Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

అధికారిక విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚల వద్ద నవీకరించబడిన హోండా సిటీని ముందుగా బుక్ చేసుకోవచ్చు

honda city కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 22, 2023 05:40 pm ప్రచురించబడింది

నవీకరించబడిన హోండా సెడాన్ స్వల్ప డిజైన్ మార్పులతో పాటు మెరుగైన భద్రతా ఫీచర్‌లతో రానుంది.

  • ప్రస్తుతం నవీకరించబడిన సెడాన్ బుకింగ్ؚలు కేవలం డీలర్‌షిప్ؚల వద్ద మాత్రమే ప్రారంభమయ్యాయి.

  • ఇది కేవలం స్వల్ప డిజైన్ మార్పులతో, నవీకరించిన భద్రతా కిట్ؚతో వస్తుంది.

  • ఈ సెడాన్, కొత్త ఉద్గార ప్రమాణాలను అందుకునేందుకు నవీకరించబడిన మునపటి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంటుంది.

  • నవీకరించబడిన 2023 హోండా సిటి విక్రయాలు మార్చి 2, 2023 నుంచి మొదలవుతాయి.

  • దీని ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా.

భారత కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ؚలో ఉన్న గట్టి పోటీ కారణంగా, హోండా తన ఐదవ-జనరేషన్ సిటీకి స్వల్ప మార్పులతో ప్రవేశపెట్టనుంది. ప్రవేశపెట్టే తేదీ దగ్గర పడుతుండగా, డిమాండ్ కారణంగా అధికారిక విడుదలకు ముందే ఎంచుకోబడిన కొన్ని హోండా డీలర్‌షిప్ؚలు నవీకరించబడిన సెడాన్ ముందస్తు బుకింగ్‌లను అంగీకరిస్తున్నాయి. డీలర్‌షిప్‌పై ఆధారపడి, ముందస్తు బుకింగ్ ధర రూ.5,000 నుండి రూ.21,000 వరకు ఉండవచ్చు.

నవీకరించబడిన హోండా సెడాన్ నుంచి మీరు ఆశించగలిగినవి క్రింది ఇవ్వబడ్డాయి

స్వల్ప డిజైన్ మార్పులు

విడుదలైన ఫేస్లిఫ్టెడ్ హోండా సిటీ చిత్రాలలో చూసినట్లు, డిజైన్ పరంగా అంతగా గమనించదగ మార్పులు ఏమి లేవు. వీటిలో, కొద్దిగా సవరించిన గ్రిల్ؚతో మరింత స్పష్టంగా కనిపించే LED DRL, కొత్త ఫ్రంట్ బంపర్ ఉన్నాయి.

ఇది కూడా చూడండి: మొదటిసారి భారతదేశ రోడ్‌లపై కనిపించిన హోండా సరికొత్త SUV, మారుతి గ్రాండ్ విటారాతో పోటీ పడవచ్చు.

లోపలి భాగంలో, ఈ సెడాన్ؚ మునపటి డ్యూయల్-టోన్ డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్ కలిగి ఉంది, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో ఎనిమిది-అంగుళాల టచ్‌స్క్రీన్ؚను కొనసాగిస్తుంది. అంతేకాకుండా, నవీకరించబడిన సిటీ వాహనంలో వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, మరింత సాంకేతికత ఫీచర్‌లు ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: CarDekho గ్రూప్ సి‌ఈ‌ఓ షార్క్ ట్యాంక్ ఇన్వెస్టర్ అమిత్ జైన్ ఈ వాహనాన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకోండి

మెరుగైన భద్రత కిట్

భద్రత పరంగా, నవీకరించబడిన సిటీలో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా అందిస్తూ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్-సీట్ యాంకర్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚ వంటి ఫీచర్‌లతో వస్తుందని అంచనా.

దీని e:HEV హైబ్రిడ్ వేరియంట్ؚలాగే ఇందులో పూర్తి ADAS సాంకేతికత ఉండవచ్చు. ఈ సాంకేతికతలో భాగంగా లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్ కూడా ఉండవచ్చు.

నవీకరించబడిన ఇంజన్

నవీకరించబడిన హోండా సిటీ, ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ లేదా CVT ఆటోమ్యాటిక్ؚతో జత చేయబడిన అదే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో (121PS, 145Nm పవర్ టార్క్‌ను అందించే) రావచ్చు. RDE, BS6 ఫేజ్ II నిబంధనలకు, E20 ఇంధనానికి అనుగుణంగా ఉండేలా దీన్ని నవీకరిస్తున్నారు.

హోండా సిటీలో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికను దశలవారీగా తొలగిస్తుంది, ఫేస్లిఫ్టెడ్ వెర్షన్ బేస్ వేరియెంట్‌లో eHEV (స్ట్రాంగ్-హైబ్రిడ్) పవర్‌ట్రెయిన్ؚను కలిగి ఉండవచ్చు, ఇది ఈ వాహనాన్ని మరింత చవకైనదిగా చేస్తుంది.

అంచనా ధర పోటీదారులు

2023 హోండా సిటీ తన పోటీని స్కోడా స్లేవియా, వోక్స్ వ్యాగన్ వర్చుస్ మరియు కొత్త-జనరేషన్ హ్యుందాయ్ వెర్నాతో కొనసాగిస్తుంది. ఇది మార్చి 2 తేదీ నుండి మార్కెట్‌లోకి రానుంది, రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వస్తుందని అంచనా.

ఇక్కడ మరింత చదవండి: సిటీ డీజిల్

Share via
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.6.54 - 9.11 లక్షలు*
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.6 - 9.50 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.07 - 17.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర