రూ.2 లక్షల వరకూ ప్రయోజనాలు అందిస్తున్న హ్యుందాయి సంస్థ
హ్యుందాయ్ వెర్నా 2017-2020 కోసం dinesh ద్వారా మే 21, 2019 11:46 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ సంస్థ క్రెటా SUV మినహా మిగిలిన అన్ని కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది
- హ్యుందాయ్ శాన్త్రో మరియు గ్రాండ్ i10 వంటి కార్లను కొనుగోలు చేసుకున్న వారికి ఇతర ప్రయోజనాలతో పాటు 3 గ్రాముల బంగారు నాణెం ఇస్తోంది.
- యాక్సెంట్ S పెట్రోల్ రూ .92,000 నగదు తగ్గింపుతో లభిస్తుంది.
- ఎలైట్ ఐ 20 లో రూ. 20,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి
- రూ. 30,000 వరకూ ప్రయోజనాలతో వెర్నా కారు లభిస్తుంది.
ఈ నెలలో హ్యుందాయ్ కారును కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది ఆనందించాల్సిన విషయం! క్రెటా కి తప్ప హ్యుందాయ్ సంస్థ మిగిలిన మోడల్ శ్రేణిలో అన్నిటికీ రూ .2 లక్షల లాభాలను అందిస్తోంది. అందువలన మరింత ఆలస్యం లేకుండా మీరు మీ కొత్త హ్యుందాయ్ కారుకు ఎంత ఆదా చేయవచ్చు అనేది కనుక్కుందాము పదండి.
నగదు డిస్కౌంట్ |
బంగారు నాణెం |
ఇతర ప్రయోజనాలు |
|
శాంత్రో |
- |
3g (రూ. 10,000 వరకు విలువైనది) |
రూ. 30,000 వరకు |
గ్రాండ్ i 10 |
- |
3g (రూ.10,000 వరకు విలువైనది) |
రూ. 95,000 వరకు |
ఎక్సెంట్ S పెట్రోల్ |
రూ. 92,000 |
- |
- |
ఎక్సెంట్ (మిగిలినది) |
- |
- |
రూ. 85,000 వరకు |
ఎలైట్ i20 |
- |
- |
రూ. 20,000 వరకు |
వెర్నా |
- |
- |
రూ. 30,000 వరకు |
ఎలంట్రా |
- |
- |
రూ. 2 లక్ష వరకు |
టక్సన్ |
- |
- |
రూ. 1 లక్ష వరకు |
టేక్అవే:
హ్యుందాయ్ శాంత్రో: హ్యుందాయ్ శాన్త్రో కు రూ. 30,000 వరకు లాభాలను అందిస్తోంది. అంతేకాకుండా, కొత్త శాన్త్రో కారు కొనుగోలుపై 3 గ్రా బంగారు నాణెం (రూ. 10,000 వరకు విలువ గల) కూడా అందిస్తోంది.
హ్యుందాయ్ గ్రాండ్ i 10: శాంత్రో మాదిరిగా, హ్యుందాయ్ గ్రాండ్ i10 కొనుగోలులో 3 గ్రా బంగారు నాణెం కూడా అందిస్తోంది. గ్రాండ్ i10 లో లభించే ఇతర ప్రయోజనాలు రూ. 95,000 వరకు ఉంటాయి.
హ్యుందాయ్ ఎక్సెంట్ S (పెట్రోల్): ఇది నగదు తగ్గింపుతో అందుబాటులో ఉన్న ఏకైక కారు. మీరు ఎక్సెంట్ S పెట్రోల్ ని 5.49 లక్షల రూపాయలకు కొనుగోలు చేయవచ్చు, సాధారణంగా ఉండే రూ. 6.41 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర కంటే ఇది రూ. 92,000 తక్కువగా ఉంది.
హ్యుందాయ్ ఎక్సెంట్ (మిగిలిన వేరియంట్స్): ఎక్సెంట్ రూ. 85,000 వరకూ కూడా ప్రయోజనాలతో లభిస్తుంది.
హ్యుందాయ్ ఎలైట్ i20: 2019 ఏప్రిల్ కి గానూ హ్యుందాయ్ యొక్క రెండో అత్యుత్తమంగా అమ్ముడుపోయిన కారు రూ. 20,000 వరకు లాభాలను అందిస్తోంది.
హ్యుందాయ్ వెర్నా: ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కాంపాక్ట్ సెడాన్ రూ. 30,000 వరకు లాభాలను పొందవచ్చు.
హ్యుందాయై ఎలన్ట్రా: ఏప్రిల్ నెలలో సబ్-100 నెలవారీ నంబర్లతో కూడిన క్లాస్ లో అతి తక్కువగా అమ్ముడుపోయిన సెడాన్ ఎలన్ట్రా. విషయాలను సరిచేసే ప్రయత్నంలో, హ్యుందాయ్ మిడ్-సైజ్ సెడాన్ లో రూ .2 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. హ్యుందాయ్ ప్రపంచ మార్కెట్ లో ఎలంట్రా ఫేస్‌లిఫ్ట్ ని ఇప్పటికే ప్రారంభించింది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి ఇక్కడకు వస్తుందని భావిస్తున్నారు.
హ్యుందాయ్ టక్సన్: టక్సన్ కారు రూ .1 లక్ష వరకు లాభాలతో లభిస్తుంది.
గమనిక: ఈ ఆఫర్లు అనేవి మే 31 వరకు చెల్లుతాయి మరియు ఇవి డీలర్ నుండి డీలర్ వరకూ మారవచ్చు. ఇతర ప్రయోజనాలు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, ఉండే వాటిలో ఉన్నాయి, కానీ మంచి అవగాహన కోసం దయచేసి మీ మంచి డీలర్ ని సంప్రదించండి.