మారుతి వాగన్ ఆర్ 2013-2022 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఇంజిన్ | 970 సిసి - 1197 సిసి |
పవర్ | 58.16 - 81.8 బి హెచ్ పి |
టార్క్ | 8.6@3,500 (kgm@rpm) - 113 Nm |
ట్రాన్స్ మిషన్ | మాన్యువల్ / ఆటోమేటిక్ |
మైలేజీ | 21.79 kmpl |
ఫ్యూయల్ | ఎల్పిజి / డీజిల్ / పెట్రోల్ / సిఎన్జి |
- digital odometer
- ఎయిర్ కండీషనర్
- central locking
- కీ లెస్ ఎంట్రీ
- బ్లూటూత్ కనెక్టివిటీ
- స్టీరింగ్ mounted controls
- touchscreen
- android auto/apple carplay
60:40 స్ప్లిట్ సర్ధుబాటు వెనుక సీటు: సెలెరియో మినహా, ఈ సెగ్మెంట్లోని ప్రతీ ఒక్క కారులో, వెనుక సీటు మడత సర్ధుబాటును కలిగి ఉంటుంది, ఈ సర్ధుబాటును కలిగి ఉండటం వలన బూట్ స్థలం మరింత పెరుగుతుంది.
341-లీటర్ బూట్ స్పేస్: వాగన్ ఆర్ యొక్క బూట్ స్పేస్, దాని పోటీ వాహనాల అలాగే దీనిని పై సెగ్మెంట్ లో ఉండే కార్ల కంటే కూడా చాలా విశాలమైనది.
7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్: మారుతి యొక్క కొత్త స్మార్ట్‌ప్లే స్టూడియో, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మద్దతుతో పాటు కార్ల తయారీదారుడు స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ యాప్, స్మార్ట్‌ప్లే స్టూడియో తో వస్తుంది. ఇది ఇంటర్నెట్ రేడియోలను మరియు వాహన గణాంకాలను ప్రదర్శిస్తుంది.
- కీలక లక్షణాలు
- అగ్ర లక్షణాలు
- ప్రత్యేక లక్షణాలు
మారుతి వాగన్ ఆర్ 2013-2022 ధర జాబితా (వైవిధ్యాలు)
following details are the last recorded, మరియు the prices మే vary depending on the car's condition.
- అన్నీ
- పెట్రోల్
- సిఎన్జి
- ఎల్పిజి
- డీజిల్
- ఆటోమేటిక్
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ డుయో BSIII(Base Model)1061 సిసి, మాన్యువల్, ఎల్పిజి, 17.3 Km/Kg | ₹3.29 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ డుయో BSIII1061 సిసి, మాన్యువల్, ఎల్పిజి, 17.3 Km/Kg | ₹3.55 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 డీజిల్970 సిసి, మాన్యువల్, డీజిల్ | ₹3.70 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ BSIV(Base Model)998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹3.74 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 క్రెస్ట్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹3.83 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ BSIII డబ్లు/ఏబిఎస్1061 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.3 kmpl | ₹3.85 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ BSIV998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.15 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ డుయో BSIV998 సిసి, మాన్యువల్, ఎల్పిజి, 14.4 Km/Kg | ₹4.16 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 డుయో ఎల్పిజి998 సిసి, మాన్యువల్, ఎల్పిజి, 14.6 Km/Kg | ₹4.16 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ప్రో998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmpl | ₹4.26 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ ఎల్పిజి(Top Model)998 సిసి, మాన్యువల్, ఎల్పిజి, 26.6 Km/Kg | ₹4.28 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ అవ్నేస్ ఎడిషన్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.30 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ BSIV998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.41 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ ఆప్షనల్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.48 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ సిఎన్జి(Base Model)998 సిసి, మాన్యువల్, సిఎన్జి, 26.6 Km/Kg | ₹4.48 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఏఎంటి విఎక్స్ఐ998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.48 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ BSIV తో ఏబిఎస్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.63 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ప్లస్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.70 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఆప్షనల్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.74 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
ఎల్ఎక్స్ఐ సిఎన్జి అవన్స్ ఎడిషన్998 సిసి, మాన్యువల్, సిఎన్జి, 26.6 Km/Kg | ₹4.84 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ 1.2 BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.5 kmpl | ₹4.89 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.51 kmpl | ₹4.89 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఆప్షనల్ 1.2BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.5 kmpl | ₹4.96 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 సిఎన్జి ఎల్ఎక్స్ఐ BSIV998 సిసి, మాన్యువల్, సిఎన్జి, 33.54 Km/Kg | ₹5 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 సిఎన్జి ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ BSIV998 సిసి, మాన్యువల్, సిఎన్జి, 33.54 Km/Kg | ₹5.08 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఏఎంటి విఎక్స్ఐ ప్లస్998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.51 kmpl | ₹5.17 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.79 kmpl | ₹5.18 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఏఎంటి విఎక్స్ఐ ఆప్షన్998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.51 kmpl | ₹5.21 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 జెడ్ఎక్స్ఐ 1.2 BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.5 kmpl | ₹5.23 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ ఆప్షనల్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.79 kmpl | ₹5.24 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఎల్ఎక్స్ఐ సిఎన్జి ఆప్షనల్998 సిసి, మాన్యువల్, సిఎన్జి, 26.6 Km/Kg | ₹5.32 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 ఏఎంటి విఎక్స్ఐ ప్లస్ ఆప్షన్998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.51 kmpl | ₹5.36 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఏఎంటి 1.2BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.5 kmpl | ₹5.37 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఏఎంటి ఆప్షనల్ 1.2BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.5 kmpl | ₹5.43 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.79 kmpl | ₹5.50 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఆప్షనల్998 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.79 kmpl | ₹5.57 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 జెడ్ఎక్స్ఐ ఏఎంటి 1.2 BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.5 kmpl | ₹5.70 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ 1.21197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.52 kmpl | ₹5.74 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఆప్షనల్ 1.21197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.52 kmpl | ₹5.80 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఏఎంటి998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.79 kmpl | ₹6 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఏఎంటి ఆప్షనల్998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.79 kmpl | ₹6.07 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 జెడ్ఎక్స్ఐ 1.21197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.52 kmpl | ₹6.08 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 సిఎన్జి ఎల్ఎక్స్ఐ998 సిసి, మాన్యువల్, సిఎన్జి, 32.52 Km/Kg | ₹6.13 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 సిఎన్జి ఎల్ఎక్స్ఐ ఆప్ట్(Top Model)998 సిసి, మాన్యువల్, సిఎన్జి, 32.52 Km/Kg | ₹6.19 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఏఎంటి 1.21197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.52 kmpl | ₹6.24 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 విఎక్స్ఐ ఏఎంటి ఆప్షనల్ 1.21197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.52 kmpl | ₹6.30 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer | |
వాగన్ ఆర్ 2013-2022 జెడ్ఎక్స్ఐ ఏఎంటి 1.2(Top Model)1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.52 kmpl | ₹6.58 లక్షలు* | వీక్షించండి ఏప్రిల్ offer |
మారుతి వాగన్ ఆర్ 2013-2022 సమీక్ష
Overview
రెండు దశాబ్దాల నుండి ఆచరణాత్మక మరియు ప్రయోజనకర హాట్చ్యాక్ కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారులకు మారుతి వాగన్ ఆర్ అగ్ర ఎంపికలలో ఒకటిగా నిలిచింది. మునుపటి తరం వాగన్ ఆర్ యొక్క టాల్‌బాయ్ బాక్సింగ్ రూపకల్పన అనేది అమ్ముడుపోతున్న ఏ ఇతర హ్యాచ్‌బ్యాక్ కన్నా, ఈ వాగన్ ఆర్ మరింత ఆచరణాత్మక సాధనంగా పనిచేయడానికి ఒక క్రియాత్మక ఎంపికగా వినియోగదారుల ముందుకు వచ్చింది. మార్కెట్ పోకడలు, వినియోగదారుని అవసరాలు అలాగే భద్రత మరియు ఉద్గార నిబంధనలను అనుసరిస్తూ ఈ వాగన్ ఆర్ వాహనం రూపుదిద్దుకుంది. సహజంగానే, దాని ప్రాధమిక విలువలతో మాత్రమే నిర్మించబడినా దాని ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా ఆల్ రౌండర్‌గా మారేందుకు మారుతి ఇటీవలే, మూడవ-తరం వాగన్ ఆర్ 2019ను స్వల్ప మార్పులతో తీసుకొచ్చింది.
బాహ్య
సుజుకి సంస్థ, తన హార్ట్క్ మాడ్యులర్ వేదిక ద్వారా తాజా వెర్షన్లో మూడవ-తరం వాగన్ ఆర్ ను తీసుకుని వచ్చింది. ఈ కొత్త ప్లాట్‌ఫాం, వాగన్ ఆర్ ను మరింత విస్తృతమైనదిగా నిర్మించింది మరియు దాని యొక్క పరిమాణ పెరుగుదల మొదటి చూపులోనే చాలా స్పష్టంగా కనబడింది.
చెప్పినట్లు, దీన్ని నవీకరించారు. అదే విధంగా, మారుతి సుజుకి వాగన్ ఆర్ డిజైన్ ఏమాత్రం పాడు చెయకుండా మరింత అందంగా కనబడుతుంది. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ ఒక టాల్ బాయ్ గా కొనసాగుతోంది, ఈ వాహనంలో లోపలకి ప్రవేశించేందుకు మరియు నిష్క్రమణకు చాలా సులభతరం చేస్తుంది, అంతేకాకుండా మునుపటి వెర్షన్ తో పోలిస్తే, ఈ వాహనానికి పుష్కలమైన హెడ్రూంను ఇవ్వడం జరిగింది. అలాగే, కొత్త శాంత్రో వలె కాకుండా, వాగన్ఆర్ టాల్ బాయ్ లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా అందించింది. శాంత్రో కొత్త తరం వాహనం యొక్క డిజైన్ ఐ10 యొక్క పరిణామం కంటే మరింత అద్భుతంగా కనిపిస్తుంది. 2019 వాగన్ ఆర్ కు పెద్ద పెద్ద విండోస్ అందించడం వలన క్యాబిన్లో మరింత గాలి వచ్చేందుకు వీలుగా రూపొందించబడింది. కొత్త వాగన్ ఆర్, అసలు రూపకల్పన విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది మరియు బాక్సింగ్గా కొనసాగుతున్నప్పటికీ, అది భర్తీ చేసిన మోడల్ కంటే చాలా వరకు తాజాగా కనిపిస్తోంది.
మారుతికి వాగన్ ఆర్ యొక్క ముందు భాగంలో వెడల్పు పెరగడం కారణంగా మరింత చదునుగా అందంగా కనబడుతుంది. ఈ వాహనానికి అందించిన ముందు భాగంలో దీర్ఘచతురస్రాకార గ్రిల్ క్రింది భాగంలో వెడల్పుగా ఆకట్టుకునే విధంగా అమర్చబడి ఉంటుంది. అల్గాగే దానిపై భాగంలో ప్రామాణిక క్రోమ్ గ్రిల్ వంటివి మరింత మెరుగులు దిద్దుకున్నాయి. ఈ గ్రిల్ కు ఇరువైపులా హెడ్‌ల్యాంప్స్ ముందు కన్నా మరింత అందంగా రూపుదిద్దుకున్నాయి మరియు దీనిలోనే టాటా టియగో మినహా మిగిలిన అన్ని పోటీ వాహనాల మాదిరిగా రెగ్యులర్ మల్టీ-రిఫ్లెక్టార్ యూనిట్లను కలిగి ఉంటాయి, దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లో ప్రొజెక్టార్ యూనిట్లు అందించబడ్డాయి. ఇక్కడ భాదాకరమైన విషయం ఏమిటంటే, కొత్త అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ లో, పాత మోడల్ దిగువ శ్రేణి వేరియంట్ అయిన విఎక్స్ఐ స్టింగ్రే వేరియంట్లో అందించిన ద్వంద్వ-బ్యారెల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను వలె కాకుండా దీనిలో అందించడం లేదు. మారుతి సుజుకి యొక్క 'బ్లూ ఐడ్ బాయ్'గా వాగన్ ఆర్ ఇక లేనట్లుగా కనిపిస్తుంది.
ఇక్కడ అర్ధం చేసుకున్నది ఏమిటంటే, వాగన్ ఆర్ వాహనాన్ని లక్షణాల పరంగా చెప్పిన దాని కంటే మరింత అద్భుతంగా ఉంటుంది. టాటా టియాగో, విశ్వవ్యాప్తంగా ఆకట్టుకునే డిజైన్ ఉన్న వాగన్ ఆర్ కంటే మరింత సమర్థవంతమైనది. అయితే, చాలా వరకు, స్టైలింగ్ క్విర్కీ అని పిలవలేము, కానీ ఆకర్షణీయంగా ఉంది.
ముందు తరాల వాగన్ ఆర్ వాహనాలు అన్నీ, చూడడానికి ఎల్లప్పుడూ అందంగా సాదా-గానే ఉండేవి. మూడవ-తరం మోడల్, చక్రం వంపులలో ప్రముఖమైన ముడతలు ఉన్నందున అసాధారణమైనదిగా కనిపిస్తోంది. అంతేకాకుండా, కొత్త హ్యాచ్‌బ్యాక్ ఒక సూక్ష్మ అలాగే ఇంకా గుర్తించదగిన ఒక వేస్ట్లైన్ ను పొందుతుంది. ఈ మార్పులు, పాత మోడల్ లాగా సాదాగా కాకుండా కనిపిస్తుంది మరియు కొత్త హాచ్బాక్ను బాహ్యభాగం పరంగా జాజ్ ను గుర్తుచేస్తుంది. తాజా ధోరణి విషయానికి వస్తే, మారుతున్న మారుతి సుజుకి ప్లాంట్‌లో ఈ వాహనానికి సి-పిల్లార్ నలుపు రంగును కలిగి ఒక ఫ్లోటింగ్ రూఫ్ ప్రభావాన్ని సృష్టించింది. ఈ వాహనం ఎంపిక చేసుకోవడానికి, అనేక అధునాతన కొత్త రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి వరుసగా, క్లాసిక్ మాగ్మా గ్రే, ప్రముఖమైన సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్, పేలవమైన జాజికాయ బ్రౌన్ మరియు ప్రకాశవంతమైన నీలం వంటి రంగులు వినియోగదారుడు ఎంపిక చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి.
కొత్త వాహనం యొక్క టైర్ల విషయానికి వస్తే, విస్తృతంగా మరియు మందంగా అందించబడ్డాయి. అయితే, ప్రతికూలతల విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో కూడా శాంత్రో వలె అల్లాయ్ చక్రాలు అందించబడలేదు. అయొతే అధనంగా ఒక్కోదానికి, 4900 రూపాయిలను చెల్లించినట్లైతే అల్లాయ్ చక్రాలను ఆప్షనల్ గా పొందవచ్చు. అయితే కారు మొత్తానికి క్లాడింగ్ ఆప్షనల్ గా అందించబడుతున్నాయి, ఇది ఒక ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు. దీని వలన కొత్త వాగన్ ఆర్ వాహనానికి, ఒక ప్రత్యేకమైన లుక్ వస్తుంది.
ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ముందు వలె వెనుక కూడా చదునుగా కనిపిస్తుంది. అయితే, మునుపటి మోడల్‌తో పోలిస్తే వెనుక విండ్ స్క్రీన్ కొద్దిగా నవీకరించబడింది. బూట్ మూతకు, మధ్య భాగంలో నెంబరు ప్లేట్ చోటు చెసుకుంది, అయితే టైల్ లాంప్లు వోల్వో వాహనాలలో కనిపించే వాటిని ప్రేరేపిస్తాయి.
పాత నమూనా వలె కాకుండా, కొత్త వాగన్ ఆర్ వాహనం దాని వెనుక బంపర్ కు ఫాగ్ ల్యాంప్‌లను కలిగి లేదు. మారుతికి చెందిన మిగిలిన కొత్త కార్ల లాగా, వెనుకవైపు సుజుకి లోగో తప్ప, ఎటువంటి బ్యాడ్జ్‌లు లేవు.
బాహ్య భాగాల పొలికలు
టాటా టియాగో | హ్యుందాయ్ శాంత్రో | మారుతి వాగన్ ఆర్ | డాట్సన్ గో | |
పొడవు (మిల్లీ మీటర్లు) | 3746 | 3610 | 3655 | 3788 |
వెడల్పు (మిల్లీ మీటర్లు) | 1647 | 1645 | 1620 | 1636 |
ఎత్తు (మిల్లీ మీటర్లు) | 1535 | 1560 | 1675 | 1507 |
గ్రౌండ్ క్లియరెన్స్ (మిల్లీ మీటర్లు) | 170 | - | - | 180 |
వీల్‌బేస్ (మిల్లీ మీటర్లు) | 2400 | 2400 | 2435 | 2450 |
వాహనం బరువు (కిలోలలో) | 1012 | - | 845 | - |
బూట్ పరిమాణ పొలికలు
డాట్సన్ గో | మారుతి వాగన్ ఆర్ | టాటా టియాగో | హ్యుందాయ్ శాంత్రో | |
పరిమాణం | 265-లీటర్లు | 341 లీటర్లు | 242-లీటర్లు | 235 లీటర్లు |
వినోద వ్యవస్థ
మూడవ-తరం వాగన్ ఆర్, మారుతి స్మార్ట్‌ప్లే స్టూడియోకి చెందిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు హర్మాన్ ఆధారిత ఏహెచ్ఏ రేడియో లతో సహ మీ స్మార్ట్‌ఫోన్ లో ఉన్న యాప్ తో పాటు వివిధ పనులకు మద్దతిసుంది. (ఆహా రేడియో, వెబ్ నుండి వ్యక్తిగతీకరించిన, ప్రత్యక్ష మరియు ఆన్ డిమాండ్ రేడియో స్టేషన్ లోకి మనకు ఇష్టమైన కంటెంట్‌ను నిర్వహిస్తుంది), అంతేకాకుండా మ్యాప్ మై ఇండియా నావిగేషన్, మరియు మరిన్ని అంశాలకు మద్దతు ఇస్తుంది.
ఈ యూనిట్, ఒక కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ (స్మార్ట్‌ఫోన్ లాంటిది) మరియు ఒక సాధారణ టైల్-టైప్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. సాధారణ కాంతిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ కొత్త హర్మాన్-ఆధారిత యూనిట్ క్రమంగా కొత్త మారుతి కార్లలో, మునుపటి బోష్-ఆధారిత వ్యవస్థను భర్తీ చేస్తుంది.
అంతర్గత
ఈ వాహనానికి అందించిన దాని టాల్‌బాయ్ రూపకల్పనకు ధన్యవాదాలు, ముందుగా అంతర్గత భాగం విషయానికి వస్తే, కొత్త వాగన్ ఆర్ లోపలికి వేళ్ళేందుకు మరియు బయటకు వచ్చేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఇది ప్రయాణికులకు ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. ఈ వాహనం యొక్క డోర్లను దాదాపు 90 దిగ్రీల వద్ద సౌకర్యవంతంగా తెరవవచ్చు.
కొత్త వాగన్ ఆర్ యొక్క ముందు భాగం విషయానికి వస్తే, దాని డాష్‌బోర్డ్ పూర్తిగా పునఃరూపకల్పన చేయబడింది మరియు ద్వంద్వ-టోన్ నలుపు అలాగే లేత గోధుమరంగు లేఅవుట్‌తో వెండి చేరికలతో అందంగా రూపొందించబడింది. స్టీరింగ్ వీల్ అనేది ఇగ్నిస్ నుండి నేరుగా కొనుగోలుదారుల ముందుకు వచ్చింది, కానీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లాగా లెదర్ ను పొందలేదు. సెంటర్ కన్సోల్‌లో, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ వ్యవస్థ, భారతదేశంలో వాగన్ ఆర్ లోనే మొదటిసారిగా ఇవ్వబడింది. ఈ టచ్‌స్క్రీన్ కు ప్రక్కన, నిలువుగా ఉండే సెంట్రల్ ఏసి వెంట్ లను చూడవచ్చు. దీని మాన్యువల్ నియంత్రణలు టచ్‌స్క్రీన్ క్రింది భాగంలోనే అమర్చబడి ఉంటాయి.
సీట్ల విషయానికి వస్తే, బూడిద రంగు మరియు లేత గోధుమ రంగు కలయికతో గోధుమ రంగు హైలైట్లతో లెధర్ అపోలిస్ట్రీ ఇవ్వబడింది. తేలికైన అపోలిస్ట్రీ, ద్వంద్వ టోన్ రంగులు మరియు పుష్కలమైన హెడ్ రూం వంటి అంశాలు క్యాబిన్ కు మంచి అనుభూతిని అందిస్తాయి. ముందు సీట్లు వెనుక వైపు లుంబార్ మద్దతు ఉండటం వలన సౌకర్యవంతంగా ఉంటాయి. మునుపటి-తరం మోడల్ లో చూసినట్టుగా ఈ కొత్త వాహనంలో కూడా డ్రైవర్ పక్క సీటు క్రింద ఒక నిల్వ కంపార్ట్మెంట్ ఇవ్వబడింది.
మరోవైపు వెనుక ఉన్న సీట్ల విషయానికి వస్తే, సగటు పరిమాణం కలిగిన ప్రయాణీకులకు కూడా తొడ మద్దతు ఇవ్వడం జరగలేదు. కానీ వెనుక రూమ్ కావలసిన దానికంటే ఎక్కువ ఇవ్వబడింది మరియు ఇది విభాగంలో ఉత్తమం అని చెప్పవచ్చు. పెరిగిన వెడల్పు కారణంగా, మునుపటి తరం మోడల్ తో పోలిస్తే ఈ కొత్త వాగన్ ఆర్ లో మధ్య వెనుక ప్రయాణీకుడు చాలా సౌకర్యవంతంగా ప్రయాణించగలడు.
డిక్కీ విషయానికి వస్తే, 341 లీటర్ల బూట్ స్థలంతో, ఈ కొత్త వాగన్ ఆర్ దాని ప్రత్యర్థుల కంటే చాలా ఎక్కువ విశాలమైనది, అలాగే దానికి పైన ఉండే విభాగంలో అనేక కార్ల కంటే కూడా చాలా విశాలంగా ఉంటుంది. నిజానికి, ఇది విటారా బ్రజ్జా (328-లీటర్లు) మరియు బాలెనో (339-లీటర్లు) కంటే కూడా బారీ డిక్కి స్థలాన్ని పొందింది. ఇది 340 లీటర్ల బూట్ స్థలాన్ని కలిగి ఉన్న ఈ కొత్త వాగన్ ఆర్, ఉప-4 మీటర్ల కార్లలో చేర్చబడింది. ఈ శ్రేష్టమైన జాబితాలో ఉన్న ఇతర కార్ల బూట్ స్థలం విషయానికి వస్తే, నెక్సాన్ (350 లీటర్లు), హోండా జాజ్ (354 లీటర్లు) మరియు డబ్ల్యూఆర్-వి (363 లీటర్లు) ఉన్నాయి. విస్తృత మరియు సర్దుబాటయ్యే బూట్ స్థలం అలాగే 60:40 స్ప్లిట్ మడత వెనుక సీట్లు అందించిన మారుతి సంస్థకు ధన్యవాదాలు చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ కొత్త వాగన్ ఆర్, మీ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను విమానాశ్రయం చేరుకోవటానికి కావలసిన సామర్థ్యం కంటే ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది.
వాగన్ ఆర్ యొక్క అంతర్గత పరంగా కొంచెం లోపం ఉన్నదని చెప్పవచ్చు, అంతేకాకుండా అవసరమైన కొన్ని సమర్థతా సమస్యలు కూడా లోపలి భాగంలో ఉన్నాయి. మొదట విషయం ఏమిటంటే వాగార్ ఆర్ లో, సర్ధుబాటు హెడ్ రెస్ట్లు లేవు. సుదీర్ఘమైన ప్రయాణాలలో డ్రైవర్ మరింత సౌకర్యవంతంగా డ్రైవ్ చేయడానికి కనీసం డ్రైవర్ సీటుకైనా సర్దుబాటు చేయగల హెడ్ రెస్ట్లు అందించి ఉంటే బాగుండేది. ప్రస్తుతం మారుతి సంస్థ వారు, ఆరు అడుగుల పొడవు కన్నా తక్కువగా ఉన్న వ్యక్తికి కూడా మెడకు సరిగ్గా మద్దతు ఇవ్వలేదు.
మారుతి సంస్థ డ్రైవర్ సౌకర్యార్ధం, ఎత్తు సర్ధుబాటు స్టీరింగ్ వీల్ అందించింది కానీ, డ్రైవర్ సీటు కోసం ఎత్తు సర్దుబాటును విస్మరించింది. ఇది కనీసం అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ లో కూడా అందించలేదు. హ్యుందాయ్ శాంత్రో కూడా ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీట్ ను విస్మరించింది, కానీ టాటా టియాగో మరువలేదు. క్యాబిన్ వెనుక భాగం విషయానికి వస్తే, వెనుక తలుపులకు ఇవ్వబడిన చేతి రెస్ట్ చిన్నగా ఉంటుంది, పెద్దవారి విషయంలో, వెనుకవైపు ఉన్న విండోల నియంత్రణను యాక్సిస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.
చిన్న చిన్న సమస్యలు కాకుండా, క్యాబిన్ లోపల మొత్తం ముగింపు రెండవ తరం మోడల్ కు ఒక అడుగు పైనే ఉన్నదని భావించవచ్చు. మరియు కొత్త వాగన్ ఆర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.
భద్రత
మూడవ తరం వాగన్ ఆర్, డ్రైవర్ ఎయిర్బాగ్, ఏబిఎస్ తో ఈబిడి మరియు వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి అంశాలు ప్రామాణికంగా అందించబడుతున్నాయి. ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ వేరియంట్ విషయానికి వస్తే, సహ-డ్రైవర్ ఎయిర్బాగ్ను అలాగే ప్రిటెన్షినార్లు మరియు లోడ్ పరిమితులను కలిగి ఉండే ముందు సీటు బెల్ట్‌లు వంటి అంశాలు అధనంగా జోడించబడతాయి. ఈ రెండు క్రియాశీల భద్రతా లక్షణాలు ఎల్ మరియు వి వేరియంట్లలో ఆప్షనల్‌గా అదనంగా అందుబాటులో ఉన్నాయి.
ప్రదర్శన
మూడవ తరం వాగన్ ఆర్ అనేది, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఎంపికలతో కూడిన పెట్రోల్ ఇంజిన్ చే జత చేయబడి ఉంటుంది. ఈ వాగన్ ఆర్ వాహనం, ఇప్పటికే ఉన్న 1.0-లీటర్, 3-సిలిండర్ ఇంజిన్ తో అందుబాటులో ఉన్నప్పటికీ, మరింత శక్తివంతమైన 1.2 లీటర్, 4-సిలిండర్ మోటార్ కూడా ఈ కొత్త వాహనంలో అందుభాటులో ఉంది. ఈ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. మారుతి లో ఉన్న స్విఫ్ట్ మరియు బాలెనో వంటి భారీ హాచ్బాక్లలో అందించబడిన అదే 1.2 లీటర్ ఇంజన్ దీనిలో కూడా అందించబడింది.
పాత మోడల్లో ఉన్న 1.0 లీటర్ ఇంజిన్‌ను, 1.2 లీటర్ ఇంజిన్ తో పోలిస్తే, మొత్తం టార్క్‌లో 23ఎన్ఎం మెరుగైన టార్క్ ను అలాగే అత్యధికంగా 15పిఎస్ పవర్ ను అదనంగా అందిస్తుంది. పాత వాహనం కంటే ఈ కొత్త వాగన్ ఆర్ బరువు 50 కిలోల వరకు తగ్గిపోయింది, ఈ కొత్త వాహనంలో అందించబడిన 1.2 లీటర్ ఇంజిన్, మునుపటి మోడల్‌తో పోల్చి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. 1.2 లీటర్ ఇంజన్ 15-20కెఎంపిహెచ్ నుండే డౌన్‌షిఫ్ట్ అవసరం లేకుండానే మూడవ గేర్‌లో అత్యధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వాహనం యొక్క పోటీ వాహనాలైన వాటిలో ఇవ్వబడిన ఇంజన్ ను దీనిలో జత చేసినప్పటికీ, క్యాబిన్ లోపల ఇంజిన్ శబ్ధం వినిపిస్తుంది. దీనికి గల కారణం, తగినంత ఇన్సులేషన్ లేకపోవడం వలన కావచ్చు.
రైడ్ మరియు నిర్వహణ
మూడవ-తరం వాగన్ ఆర్ యొక్క రైడ్ నాణ్యత, రెండో-తరం మోడల్ మీద మరింత మెరుగుపడింది. ఈ కొత్త వాహనం, కొత్త గట్టి చట్రం, విస్తృత టైర్లు మరియు సాపేక్షంగా మృదువైన సస్పెన్షన్ సెటప్‌కు కొంచెం తక్కువగా ఉంటుంది. ముందుగా కాకుండా, ప్రయాణ సమయంలో మరింత కుదుపులు ఉండవు. 3-సిలిండర్ ఇంజిన్ తో ఉన్న పాత మోడల్‌తో పోలిస్తే, నాలుగు-సిలెండర్ ఇంజిన్ తక్కువ స్పందనలను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కొత్త వాహనంలో అందించబడిన స్టీరింగ్ వీల్, నగరాలలో వేగంతో వెళ్ళినప్పుడు భారీ స్థాయిలో ఉంటుంది మరియు అదే విధంగా కొంచెం అస్పష్టంగా కూడా ఉంటుంది. స్టీరింగ్ వీల్ మరింత మంచి అనుభూతిని కలిగి ఉంటే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. ముందు చక్రం పాక్షికంగా కప్పబడి ఉంటుంది అయితే, వెనుక చక్రానికి ఏ రకమైన క్లాడింగ్ లేదు. అందువల్ల, చక్రాల శబ్ధం లోపలి క్యాబిన్లో మరింత స్పష్టంగా వినిపిస్తుంది. ఈ తగినంత క్లాడింగ్ కలిగి ఉంటే, రైడ్ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో ఇదే విభాగంలో ఉన్న ఇతర పోటీ వాహనాలతో ఎదుర్కొనే సామర్ధ్యం లేదు.
వాగన్ ఆర్, ప్రయాణ సమయంలో పదునైన మలుపులు కారణంగా అయిష్టంగా ఉంటుంది. అంతేకాకుండా, దాని ఎత్తు మరియు మృదువైన సస్పెన్షన్ సెటప్ కారణంగా అనుభూతి పాక్షికంగా ఉంటుంది. ఇదే విభాగంలో ఇతర కార్లు వలె, ఇది సున్నితమైన పద్ధతిలో నడుపబడేందుకు కష్టపడుతుంది.
నగరాలలో ఇటువంటి పద్ధతిలో నడుపగానే, వాగన్ఆర్ కొత్త పెప్పీ 1.2 లీటర్ మోటర్ మరియు అద్భుతమైన రైడ్ నాణ్యతతో మంచి రైడ్ అనుభూతిని ఇవ్వగలుగుతుంది. వాగన్ ఆర్ యొక్క తక్కువ టర్నింగ్ వ్యాసార్థం కారణంగా నగరంలో ట్రాఫిక్‌ను సులభంగా ఎదుర్కోగలుగుతుంది మరియు ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ సమయంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
పనితీరు పొలికలు (పెట్రోల్)
మారుతి వాగన్ ఆర్ | డాట్సన్ గో | టాటా టియాగో | హ్యుందాయ్ శాంత్రో | |
శక్తి | 81.80బిహెచ్పి@6000ఆర్పిఎం | 67బిహెచ్పి@5000ఆర్పిఎం | 84బిహెచ్పి@6000ఆర్పిఎం | 68బిహెచ్పి@5500ఆర్పిఎం |
టార్క్ ( ఎన్ఎం) | 113ఎన్ఎం@4200ఆర్పిఎం | 104ఎన్ఎం@4000ఆర్పిఎం | 114ఎన్ఎం@3500ఆర్పిఎం | 99ఎన్ఎం@4500 ఆర్పిఎం |
ఇంజిన్ సామర్ధ్యం (సిసి) | 1197 | 1198 | 1199 | 1086 |
ట్రాన్స్మిషన్ | మాన్యువల్ | మాన్యువల్ | మాన్యువల్ | మాన్యువల్ |
అగ్ర వేగం (కెఎంపిహెచ్) | - | 150 కెఎంపిహెచ్ | 150 కెఎంపిహెచ్ | 162కెఎంపిహెచ్ |
0-100 త్వరణం (సెకన్లు) | 18.6 సెకన్లు | 13.3 సెకన్లు | 14.3 సెకన్లు | 15.23 సెకన్లు |
వాహన బరువు (కిలోలు) | 835కిలోలు | - | 1012కిలోలు | - |
ఇంధన సామర్ధ్యం (ఏఆర్ఏఐ) | 21.5కెఎంపిఎల్ | 19.83కెఎంపిఎల్ | 23.84కెఎంపిఎల్ | 20.3కెఎంపిఎల్ |
శక్తి బరువు నిష్పత్తి | 97.96 బిహెచ్పి/టన్ | - | 83.00 బిహెచ్పి/టన్ | - |
వేరియంట్లు
మూడవ-తరం వాగన్ ఆర్, మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఎల్, వి మరియు జెడ్. ముందుగా దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎల్ వేరియంట్ లో చిన్న 1.0- లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉండగా, కొత్త 1.2-లీటర్ మోటర్ అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ లో అందించబడుతుంది. మరోవైపు మధ్యస్థ వేరియంట్ అయిన వి విషయానికి వస్తే, రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
వెర్డిక్ట్
“కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్, ప్రతి అంశంలోనూ అభివృద్ధి చెందింది, ఇది భద్రత, పనితీరు, లక్షణాలు అలాగే రూపకల్పన పరంగా కూడా నవీకరించబడింది."
కొత్త డిజైన్ అంత అద్భుతంగా ఏమి లేదు, అయితే మారుతి కొత్త వాహనం, మునుపటి నమూనా వలె కనిపించడం లేదని నిర్ధారించింది. ఈ వాహనానికి జనాదరణ పెరగడంతో నమూనా కూడా నవీకరించబడింది.
మూడవ తరం వాగన్ ఆర్, మారుతి దాని ప్రాముఖ్యతను మరోసారి చూపించింది. విశాలమైన క్యాబిన్ మరియు భారీ బూట్ కారణంగా ఈ వాహనానికి జనాదరణ పెరిగింది. మరో విషయం ఏమిటంటే, ఇది మరింత శక్తివంతమైన ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది.
కొత్త వాగన్ ఆర్ వెనుక సీట్ల విషయానికి వస్తే మరీ అంత ఖచ్చితమైనది కాదు అని చెప్పవచ్చు. కానీ ఇంతకుముందెన్నడూ లేనంత దృడంగా మరియు ఇతర ప్రత్యర్థులతో సవాలు చేయటానికి సిద్ధంగా ఉంది. మరియు ధరల పెంపు ఈ ఒప్పందాన్ని మరింత తీసివేసింది.
మారుతి వాగన్ ఆర్ 2013-2022 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
- మనకు నచ్చిన విషయాలు
- మనకు నచ్చని విషయాలు
- లభ ప్రవేశం మరియు నిష్క్రమణ: మీరు బాగా వంగి లోనికి ప్రవేశించవలసిన అవసరం లేదు మరియు వాగన్ ఆర్ నుండి బయటకు రావడం కూడా చాలా సులభం.
- విశాలమైన క్యాబిన్: వెలుపలి కొలతలు మరియు వీల్‌బేస్ పెరుగుదల కారణంగా లోపలి కాబిన్ స్థలం మరింత విశాలానికి దారితీసింది.
- భారీ బూట్: 341-లీటర్ బూట్ స్పేస్ తో దాని సెగ్మెంట్లో గరిష్టంగా ఉంది. నిజానికి, ఈ వాహనాన్ని, దీని పైన విభాగంలో ఉన్న వాహనాలతో కంటే కూడా పోల్చదగినది లేదా పెద్దదిగా ఉంటుంది. 3-4 మీడియం సైజు సంచులు సులభంగా అమర్చవచ్చు. అంతేకాకుండా మరింత స్థలాన్ని ఇవ్వడం కోసం వెనుక సీటుకు 60:40 స్ప్లిట్ సౌకర్యం జోడించబడింది.
- రెండు ఇంజిన్లలో ఆటోమేటిక్ ఆప్షన్: ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ సౌలభ్య స్థాయిని మరింత పెంచుతుంది అంతేకాకుండా కారు నడపడానికి సులభమైనది. ఈ ఎంపిక, వి మరియు జెడ్ వేరియంట్లలో లభిస్తుంది మరియు రెండు ఇంజిన్లతోనూ లభిస్తుంది.
- భద్రత: ఏబిఎస్ ప్రామాణికంగా అందించబడుతుంది, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ అన్ని వేరియంట్ లలో అప్షనల్గా అందించబడతాయి. ఈ కొత్త నవీకరించబడిన వాహనం ముందు కంటే కూడా దృడంగా ఉంది.
- ప్లాస్టిక్ నాణ్యత: క్యాబిన్‌లోని మెటీరియల్స్ నాణ్యత మరింత మెరుగుపర్చవలసిన అవసరం ఉంది. నాణ్యతలో క్రమబద్ధత కూడా ఒక ఆందోళనకర విషయం అని చెప్పవచ్చు.
- ప్రస్తుతం, సిఎన్జి లేదా ఎల్పిజి ఎంపికలు లేవు.
- స్పాంజి బ్రేక్‌లు: మంచి పెడల్ స్పందన ఉండవల్సిన అవసరం ఉంది.
- కోల్పోయిన లక్షణాలు: సర్దుబాటు వెనుక హెడ్ రెస్ట్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, వెనుక పార్కింగ్ కెమెరా మరియు అల్లాయ్ చక్రాలు వంటి అంశాలు కనీసం అగ్ర శ్రేణి వేరియంట్ లోనైనా అందించవలసిన అవసరం ఉంది.
- బలహీనమైన క్యాబిన్ ఇన్సులేషన్: ఎన్విహెచ్ స్థాయిలు అత్యుత్తమంగా లేవు - క్యాబిన్లోకి, చాలా భయంకరమైన ఇంజిన్ శబ్దం వస్తుంది.
మారుతి వాగన్ ఆర్ 2013-2022 car news
- తాజా వార్తలు
- Must Read Articles
- రోడ్ టెస్ట్
మారుతి, మహీంద్రా, టయోటా, కియా, MG మోటార్ మరియు స్కోడా అమ్మకాలలో వృద్ధిని సాధించగా, హ్యుందాయ్, టాటా, వోక్స్వాగన్ మరియు హోండా వంటి కార్ల తయారీదారులు తిరోగమనాన్ని చూశారు.
BS6 అప్‌గ్రేడ్‌తో ఫ్యుయల్ ఎఫిషియన్సీ కిలోకు 1.02 కి.మీ తగ్గింది
ధరల పెరుగుదల ఐదు అరేనా మోడళ్లకు మరియు రెండు నెక్సా సమర్పణలకు వర్తిస్తుంది
మేడ్ ఇన్ ఇండియా కారు మాత్రమే ఈ తరగతిలో పూర్తి మార్కులు సాధించగలిగింది
గత వారం నుండి విలువైన ప్రతి కారు వార్తలు మీ దృష్టికి తెచ్చేందుకు ఇక్కడ ఉంచాము
కొత్త వాగన్ ఆర్ మూడు రకాల వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఎల్, వి, జెడ్; ఇవి రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది
నేను చాలా కాలంగా దీన్ని దీర్ఘకాలిక పరీక్షా కారుగా ఎంచుకోలేదు. కారణం ఈ క్రింది ఉంది
సరికొత్త డిజైర్ ఇప్పుడు స్ఫూర్తి కోసం స్విఫ్ట్ వైపు చూడడం లేదు. మరియు అది అన్నింటి పరంగా బిన్నంగా ఉంది
ఇది దాని కొత్త ఇంజిన్‌తో కొంత శక్తిని కోల్పోయినప్పటికీ, ఫీచర్ జోడింపులు మరియు డ్రైవ్ అనుభవం దీనిని మెరుగైన...
2024 స్విఫ్ట్ పాత వ్యక్తి యొక్క మనోహరమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ, కొత్తగా అనుభూతి చెందడానికి ఎంత మార్చాలో న...
మారుతి డిజైర్ మీ కుటుంబం యొక్క తదుపరి కాంపాక్ట్ సెడాన్ కావడానికి దాదాపు అన్ని సరైన అంశాలను టిక్ చేస...
మారుతి వాగన్ ఆర్ 2013-2022 వినియోగదారు సమీక్షలు
- All (1431)
- Looks (360)
- Comfort (500)
- Mileage (449)
- Engine (227)
- Interior (175)
- Space (365)
- Price (209)
- మరిన్ని...
- తాజా
- ఉపయోగం
- Verified
- Critical
- The Car Looks Good In
The car looks good in white colour car have decent build quality , performance of the car is also good and the engine is almost silent and milage of the car is goodఇంకా చదవండి
- Ownership Review Of My WagonR.
Ownership Review Of My WagonR. I Would Like To Say That The Car Is Pretty Basic, Like Basic Features And Everything.Running Is Not That Much It Has Barely Crossed 7000 Kms Till Now. But There Are Issues In My Car That Needs To Be Fixed By Maruti. Like Sometimes The Infotainment System Of My Car Freezes And If Wireless Android Auto And Apple CarPlay Is Available In WagonR Then I Would Request That Maruti Should Add Wireless Android Auto In My Car.ఇంకా చదవండి
- It's Good కోసం Family Space
It's good for family space an all , performance is mid ranged but good in milage an all so if your planning to have small intercity travelling petrol car wagonr is go to carఇంకా చదవండి
- My Car ఐఎస్ Very Valuable కోసం Money
Very good car it doesn't have any problems since 9 years of my experience I love my car it's performance is very much great i love my car 🚗 thank youఇంకా చదవండి
- Good Car కోసం Everyone
I have a top model Zxi but don't have a parking camera. I tried many times to install a parking camera but was not successful. Must upgrade the parking camera in Zxi 2019 model.ఇంకా చదవండి
వాగన్ ఆర్ 2013-2022 తాజా నవీకరణ
కడాపటి నవీకరణ: మారుతి బిఎస్ 6 వాగన్ఆర్ సిఎన్‌జిని విడుదల చేసింది. దాని గురించి ఇక్కడ మరింత చదవండి.
మారుతి వాగన్ఆర్ ధర మరియు వైవిధ్యాలు: కొత్త వాగన్ఆర్ ధర రూ .4.45 లక్షల నుండి 5.94 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇది ఎల్, వి మరియు ఝడ్ అనే మూడు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ఎలా విభిన్నంగా ఉన్నాయో తెలుసుకోవడానికి, వేరియంట్ వారీగా ఉన్న లక్షణాలను ఇక్కడ చదవండి.
మారుతి వాగన్ఆర్ ఇంజిన్లు మరియు ట్రాన్స్మిషన్లు: మారుతి వాగన్ఆర్ ను రెండు బిఎస్ 6-కాంప్లైంట్ ఇంజన్లతో అందిస్తోంది: 1.0-లీటర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ యూనిట్. 1.2-లీటర్ ఇంజన్ 83 పిఎస్ పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, సాధారణ 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 68 పిఎస్ మరియు 90 ఎన్ఎమ్ లకు మంచిది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్‌ల ఎంపికతో అందించబడతాయి. కొత్త వాగన్ఆర్ 1.0-లీటర్ వెర్షన్లో సిఎన్జి వేరియంట్లో కూడా అందించబడుతుంది.
మారుతి వాగన్ఆర్ సేఫ్టీ ఫీచర్స్: ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఎబిఎస్ విత్ ఇబిడి, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ప్రామాణిక భద్రతా లక్షణాలతో వస్తుంది. కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌తో పాటు ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లతో పాటు ప్రిటెన్షనర్లు మరియు లోడ్ లిమిటర్లు టాప్-స్పెక్ ఝడ్ వేరియంట్‌కు పరిమితం చేయబడ్డాయి మరియు ఎల్ మరియు వి వేరియంట్లలో ఐచ్ఛికంగా ఇస్తున్నారు.
మారుతి వాగన్ఆర్ లక్షణాలు: కొత్త వాగన్ఆర్ 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, మాన్యువల్ ఎసి, మొత్తం నాలుగు పవర్ విండోస్ మరియు ఎలక్ట్రికల్ సర్దుబాటు మరియు ఫోల్డబుల్ ఒఆర్విఎం లను కలిగి ఉంది. ఇంకా ఏమిటంటే, మారుతి హ్యాచ్‌బ్యాక్‌తో రియర్ వాషర్ మరియు వైపర్ విత్ డీఫాగర్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు మరియు ఫ్రంట్ ఫాగ్ లాంప్స్‌ను కూడా అందిస్తుంది.
మారుతి వాగన్ఆర్ ప్రత్యర్థులు: కొత్త వాగన్ఆర్ హ్యుందాయ్ సాంట్రో, టాటా టియాగో, డాట్సన్ గో, మరియు మారుతి సుజుకి సెలెరియో వంటి వాటికి ప్రత్యర్థి.
మారుతి వాగన్ ఆర్ 2013-2022 చిత్రాలు
మారుతి వాగన్ ఆర్ 2013-2022 20 చిత్రాలను కలిగి ఉంది, వాగన్ ఆర్ 2013-2022 యొక్క చిత్ర గ్యాలరీని వీక్షించండి, ఇందులో హాచ్బ్యాక్ కారు యొక్క బాహ్య, అంతర్గత & 360 వీక్షణ ఉంటుంది.
మారుతి వాగన్ ఆర్ 2013-2022 అంతర్గత
మారుతి వాగన్ ఆర్ 2013-2022 బాహ్య
Ask anythin g & get answer లో {0}
ప్రశ్నలు & సమాధానాలు
A ) Maruti Suzuki Wagon R has a kerb weight of 830-845kg, and a gross weight of 1340...ఇంకా చదవండి
A ) For the availability and waiting period, we would suggest you to please connect ...ఇంకా చదవండి
A ) Maruti offers Wagon R in CNG variant with the 1-litre engine (59PS/78Nm), paired...ఇంకా చదవండి
A ) As of now, there is no official update available from the brand's on the same. W...ఇంకా చదవండి
A ) Maruti Wagon R CNG LXI Opt retails at ₹ 6.19 Lakh (ex-showroom, Delhi). You may ...ఇంకా చదవండి