• English
    • లాగిన్ / నమోదు

    2023 రెండవ త్రైమాసికంలో విడుదల అవుతాయని ఆశిస్తున్న టాప్ 10 కార్‌ల వివరాలు

    ఏప్రిల్ 13, 2023 11:55 am tarun ద్వారా ప్రచురించబడింది

    35 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ జాబితాలో ఉత్తేజకరమైన సరికొత్త మోడల్‌లు, ముఖ్యమైన నవీకరణలు ఇంకా మరెన్నో  ఉన్నాయి! 

    Upcoming Cars Q2 2023

    2023 రెండవ త్రైమాసికం భారత ఆటోమోటివ్ రంగానికి చాలా ఉత్తేజకరమైన సమయంగా నిలవనుంది! ఎన్నో కొత్త SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సరికొత్త ఎడిషన్‌లు, నవీకరణలు రాబోతున్నాయి. ఏప్రిల్ మరియు జులై నెలలలో దాదాపుగా ప్రతి కారు తయారీదారు తమ వాహనాలను ఆవిష్కరణ లేదా విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నారు. వచ్చే మూడు నెలలలో రానున్న మోడల్‌లలో ఎంచుకున్న ముఖ్యమైన వాహనల వివరాలు ఇక్కడ అందించాము: 

    మారుతి ఫ్రాంక్స్

    Maruti Fronx

    విడుదల తేదీ: ఏప్రిల్ నెల చివరిలో

    ధర అంచనా: రూ.8 లక్షల నుండి ప్రారంభం

    మారుతి సరికొత్త SUV క్రాస్ఓవర్ ఈ నెల చివరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫ్రాంక్స్ؚ మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలతో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లను కలిగి ఉంటుంది. 9-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ వైర్ؚలెస్ ఛార్జర్, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా ఉంటాయి. హ్యుందాయ్ i20 మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలతో కాకుండా సబ్-కాంపాక్ట్ SUVలతో కూడా పోటీ పడనుంది. 

    MG కామెట్ EV

    MG Comet EV

    ఆవిష్కరణ తేదీ: ఏప్రిల్ నెల చివరిలో

    ధర అంచనా: రూ.10 లక్షల నుండి ప్రారంభం

    భారతదేశంలో ఈ కారు తయారీదారు అందిస్తున్న ఐదవ వాహనం, MG కామెట్ EV, దీన్ని ఏప్రిల్ؚలో ఆవిష్కరించనున్నాను. టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3లకు పోటీగా నిలిచే ఈ వాహనం చిన్న రెండు-డోర్‌ల ఆఫరింగ్, ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. కామెట్ EV 17.3kWh మరియు 26.7kWh బ్యాటరీ ప్యాక్ؚలతో, 300 కిలోమీటర్‌ల వరకు క్లెయిమ్ చేసిన పరిధితో రావచ్చు. ఫీచర్‌ల విషయానికి వస్తే, ఇది టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లే, ఆటోమ్యాటిక్ AC, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా వంటి వాటితో వస్తుంది. 

    సిట్రోయెన్ కాంపాక్ట్ SUV (C3 ఎయిర్ؚక్రాస్)

    Citroen C3 Compact SUV

    ఆవిష్కరణ తేదీ – ఏప్రిల్ 27 

    ధర అంచనా – రూ.9 లక్షల నుండి ప్రారంభం

    సిట్రోయెన్ తన కొత్త SUVని ఈ నెల ఆఖరిలో ఆవిష్కరించనుంది, ఇది హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి గ్రాండ్ విటారా వంటి కాంపాక్ట్ SUVలతో పోటీ పడుతుంది. ఇది C3 హ్యాచ్ؚబ్యాక్ పొడిగించిన వెర్షన్ؚల కనిపించే మూడు-వరుసల SUV. 110PS పవర్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో, ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో రావచ్చు. సిట్రోయెన్ కాంపాక్ట్ SUVలో 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ఆటోమ్యాటిక్ AC, డిజిటల్ స్పీడోమీటర్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉండవచ్చు. 

    మారుతి జిమ్నీ

    Maruti Jimny side

    ఆవిష్కరణ – మే నెలలో 

    అంచనా ధర – రూ.10 లక్షల నుండి ప్రారంభం

    ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మారుతి ఆఫ్-రోడర్ చివరకు ఈ వేసవిలో మార్కెట్‌లోకి రానుంది, ఇది మహీంద్రా థార్ؚతో పోటీపడుతుంది. మాన్యువల్, ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚ ఎంపికలతో 103PS 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంటుంది. 

    జిమ్నీ తక్కువ పరిధి గేర్ బాక్స్ؚతో 4WDని ప్రామాణికంగా పొందుతుంది. తొమ్మిది-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఆటోమ్యాటిక్ AC, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్‌లను పొందింది. 

    హోండా కాంపాక్ట్ SUV

    Honda Compact SUV

    ఆవిష్కరణ – మే నెలలో

    అంచనా ధర – రూ.11 లక్షల నుండి ప్రారంభం

    హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా మరియు ఇతర కాంపాక్ట్ SUVలతో పోటీ పడటానికి హోండా చివరకు ఈ విభాగంలోకి ప్రవేశిస్తోంది. హోండా SUV దృఢమైన లుక్ కోసం నిటారుగా, దృఢమైన బాడీ క్లాడింగ్ؚతో వస్తుంది. స్ట్రాంగ్-హైబ్రిడ్ సాంకేతికతతో సిటీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను ఇది ఉపయోగిస్తుందని భావిస్తున్నాము. ఫీచర్‌ల పరంగా చూస్తే, ఇది ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, పెద్ద టచ్ؚస్క్రీన్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వైర్ؚలెస్ ఛార్జర్, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు రాడార్ ఆధారిత ADASలను కలిగి ఉండవచ్చు. 

    సరికొత్త హ్యుందాయ్ SUV

    Hyundai Micro SUV

    ఆవిష్కరణ – మే నెలలో

    ధర అంచనా – రూ.6 లక్షల నుండి ప్రారంభం

    భారతదేశంలో హ్యుందాయ్ సరికొత్త SUVని ప్రవేశపెట్టనుంది, ఇది టాటా పంచ్ؚకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ మైక్రో SUV గ్రాండ్ i10 నియోస్ 83PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది, 100PS పవర్ 1-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ కూడా ఉండవచ్చు. ఇతర హ్యుందాయ్ వాహనాల విధంగానే, కొత్త SUVలో భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, సన్ؚరూఫ్, రేర్ పార్కింగ్ కెమెరాలతో ఫీచర్‌లతో రావచ్చు. 

    నవీకరించబడిన కియా సెల్టోస్

    2023 Kia Seltos

    ఆవిష్కరణ – జూన్ నెలలో

    అంచనా ధర – రూ. 10 లక్షల నుండి ప్రారంభం

    నవీకరించబడిన సెల్టోస్‌ను కియా ఈ సంవత్సరం రెండవ భాగంలో ఆవిష్కరించవచ్చు. నవీకరించబడిన ఈ కాంపాక్ట్ SUV కొత్త గ్రిల్ؚతో తాజా ఎక్స్ టీరియర్ డిజైన్, విభిన్నమైన అలాయ్ వీల్స్, కొత్త హెడ్‌ల్యాంపులు మరియు టెయిల్ లైట్ؚలు, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్ؚలతో వస్తుంది. క్యాబిన్ؚలో కూడా తేలికపాటి మార్పులతో, గ్లోబల్ మోడల్ؚలో ఉన్నట్లుగా అనేక కొత్త ఫీచర్‌లను ఆశించవచ్చు. ప్రధానంగా రాడార్-ఆధారిత ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)తో మెరుగైన భద్రతను పొందనుంది. నవీకరించబడిన సెల్టోస్ؚలో ప్రస్తుత 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో పాటు వెర్నా 160PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. 

    టాటా ఆల్ట్రోజ్ CNG

    Tata Altroz CNG Boot

    విడుదల – జూన్ నెలలో 

    ధర అంచనా – రూ.8.5 లక్షల నుండి ప్రారంభం

    ఆల్ట్రోజ్ CNGని టాటా ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించింది, ఈ బ్రాండ్ నుండి మార్కెట్‌లో మొదటిసారిగా విడుదల కానున్న డ్యూయల్-సిలిండర్ ట్యాంక్ సెట్ؚఅప్ؚను ఈ వాహనం కలిగి ఉంది. ఒక పెద్ద CNG ట్యాంక్ؚకు బదులుగా రెండు చిన్న ట్యాంక్ؚల కారణంగా ఉపయోగించుకోగలిగే అదనపు బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్ పెట్రోల్-CNG ఇంజన్‌ను పొందుతుంది, ఇది గ్యాస్‌పై నడుస్తున్నప్పుడు 77PS పవర్‌ను అందిస్తుంది. 25km/kg కంటే ఎక్కువ ఇంధన సామర్ధ్యం ఉంటుందని ఆశిస్తున్నాము. ఫీచర్‌ల పరంగా CNG వేరియెంట్ؚలు ఏడు-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఆటో AC, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరాలను కూడా పొందనుంది.   

    టాటా పంచ్ CNG

    Tata Punch CNG

    అంచనా విడుదల – జూన్ 

    అంచనా ధర – రూ.7.5 లక్షల నుండి ప్రారంభం

    ఆల్ట్రోజ్ CNGతో పాటుగా, CNG-ఆధారిత వెర్షన్ؚ గల పంచ్‌ను కూడా ప్రదర్శించారు, అంతేకాకుండా ఇది కూడా ఆల్ట్రోజ్ CNGతో పాటు విడుదల కానుంది. సుమారు 25km/kg మైలేజ్ సామర్ధ్యంతో అదే విధమైన 1.2-లీటర్ ఇంజన్ؚతో డ్యూయల్ CNG సిలిండర్ సెట్అప్ؚను ఉపయోగిస్తుంది. ఇందులోని ఫీచర్‌లు ఆల్ట్రోజ్ CNG విధంగానే ఉండవచ్చు, ఎందుకంటే మిడ్-స్పెక్ మరియు హయ్యర్-ఎండ్ వేరియెంట్ؚలలో కంప్రెసెడ్ గ్యాస్ ఎంపికను ఆశిస్తున్నాము. 

    టాటా ఆల్ట్రోజ్ రేసర్

    Tata Altroz Racer side

    విడుదల అంచనా – జూన్ 

    అంచనా ధర – రూ. 10 లక్షలు

    ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా కనిపించే వెర్షన్ గల ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఆల్ట్రోజ్ రేసర్, కూడా ఈ వేసవిలో విడుదల అవుతుందని అంచనా. నలుపు రంగు వీల్స్, నలుపు రంగు రూఫ్ మరియు హుడ్‌పై రేసింగ్ స్ట్రైప్ؚలు, పూర్తి నలుపు రంగు ఇంటీరియర్ థీమ్ వంటి అనేక విజువల్ అప్ؚగ్రేడ్ؚలను పొందనుంది. రేసర్, నెక్సాన్ 120PS 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది, ఇది సాధారణ ఆల్ట్రోజ్ టర్బో వేరియెంట్‌ల కంటే 10PS ఎక్కువ శక్తివంతమైనది. ఈ వెర్షన్ అనేక ఫీచర్‌లతో వచ్చే ఆల్ట్రోజ్ వెర్షన్ కావచ్చు. సన్ؚరూఫ్, ఏడు-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10.25-అంగుళాల భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్ؚను పొందింది. 

    ఈ కార్‌లతో పాటుగా, అనేక లగ్జరీ మరియు ప్రీమియం మోడల్‌లు కూడా రాబోయే త్రైమాసికంలో విడుదల కావచ్చు. మెర్సెడెజ్ AMG GT63 SE పర్ఫార్మెన్స్, లాంబోర్గిని ఉరుస్ S, నవీకరించబడిన మెర్సిడెజ్ బెంజ్ GLC, BMW M2, మరియు నవీకరించబడిన Z4లు రానున్న నెలలలో విడుదల కావచ్చు. 

    was this article helpful ?

    Write your Comment on Maruti జిమ్ని

    explore similar కార్లు

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం