటి క్రాస్ఓవర్ మోడల్‌లతో కూడా పోటీ పడనుంది.
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT
0 out of 0 found this helpful