ఫియట్, తన ఔత్సాహికుల కోసం అబర్త్ పుంటో ఈవిఓ కు 595 కు మధ్య పోలిక

ఫియట్ పుంటో అబార్ట్ కోసం అభిజీత్ ద్వారా జూన్ 12, 2015 10:24 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫియాట్ యొక్క అబార్త్ పెర్ఫామెన్స్ వింగ్ ను భారతదేశంలో ప్రవేశపెట్టబోతుంది అది కూడా త్వరలో. అంతేకాక ఫియాట్ యొక్క అధికారిక వెబ్సైట్ లో ఈ ఫియాట్ 595 కాంపిటీజియన్ వాహనాన్ని ప్రస్తుతం చూపిస్తుంది. అయితే, ఈ పుంటో ఈవిఓ ఇంజెన్ గురించి మాట్లాడటానికి వస్తే, ఈ ఇంజెన్ 1.4 లీటర్ టి జెట్ ఇంజెన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజెన్ అత్యధికంగా 135bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలోకి త్వరలోనే రాబోతుంది. మరియు సంస్థ యొక్క లక్ష్యాలను దృష్ట్టి లో పెట్టుకొని ఆటో ఔత్సాహికులకు మరింత ఆకర్షణీయంగా రాబోతుంది.  

ఒక్కసారి రాబోయే ఈ రెండు హాచ్బాక్ లను ఒకేసారి చూసినట్లైతే, ఖచ్చితంగా వాహన కొనుగోలుదారుల మనస్సును ఆకట్టుకునే విధంగా రాబోతున్నాయి.

అబార్త్ పుంటో ఈవిఓ

మేము అబాత్ పుంటో ఈవిఓ మీదా చాలా అంచనాలు పెట్టుకున్నాము. ఈ వాహనం యొక్క ధర ఈణృ 10 లక్షలకు తక్కువగా ఉంటుందని భావిస్తున్నాము. ఈ ఇంజెన్ అత్యధికంగా 135bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విభాగం లో అత్యంత శక్తివంతమైనదిగా రాబోతుంది. ఈ రాబోయే వెర్షన్ లో పెద్ద చక్రాలు, సైడ్ స్కర్ట్స్, రియర్ స్పాయిలర్, వన్-ఆఫ్ పెయింట్ జాబ్స్ వంటి అంశాలతో రాబోతుంది.  

కారు యొక్క లోపలి భాగలను చూసినట్లైతే, ఉత్సాహంతో ప్రేరేపితులై ఉండేలా ఉంటుంది. లోపలి భాగం అంతా స్పోర్టీ లుక్ ను కలిగి ఉంటుంది మరియు రెడ్ అండ్ బ్లాక్ కలర్ పధకం తో అలంకరించబడి ఉంటుంది. అంతేకాక, ఈ అబార్త్ యొక్క సీట్లు లెధర్ అపోలిస్ట్రీ ను కలిగి ఉంటాయి.

ఈ కారు యొక్క పవర్ గురించి మాట్లాడటానికి వస్తే, 1.4 లీటర్ టి జెట్ ఇంజెన్ తో రాబోతుంది. అంతేకాకుండా, స్టిఫ్ఫర్ చాసిస్ తో పాటు స్టిఫ్ఫర్ సస్పెన్షన్ పెద్ద బ్రేక్లు, పెద్ద చక్రాలతో రాబోతుంది.

అబార్త్ 595 కాంపిటిజన్

తయారీదారుడు 595 కాంపిటిజన్ విషయం లో చాలా స్పష్టంగా ఉన్నాడు. ఫియట్ భారతదేశం యొక్క అధికారిక వెబ్ పేజీ వద్ద దీనిని ప్రదర్శించారు మరియు దీని యొక్క బ్యానర్ త్వరలో రానున్నట్టుగా చెప్పింది. ఈ ఐకానిక్ 595 వాహనం 1960 నాటిది. అయితే, ప్రస్తుత కార్ల యొక్క నిష్పత్తి పెరిగింది. కానీ పాత 595 వాహనం లో రౌండ్ హెడ్ల్యాంప్స్ మరియు టైల్ ల్యాంప్స్ మరియు క్రోమ్ చేరికలతో పొందుపరచుకున్న దాని రెట్రో ఇటాలియన్ డిజైన్ లో సజీవంగా కనబడుతున్నాయి.  

595 కాంపిటిజన్ అంతర్గత భాగాం అంతా రెద్ కలర్ మరియు బ్లాక్ పధకంతో క్రోం తో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా ఒక పెద్ద స్పీడోమీటర్ మరియు అబార్త్ రేసింగ్ సీట్స్ తో రాబోతున్నాయి.

ఈ 595 కాంపిటిజన్ వాహనం విషయానికి వస్తే, దీని యొక్క ఇంజెన్ ఆబార్త్ పుంటో లో ఉండే అదే 1.4 లీటర్ మోటార్ తో రాబోతుంది. మరియు ఈ ఇంజెన్ అత్యధికంగా 150bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజెన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫియట్ పుంటో అబార్ట్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience