• English
  • Login / Register

2018 రిక్యాప్: మేము పరీక్షించిన దాని ప్రకారం ఎక్కువ ఇంధన సామర్ధ్యాన్ని అందించే మొదటి ఐదు డీజిల్ కార్లు

మారుతి సియాజ్ కోసం dinesh ద్వారా మార్చి 29, 2019 03:11 pm ప్రచురించబడింది

  • 246 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2018 Recap: 5 Most Fuel Efficient Diesel Cars We Tested

2018 ముగింపుతో, కొన్ని సంవత్సరాలగా మంచి అనుభూతిని అందిస్తున్న కొన్ని ఉత్తమ కార్ల గురించే తెలుసుకునే సమయం వచ్చేసింది. మేము ఇప్పటికే ఇంధన సామర్థ్య పెట్రోల్ మరియు హైబ్రిడ్ కార్లను 2018 లో పరీక్షించాము. ఇక్కడ తనిఖీ చేయండి. ఇప్పుడే, ఇంధననాన్ని సమర్థవంతంగా అందించే డీజిల్ కార్లను కొన్నింటిని పరిశీలిద్దాం. జాబితా దిగువ నుండి ప్రారంభిద్దాం.

పోలిక కోసం, మేము సిటీ మరియు హైవే పరీక్ష ఆధారంగా ఇంధన ఆర్థిక గణాంకాల యొక్క సగటు (75:25) మైలేజ్ ను అందించాము.

5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10:

Hyundai Grand i10

  • నగరాలలో ఇంధన సామర్ధ్యం : 19.10 కెఎంపిఎల్

  • రహదారిపై ఇంధన సామర్ధ్యం : 22.19 కెఎంపిఎల్

  • సగటు ఇంధన సామర్ధ్యం : 19.78 కెఎంపిఎల్

  • ధర: 6.07 లక్షల నుండి 7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

గ్రాండ్ ఐ 10 డీజిల్ మేము ఈ సంవత్సరం పరీక్షించిన ఐదవ అత్యంత సమర్థవంతమైన కారు. అయినప్పటికీ, బోనెట్లో 1.2 లీటర్ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేయదు, ఇది గరిష్టంగా 75 పిఎస్ శక్తిని మరియు 190 ఎన్ఎమ్ గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క ప్రయాణ అనుభూతి, ఐ 10 ను నగర ప్రయాణానికి ఒక ఖచ్చితమైన కారుని చేస్తుంది.

• కొత్త 2019 హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 స్పై షాట్స్ మరిన్ని వివరాలను వెల్లడిస్తాయి

4. మారుతి స్విఫ్ట్ ఏఎంటి:

 

  • నగరాలలో ఇంధన సామర్ధ్యం : 19.27 కి.మీ.

  • రహదారిపై ఇంధన సామర్ధ్యం : 22.21 కి.మీ.

  • సగటు ఇంధన సామర్ధ్యం : 19.93 కి.మీ.

  • ధర: రూ. 7.34 లక్షల నుంచి రూ. 8.76 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

జాబితాలో నాల్గవ స్థానానికి చేర్చబడింది స్విఫ్ట్ ఏఎంటి, గ్రాండ్ ఐ 10 కన్నా కొంచెం ఎక్కువ అంటే 0.13 కెఎంపిఎల్ ఇంధన సామర్ధ్యాన్ని మాత్రమే అందిస్తుంది. ఇప్పుడు మూడవ తరం లో డీజిల్- ఏఎంటి కలయికతో స్విఫ్ట్ మొదటిసారి అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 83 పిఎస్ పవర్ ను మరియు 190 ఎన్ఎమ్ గల ఇంధన సామర్ధ్యాన్ని అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్తో శక్తిని కలిగి ఉంది. దాని పూర్వీకుల మాదిరిగానే, ఇది ఫన్ టి డ్రైవ్ కోట్ ను కలిగి ఉంటుంది. మరియు అది ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సౌలభ్యంను సిద్ధం చేస్తుంది.

3. హోండా అమజ్ సివిటి:

Honda Amaze

  • నగరంలో ఇంధన సామర్ధ్యం : 19.28 కి.మీ.

  • రహదారిపై ఇంధన సామర్ధ్యం : 22.63 కి.మీ.

  • సగటు ఇంధన సామర్థ్యం : 20.02kmpl

  • ధర: రూ 8.50 లక్షల నుంచి 9.1 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఈ సంవత్సరం మేము నిర్వహించిన పరీక్షలలో మొదటిసారిగా అందించబడిన డీజిల్ సివిటి తో వచ్చిన హోండా వాహనం మూడవ స్థానం లో నిలిచింది. ఈ వాహనంలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా 80 పిఎస్ పవర్ ను అలాగే 160 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ లను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, రిలాక్స్డ్ పద్దతిలో మాత్రమే నగరాలలోనే కాక రహదారులపై కూడా మంచి మృదువైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. మీరు దీనిని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుంటే, మాన్యువల్ వేరియంట్తో పోల్చితే అమేజ్ యొక్క సివిటి ఇంజన్ శక్తి మరియు టార్క్ ల పరంగా కొంచెం తక్కువ పనితీరును అందిస్తుంది అని చెప్పవచ్చు.

  • హోండా ఆమేజ్ డీజిల్ సివిటి : రివ్యూ

2. హోండా అమేజ్ ఎంటి :

 

  • నగరంలో ఇంధన సామర్ధ్యం : 19.69 కెఎంపిఎల్

  • రహదారులలో ఇంధన సామర్ధ్యం : 23.37 కెఎంపిఎల్

  • సగటు ఇంధన సామర్ధ్యం : 20.5 కెఎంపిఎల్

  • ధర: 6.90 లక్షల నుంచి 8.78 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ యొక్క మరింత శక్తివంతమైన వెర్షన్ను పొందినప్పటికీ, అమేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పోలిస్తే మాన్యువల్ మరింత పొదుపుగా ఉంది అలాగే ఎక్కువ పనితీరును మంచి మైలేజ్ ను ఇస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్ పవర్ ను మరియు 200ఎన్ఎమ్ గల అధిక టార్క్ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఆటోమేటిక్ తో పోలిస్తే, 20 పిఎస్ / 40 ఎన్ఎమ్ గల టార్క్ ఉత్పత్తులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, మీరు హైవే మీద గణనీయమైన సమయాన్ని గడపాలని కోరుకుంటే, మరింత శక్తివంతమైన 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్- తో జత చేయబడిన వేరియంట్ ను ఎంపిక చేసుకోండి.

1. మారుతి స్విఫ్ట్ ఎంటి

Maruti Swift

  • నగరాలలో ఇంధన సామర్ధ్యం : 19.74 కెఎంపిఎల్  

  • రహదారులలో ఇంధన సామర్ధ్యం : 27.38 కెఎంపిఎల్

  • సగటు ఇంధన సామర్ధ్యం : 21.22 కెఎంపిఎల్

  • ధర: 5.99 లక్షల నుంచి రూ. 8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఈ జాబితాలో మారుతి మొదటి స్థానంలో ఉంటుందని ఊహించగలం మరియు డీజిల్ ఇంజన్ తో జత చేయబడిన స్విఫ్ట్ మాన్యువల్ వెర్షన్, ఈ సంవత్సరం మేము చేసిన పరీక్షలలో ఎక్కువ ఇంధన సామర్ధ్యాన్ని అందింస్తుందని తేలింది. ఈ మాన్యువల్ వెర్షన్, ఆటోమేటిక్ వెర్షన్ తో పోలిస్తే 1.65 కి మీ మైలేజ్ ను ఎక్కువగా అందిస్తుంది. అదే ఆటోమేటిక్ వెర్షన్ మన జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. ఏఎంటి వెర్షన్ లాగే, స్విఫ్ట్ డీజిల్ మాన్యువల్ కూడా- 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్ పవర్ ను అలాగే 190 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. డ్రైవింగ్ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, స్విఫ్ట్ ముందరి మోడల్స్ వలె- ఫన్ టు డ్రైవ్ కోట్ ను అనుసరిస్తూ ముందుకు కొనసాగుతుంది.  

మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10: రివ్యూ

ఇది కూడా చదవండి: 2019 లో నిలిపివేయబడే కార్లు - మారుతి ఓమ్ని, జిప్సీ & టాటా నానో

మరింత చదవండి: మారుతి సియాజ్ ఏఎంటి

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti సియాజ్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience