ఆడీ వారు A8 L సెక్యూరిటీ వాహనాన్ని రూ.9.15 కోట్ల ధర వద్ద ప్రవేశపెట్టారు
ఆడి ఏ8 2014-2019 కోసం saad ద్వారా ఫిబ్రవరి 04, 2016 06:54 pm ప ్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆడీ వారు తమ A8 L సెక్యూరిటీ ఆర్మర్డ్ వాహనన్ని 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ కారు మొదటిసారి ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శితమయ్యి ఇప్పుడు తొలిసారి ఆడీ R8స్పోర్ట్స్ కార్ మరియు ఆడీ ప్రొలాగ్ కూప్ కాన్సెప్ట్లతో ప్రదర్శితం అవుతుంది. ప్రత్యేఖంగా డిజైన్ చేయబడి రక్షణా తీరుతెన్నులను కలిగి ఉన్న కారు భారతీయ కొనుగోలుదారుల కోసం ప్రత్యేఖమైన ఆర్డర్ ద్వారా జర్మనీ నుండి అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త ఆడీ A8 L సెక్యురిటీ ఒక A8లిమోసీన్ సెడాన్ వాహనం పోలికలో ఉంటుంది. ఈ వాహనం అధిక ప్రతిఘటన శక్తిని కలిగి VR9సామర్ధ్యపు రక్షణా ప్రమాణాలను ERV 2010 నిర్దేశకాలకు అనుగుణంగా మునుపటి తరం VR7 నిర్దేశకాల కన్నా మెరుగుగా ఉంటుంది. ఇది పూర్తిగా నడిపే వారి యొక్క భద్రతను M60 శ్రేణి ఆయుధాల నుండి రక్షణను మరియు చిన్న మెషీన్ గన్ ల నుండి భద్రతను కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ వాహనం విస్పోటనాల సమయంలో కూడా సమగ్రమైన భద్రతను సూచిస్తుంది. ఇందులో ఆశక్తికరమైన విషయం ఏమిటంటే అన్ని భద్రతా ప్రమాణాలు వాహనం యొక్క బరువుని పెంచకుండా అందించడం జరిగింది. అందువలన ఇది తక్కువ బరువు గల ఉత్తమ భద్రతా ప్రమాణాల కారుగా పేరు పొందింది.
అంతేకాకుండా ఈ A8 L సెక్యురిటీ వాహనం ఆర్మాడ్ లగ్జరీ సెడాన్ విభాగంలోని అన్ని చక్రాల డ్రైవ్ గల ఏకైక కారుగా పేరు తెచ్చుంది. అయితే, కారు యొక్క చాసిస్ మాత్రం ఉత్తమ భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది. కారు యొక్క ఎంపికలో 4.8 లీటర్ v8 లేదా 6.3 లీటర్ FSI W12 పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 500Ps శక్తిని మరియు గరిష్ట టార్క్ 625Nm అందిస్తూ 435Hp శక్తి వద్ద 600Nm టార్క్ ని కలిగి ఉంటుంది.
A8 L సెక్యూరిటీ వాహనం నెకార్స్లం తో అనుసంధానంగా ఉండి, జర్మనీలో ఉన్న ఈ సంస్థ యొక్క గోప్యమైన కర్మాగారం నుండి తయారుచేయబడింది. బిఎండబ్లు 7 సిరీస్ మరియు మెర్సెడీస్ బెంజ్ S-క్లాస్ లకు పోటీ గా ఈ వాహనంగా రాబోతుంది.