మార్చి 2023లో అత్యధికంగా అమ్ముడైన 15 కార్‌ల వివరాలు
టాటా నెక్సన్ 2020-2023 కోసం ansh ద్వారా ఏప్రిల్ 12, 2023 06:56 pm ప్రచురించబడింది
- 48 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ జాబితాలోని అన్నీ కార్‌లలో, అరవై శాతం మారుతి కార్‌లు ఉన్నాయి
అమ్మకాల విషయంలో మారుతి ఎల్లప్పుడూ మార్కెట్‌లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. మార్చి 2023లో కూడా దీనినే కొనసాగించింది. మార్చిలో అత్యధికంగా అమ్ముడైన 15 కార్‌లలో, తొమ్మిది మోడల్‌లు మారుతికి చెందినవే. ఈ జాబితాలో టాటా, హ్యుందాయ్ వంటి బ్రాండ్‌లు తదుపరి స్థానాలను ఆక్రమించాయి. ఈ జాబితాలోని కొన్ని మోడల్‌లు సంవత్సరవారీ (YoY) అమ్మకాలలో నష్టాలను చవిచూశాయి, అయితే వీటిలో చాలా వరకు వృద్ధిని కూడా కనపరిచాయి.
ఇది కూడా చదవండి: మార్చి 2023లో అత్యధిక ప్రజాదరణ పొందిన 10 కార్‌లు
మార్చి 2023లో అత్యధికంగా అమ్ముడైన ఈ 15 కార్‌ల అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:
మోడల్‌లు |
మార్చి 2023 |
మార్చి 2022 |
ఫిబ్రవరి 2023 |
మారుతి స్విఫ్ట్ |
17,559 |
13,623 |
18,412 |
మారుతి వాగన్ R |
17,305 |
24,634 |
16,889 |
మారుతి బ్రెజ్జా |
16,227 |
12,439 |
15,787 |
మారుతి బాలెనో |
16,168 |
14,520 |
18,592 |
టాటా నెక్సాన్ |
14,769 |
14,315 |
13,914 |
హ్యుందాయ్ క్రెటా |
14,026 |
10,532 |
10,421 |
మారుతి డిజైర్ |
13,394 |
18,623 |
16,798 |
మారుతి ఈకో |
11,995 |
9,221 |
11,352 |
టాటా పంచ్ |
10,894 |
10,526 |
11,169 |
మారుతి గ్రాండ్ విటారా |
10,045 |
- |
9,183 |
హ్యుందాయ్ వెన్యూ |
10,024 |
9,220 |
9,997 |
మహీంద్రా బొలెరో |
9,546 |
6,924 |
9,782 |
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ |
9,304 |
9,687 |
9,635 |
మారుతి ఆల్టో |
9,139 |
7,621 |
18,114 |
మారుతి ఎర్టిగా |
9,028 |
7,888 |
6,472 |
సారాంశం
-
17,500 పైగా యూనిట్‌ల విక్రయంతో, బాలెనోను అధిగమించి మారుతి స్విఫ్ట్ అగ్ర స్థానంలో నిలిచింది. మార్చి 2022తో పోలిస్తే, ఈ వాహన విక్రయాలు 29 శాతం పెరిగాయి.
-
మార్చి 2023లో 17,300 కంటే ఎక్కువ యూనిట్‌ల అమ్మకాలతో వ్యాగన్ R స్విఫ్ట్‌ను అనుసరించింది. చెప్పాలంటే దీని అమ్మకాలు, గత సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గిపోయాయి.
-
వ్యాగన్ R తరువాత బ్రెజ్జా మరియు బాలెనోలు వరుసగా మూడు మరియు నాలుగవ స్థానాలలో నిలిచాయి, వీటి అమ్మకాలు 16,000 నుండి 16,300 యూనిట్‌ల పరిధిలో ఉన్నాయి. ఫిబ్రవరి 2023తో పోలిస్తే బ్రెజ్జా మూడు స్థానాలు పైకి వెళ్ళగా బాలెనో, మొదటి స్థానాన్ని కోల్పోయింది.
-
మార్చి 2023లో 14,700 యూనిట్‌ల అమ్మకాలతో టాటా నెక్సాన్ ఐదవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2023లో ఇది ఏడవ స్థానంలో నిలిచింది. ఈ అమ్మకాల గణాంకాలలో నెక్సాన్ EV ప్రైమ్ మరియు నెక్సాన్ EV మాక్స్ కూడా ఉన్నాయి.
-
14,000 యూనిట్‌ల అమ్మకాల మార్కును దాటిన మరొక కారు హ్యుందాయ్ క్రెటా, ఇది 33 శాతం సంవత్సరవారీ అమ్మకాలలో వృద్ధిని కనపరిచింది.
-
మార్చి 2023లో 13,400 యూనిట్‌ల కంటే తక్కువ అమ్మకాలతో మారుతి డిజైర్ నెలవారీ మరియు సంవత్సరవారీ అమ్మకాలు రెండిటిలో నష్టాన్ని చూసింది
-
మారుతి ఈకో ఫిబ్రవరి 2023లో ఉన్న స్థానంలోనే కొనసాగింది, కానీ సంవత్సరవారీ అమ్మకాలలో 30 శాతం వృద్ధిని కనపరిచింది.
-
టాటా పంచ్ తొమ్మిదవ స్థానంలో నిలవగా, మారుతి గ్రాండ్ విటారా పదవ స్థానంలో ఉంది, మార్చి 2023లో వీటి అమ్మకాలు వరుసగా 10,894 మరియు 10,045 యూనిట్‌లు.
-
మార్చి 2023లో 10,000 యూనిట్‌ల అమ్మకాల మార్క్ؚను దాటిని చివరి మోడల్ హ్యుందాయ్ వెన్యూ.
-
మొదటి 15 కార్‌ల జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక మహీంద్రా మోడల్ బొలెరో, దీని అమ్మకాలు 9,500 యూనిట్‌లుగా ఉంది.
-
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ అమ్మకాలు దాని నెలవారీ మరియు సంవత్సరవారీ అమ్మకాల గణాంకాలతో పోలిస్తే 9,000 యూనిట్‌ల వద్ద స్థిరంగా ఉంది.
-
చివరి రెండు ర్యాంకులను రెండు మారుతి కార్‌లు ఆల్టో మరియు ఎర్టిగా సొంతం చేసుకున్నాయి. ఎర్టిగా గత నెలతో పోలిస్తే వృద్ధిని సాధించింది, ఆల్టో అమ్మకాలు 50 శాతం వరకు పడిపోగా, దీని స్థానం 14గా ఉంది.
ఇది కూడా చదవండి: 2023 Q2లో విడుదల అవుతాయని ఆశిస్తున్న టాప్ 10 కార్‌లు
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT