• English
  • Login / Register

2016 ఆడి ఏ4 ఎటువంటి దాపరికం లేకుండా బహిర్గతం

ఆడి ఏ4 2015-2020 కోసం అభిజీత్ ద్వారా జూన్ 06, 2015 04:22 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఎంతగానో ఎదురుచూస్తున్న ఆడి ఏ4 మళ్ళీ ఎటువంటి దాపరికం లేకుండా బహిర్గతం అయ్యింది. మరియు దీని యొక్క చిత్రాలు చూడటానికి, అనేక మార్పులను కలిగి ఉన్నాయి. ఈ రాబోయే ఆడి ఏ4 ను ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో కన్న ముందు సెప్టంబర్ లో చూపించబోతున్నారు. కాని, ఆడి ఎటువంటి సమాచారాన్ని అందజేయలేదు. ఈ కారు ను త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

అయితే, ఆడి ఏ4 యొక్క తరువాత తరం అంతా కొత్తగా రాబోతుంది. కారు యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని అవుట్గోయింగ్ మోడల్ తో పోలిస్తే, అనేక నవీకరణలను పొందింది. అయితే, ఈ కొత్త ఏ4 లో ఎక్స్టేండెడ్ వీల్బేస్ ఉండటం వలన వెనుక ప్రయాణీకులు విశాలంగా కూర్చునేందుకు అవకాశం ఉంటుంది. బాహ్య బాగాలలో ముఖ్యంగా చెప్పలంటే, ఎల్- ఆకారపు హెడ్ల్యాంప్ క్లస్టర్ తో పాటు అధునాతన డిజైన్ ను కలిగి ఉంటుంది. కారు యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఒక జత న్యూ అల్లాయ్ వీల్స్, మరియు ఒక వేస్ట్ లైన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ వేస్ట్ లైన్ ను కలిగి ఉండటం వలన కారును మరింత అందంగా చూపిస్తుంది. వెనుక టైల్ లైట్ క్లస్టర్ లో నలుపు రంగు మరియు ఎరుపు రంగులను కలిగి ఉంటాయి. ఈ కారుని దూరం నుండి చూసినటైతే, వేస్ట్ లైన్ క్రింది బాగసంలో ఒక క్రోమ్ పిన్ స్ట్రిప్ కనిపిస్తుంది. ఈ క్రొమ్ స్ట్రిప్ ముందు హెడ్ల్యాంప్ నుండి వెనుక టైల్ ల్యాంప్ వరకు కనిపిస్తుంది. అంతేకాక, దీని ముందు ఆడి ఏ4 కారుతో పోలిస్తే, ప్రస్తుత ఆడి ఏ4 కారు యొక్క వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ కొంచెం క్రింది బాగంలో అమర్చబడి ఉంటాయి.  

  

దీని యొక్క చిత్రాలలో అంతర్గత భాగాలను చూపించడంలేదు. అయినప్పటికి, ఆడి నుండి తాజాగా ప్రవేశపెట్టబడిన వాహనాల నుండి అనేక లక్షణాలతో రాబోతుంది. దీనితో పాటు ఎం ఎం ఐ సమాచార వ్యవస్థ మరియు అనేక లక్షణాలతో రాబోతుంది.

was this article helpful ?

Write your Comment on Audi ఏ4 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience