నవీకరించబడిన క్రెటా డీజిల్ ఇంజన్ తో పాటు 25,000 వరకు పెరిగిన ధరతో త్వరలో రానున్న 2023 హ్యుందాయ్ వెన్యూ
నవీకరించిన డీజిల్ యూనిట్‌తో పాటు, ఫీచర్‌ల విషయంలో స్వల్ప మార్పులతో వెన్యూ రానుంది.
-
డీజిల్ యూనిట్ ఇప్పుడు 116PS, 250Nm పవర్, టార్క్ లను అందిస్తుంది.
-
పక్క వైపు ఎయిర్ బ్యాగులు ఇప్పుడు మిడ్-స్పెక్ S(O) వేరియెంట్ؚలో కూడా అందుబాటులో ఉన్నాయి.
-
డీజిల్ SX వేరియెంట్ؚలో వాల్చ గల వెనుక సీట్‌లు ఉండవు.
-
కొత్త ధరలు రూ.7.68 లక్షల నుండి రూ.13.11 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
నాలుగు మీటర్‌ల కంటే తక్కువ ఎత్తు SUV విభాగంలో ఒక ముఖ్యమైన పోటీదారు అయిన హ్యుందాయ్ వెన్యూ గత జూన్ؚలో నవీకరించబడింది. అంతేకాకుండా ఇంజన్ నవీకరణ, ఫీచర్‌ల పరంగా స్వల్ప మార్పులు, అధిక ధర వంటి కొన్ని MY23 నవీకరణలను ఈ హ్యుందాయ్ SUV పొందింది.
నవీకరించిన ఇంజన్
వెన్యూ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఇప్పుడు, మెరుగైన పనితీరు కోసం నవీకరించిన క్రెటా ఇంజన్‌తో అందించబడుతుంది. కానీ, క్రెటా డీజిల్ యూనిట్‌లతో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికను పొందింది, వెన్యూ కేవలం ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ؚలో మాత్రమే వస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ |
పాత స్పెసిఫికేషన్‌లు |
కొత్త స్పెసిఫికేషన్‌లు |
ఇంజన్ |
1.5 లీటర్ డీజిల్ ఇంజన్ |
1.5 లీటర్ డీజిల్ ఇంజన్ |
ట్రాన్స్ؚమిషన్ |
6-స్పీడ్ MT |
6-స్పీడ్ MT |
పవర్ |
100PS |
116PS |
టార్క్ |
240Nm |
250Nm |
డీజిల్ ఇంజన్ అవుట్ؚపుట్ ఇప్పుడు 16PS మరియు 10Nm వరకు పెరిగింది. వెన్యూ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. అవి వరుసగా: 83PS మరియు 114Nm అవుట్ؚపుట్ؚ అందించే 1.2-లీటర్ యూనిట్ؚతో ఐదు-స్పీడ్‌ల మాన్యువల్, 120PS మరియు 172Nm అవుట్ؚపుట్ؚ అందించే 1.0-లీటర్ టర్బోؚతో ఆరు-స్పీడ్‌ల iMT లేదా ఏడు-స్పీడ్ DCTతో వస్తుంది.
ఫీచర్‌లలో మార్పులు
భారీ మార్పులలో ఒకటి, హ్యుందాయ్ ఇప్పుడు మిడ్-స్పెక్ S(O) వేరియెంట్ నుండి సైడ్ ఎయిర్ؚబ్యాగులను అందిస్తోంది, ఇంతకు ముందు ఇవి కేవలం టాప్-స్పెక్ SX(O) వేరియెంట్ؚలో మాత్రమే ఉండేవి. వెన్యూ N లైన్ N6 వేరియెంట్ؚలో కూడా సైడ్ ఎయిర్ బ్యాగ్ؚలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ i20 iMT ఎంపికను కోల్పోయింది, టర్బో వేరియెంట్‌ల ధర మరింత పెరిగింది
అంతేకాకుండా, డీజిల్ SX వేరియెంట్ؚలో ఉండే వెనుక సీట్ రిక్లైనర్, కప్ హోల్డర్ؚ గల ఆర్మ్ؚరెస్ట్ ఇప్పుడు కేవలం టాప్-స్పెక్ డీజిల్ SX (O)కు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇవి కాకుండా, వెన్యూ ఫీచర్‌ల జాబితాలో ఎటువంటి భారీ మార్పులు లేవు.
కొత్త ధరలు
ఈ సంవత్సరంలో వెన్యూ మొదటగా ధర పెంపును పొందింది. ఇప్పుడు దీని ధర రూ.7.68 వద్ద ప్రారంభమై రూ.13.11 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వేరియెంట్-వారీ ధరలు క్రింద పేర్కొనబడ్డాయి.
వేరియెంట్ |
పాత ధర |
కొత్త ధర |
తేడా |
E |
రూ. 7.62 లక్షలు |
రూ. 7.68 లక్షలు |
రూ. 6,000 |
S |
రూ. 8.79 లక్షలు |
రూ. 8.90 లక్షలు |
రూ. 11,000 |
S (O) |
రూ. 9.58 లక్షలు |
రూ. 9.73 లక్షలు |
రూ. 14,000 |
S (O) Turbo iMT |
రూ. 10.15 లక్షలు |
రూ.10.40 లక్షలు |
రూ. 25,000 |
S+ Diesel |
రూ. 10.15 లక్షలు |
రూ. 10.15 లక్షలు |
మార్పు లేదు |
SX |
రూ. 10.77 లక్షలు |
రూ. 10.89 లక్షలు |
రూ. 12,000 |
SX DT |
రూ. 10.92 లక్షలు |
రూ. 11.04 లక్షలు |
రూ. 12,000 |
S (O) టర్బో DCT |
రూ. 11.11 లక్షలు |
రూ. 11.36 లక్షలు |
రూ. 25,000 |
SX డీజిల్ |
రూ. 11.62 లక్షలు |
రూ 11.62 లక్షలు |
మార్పు లేదు |
SX డీజిల్ DT |
రూ. 11.77 లక్షలు |
రూ. 11.77 లక్షలు |
మార్పు లేదు |
SX (O) టర్బో iMT |
రూ. 12.06 లక్షలు |
రూ. 12.31 లక్షలు |
రూ. 25,000 |
SX (O) టర్బో iMT DT |
రూ. 12.21 లక్షలు |
రూ. 12.46 లక్షలు |
రూ. 25,000 |
SX (O) డీజిల్ |
రూ. 12.51 లక్షలు |
రూ. 12.51 లక్షలు |
మార్పు లేదు |
SX (O) డీజిల్ DT |
రూ. 12.66 లక్షలు |
రూ. 12.66 లక్షలు |
మార్పు లేదు |
SX (O) టర్బో DCT |
రూ. 12.71 లక్షలు |
రూ. 12.96 లక్షలు |
రూ. 25,000 |
SX (O) టర్బో DCT DT |
రూ. 12.86 లక్షలు |
రూ. 13.11 లక్షలు |
రూ. 25,000 |
1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్‌ల ధరలు రూ.14,300 వరకు అధికంగా ఉన్నాయి, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియెంట్‌లలో రూ.25,000 వరకు ఏకరీతి ధరల పెరుగుదల ఉంది, అంతేకాకుండా డీజిల్ వేరియెంట్‌ల ధరలలో ఎటువంటి మార్పు లేదు.
పోటీదారులు
నవీకరించబడిన హ్యుందాయ్ వెన్యూ తన పోటీని కియా సోనెట్, టాటా నెక్సన్, మహీంద్రా XUV300, మారుతి బ్రెజ్జా, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి ఇతర నాలుగు మీటర్‌ల కంటే తక్కువ ఎత్తు గల SUVలతో కొనసాగిస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: వెన్యూ ఆన్-రోడ్ ధర