• English
  • Login / Register

2018 మారుతి సియాజ్ Vs హ్యుందాయ్ వెర్నా: వేరియంట్స్ పోలిక

మారుతి సియాజ్ కోసం dhruv attri ద్వారా మార్చి 15, 2019 04:27 pm ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2018 Maruti Ciaz vs Hyundai Verna: Variants Comparison

2018 మారుతి సుజుకి సియాజ్ ఫేస్ లిఫ్ట్ పలు కొత్త లక్షణాలు మరియు ఒక కొత్త 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని స్వీకరించి ఉన్నప్పటికీ దాని పోటీ ధర ట్యాగ్ ని నిలుపుకుంది.  పెట్రోల్ ఇంజిన్ పాత మోడల్లో 1.2 లీటర్ యూనిట్ తో పోల్చి చూస్తే పెద్దదిగా ఉంటుంది మరియు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. ఇది అంత శక్తివంతమైనది కాదు, కానీ మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సియాజ్ ధర రూ. 8.19 లక్షలు దగ్గర ప్రారంభమవుతుంది, అయితే టాప్-స్పెక్ వేరియంట్ రూ.10.97 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) దగ్గర ఉంది. దీని యొక్క చాలా వేరియంట్లు ధరల పట్టిక వద్ద హ్యుందాయి వెర్నా తో పోటీ పడుతునాయి.

2018 Maruti Ciaz vs Hyundai Verna: Variants Comparison

డీజిల్

2018 Maruti Ciaz vs Hyundai Verna: Variants Comparison

పెట్రోల్

2018 Maruti Ciaz vs Hyundai Verna: Variants Comparison

ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

మారుతి సియాజ్ (పెట్రోల్)

హ్యుందాయ్ వెర్నా (పెట్రోల్)

సిగ్మా: రూ 8.19 లక్షలు

E రూ.7.89 లక్షలు (1.4 లీటర్)

డెల్టా: రూ 8.8 లక్షలు

EX రూ. 9.19 లక్షలు (1.4 లీటర్)

జీటా: రూ. 9.57 లక్షలు

SX రూ. 9.80 లక్షలు (1.6 లీటర్)

ఆల్ఫా: రూ. 9.97 లక్షలు

SX (O) 11.51 లక్షలు (1.6 లీటర్)

డెల్టా ఆటో: రూ. 9.8 లక్షలు

EX AT రూ. 10.65 లక్షలు (1.6 లీటర్)

జీటా ఆటో: రూ. 10.57 లక్షలు

SX(O) AT రూ. 12.65 లక్షలు (1.6 లీటర్)

ఆల్ఫా ఆటో: రూ. 10.97 లక్షలు

 

మారుతి సియాజ్ (డీజిల్)

హ్యుందాయ్ వెర్నా (డీజిల్)

సిగ్మా: రూ 9.19 లక్షలు

E రూ 9.59 లక్షలు

డెల్టా: రూ. 9.8 లక్షలు

రూ. 10.41 లక్షలు

జీటా: రూ. 10.57 లక్షలు

SX రూ. 11.49 లక్షలు

ఆల్ఫా: రూ. 10.97 లక్షలు

SX(O) రూ. 12.85 లక్షలు

 

EX AT రూ. 11.84 లక్షలు

 

SX+ AT రూ.12.99 లక్షలు

Hyundai Verna

మారుతి సియాజ్ సిగ్మా Vs హ్యుందాయ్ వెర్నా E (పెట్రోల్)

హ్యుందాయ్ వెర్నా

మారుతి సియాజ్

రూ. 7.89 లక్షలు

రూ 8.19 లక్షలు


ధర తేడా: సియాజ్ ధర రూ.30,000 చాలా ఖరీధైనది.

సాధారణ లక్షణాలు: డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, EBD తో ABS, మాన్యువల్ రోజు / నైట్ ORVM, ISOFIX, సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ బాడీ కలర్డ్ ORVMs, కవర్లు తో స్టీల్ వీల్స్, కీలెస్ ఎంట్రీ, డ్రైవర్ వైపు ఆటో మరియు యాంటీ పించ్ ఫంక్షన్ తో అన్ని పవర్ విండోస్, టిల్ట్ స్టీరింగ్ మరియు మాన్యువల్ AC.

సియాజ్ సిగ్మా వెర్నా E కంటే అధికంగా కలిగి ఉన్న లక్షణాలు: వెనుక డీఫాగర్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ అలర్ట్ సిష్టం, హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, గ్లాస్ యాంటెన్నా, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్, 4.2-అంగుళాల కలర్ MID(పెట్రోల్ మాత్రమే),ముందు మరియు వెనుక మరియు వెనుక A.C వెంట్స్ వద్ద ఆక్సిసరీ సాకెట్, CD ప్లేయర్, బ్లూటూత్, USB మరియు AUX కనెక్టివిటీతో ఆడియో స్పీకర్లతో కలిగి ఉంది మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్.

వెర్నాE వేరియంట్  సియాజ్ సిగ్మా మీద కలిగి ఉన్న లక్షణాలు: కూలెడ్ బాక్స్ గ్లోవ్ మరియు క్లచ్ లాక్.

మనం తెలుసుకోవలసినవి

ఇక్కడ మారుతి యొక్క అత్యంత ఖరీదైనది కారు, కానీ మంచి లక్షణాలతో కూడా అమర్చబడి ఉంది. సియాజ్ లో వెనుక సీటు చాలా విశాలంగా ఉంటుంది మరియు రేర్ A.C వెంట్స్ ని బేస్ వేరియంట్స్ నుండి కలిగి ఉంటుంది. ఎవరికైతే డ్రైవర్ ని పెట్టుకొని వెనకాతల సీటులో కూర్చొని A.C ని ఎంజాయి చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వేరియంట్ అనుకూలమైనది మరియు వెర్నా లో ఈ లక్షణం  వలన వెర్నా మీద పై చెయ్యి సాధిస్తుంది.

అయితే, ఎవరైతే సొంతంగా డ్రైవ్ చేద్దాం అనుకుంటారో వారికి సియాజ్ లో ఉన్న ముఖ్యమైన లక్షణాలు ఆడియో సిష్టం, వెనుక డీఫాగర్, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు ముందు ఆర్మ్రెస్ట్లు ఉన్నాయి మరియు ఇవి వెర్నా లో లేవు. వెనుక డిఫేజర్ ని మినహాయిస్తే మిగిలిన లక్షణాలన్నీ రూ.30,000 లోపు ధరకే కొనుక్కున్న తరువాత వెర్నా లో పెట్టించుకోవచ్చు.

కాబట్టి  మీరు ఎక్కువగా కారు ని డ్రైవర్ ని పెట్టుకొని వెళ్ళలనుకున్నామరియు మీ ఫ్యామిలీ కోసం వెనుక సీటులో సౌకర్యం కోరుకున్నా సరే సియాజ్ ను ఎంచుకోవచ్చు. మీరు ఈ రెండు మిడ్-సైజ్ సెడాన్ల మధ్య అత్యంత సరసమైనది కావాలనుకుంటే మరియు పైన చెప్పుకున్న లక్షణాల గురించి ఎక్కువగా పట్టించుకోకపోతే, అప్పుడు వెర్నా మీ అవసరాలకు బాగా సరిపోతుంది.

Hyundai Verna

మారుతి సియాజ్ డెల్టా MT Vs హ్యుందాయ్ వెర్నా EX MT (పెట్రోల్)

హ్యుందాయ్ వెర్నా

మారుతి సియాజ్

రూ. 9.19 లక్షలు

రూ. 8.8 లక్షలు

ధర తేడా: వెర్నా రూ. 39,000 ఖరీదు

ముందు వేరియంట్లలో ఉన్న సాధారణ లక్షణాలు:

వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీట్, క్లైమేట్ కంట్రోల్,క్రూయిస్ కంట్రోల్, స్టోరేజ్ తో ముందు మరియు వెనుక సెంటర్ ఆర్మ్రెస్ట్ మరియు కప్ హోల్డర్స్, సన్‌గ్లాస్ హోల్డర్, ముందు మరియు వెనుక స్పీకర్లు, USB, AUX కనెక్టివిటీతో కూడిన ఆడియో సిష్టం మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రేర్ A.C వెంట్స్, వెనుక మరియు ముందు USB చార్జర్ మరియు క్రూయిజ్ కంట్రోల్.

సియాజ్ డెల్టా వేరియంట్ వెర్నా EX మీద కలిగి ఉండే లక్షణాలు ఏమిటి: అల్లాయ్ వీల్స్.

వెర్నా EX వేరియంట్ సియాజ్ డెల్టా మీద కలిగి ఉండే లక్షణాలు ఏమిటి: రియర్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, రిమోట్ కంట్రోల్ తో 5-ఇంచ్ టచ్స్క్రీన్ వ్యవస్థ.

మీరు తెలుసుకోవలసినవి

వెర్నా ఖరీదైన ఎంపికగా ఉంటుంది, కానీ అదనపు లక్షణాలను పొందుతుంది. పార్కింగ్ కెమెరా తప్ప, అన్ని ఇతర లక్షణాలు ప్రీమియం ని మరింత పెంచే విధంగా ఉంటాయి. ఇది ఎలా ఉండగా రేర్ పార్కింగ్ కెమేరా తో టచ్‌స్క్రీన్ ఆడియో సిష్టం సియాజ్ లో తక్కువ ధరలో లభిస్తుంది, అందువలన సియాజ్ మంచి విలువని అందిస్తుంది.

Maruti Ciaz Zeta AT vs Hyundai Verna EX AT (Petrol)

వెర్నా EX AT

సియాజ్ జీటా AT

రూ. 10.65 లక్షలు

రూ. 10.57 లక్షలు

ధర తేడా: వెర్నా రూ .8,000 ఖరీదు.

మునుపటి వేరియంట్స్ లో ఉండే సాధారణ లక్షణాలు: ఆటో డిమ్మింగ్ ORVM, డే టైం రన్నింగ్ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVM మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా.

వెర్నా కంటే సియాజ్ లో ఉన్న అధనపు లక్షణాలు: LED హెడ్ల్యాంప్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, వెనుక అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్లు, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ మరియు రేర్ సన్‌షేడ్.

సియాజ్ కంటే అధనంగా వెర్నా లో ఉండే లక్షణాలు: కార్నరింగ్ ల్యాంప్స్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ తో 7-ఇంచ్ టచ్స్క్రీన్ యూనిట్.

మీరు తెలుసుకోవలసినవి:

సియాజ్ లోని కార్నరింగ్ ల్యాంప్స్ అమర్చడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మారుతీ సంస్థ MGA కింద ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను అందిస్తోంది. ఒకవేళ కార్నరింగ్ ల్యాంప్స్ అమర్చబడి ఉంటే సియాజ్ కారు వెర్నా కంటే రూ.20,000 అధనపు ధరను కలిగి ఉండేది, అయినప్పటికీ కూడా వెర్నా పైన అందిస్తున్న అదనపు లక్షణాలు పరిగణనలోకి తీసుకుంటే సియాజ్ కొనడం లాభదాయకమే.

Maruti Suzuki Ciaz

మారుతి సియాజ్ జెటా ఆటో vs హ్యుందాయ్ వెర్నా EX AT (పెట్రోల్)

మారుతి సియాజ్ జెటా MT vs హ్యుందాయ్ వెర్నా EX MT(డీజిల్)

వెర్నా

సియాజ్

తేడా

EX AT రూ.10.65 లక్షలు

జీటా ఆటో: రూ. 10.57 లక్షలు

రూ. 8,000

EX డీజిల్ 10.57 లక్షలు

జీటా డీజిల్ 10.41 లక్షలు

రూ .16,000

సాధారణ ఫీచర్లు (మునుపటి వేరియంట్ల మీద): అల్లాయ్ వీల్స్, క్రూయిస్ కంట్రోల్, వెనుక పార్కింగ్ కెమెరా.

వెర్నా కంటే సియాజ్ లో అధిక లక్షణాలు: LED ఫాగ్ లాంప్స్, DRLS తో LED హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్,రేర్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ లు, ఎలక్ట్రికల్లీ ఫోల్డింగ్ ORVM,పుష్ స్టార్ట్/స్టాప్  బటన్,సన్ గ్లాస్ హోల్డర్,రేర్ సన్షేడ్, హిల్ హోల్డ్ అసిస్ట్ తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్.

సియాజ్ పై వెర్నా లో ఉండే లక్షణాలు: ఆటోమాటిక్ హెడ్ల్యాంప్స్, 5-ఇంచ్ టచ్స్క్రీన్ వ్యవస్థ.

మీరు తెలుసుకోవలసినవి

దీనిలో ఉన్న చాలా అదనపు లక్షణాలకు ధన్యవాదాలు, సియాజే మా ఎంపిక. ఎవరైతే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేకుండా ఉండలేరో వారు దానిని కొనుగోలు చేసిన తరువాత MGA ద్వారా అమర్చుకోవచ్చు. దీనివలన సియాజ్ కారు వెర్నా కంటే ఖరీదైనది అవుతుంది. అయినప్పటికీ కూడా దీనిని లక్షణాల కారణంగా సియాజే మంచి కారు అవుతుంది.

హ్యుందాయ్ వెర్నా E MT vs మారుతి సియాజ్ డెల్టా MT (డీజిల్)

వెర్నా

సియాజ్

రూ. 9.59 లక్షలు

రూ. 9.8 లక్షలు

ధర వ్యత్యాసం: సియాజ్ రూ.21,000 ఖరీదైనది.

సాధారణ లక్షణాలు: డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, EBD తో ABS, మాన్యువల్ డే/ నైట్ ORVM, ISOFIX, సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రికల్లీ  అడ్జస్టబుల్ బాడీ కలర్డ్ ORVMs, కవర్లు తో స్టీల్ వీల్స్,కీలెస్ ఎంట్రీ, డ్రైవర్ వైపు ఆటో మరియు యాంటీ పించ్ ఫంక్షన్ తో అన్ని పవర్ విండోస్, టిల్ట్ స్టీరింగ్,ఒకే రంగు తో MID ( మల్టీ ఇంఫో డిస్ప్లే)  మరియు మాన్యువల్ AC.

వెర్నా పైన సియాజ్ లో ఉండే లక్షణాలు: రేర్ డిఫేజర్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, గ్లాస్ యాంటెన్నా, స్పీడ్ హెచ్చరిక వ్యవస్థ, హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, 4.2-ఇంచ్ కలర్ MID (పెట్రోల్ మాత్రమే), ముందు మరియు వెనుక ఆక్సిసరీ సాకెట్స్ మరియు వెనుక A.C వెంట్స్,CD ప్లేయర్, బ్లూటూత్, USB మరియు AUX కనెక్టివిటీతో ఆడియో స్పీకర్లతో ఉంటుంది మరియు స్టీరింగ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్.

సియాజ్ పై వెర్నాలో ఉండే లక్షణాలు: కూలెడ్ గ్లోవ్ బాక్స్ మరియు క్లచ్ లాక్.

మీరు తెలుసుకోవలసినవి

ఇక్కడ సియాజ్ యొక్క రెండవ వేరియంట్ వెర్నా యొక్క బేస్ వేరియంట్ తో పోలిస్తే సియాజ్ మంచి విలువను అందిస్తుంది. మారుతి రూ. 21,000 ఖరీదైనది, అయితే దాని అద్భుతమైన లక్షణాలు ఆ డబ్బుకు న్యాయం చేస్తాయి.

Maruti Suzuki Ciaz

మారుతి సియాజ్ ఆల్ఫా MT vs హ్యుందాయ్ వెర్నా SX MT (పెట్రోల్)

వెర్నా

సియాజ్

రూ. 9.80 లక్షలు

రూ. 9.97 లక్షలు

ధర వ్యత్యాసం: సియాజ్ రూ.17,000 ఖరీదైనది.

మునుపటి వేరియంట్లలో సాధారణ లక్షణాలు: ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో 7-ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే మరియు ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVM.

వెర్నా పై సియాజ్ అందించే లక్షణాలు: లెదర్ సీటు అపోలిస్టీ మరియు లెథర్ స్టీరింగ్ వీల్.

సియాజ్ మీద వెర్నాలో ఉండే లక్షణాలు: హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్‌బెల్ట్స్.

మీరు తెలుసుకోవలసినవి

మీరు సియాజ్ పై చెల్లించే డబ్బులకి లగ్జరీ ని పెంచే ప్రీమియం అనుభూతిని కలిగించే లెథర్ టచ్ పాయింట్లు కలిగి ఉంటారు. అయితే దాదాపుగా ఇదే ధరకు వీటిని వెర్నా లో కూడా పెట్టించుకోవచ్చు. దీనివలన రెండూ కూడా సుమారుగా మనం పెట్టే డబ్బుకి ఒకలాంటి లక్షణాలనే అందిస్తున్నారు.

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti సియాజ్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience