కొత్త మారుతి వాగన్ ఆర్ 2019: వేరియంట్ల వివరాలు
మారుతి వాగన్ ఆర్ 2013-2022 కోసం cardekho ద్వారా మార్చి 07, 2019 12:24 pm ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నవీకరణ: ఇక్కడ మా మారుతి వాగన్ ఆర్ యొక్క మొదటి డ్రైవ్ రివ్యూ చదవండి.
మారుతి భారత మార్కెట్లో మూడో తరం వాగన్ ఆర్ రూ. 4.19 లక్షల నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇది మూడు రకాల్లో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఎల్, వి మరియు జెడ్. మొట్టమొదటిసారిగా, మారుతి సుజుకి వాగన్ ఆర్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది: ఒక 1.0 లీటర్ మరియు 1.2 లీటర్. 1.0 లీటర్ ఇంజిన్ ఎల్ మరియు వి రకాల్లో మాత్రమే ఉండగా, 1.2 లీటర్ వి మరియు జెడ్ రకాల్లో లభిస్తుంది. ఎల్ మినహా అన్ని వేరియంట్లలో ఏఎంటి గేర్బాక్స్ తో పాటు రెండు ఇంజిన్లతో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాకుండా అందుబాటులో ఉంటాయి.
ఇప్పుడు మీ బడ్జెట్ తో పాటు మీ అవసరాలకు ఏ వేరియంట్ మరియు ఏ ఇంజిన్ కలయిక సరిపోతుందో చూద్దాం.
వేరియంట్ వివరాలలోకి వేళ్ళే ముందు, రంగు ఎంపికలు మరియు ప్రామాణిక భద్రతా లక్షణాల సెట్ ను చూద్దాం.
రంగు ఎంపికలు:
సిల్కీ సిల్వర్
- మాగ్నా గ్రే
- ఆటుమ్న్ ఆరెంజ్
- జాజికాయ బ్రౌన్
- పూల్సైడ్ బ్లూ
- సుపీరియర్ వైట్
ప్రామాణిక భద్రతా లక్షణాలు:
- డ్రైవర్ వైపు ఎయిర్బాగ్
- ఏబిఎస్ తో ఈబిడి
- ముందు స్థానాలకు సీటు బెల్ట్ రిమైండర్
- రేర్ పార్కింగ్ సెన్సార్లు
- సెంట్రల్ లాకింగ్
మారుతి వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ: ఈ దిగువ శ్రేణి వేరియంట్ ను బడ్జెట్ తక్కువ ఉన్న వారు కోరుకుంటారు.
1.0 మాన్యువల్ ట్రాన్స్మిషన్
ఎల్ఎక్స్ఐ ధర రూ. 4.19 లక్షలు
ఎల్ఎక్స్ఐ (ఓ) - రూ 4.25 (+ రూ 6500)
సేఫ్టీ: ముందు ప్రయాణికుల ఎయిర్బాగ్ (ఆప్షనల్) మరియు ప్రీటెన్షినర్ల మరియు లోడ్ పరిమితి (ఆప్షనల్) తో కూడిన ముందు సీటు బెల్ట్లు.
ఎక్స్టీరియర్ కలర్స్: బాడీ- కలర్ బంపర్స్ మరియు రూఫ్ యాంటెన్నా.
కంఫర్ట్: ముందు వరుస కోసం యాక్ససరీ సాకెట్, ముందు పవర్ విండోస్ మరియు మాన్యువల్ ఏసి.
వీల్స్: 155 / 80 ఆర్13 టైర్ లకు 13- అంగుళాల వీల్స్.
తీర్పు: కొత్త వాగన్ ఆర్ యొక్క బేస్ వేరియంట్ అవుట్గోయింగ్ వాగన్ ఆర్ బేస్తో సమానంగా ఉంటుంది. ప్రాథమిక భద్రతా ఫీచర్లతో పాటు మరిన్ని ఫీచర్లను పొందినందున, కొత్త వాగన్ ఆర్ అవుట్గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ కొనదగినది.
మారుతి అందిస్తున్న కారు -రంగులో ఉండే బంపర్స్, రేర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటివి ప్రామాణికంగా అందించబడతయి, అంతేకాకుండా డిఫోగ్గర్, 2 దిన్ ఆడియో సిస్టమ్, మాన్యువల్ డే / నైట్ ఐఆర్విఎం మరియు వీల్ కవర్లు వంటివి ప్రాథమిక ప్యాకేజీలో భాగంగా అందించబడతాయి.
మీరు మీ కారులో ఒంటరిగా లేదా డ్రైవర్ తో ఎక్కువ సమయం ప్రయాణించినట్లయితే, మీరు ఎల్ఎక్స్ఐ వేరియంట్ కోసం వెళ్ళవచ్చు మరియు దీనినే మేము కూడా సిఫార్సు చేస్తాము. ఒక ప్రయాణికుడితో లేదా ఇంటిలో చాలామందితో మీరు ప్రయాణించేటప్పుడు, ఎల్ఎక్స్ఐ (ఓ) కోసం వెళ్ళమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము, ఎందుకంటే ఇది సహ-ప్రయాణీకుల ఎయిర్బాగ్స్ మరియు సీట్ల బెల్ట్లను ప్రీటెన్షినార్లతో అందించబడుతుంది. ఎల్ఎక్స్ఐ (ఓ) వేరియంట్ రూ .6,500 ధరతో ఎల్ఎక్స్ఐ వేరియంట్ కంటే ఎక్కువగా ప్రీమియం లుక్ తో అందరినీ ఆకర్షిస్తుంది.
అలాగే: 2019 మారుతి బాలెనో ఫేస్ లిఫ్ట్ బుకింగ్స్ వివరాలను కూడా చదవండి
మారుతి వాగన్ ఆర్ విఎక్స్ఐ: దిగువ శ్రణి వేరియంట్ లో అందించిన అన్ని అంశాలను కలిగి ఉంది. ఇది 1.2 లీటర్ ఇంజన్ తో కొనుగోలుకు సరైనదని పరిగణించబడుతుంది.
|
1.0 మాన్యువల్ / 1.0 ఆటోమేటిక్ |
1.2 మాన్యువల్ / 1.2 ఆటోమేటిక్ |
విఎక్స్ఐ |
రూ 4.69 లక్షలు / రూ 5.16 లక్షలు (+రూ 47,000) |
రూ 4.89 లక్షలు / రూ 5.36 లక్షలు (+47,000) |
విఎక్స్ఐ (ఓ) |
రూ 4.75 లక్షలు / రూ 5.22 లక్షలు |
రూ 4.95 లక్షలు / రూ 5.42 లక్షలు |
ఎల్ఎక్స్ఐ / ఎల్ఎక్స్ఐ (ఓ) |
రూ 50,000/- |
- |
ఫీచర్స్ (ఎల్ఎక్స్ఐ లో అందించిన అంశాలకన్నా పైగా)
సేఫ్టీ: ముందు ప్రయాణికుడి ఎయిర్బాగ్ (ఆప్షనల్) మరియు ప్రీటెన్షనర్లు, లోడ్ పరిమితి తో కూడిన ముందు సీటు బెల్టులు (ఆప్షనల్) స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్, స్పీడ్ అలెర్ట్ సిస్టం, సెక్యూరిటీ అలారం వంటివి అందించబడ్డయి.
ఎక్స్టీరియర్స్: పూర్తి వీల్ క్యాప్లు, కారు రంగులో ఉండే డోర్ హ్యాండిళ్ళు మరియు ఓఆర్విఎం లు.
కంఫర్ట్: విధ్యుత్ తో సరుధుబాటయ్యే ఓ ఆర్ వి ఎం లు, 60:40 స్ప్లిట్ రేర్ సీటు, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, వెనుక పవర్ విన్Zడోలు, మాన్యువల్ డే / నైట్ ఐఆర్విఎం లు, సర్దుబాటు స్టీరింగ్ వీల్ మరియు స్టీరింగ్- వీల్ పై ఆడియో నియంత్రణలు (1.2 లీటర్ లో మాట్రమే).
ఇన్ఫోటైన్మెంట్: బ్లూటూత్, యూఎస్బి మరియు ఆక్స్ తో 2- దిన్ ఆడియో సిస్టమ్.
వీల్స్: 165 / 70ఆర్14 టైర్లతో 14 అంగుళాల స్టీల్ వీల్స్
తీర్పు: వి ఎక్స్ ఐ వేరియంట్ అన్ని ప్రాథమిక లక్షణాలను పొందుతుంది. అంతేకాకుండా దీనిలో అందించిన అంశాలతో వాగన్ ఆర్ కొనుగోలుదారులు ఈ కారుని కొనుగోలు చేయడానికి సంతోషిస్తారు.
కానీ రూ. 50,000 ప్రీమియం ఈ లక్షణాల కోసం 1.0 మాన్యువల్ ఎల్ఎక్స్ఐ ని దాదాపు 15000 ధరతో ఆకర్షిస్తుంది. స్పష్టంగా, మీరు తగిన బడ్జెట్లో ఉన్నట్లయితే మీరు వాగన్ ఆర్ 1.0 ను ఎంచుకుంటున్నందున, మీరు ఎల్ ఎక్స్ ఐ 1.0 మాన్యువల్ కోసం వెళ్ళమని సూచించాము.
ఇప్పుడు నిజంగా ఒక ఎంట్రీ- లెవల్ హ్యాచ్బ్యాక్ నుండి పెద్ద కారుకు అప్గ్రేడ్ చేయాలనుకుంటే, వాగన్ ఆర్ 1.2 మాన్యువల్ విఎక్స్ఐ మంచి ప్యాకేజీ అని చెప్పవచ్చు. వాగన్ ఆర్ 1.2 విఎక్స్ఐ, వాగన్ ఆర్ 1.0 విఎక్స్ఐ కంటే రూ. 20,000 ఎక్కువ ఖరీదైనది, అలాగే పెద్దది మరియు మరింత శక్తివంతమైన ఇంజిన్ (స్విఫ్ట్ వలె అదే ఇంజిన్) దీనిలో కూడా అందించినందునా విలువైన కారుగా పరిగణించబడుతుంది. అయితే, మీరు ఇక్కడ వరకు మీ బడ్జెట్ను విస్తరించగలిగినట్లయితే వాగన్ఆర్ 1.2 వి ఎక్స్ ఐ ఆప్షనల్ వేరియంట్ కోసం ఎంపిక చేసుకోవచ్చు (ఆప్షనల్ వేరియంట్ ను కొనుగోలు చేయండి). మీరు మీ జేబులో ఇంకా కొంచెం మొత్తాన్ని తీయగలిగితే, వాగన్ ఆర్ జెడ్ ఎక్స్ ఐ ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే? మేము మీకు తెలియజేస్తాము.
కొత్త మారుతి వాగన్ ఆర్ 2019 వర్సెస్ శాంత్రో వెర్సెస్ టియాగో వెర్సెస్ గో వెర్సెస్ సెలిరియో స్పెసిఫికేషన్ల పోలిక
స్పెసిఫిక్ పోలిక
మారుతి వాగన్ ఆర్ జెడ్ఎక్స్ఐ - కొనదగినట్టుగా నవీకరించబడింది, ఆధునిక కాంపాక్ట్ యుటిలిటీ హాచ్బాక్
|
1.0 లీటర్ |
|
జెడ్ఎక్స్ఐ |
- |
రూ 5.22 లక్షలు / రూ 5.69 లక్షలు (+47,000) |
విఎక్స్ఐ కంటే |
- |
రూ 33,000 / రూ 33,000 |
విఎక్స్ఐ (ఓ) |
- |
రూ 26,500 / రూ 26,500 |
ఫీచర్స్ (విఎక్స్ఐ లో అందించబడిన కనా పైగా)
సేఫ్టీ: ముందు-ప్రయాణీకుల ఎయిర్బాగ్ మరియు బెల్టులు ప్రీటెన్షనర్లు అలాగే లోడ్ పరిమితి తో కూడిన ముందు సీటు ప్రామాణికంగా అందించబడ్డాయి.
ఎక్స్టీరియర్స్: ఓఆర్విఎం ల పై టర్న్ సూచికలు మరియు ఫాగ్ లాంప్స్ (7కె).
కంఫర్ట్: ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎం లు, డిఫోగ్గర్ మరియు వెనుక వాషర్ అలాగే వైపర్ మరియు స్టీరింగ్ వీల్ పై వాయిస్ నియంత్రణలు.
ఇన్ఫోటైన్మెంట్: 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో.
తీర్పు: 1.2 లీటర్ వాగన్ ఆర్ (ఇది 1.0 లీటర్ వాగన్ ఆర్ తో అందుబాటులో లేదు) కొనుగోలుదారు కోసం జెడ్ఎక్స్ఐ మా సిఫార్సు వేరియంట్. విఎక్స్ఐ కి రూ .33,000 అదనంగా చెల్లిస్తే అదనపు ఫీచర్లతో ప్రీమియంను సమర్థిస్తుంది. ఇది మెరుగైన భద్రతా సాంకేతికతను కలిగి ఉండటమే కాకుండా టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎం ల వంటి ఇతర లక్షణాలతో ఆధునిక కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్గా కనబడుతుంది. ఈ వేరియంట్ లో ఒక ఫీచర్ ను కోల్పోతాము అది ఏమిటంటే, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు. అది అందించినట్లైతే కొంచెం ఎక్కువ చెల్లించాలి.
2019 మారుతి వాగన్ ఆర్ వెయిటింగ్ పిరియడ్: ఎప్పుడు డెలివరీ చేయబడుతుంది? వంటివి కూడా చదవండి
మరిన్ని చదవండి: వాగన్ ఆర్ ఏఎంటి