2016 ఆడీ ఏ8 ఎల్ 4.0టీ స్పోర్ట్ మరింత శక్తితో వస్తోంది
ఆడి ఏ8 2014-2019 కోసం bala subramaniam ద్వారా అక్టోబర్ 28, 2015 03:02 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఆడీ వారు 2016 ఆడీ ఏ8 ఎల్ 4.0టీ స్పోర్ట్ ని యునైటెడ్ స్టేట్స్ లో విడుదల చేశారు. ఇది భారతదేశంలో ఏ8 60 టీఎఫెసై పేరిట మెరుగైన శక్తితో రానుంది. ఈ 4.0-లీటర్ వీ8 ఇంజిను మునుపటి 430 కాకుండా ఇప్పుడు 450 శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టార్క్ అదే విధంగా 600 గా ఉంటుంది. మరింత పెద్ద ఎయిర్ ఇంటేక్ల కారణంగా బాహ్యంగా కూడా మరింత ధుడుకైన రూపంలో కనపడుతుంది. ముందు బంపర్ కొద్దిగా క్రిందకి ఉండి, పక్క వైపున ప్యానెల్స్ ఇంకా పదునుగా ఉంటాయి.
లోపల, ఏ8 ఎల్ 4.0టీ స్పోర్ట్ కి 22-వివిధ సౌకర్యవంతమైన ముందు వైపు సీట్లు తో వాల్కొనా లెదర్ మరియూ ఒక స్పోర్టీ డైమండ్ ప్యాటర్న్ కుట్టు తో వెంటిలేషన్ ఇంకా మస్సాజ్ ఫంక్షన్లు కలిగి ఉన్న ప్రామాణిక ఎగ్జెక్యూటివ్ మరియూ లగ్జరీ ప్యాకేజీలు కలిగి ఉంటాయి. ప్రామాణిక పరికారాల జాబితాలో అల్కంటర హెడ్ లైనర్. పనోరమిక్ సన్ రూఫ్ మరియూ విండోస్ పై అకౌస్టిక్ గ్లేజింగ్ కలిగి ఉంటాయి.
భారతదేశంలో ఆడీ ఇండియా కి ఈ మార్పులు ఎప్పుడు వస్తాయో తెలీదు కానీ, దీనిపై మరింత సమాచారం కోసం వేచి వుండండి.
2016 ఆడీ ఏ8 ఎల్ 4.0టీ స్పోర్ట్ మోడల్ యొక్క పరికరాల జాబితా:
- గత 4.0టీ మోడల్ కన్నా 15hp ఎక్కువగా ఈ పునరుద్దరించబడిన 4.0టీ ట్విన్ టర్బో వీ8 ఇంజిను 450hp శక్తిని అందిస్తుంది.
- స్పోర్ట్ బాహ్యపు స్టైల్; పూర్తిగా కొత్త క్రింది బంపర్ మరియూ డిజైన్ మార్చిన వెనుక బంపర్; పదునైన రాకర్ ప్యానెల్స్; మరింత ధుడుకైన ఆకారం మరియూ తక్కువ క్రోము పూతలు
- ప్రామాణిక 20 అంగుళాల 5-స్పోక్ వీల్స్ తో ఆల్-సీజన్ టైర్లు; 21 అంగుళాల 5-స్పోక్ వీల్స్ తో సమ్మర్ టైర్లు కూడా అందుబాటులో ఉంటాయి
- 22 విధాల సౌకర్యవంతమైన స్పోర్ట్ సీట్లు తో వెంటిలేషన్ మరియూ మస్సాజ్ ఫంక్షన్లు
- హెడ్ అప్ డిస్ప్లే
- ఆడీ సైడ్ అస్సిస్ట్ తో ఆడీ ప్రీ సెన్స్ రేర్
- వల్కోనా లెదర్ అంతర్ఘతలతో డైమండ్ ప్యాటర్న్ కుట్టు
- అల్కంటర హెడ్ లైనర్
- ప్రామాణిక ఎగ్జెక్యూటివ్, లగ్జరీ మరియూ స్పోర్టీ స్టైల్ ప్యాకేజీలు
- పానరోమిక్ సన్ రూఫ్
- విండోస్ పై అకౌస్టిక్ గ్లేజింగ్