Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

Honda Elevateను డ్రైవ్ చేసిన తరువాత మేము పరిశీలించిన 5 విషయాలు

హోండా ఎలివేట్ కోసం ansh ద్వారా ఆగష్టు 14, 2023 12:39 pm ప్రచురించబడింది

పోటీదారులతో పోలిస్తే ఎలివేట్ؚలో ఫీచర్‌లు కొంత తక్కువనే చెప్పవచ్చు, అయితే ఇది అందిస్తున్నవి చాలా ఉన్నాయి

హోండా కార్స్ ఇండియా, సెప్టెంబర్ మొదటి వారంలో ఎలివేట్ SUVని మన దేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రీ-లాంచ్ బుకింగ్ؚలు ప్రారంభం అయ్యాయి మరియు ఆగస్ట్ మధ్యలో ఈ కారు షోరూమ్ؚలలో అందుబాటులో ఉంటాయని అంచనా. ఇటీవల, మేము 2023 కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ పోటీదారుతో కొంత సమయం గడిపాము మరియు దీని 5 ముఖ్యాంశాలను ఇక్కడ అందించాము.

బ్రోచర్ؚలో లేని సామర్ధ్యాలు

అందిస్తున్న ఫీచర్‌ల బట్టి చూస్తే, ఈ వాహనంలో మరిన్ని ఫీచర్‌లు లేకపోవడం పరిగణించాల్సిన విషయం. బ్రోచర్ؚలో లేని అనేక అంశాలు ఈ కారులో ఉన్నాయి. నాణ్యత, నమ్మకం మరియు విశ్వసం వంటి అంశాలను మీరు ఈ కారును నడిపి, కొంత సమయం ఉపయోగించిన తరువాత అర్ధం చేసుకోగలరు.

హోండా ఈ కారులో అందించిన విషయలను పరిగణిస్తే. వెలుపల, లోపల ఉపయోగించిన మెటీరీయల్ؚల నాణ్యత అద్భుతంగా ఉంది. మీరు హోండా కారును ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, ఇది నమ్మకమైన కారు ఎందుకు అంటారు అనే విషయం అర్ధం అవుతుంది. మృదువైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. టచ్ؚస్క్రీన్ డిస్ప్లే వంటివి మెరుగ్గా పనిచేస్తాయి, ఇది హోండా మునపటి మోడల్ కార్‌లతో పోలిస్తే మరింతగా మెరుగుపడింది. హోండా సర్వీస్ అనుభవం కూడా ఉత్తమమైన వాటిలో ఒకటి అలాగే, మనకు ఇప్పటికే తెలిసినట్లు, వారు అందించే కార్‌లు విశ్వసనీయతలో అత్యుత్తమమైనవి. వీటన్నిటి వలన నమ్మకం ఏర్పడుతుంది.

సాంప్రదాయకంగా అయినా క్లాసీగా ఉంటుంది

దీని ఆవిష్కరణ సమయంలో, డిజైన్ పరంగా ఎలివేట్ؚను ఫ్యాన్సీగా అందించలేదు, ఇది సాధారణ సంప్రదాయ SUV అనుభూతిని కలిగిస్తుంది. ఈ అనుభూతి మంచిది కాదా? ఖచ్చితంగా మంచిదే. హోండా చాలా జాగ్రత్తలు తీసుకుంది, విజయం సాధించింది. సంప్రదాయ SUV స్టైలింగ్ؚతో కూడా ఎలివేట్ క్లాసీగా కనిపిస్తోంది.

భారీ ఫ్రంట్ గ్రిల్, నాజూకైన LED హెడ్ؚలైట్‌లు మరియు DRLలు, బాక్సీ స్టైలింగ్ మరియు స్టైల్ؚగా ఉండే 17-అంగుళాల అలాయ్ వీల్స్ కలిగిన నిటారైన ఎక్స్ؚటీరియర్ డిజైన్ కారణంగా ఎలివేట్ ఈ క్లాసీ అప్పీల్‌ను పొందింది. నిలువు గీతలు, ఉడెన్ ఇన్సర్ట్ؚలు మరియు డ్యూయల్-టోన్ ట్యాన్-బ్లాక్ థీమ్ؚలు ఎలివేట్‌కు ప్రీమియం ఎలిమెంట్ؚను జోడిస్తాయి.

సెన్సిబిలిటీకి ప్రాధాన్యత

కాంపాక్ట్ SUV నుంచి ఆశించే ఫీచర్‌ల అన్నిటిలో, విశాలంగా ఉండటం మరియు ప్రాక్టికాలిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎలివేట్ విషయంలో ఈ అంశాలపై కారు తయారీదారు ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎలివేట్ؚ డోర్‌లు విశాలంగా తెరుచుకుంటాయి, కాబట్టి ఎక్కడం, దిగటం చాలా తేలిక. క్యాబిన్ విశాలంగా ఉంటుంది, ప్రత్యేకించి వెనుక సీట్‌లలో 6-అడుగుల వ్యక్తులు కూడా సౌకర్యంగా కూర్చోగలరు.

ఇంధన ట్యాంక్ ముందు సీట్ల కింద అమర్చినందున మీకు కొంత ఎత్తులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది, ఫలితంగా హెడ్ؚరూమ్ తగ్గుతుంది, అయితే సగటు-పరిమాణంలో ఉండే వయోజనులకు ఇది సరిపోతుంది. ఎలివేట్ؚలో బూట్ؚ స్థలాన్ని ఉత్తమంగా డిజైన్ చేశారు. ఇది 458-లీటర్‌ల బూట్ స్పేస్ؚను అందిస్తుంది, ఇది ఈ విభాగంలో భారీది కాకపోయినా, మీ ట్రిప్ؚలకు సరిపోతుంది.

క్యాబిన్ ప్రాక్టికాలిటీ విషయంలో, ఎలివేట్ రాజీ పడలేదు. అన్నీ డోర్ؚలలో బాటిల్ హోల్డర్ؚలు ఉన్నాయి, సెంటర్ కన్సోల్ అలాగే రేర్ ఆర్మ్ రెస్ట్‌పై కప్ హోల్డర్‌లు ఉన్నాయి, సెంటర్ ఆర్మ్ రెస్ట్ లోపల స్టోరేజీ, మీ ఫోన్, వ్యాలెట్ లేదా కీస్ కోసం సన్నని స్లాట్లు ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ విషయంలో రాజీ

హోండా ఎలివేట్ 121PS మరియు 145Nm టార్క్‌ను అందించే 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది. ఇది హోండా సిటీలో ఉన్న ఇంజన్, కానీ ఈ సైజ్ కారుకు, మరింత శక్తివంతమైన ఇంజన్ ఎంపిక కూడా ఉంటే బావుండేది.

1.5-లీటర్ ఇంజన్ మెరుగైనదే. ఇది రిఫైన్ చేయబడింది, డ్రైవింగ్ మృదువుగా మరియు రిలాక్స్ؚగా ఉంది, అయితే దీనిలో ఉత్సాహపరిచేది లేదా నిమగ్నం చేసేది ఏం లేదు. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపిక ఉండి ఉంటే, డ్రైవ్ మరింత సరదాగా ఉండేది.

ఇది కూడా చదవండి: భారతదేశంలో హోండా ఎలివేట్ తదుపరి 5-స్టార్ రేటెడ్ SUV అవుతుందా?

అంతేకాకుండా, సిటీలో ఉన్నట్లుగా ఎలివేట్ؚలో కూడా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వస్తుందని ఆశించాము, అయితే ఇక్కడ అది కూడా మిస్ అయింది. హైబ్రిడ్ సాంకేతికత విషయానికి వస్తే హోండాలో, టయోటా మరియు మారుతి కంటే మంచి సాంకేతికత అందుబాటులో ఉంది. కారు తయారీదారు ఈ సాంకేతికతను ఎలివేట్ؚలో అందించి ఉంటే, ఈ విభాగంలో అత్యున్నత స్థానంలో ఉండి ఉండేది.

తొలగించిన ఫీచర్‌లు

ఎలివేట్ అనేక ఫీచర్‌లను అందిస్తున్నపటికి, ఈ విభాగంలో ప్రస్తుతం సాధారణంగా వస్తున్న కొన్ని ముఖ్యమైన ఫీచర్‌లు ఇందులో లేవు. 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సింగిల్-పేన్ సన్ؚరూఫ్ మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ ఉన్నప్పటికీ, పనోరమిక్ సన్ؚరూఫ్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ؚలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, రేర్ సన్ؚషేడ్ؚలు మరియు టైప్-C ఛార్జింగ్ పోర్ట్ؚలు వంటి ముఖ్యమైన ఫీచర్‌లు లేవు.

భద్రత విషయంలో కూడా, ఇది లెన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు హై బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్‌లతో ADASను పొందింది, అయితే ఇది కేవలం కెమెరా-ఆధారిత ADAS మరియు తన తక్షణ ప్రత్యర్ధి కియా సెల్టోస్ؚలో ఉన్న రాడార్ ఆధారితమైన ADAS ఇందులో లేదు. కాబట్టి రాత్రి సమయంలో సిస్టమ్ తికమక పడవచ్చు, కానీ పగలు బాగా పని చేస్తుంది.

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ Vs స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్ మరియు MG ఆస్టర్: స్పెసిఫికేషన్ؚల పోలిక

మొత్తం మీద, హోండా ఎలివేట్ ఒక సురక్షితమైన, తెలివైన ఎంపిక. మీరు కొన్ని ఫీచర్‌లను మిస్ అవుతారు మరియు సింగిల్ ఇంజన్ ఎంపికను మాత్రమే పొందుతారు. అయితే క్యాబిన్ నాణ్యత, అనుకూలత మరియు విశాలంగా ఉండటం, అలాగే హోండాపై విశ్వాసం ఈ లోటుపాటులను భర్తీ చేస్తాయి. ఇది మిమ్మల్ని నిరాశపరచదు, అలాగే అద్భుతంగా అనిపించదు.

ఎలివేట్ ధరలు ఇప్పటికి వెల్లడించలేదు, దీని ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు అని అంచనా. విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ؚలతో పోటీ పడుతుంది.

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 45 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హోండా ఎలివేట్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.68.50 - 87.70 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.1.36 - 2 సి ఆర్*
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర