• English
  • Login / Register

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఫేస్ లిఫ్ట్ వేరియంట్స్ వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కోసం dinesh ద్వారా మార్చి 12, 2019 10:34 am ప్రచురించబడింది

  • 33 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి
  • ఈ కారు ధర రూ .4.97 లక్షల నుంచి రూ .7.62 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది.
  •  పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ రెండిటితో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది.
  •  ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ కు మాత్రమే పరిమితం.

Hyundai Grand i10 

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అనేది దక్షిణ కొరియా ఆటోమేకర్ యొక్క మధ్యతరం హాచ్బాక్, ఇది మారుతి ఇగ్నిస్ మరియు మహీంద్రా కెయూవి100 లకు ప్రత్యర్థిగా ఉంటూ గట్టి పోటీను ఇస్తుంది. ఈ కారు- ఎరా, మాగ్న, స్పోర్ట్స్జ్, స్పోర్ట్స్జ్ (డ్యూయల్- టోన్), ఆస్టా నాలుగు రకాల వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు రూ. 4.97 లక్షల నుంచి రూ. 7.62 లక్షల రూపాయల ధరకే లభిస్తుంది. కానీ ఈ కారు ఏ ఫీచర్ ప్యాకేజీ, ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ల కలయికలతో వస్తుందో తెలుసుకోండి, అంతేకాకుండా మీ అవసరాలకు ఏ కారు బాగా సరిపోతుంది? కనుగొనండి.

వేరియంట్ వివరాలలోకి వెళ్ళే ముందు, ఈ హ్యాచ్బ్యాక్ ఏ ఏ రంగు ఎంపికలతో మరియు భద్రతా లక్షణాలతో అందించబడుతుందో తెలుసుకుందాం.

రంగుల ఎంపికలు

  •  టైఫూన్ సిల్వర్
  •  స్టార్ డస్ట్
  •  ఫైరీ రెడ్
  •  పోలార్ వైట్
  •  ఫ్లేమ్ ఆరెంజ్
  •  మెరీనా బ్లూ

ప్రాధమిక భద్రతా ఫీచర్లు

  •  ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్
  •  ఏబిఎస్ తో ఈబిడి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ఎరా: ప్రాథమిక భద్రత అంశాలను పొందుతుంది

వేరియంట్

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఎరా పెట్రోల్

రూ .5 లక్షలు

ఎరా డీజిల్

రూ. 6.17 లక్షలు

లక్షణాలు:

భద్రత: ఈబిడి తో ఈబిడి మరియు ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్  

బాహ్య: కారు శరీర రంగులో ఉండే బంపర్లు

Hyundai Grand i10

కంఫర్ట్: పవర్ స్టీరింగ్, మాన్యువల్ ఏసి, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు అంతర్గతంగా సర్దుబాటయ్యే ఓఆర్విఎం లు 

తీర్పు: మీరు తక్కువ బడ్జెట్లో ఉన్నట్లయితే, ఈ గ్రాండ్ ఐ 10 యొక్క ఈ వేరియంట్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. గ్రాండ్ ఐ 10 యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లో పీలవమైన భద్రతా లక్షణాలు అందించబడతాయి. ఇది ప్రాథమిక భద్రతా లక్షణాలను పొందినప్పటికీ, ఒక మ్యూజిక్ సిస్టమ్, వెనుక పవర్ విండోస్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటి ప్రాథమిక అవసరమైన ఆధారిత లక్షణాలను మిస్ అవుతోంది. హ్యుందాయ్ కూడా దిగువ శ్రేణి మోడల్ లో కారు -రంగులో ఉండే డోర్ హాండెల్స్ మరియు ఓ ఆర్ వి ఎం వంటి అంశాలను అందించడం లేదు, ఇవి లేకపోవడం వలన ఈ కారు సాధారణమైనదిగా కనిపిస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మాగ్నా- ఎరా తో పోలిస్తే కొంచెం ఎక్కువ

 

పెట్రోల్ ఎంటి / ఎటి

డీజిల్

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

రూ .5.75 లక్షలు / రూ 6.55 లక్షలు

రూ 6.72 లక్షలు

మునుపటి ఎరా ధర కంటే పైగా

రూ  75,000

రూ 55,000

ఎరా లో అందించబడిన ఫీచర్లతో పాటు

సేఫ్టీ: సెంట్రల్ లాకింగ్ మరియు స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్

ఎక్స్టీరియర్స్: కారు-రంగులో ఉండే డోర్ హ్యాండిళ్ళు, డోర్ అద్దాలు, రూఫ్ యాంటెన్నా, పూర్తి వీల్ కవర్ మరియు రూఫ్ రైల్స్

Hyundai Grand i10

కంఫర్ట్: స్టీరింగ్- వీల్ పై కంట్రోల్స్, వెనుక ఏసి వెంట్ళు, డే / నైట్ ఐవిఆర్ఎం లు, వెనుక పవర్ విండోస్ మరియు విద్యుత్ తో సర్దుబాటయ్యే ఓఆర్విఎం లు

ఇన్ఫోటైన్మెంట్: మాన్యువల్ వేరియంట్ లో బ్లూటూత్, ఆక్స్ మరియు యూఎస్బి తో కూడిన 2- దిన్ ఆడియో వ్యవస్థ మరియు ఆటోమేటిక్ మోడల్లో- బ్లూటూత్, యూఎస్బి, ఆక్స్ లతో కూడిన 5- అంగుళాల టచ్స్క్రీన్ యూనిట్

తీర్పు: ఈ వేరియంట్లో, గ్రాండ్ ఐ 10 దిగువ శ్రేణి వేరియంట్ లో అందించిన అన్ని అంశాలు అందించబడతాయి. హ్యుందాయ్ వీటితో పాటు ప్రీమియం అయినప్పటికీ, డీజెల్ వెర్షన్ కోసం అయినా మరిన్ని అంశాలను అందించి ఉండాల్సి ఉంటుంది. ఈ వేరియంట్ కోసం మీ బడ్జెట్ను కొనసాగించినట్లయితే, మనం బేస్-స్పెక్ట్ గ్రాండ్ ఐ 10 కోసం వెళ్లి ఈ అదనపు ఫీచర్లను కొనుగోలు చేసిన తరువాత కూడా పొందవచ్చని మేము సూచిస్తాము.

అయితే, మీరు ఒక పెట్రోల్ ఆటోమేటిక్ హ్యాచ్బ్యాక్ కోసం చూస్తున్నట్లయితే, ఏటి యొక్క ఎంపికను అందించే గ్రాండ్ ఐ 10 శ్రేణిలో ఇదే మొట్టమొదటి రకం. మీరు ఒక మంచి బడ్జెట్లో ఉన్నట్లైతే గ్రాండ్ ఐ 10 జాబితాలో ఆటోమేటిక్ వెర్షన్ తో ఉన్న ఈ వేరియంట్ కోసం వెళ్ళవచ్చు, లేకుంటే మేము మీ బడ్జెట్ మరింత విస్తరించి ఉంటే స్పోర్ట్జ్ వేరియంట్ మీరు సూచించబడుతుంది.

  • హ్యుందాయ్ శాంత్రో వర్సెస్ గ్రాండ్ ఐ 10 స్పోర్ట్జ్: ఏ హాచ్బ్యాక్ మరింత ఖాళీ స్థలాన్ని అందిస్తుంది?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 స్పోర్ట్జ్- ఈ వేరియంట్ సిఫార్సు చేయబడినది

 

పెట్రోల్ ఎంటి / ఎటి

డీజిల్

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

రూ 6.14 లక్షలు / రూ 7.08 లక్షలు

రూ 7.17 లక్షలు

మునుపటి మాగ్నా ధర కంటే పైగా

రూ. 39,000 / రూ .53,000

రూ 45,000

మాగ్నా లో అందించబడిన ఫీచర్లతో పాటు అధనపు ఫీచర్లు:

సేఫ్టీ: వెనుక పార్కింగ్ సెన్సార్లు

Hyundai Grand i10

ఎక్స్టీరియర్స్: ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్, అల్లాయ్ వీల్స్ (ఏటి లో మాత్రమే), ఓఆర్విఎం లకు టర్న్ ఇండికేటర్లు మరియు వెనుక స్పాయిలర్

కంఫర్ట్: వెనుక పార్కింగ్ కెమెరా, వెనుక డిఫోగ్గర్, ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎం లు, టిల్ట్- సర్దుబాటు స్టీరింగ్ వీల్ మరియు కూల్డ్ గ్లోవ్ బాక్స్Hyundai Grand i10

ఇన్ఫోటైన్మెంట్: ఆపిల్ కార్పిల్ మరియు ఆండ్రాయిడ్ ఆటో లతో కూడిన 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్

తీర్పు: ఇది మేము సిఫార్సు చేస్తున్నాము. ఇది అన్ని అవసరమైన లక్షణాలతో పాటు మరి కొన్ని అంశాలను పొందుతుంది. ప్రీమియం ధరతో ఎదురుచూసే వాళ్ళకు మునుపటి వేరియంట్ పూర్తిగా మా అభిప్రాయంతో సమర్థించబడుతోంది. ఒక పెట్రోల్ ఆటోమేటిక్ హాచ్బాక్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు స్పోర్ట్జ్ వేరియంట్ మా అభిప్రాయం ప్రకారం సరైన ఎంపిక.

హ్యుందాయ్ కూడా స్పోర్ట్జ్ వేరియంట్ లో- డ్యూయల్- టోన్ ఎక్స్టీరియర్ పెయింట్ ఎంపికను అందిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, సింగిల్ టోన్ వేరియంట్ పై ధర రూ. 24,000 (డీజిల్) మరియు రూ .25,000 (పెట్రోల్) ధరతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. దీనికి బదులుగా గ్రాండ్ ఐ 10 అస్టా కోసం ఎందుకు వెళ్ళకూడదు?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 అస్టా:

అధ్బుతమైన ఫీచర్లతో అందించబడుతుంది, డీజెల్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా తయారుచేయబడింది అంతేకాకుండా ఇది విలువకు తగిన వాహనం అని చెప్పవచ్చు

 

పెట్రోల్ ఎంటి / ఎటి

డీజిల్

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

రూ 6.65 లక్షలు

రూ. 7.62 లక్షలు

మునుపటి మాగ్నా ధర కంటే పైగా

రూ 51,000

రూ 45,000

స్పోర్ట్జ్ లో అంబ్దించబడిన ఫీచర్లతో పాటు

ఎక్స్టీరియర్స్: క్రోం డోర్ హ్యాండిల్స్ మరియు అల్లాయ్ వీల్స్

Hyundai Grand i10

కంఫర్ట్: ఆటో ఏసి, పుష్ బటన్ స్టార్ట్, వెనుక వాషర్ మరియు వైపర్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు మరియు వెనుక సర్దుబాటు హెడ్ రెస్ట్

Hyundai Grand i10

తీర్పు: అన్ని ఫీచర్లతో అందించబడిన కొత్త గ్రాండ్ ఐ 10 ను మీరు ఇష్టపడుతున్నట్లైతే మరియు అన్ని అద్భుతమైన అంశాలు మరియు ప్రశంసలతో లోడ్ చేయాలని మీరు కోరుకుంటే, ఇది మీకు సరైన వేరియంట్ గా ఉంటుంది. స్పోర్ట్జ్ వేరియంట్కు రూ. 51,000 వరకు అధనంగా చెల్లిస్తే ప్రీమియం కోసం, ఆటో ఎసి మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటి మంచి ఫీచర్లు ఈ కారులో అందించబడతాయి. ఇది ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, సర్దుబాటు వెనుక హెడ్ రెస్ట్ మరియు వెనుక వాషర్ మరియు వైపర్ వంటి కొన్ని అదనపు ఫీచర్లను పొందుతుంది. గ్రాండ్ ఐ 10 అనేది కాంటెంపరరీ కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్, ఇది దాని మునుపటి వేరియంట్ తో పోలిస్తే అధిక ధరను కలిగి ఉన్నా దరకు తగిన వాహనం అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: కొత్త 2019 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 స్పై షాట్స్ యొక్క మరిన్ని వివరాలు విడుదల

గ్రాండ్ ఐ 10 డీజిల్ కోసం మరిన్ని చదవండి

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai Grand ఐ10

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience