• English
  • Login / Register

చేవ్రొలెట్ క్రుజ్ ఫేస్ లిఫ్ట్ ఆటో ఎక్స్పో 2016 లో ప్రదర్శించారు

చేవ్రొలెట్ క్రూజ్ కోసం saad ద్వారా ఫిబ్రవరి 03, 2016 05:26 pm ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.

జనరల్ మోటార్స్ వారు తమ యొక్క కొత్త షెవర్లే క్రూజ్ వహనాన్ని జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు. ఈ వాహనం ఇటీవలే 14.68 లక్షల(ఎక్స్-షోరూం డిల్లీ) ధర వద్ద ప్రవేశపెట్టబడింది. ఈ నవీకరించబడిన సెడాన్ ఒక పూర్తి మార్పు చేసిన లుక్ తో మరియు అధికమైన సాంకేతిక ప్రత్యేఖతలతో తయారుచేయబడింది మరియు ఇది సామర్ధ్యం దృష్ట్యా మునుపటి వాహనాన్ని పోలి ఉండబోతోంది. ఈ కారు ఇంతకు ముందు కన్నా కొద్దిగా పెంపు చేసిన రూ.15,000 నుండి 70,000 ధరతో మార్కెట్లోనికి రానున్నది. ధర వాహనం యొక్క ప్ర్త్యేకతలపై ఆధారపడి ఉండబోతోంది. అవి మాన్యువల్, ఆటోమెటిక్ వేరియంట్స్ అయిన LT, LTZ మరియు LTZ AT మోడళ్ళుగా కలిగి ఉంది. ఈ వాహనం రెనో ఫ్లూయెన్స్, హ్యుందాయి ఎలంట్రా, స్కోడా ఆక్టేవియా మరియు టొయోటా కొరోల్లా ఆల్టిస్ వంటి వాహనాలతో పోటీ గా రాబోతుంది.  

మార్పు చేసిన ముందు మరియు వెనుక భాగాల వలన ఈ క్రూజ్ చాలా స్టయిలిష్ గా కనిపించబోతుంది. ఈ ఫేస్లిఫ్ట్ క్రూజ్ షెవ్రోలే యొక్క కొత్త ట్విన్ స్లాట్ గ్రిల్ ని పొంబ్ది పూర్తిగా నవీకరించిన బంపర్లను కలిగి పగటి పూట నడిచే LED లైట్లతో అందంగా ఉండబోతోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మోడళ్ళలోని ఉన్నటువంటి అవే హెడ్లైట్లను ఈ ఫేస్లిఫ్ట్ లో కూడా కొనసాగించడం జరుగుతుంది. కారు వెనుక భాగంలో ఒక కొత్త స్పాయిలర్ లిప్ ను అమర్చడం జరిగింది, ఈ విధంగా కారు యొక్క బాహ్య రూపం ఒక కొత్త రూపుతో అలరించబోతుంది. 

కారు అంతర్భాగం విషయానికి వస్తే ఈ సెడాన్ వాహనం తన యొక్క మునుపటి వాహనం నుండి ప్రత్యేఖతను పోలి ఉండబోతుంది. ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగినవి కలర్ స్కీం- డిజైన్ మరియు ప్లాస్టిక్ అంతర్భాగాలు. ప్రత్యేఖంగా చూపరులను ఆకర్షించే విధంగా ఉన్న కొత్త 7-అంగుళాల మైలింక్ టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, షెవ్రోలే ట్రెయిల్ బ్లేజర్ లో అమర్చే విధంగా ఉండబోతుంది. వినోద వ్యవస్థ ఇంటర్నెట్ రేడియో తో బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ తో టెలిఫోనీ, A.C నియంత్రణ మరియు సిరి కంపాటబిలిటీ కలిగి ఉండబోతుంది. అయితే సిరి వ్యవస్థ ఆపిల్ ఫోన్లలో ఉదాహరణకి ఐపాడ్ మరియు ఐ ఫోన్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండబోతుంది. అంతేకాకుండా ఒక మల్టీఫంక్ష్నల్ స్టీరింగ్ వ్యవస్థ సమాచార వినోద వ్యవస్థతో జత చేయబడి ఉండబోతుంది.

ఈ క్రూజ్ సామర్ధ్యం పరంగా మాత్రం ముందు చెప్పినట్లు ప్రస్తుతం ఉన్న వాహనాలను పోలి ఉండబోతోంది. ఇది 2.0 లీటర్ 4 సిలెండర్ టర్బో డీజిల్ మిల్ ను కూడి ఉండబోతుంది. VCDi ఇంజిన్ ఒక 165bhp శక్తిని అందిస్తుంది మరియు 3.60Nm టార్క్ ని అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమెటిక్ గేర్బాక్స్ ని కలిగిన మోటార్ ద్వారా 14.81 మరియు 17.9Kmpl మైలేజ్ ని అందిస్తుంది. భద్రతా పరంగా సైడ్ ఎయిర్బ్యాగ్స్, ABS మరియు PEPS( పాసివ్ ఎంట్రీ పాసివ్ స్టార్ట్), ఏంటీ తెఫ్ట్ అలారం, సెంట్రల్ లాకింగ్ మరియు ఆటో ఇగ్నీషియన్ స్టార్ట్ స్టాప్ వంటి అంశాలు కలిగి ఉంటుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Chevrolet క్రూజ్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience