సెగ్మెంట్ల పోరు: మారుతి స్విఫ్ట్ 2018 Vs మారుతి ఇగ్నిస్ - ఏ కారు కొనుగోలు చేసుకొనేందుకు సరైనది?
మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం cardekho ద్వారా మార్చి 29, 2019 12:11 pm ప్రచురించబడింది
- 129 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఏడాది ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ 2018 ను విడుదల చేసింది. దీని ధర రూ .4.99 లక్షల దగ్గర మొదలయ్యి రూ .8.29 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంది. ఆసక్తికరంగా, ఈ స్విఫ్ట్ మారుతి సంస్థ కి చెందిన మరో రెండు మంచి హ్యాచ్బ్యాక్ లు అయిన ఇగ్నిస్ మరియు బాలెనో కార్లతో ఢీ కొడుతుంది. ఈ మూడు హ్యాచ్బ్యాక్లు ప్రత్యక్షంగా పోటీ లోనికి దిగకపోయినా, కానీ ఈ వేరియంట్ల మధ్య ఉన్న ధరలు దాదాపు ఒకేలా ఉండడంతో ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది: అదేమిటంటే ఏ మోడల్ కొనుగోలు చేసేందుకు సరైనది?
బాలెనో మరియు స్విఫ్ట్ మధ్య ఏది కొనుగోలు చేసేందుకు బాగుంటుందో మేము ఇప్పటికే సమాధానం చెప్పాము, ఇప్పుడు ఇగ్నిస్ మరియు స్విఫ్ట్ ఏ విధంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయో తెలుసుకోవడానికి రెండు కార్ల మధ్య ప్రాధమిక లక్షణాలు వ్యత్యాసాలతో మొదలుపెడదాము.
స్విఫ్ట్ |
ఇగ్నీస్ |
చిన్నగా ఉన్నప్పటికీ విశాలమైనది కొత్త స్విఫ్ట్ దాని ముందు దానితో పోలిస్తే స్థలంలో ఎక్కువగా ఉంటుంది. పెరిగిన వెడల్పు మరియు వీల్ బేస్ కారణంగా క్యాబిన్ చుట్టూ స్థలం బాగా మెరుగ్గా అభివృద్ధి చెందింది, ప్రత్యేకంగా వెనుక భాగంలో బాగా అభివృద్ధి చెందింది. |
చిన్నది కానీ ఎత్తైనది ఇగ్నీస్ కారు ఎత్తు పరంగా తప్ప మిగిలిన వాటిలో స్విఫ్ట్ కంటే చిన్న హ్యాచ్బ్యాక్. క్యాబిన్ నలుగురు మనుషులు(ఐదుగురు కాదు) సీటింగ్ కోసం బాగుంటుంది, అయితే, పొడవైన ప్రయాణీకులు కోసం తగినంత హెడ్‌రూం ఉంటుంది. |
రైడ్ బాగానే ఉంటుంది, అంత అసౌకర్యంగా ఏమీ ఉండదు. స్విఫ్ట్ రైడ్ బానే ఉంటుంది, లోపల ఉన్న వారిని అంతగా ఏమీ కుదిపేయదు. కానీ ఇగ్నీస్ తో పోల్చుకుంటే కొంచెం స్విఫ్ట్ లో బయట ఉండే గతకలు ఆ చెడుదారి అనుభవం కొద్దిగా లోపల ఉన్న వారికి తెలుస్తుంది. |
ఒక సౌకర్యవంతమైన రైడ్ ఇగ్నిస్ సస్పెన్షన్ మృదువుగా ఏర్పాటు చేయబడి, స్విఫ్ట్ కంటే మరింత సౌకర్యవంతమైన రైడ్ ని అందించే అవకాశం ఉంది. |
స్విఫ్ట్ డ్రైవర్ కారు మెరుగైన సస్పెన్షన్ సెటప్ మెరుగైన హ్యాండ్లింగ్ ప్యాకేజీలో లభిస్తుంది. ఇగ్నిస్ కంటే మెరుగైన ట్విస్ట్లను పరిష్కరించడంలో స్విఫ్ట్ మరింత విశ్వసనీయతను కలిగి ఉంటుంది. |
రెండు ప్రపంచాల మిశ్రమం మృదువైన సస్పెన్షన్ సెటప్ ఉన్నప్పటికీ, ఇగ్నిస్ స్టీరింగ్ విషయంలో అంతగా బాగోదు.అనగా దాని హ్యాండిలింగ్ విధానం స్విఫ్ట్ అంత షార్ప్ గా ఉండదు. |
మంచి పునఃవిక్రయం విలువను కలిగి ఉంది స్విఫ్ట్ భారతదేశంలో విజయవంతమైన నామకరణం కలిగి ఉంది మరియు యూసెడ్ కార్ స్పేస్ లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంది. కొత్తది కూడా అధిక సంఖ్యలో అమ్ముడవుతోంది, దాని ప్రత్యర్ధుల కన్నా ఎక్కువ పునఃవిక్రయ విలువను కలిగి ఉంటుందని అంచనా. |
చురుకైన స్టయిలింగ్ మరియు కొద్దిగా మెరుగ్గా ఉంటుంది విక్రయాలు విషయానికి వస్తే ఇగ్నిస్ బాగా అమ్మకాలు జరిగే కారు.అయితే, దాని చురుకుగా ఉండే డిజైన్ అందరి ఇష్టాలకు అంతగా నచ్చకపోవచ్చు మరియు ఈ విషయమే సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో దాని ధరలను ప్రభావితం చేస్తుంది. |
ఇంచుమించు ఒకే ధరతో కూడుకున్నటువంటి వేరియంట్స్ రెండు కార్లలో ఏ కారు ఎక్యుప్మెంట్ పరంగా మంచి విలువను అందిస్తుంది, ఇప్పుడు చూద్దాము పదండి.
ఇగ్నిస్ సిగ్మా vs స్విఫ్ట్ L vs ఇగ్నిస్ డెల్టా
ఎక్స్- షోరూం ఢిల్లీ ధరలు మార్చి 1, 2018 న
వేరియంట్ |
మారుతి సుజుకి ఇగ్నిస్ |
వేరియంట్ |
మారుతి సుజుకి స్విఫ్ట్ |
||||
|
పెట్రోల్ |
డీజిల్ |
పెట్రోల్ |
డీజిల్ |
|||
సిగ్మా |
రూ.4.66లక్షలు |
NA |
L |
రూ. 4.99 లక్షలు |
రూ 5.99 లక్షలు |
||
డెల్టా |
రూ.5.27లక్షలు |
రూ.6.32లక్షలు |
ఇగ్నిస్ కారు యొక్క బేస్ వేరియంట్ సిగ్మా బాడీ-కలర్డ్ డోర్ హ్యాండిల్స్ మరియు అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ (ORVMs), మరియు స్విఫ్ట్ కారులో లేని పవర్ పవర్ విండోస్ కలిగి ఉన్నాయి. మీరు ఈ కార్లు అందించే ఆఫర్ల ద్వారా చూసుకున్నట్లయితే, స్విఫ్ట్ అనేది ఇగ్నిస్ కంటే పెద్దది మరియు మరింత విశాలమైనది అనే అంశం పక్కన పెడితే, ఇగ్నిస్ సిగ్మా ఇక్కడ స్పష్టంగా విజేతగా పరిగణించబడుతుంది.
కానీ, ఇగ్నిస్ డెల్టా సిగ్మాపై క్రింది లక్షణాలను పొందుతుంది: వీల్ కవర్లు, ORVM లపై టర్న్ ఇండికేటర్స్, స్టీరింగ్ మౌంటెడ్ నియంత్రణలతో ఆడియో సిష్టం, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVM లు, డే/నైట్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ (IRVMs) మరియు వెనుక పవర్ విండోస్.
ఇగ్నిస్ డెల్టా వేరియంట్ ను దాని రహదారి ధర రూ.40,000 సిగ్మాపై కంటే ఎక్కువ కాకుండా ఉంటే మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే దాని పైన ధర ఎక్కువ ఉంటే గనుక అది న్యాయం చేయదు.
స్విఫ్ట్ V vs ఇగ్నిస్ జీటా
మార్చి 1, 2018 న ఎక్స్-షోరూం ఢిల్లీ ధరలు
వేరియంట్ |
మారుతి సుజుకి ఇగ్నిస్ |
వేరియంట్ |
మారుతి సుజుకి స్విఫ్ట్ |
||||
|
పెట్రోల్ |
డీజిల్ |
పెట్రోల్ |
డీజిల్ |
|||
జెటా |
రూ.5.69లక్షలు |
రూ.6.79లక్షలు |
V |
రూ. 5.87 లక్షలు |
రూ. 6.87 లక్షలు |
||
జెటా AMT |
రూ.6.25లక్షలు |
రూ.7.34లక్షలు |
V AGS |
రూ. 6.34 లక్షలు |
రూ. 7.34 లక్షలు |
స్విఫ్ట్ V మరియు ఇగ్నిస్ జీటా రెండూ కూడా ఏదైనా కారుకి మనం కనీసం ఎటువంటి లక్షణాలు అయితే కావాలి అనుకుంటామో వాటిని అనగా డ్యుయల్ ఎయిర్బాగ్స్, ABS, అన్ని డోర్స్ కి పవర్ విండోస్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ తో మ్యూజిక్ సిష్టం మరియు ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVM వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ రెండు కార్లు కూడా ఈ వేరియంట్స్ బాడీ-కలర్డ్ డోర్ హ్యాండిల్స్ మరియు ORVM లను పొందుతున్నాయి. దీని పైన ఇగ్నీస్ అల్లాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్ /స్టాప్, ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ ORVM లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఫాగ్ లాంప్స్, వెనుక వైపర్ మరియు డిఫేజర్లను పొందుతున్నాడు. జెటా లో ఉండే ఈ అధనపు లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటే స్విఫ్ట్ V మరియు ఇగ్నీస్ జెటా రెండూ ఒకటే ఆన్-రోడ్ ధరలను కలిగి ఉండడంతో జెటా కొనుగోలు చేసుకోవడం మంచింది.
స్విఫ్ట్ Z vs ఇగ్నిస్ ఆల్ఫా
మార్చి 1, 2018 నాటికి ఎక్స్-షోరూమ్ ధర
వేరియంట్ |
మారుతి సుజుకి స్విఫ్ట్ |
వేరియంట్ |
మారుతి సుజుకి ఇగ్నిస్ |
||||
|
పెట్రోల్ |
డీజిల్ |
పెట్రోల్ |
డీజిల్ |
|||
Z |
రూ.6.49లక్షలు |
రూ.7.49లక్షలు |
ఆల్ఫా |
రూ. 6.50 లక్షలు |
రూ. 7.58 లక్షలు |
||
Z AGS |
రూ.6.96లక్షలు |
రూ.7.96లక్షలు |
ఆల్ఫా AMT |
రూ. 7.04 లక్షలు |
రూ. 8.12 లక్షలు |
ఆల్ఫా వేరియంట్ ఇగ్నీస్ యొక్క టాప్ వేరియంట్, మీరు కొనుగోలు చేసుకోగలరు మరియు ఇది LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, స్మార్ట్ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు రియర్ స్పోర్ట్స్ కెమెరా వంటి లక్షణాలను కలిగి ఉంది. ఇవి స్విఫ్ట్ Z లో లభించవు, ఇది స్విఫ్ట్ యొక్క టాప్ Z + వేరియంట్ క్రింద ఉంది. స్విఫ్ట్ Z మరియు ఇగ్నిస్ ఆల్ఫాలను తీసుకుంటే, అదనపు ఉపకరణాల ఆధారంగా ఇగ్నిస్ ఆల్ఫాను సిఫార్సు చేయడం మంచింది అనిపిస్తుంది.
కానీ, స్పష్టముగా ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, స్విఫ్ట్ Z ఏ ముఖ్యమైన లక్షణాలను కోల్పోయి లేదు. ఇంకా ఈ రెండు కార్లలో స్విఫ్ట్ పెద్దది అనే అంశాన్ని మీరు మర్చిపోలేరు. అందువలన రెండు కార్లు ఒకే ధరను కలిగి ఉంటే మాత్రం స్విఫ్ట్ బెటర్ కారుగా నిలుస్తుంది.
మేము ముగించడానికి ముందు, ఇక్కడ ఇగ్నిస్ మరియు స్విఫ్ట్ యొక్క స్పెసిఫికేషన్ వివరణలు చూడండి:
సాంకేతిక వివరములు
కొలతలు |
మారుతి సుజుకి స్విఫ్ట్ |
మారుతి సుజుకి ఇగ్నిస్ |
పొడవు |
3,840mm |
3,700mm |
వెడల్పు |
1,735mm |
1,690mm |
ఎత్తు |
1,530mm |
1,595mm |
వీల్బేస్ |
2,450mm |
2,435mm |
బూట్ స్పేస్ |
268L |
260L |
గ్రౌండ్ క్లియరెన్స్ |
163mm |
180mm |
మారుతి సుజుకి స్విఫ్ట్ |
మారుతి సుజుకి ఇగ్నిస్ |
||||
డీజిల్ |
పెట్రోల్ |
డీజిల్ |
పెట్రోల్ |
||
ఇంజిన్ |
1248cc |
1197cc |
1248cc |
1197cc |
|
పవర్ |
75PS @ 4000rpm |
83PS @ 6000rpm |
75PS @ 4000rpm |
83PS @ 6000rpm |
|
టార్క్ |
190Nm @ 2000rpm |
113Nm @ 4200rpm |
190Nm @ 2000rpm |
113Nm @ 4200rpm |
|
ట్రాన్స్మిషన్ |
5MT/5AMT |
5MT/5AMT |
5MT/5AMT |
5MT/5AMT |