ఆగస్టు 20, 2015న ఎ6 ఫేస్ లిఫ్ట్ ను ప్రారంభించనున్న ఆడి (టీజర్ వీడియో)
ఆడి ఏ6 2015-2019 కోసం raunak ద్వారా ఆగష్టు 19, 2015 09:18 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఆడి ఇండియా ఆగస్టు 20, 2015న దేశంలో 2015 ఎ6 ఫేస్లిఫ్ట్ ను ప్రారంభించనున్నది. ఈ వాహనం అధికారికంగా గత సంవత్సరం 2014 అక్టోబర్ లో పారిస్ మోటార్ షో వద్ద బహిర్గతమైంది . ఇది వెలుపల మరియు లోపల అనేక స్టయిలిష్ అంశాలతో రాబోతున్నది. కానీ యాంత్రికంగా ఎటువంటి మర్పుని పొందడం లేదు. అనేక జోడించబడిన అంశాలతో 2015 ఎ6 దాని అవుట్గోయింగ్ కారు కంటే కొంచెం ఖరీదైనదిగా రాబోతున్నది. ఈ కారు మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్, బిఎండబ్లు 5 సీరీస్ మరియు జాగ్వార్ఎక్స్ ఎఫ్ వంటి వాటితో పోటీ పడనున్నది.
మార్పుల గురించి మాట్లాడుకుంటే, 2015 ఎ6 తిరిగి రూపకల్పన చేసిన బంపర్స్ మరియు కొత్త సింగిల్ ఫ్రేం గ్రిల్ ని పొంది ఉంటుంది. సెలూన్ తిరిగి శైలీకరించబడిన ఎల్ ఇడి టెయిల్ ల్యాంప్స్ తో పాటూ మాట్రిక్స్ ఎల్ ఇడి హెడ్లైట్లు కూడా పొంది ఉంటుంది. దీని పక్క ప్రొఫైల్ ఒక్క అల్లాయి వీల్స్ తప్ప మిగిలినవన్నీ కూడా ఒకేలా ఉంటాయి . లోపలివైపు, ఇది నవీకరించబడిన ఆడి యొక్క ఎం ఎం ఐ సమాచార వ్యవస్థ తో పాటు కొత్త అపోలిస్ట్రీ ని కలిగి ఉంది.
అంతర్జాతీయంగా ఎ6 ఫేస్లిఫ్ట్ నవీకరించబడిన టిఎఫ్ ఎస్ ఐ మరియు టిడి ఐ ఇంజిన్లతో అందుబాటులో ఉంది. భారతదేశంలో ఆడీ క్యు3 ఫేస్లిఫ్ట్ కి ఉన్నటువంటి పవర్ ట్రైన్లతో రాబోతుంది. ఇది 2.0 లీటర్ టిడి ఐ డీజిల్ పాటు 2.0 లీటర్ టి ఎఫ్ ఎస్ ఐ పెట్రోల్ తో కొనసాగుతుంది. 2.0 లీటర్ 35 టి ఎఫ్ ఎస్ ఐపెట్రోల్ 4000-6000rpmవద్ద 177bhp శక్తిని మరియు 1500-3900rpm వద్ద 320Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. 2.0 లీటర్ 35 టిడి ఐ 3750-4200rpmవద్ద 174bhp శక్తిని మరియు 1750-2500rpm వద్ద 380Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా ఫ్రంట్ వీల్-డ్రైవ్ లే అవుట్ లో మల్టీట్రోనిక్ సివిటి ట్రాన్స్మిషన్ వ్యవస్థ తో జత చేయబడి ఉంటుంది.