• English
  • Login / Register

2018 మారుతి సుజుకి స్విఫ్ట్ - అద్భుతాలు మరియు లోపాలు

మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం khan mohd. ద్వారా మార్చి 29, 2019 11:50 am ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

New Maruti Suzuki Swift

నవీకరణ: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ని రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద ప్రారంభించారు. ఇక్కడ పూర్తి వివరాలు చదవండి.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్ అత్యంత ముందడుగు వేస్తున్న కార్లలో ఒకటి. మూడవ-తరం హాచ్బ్యాక్ అందించే లక్షణాలు ఏమిటో మేము ఇప్పటికే తెలుసుకొని ఉన్నాము. ధరల మినహా, వచ్చే నెల ఫిబ్రవరి 8, 2018 న ఆటో ఎక్స్పోలో 2018 లో విడుదల చేయబోయే రాబోయే స్విఫ్ట్ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు ఇప్పటికే మా సమీక్షను చదివి ఉంటే, ఎక్కడ స్విఫ్ట్ ఎక్కువ మంచి మార్కులు సంపాదిస్తుందో మీకు తెలిసే ఉండాలి? ఇప్పుడు, మేము 2018 స్విఫ్ట్ యొక్క టాప్ అద్భుతాలు మరియు లోపాల జాబితా తీసుకొచ్చాము మరియు తెలుసుకుందాం పదండి.

అద్భుతాలు :

ఆహ్లాదకరమైన డ్రైవింగ్ లక్షణం :

Maruti Suzuki Swift 2018

స్విఫ్ట్ యొక్క నిర్వహణ లక్షణాలు వ్యాపారంలోనే అత్యుత్తమంగా కొనసాగుతున్నాయి. దీని యొక్క తేలికైన హార్టెక్ట్ ప్లాట్‌ఫార్మ్ మరియు గట్టి సస్పెన్షన్ సెటప్ కి ధన్యవాదాలు తెలుపుకోవాలి,ఈ హ్యాచ్‌బ్యాక్ కార్నర్స్ లో చాలా బాగా పనితీరు ప్రదర్శిస్తుంది. ఇది అధిక వేగంలో తీసుకొనే షార్ప్ టర్న్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది.  

ప్రతీ ఒక్కరి కొరకు ఆటోమెటిక్ లో అందుబాటులో ఉంది

Maruti Suzuki Swift 2018 AMT Transmission

కొత్త స్విఫ్ట్ రెండు ఇంజన్ ఎంపికలలో కూడా AMT ఆప్షన్ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) తో అందించబడుతుంది. అయితే ఆటోగేర్బాక్స్ ఇగ్నీస్ లో స్పోర్టీ ఫీల్ ని కలిగి ఉంటుంది మరియు డిజైర్ లో సౌకర్యంగా ఉంటుంది. అయితే చూస్తుంటే మారుతి సంస్థ ఆ రెండు కార్లని బాలెన్స్ చేసే విధంగా స్విఫ్ట్ లో అందించినట్టు తెలుస్తుంది. ఇది సిటీ ట్రాఫిల్ లో మాత్రమే ఆదర్శవంతమైనది కాదు, హైవే లో కూడా మీ ఇంట్లో ఉండే అనుభూతిని అందిస్తుంది.

విశాలవంతమైన క్యాబిన్:

Maruti Suzuki Swift 2018 Interior

ముందు కారుతో పోలిస్తే మూడవ తరం స్విఫ్ట్, వెడల్పు లో 40mm ఎక్కువగా మాత్రమే కాదు, ముందు దానితో పోల్చుకుంటే వీల్బేస్ లో కూడా 20mm పెద్దది. ఇది క్యాబిన్ లోపల చాలా స్థలాన్ని కలిగి ఉంది. ఆరు అడుగుల కన్నా పొడవు ఎక్కువ ఉండే వారికి ముందు లేదా వెనుక సీటులో ఫిర్యాదు చేయడానికి ఎటువంటి కారణం కనిపించదు. దీనిలో ఆకట్టుకొనే అంశం ఏమిటంటే 268 లీటర్ బూట్ స్పేస్. అధనంగా ఉండే 58 లీటర్లు వారానికి సరిపడా లగేజ్ తీసుకెళ్ళడానికి సరిపోతుంది.

అద్భుతమైన లక్షణాలతో నిండి ఉంది

Maruti Suzuki Swift 2018 Infotainment System

కొత్త స్విఫ్ట్ LED డే టైం రన్నింగ్ లైట్లు (DRLs), LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, లెదర్ తో చుట్టిన స్టీరింగ్ వీల్, ఆటో హెడ్ల్యాంప్స్, స్మార్ట్ కీ తో ప్రారంభించబడిన పుష్-బటన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు 6 స్పీకర్ సౌండ్ సిష్టం వంటి  ఆధునిక లక్షణాలతో లోడ్ అవుతుంది. టాప్-ఎండ్ Z + వేరియంట్ కూడా 7 అంగుళాల స్మార్ట్ప్లే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని పొందుతున్నాయి, ఇవి మిర్రర్ లింక్ కనెక్టివిటీ తో పాటూ ఆపిల్ కార్ప్లే మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది EBD తో ABS మరియు ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

లోపాలు  

రైడింగ్ సామర్ధ్యం

దీనిలో గట్టి సస్పెన్షన్ నిర్వహణ లక్షణాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, రైడ్ నాణ్యత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. కారు గతకల రోడ్డుల మీద మరియు కఠినమైన పాచెస్ మీద వెళితే గనుక మీరు ఆ బాగాలేని రోడ్డు అనుభవాన్ని ఎదుర్కొంటారు. ఇంకొంచెం నియంత్రణ బాగుంటే బయట చెడు రోడ్డు అనుభవం లోనికి తెలియకుండా ఉంటుంది.

Z + వేరియంట్ లో ఆటో బాక్స్ లేదు

ప్రస్తుతానికి, మారుతి సుజుకి టాప్ వేరియంట్ అయిన Z + వేరియంట్ లో AMT ను అందివ్వడం లేదు. కాబట్టి ఎవరైతే ఔత్సాహికులు టాప్ వేరియంట్ లో అద్భుతమైన లక్షణాలతో పాటూ ఆటోమేటిక్ గేర్బాక్స్ యొక్క సౌకర్యాన్ని కూడా కావాలనుకుంటారో వారు ఇంకా కొంత కాలం ఎదురు చూడాల్సిందే. ఏదేమైనా, ఇగ్నిస్ తో చేసినట్లుగా కార్ల తయారీదారులు ఈ సంవత్సరంలోని తరువాత ఆ ఆప్షన్ ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు.

మంచి అనుభూతిని అందివ్వనటువంటి స్టీరింగ్ వీల్

Maruti Suzuki Swift 2018 Steering

డ్రైవర్-సెంట్రిక్ కారు మరియు అద్భుతమైన నిర్వాహకుడు అయినప్పటికీ, కొత్త స్విఫ్ట్ యొక్క స్టీరింగ్ అనుభూతి అంతగా బాగా లేదు. స్టీరింగ్ తేలికగా ఉంటుంది మరియు ప్రతిరోజు ప్రయాణానికి ప్రతిస్పందించినప్పటికీ, మీరు ఉత్సాహంగా నడపడానికి ప్రయత్నించినట్లయితే అది మీకు అంత మంచి అనుభూతిని అందించదు. స్టీరింగ్ వీల్ కొంచెం ఎక్కువ బరువు బరువు ఉండి ఉంటే మొత్తంగా మంచి అనుభూతిని అందిస్తుందేమో అని మేము భావిస్తున్నాము.

కొత్త స్విఫ్ట్ లో ఉండే మరింత నవీకరణలు తెలుసుకోవడం కోసం కార్‌దేఖో ని చూస్తూ ఉండండి.    

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti స్విఫ్ట్ 2014-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience