<cityName> లో సిఫార్సు చేయబడిన వాడిన మారుతి డిజైర్ 2017-2020 కార్లు
మారుతి డిజైర్ 2017-2020 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఇంజిన్ | 1197 సిసి - 1248 సిసి |
పవర్ | 74 - 83.14 బి హెచ్ పి |
టార్క్ | 113 Nm - 190 Nm |
ట్రాన్స్ మిషన్ | మాన్యువల్ / ఆటోమేటిక్ |
మైలేజీ | 20.85 నుండి 28.4 kmpl |
ఫ్యూయల్ | పెట్రోల్ / డీజిల్ |
- పార్కింగ్ సెన్సార్లు
- रियर एसी वेंट
- ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
ొత్త డిజైర్ వాహనం యొక్క క్యాబిన్ లో ఫ్లాట్ బోటం స్టీరింగ్ వీల్ అందించడం వలన వాహనం స్పోర్టి కనిపిస్తోంది
ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి ప్రొజెక్టార్ హెడ్‌ల్యాంప్స్
ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో లతో 7.0- అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్
ొత్త డిజైర్ యొక్క టైల్ ల్యాంప్స్ ఇప్పుడు స్పోర్ట్ ఎల్ఈడి గ్రాఫిక్స్ ను కలిగి ఉన్నాయి.
- కీలక లక్షణాలు
- అగ్ర లక్షణాలు
- ప్రత్యేక లక్షణాలు
మారుతి డిజైర్ 2017-2020 ధర జాబితా (వైవిధ్యాలు)
following details are the last recorded, మరియు the prices మే vary depending on the car's condition.
- అన్నీ
- పెట్రోల్
- డీజిల్
- ఆటోమేటిక్
డిజైర్ 2017-2020 ఎల్ఎక్స్ఐ 1.2 BSIV(Base Model)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl | ₹5.70 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఎల్ఎక్స్ఐ 1.21197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.21 kmpl | ₹5.89 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 విఎక్స్ఐ 1.2 BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl | ₹6.58 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఎల్డిఐ(Base Model)1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl | ₹6.67 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 విఎక్స్ఐ 1.21197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.21 kmpl | ₹6.79 లక్షలు* |
డిజైర్ 2017-2020 ఏఎంటి విఎక్స్ఐ BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22 kmpl | ₹7.05 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 జెడ్ఎక్స్ఐ 1.2 BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl | ₹7.20 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏఎంటి విఎక్స్ఐ1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.21 kmpl | ₹7.32 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 జెడ్ఎక్స్ఐ 1.21197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.21 kmpl | ₹7.48 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 రేంజ్ ఎక్స్టెండర్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.85 kmpl | ₹7.50 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 విడిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl | ₹7.58 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏఎంటి జెడ్ఎక్స్ఐ BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22 kmpl | ₹7.67 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏఎంటి జెడ్ఎక్స్ఐ1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.21 kmpl | ₹8.01 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏఎంటి విడిఐ1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 28.4 kmpl | ₹8.05 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 జెడ్ఎక్స్ఐ ప్లస్ BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl | ₹8.10 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 జెడ్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl | ₹8.17 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 జెడ్ఎక్స్ఐ ప్లస్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.21 kmpl | ₹8.28 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏఎంటి జెడ్ఎక్స్ఐ ప్లస్ BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22 kmpl | ₹8.57 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏఎంటి జెడ్డిఐ1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 28.4 kmpl | ₹8.63 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏఎంటి జెడ్ఎక్స్ఐ ప్లస్(Top Model)1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.21 kmpl | ₹8.80 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 జెడ్డిఐ ప్లస్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl | ₹9.06 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏజిఎస్ జెడ్డిఐ ప్లస్1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 28.4 kmpl | ₹9.20 లక్షలు* | ||
డిజైర్ 2017-2020 ఏఎంటి జెడ్డిఐ ప్లస్(Top Model)1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 28.4 kmpl | ₹9.53 లక్షలు* |
మారుతి డిజైర్ 2017-2020 సమీక్ష
Overview
కొత్త మారుతి స్విఫ్ట్ డిజైర్ ప్రీమియమ్ అనుభూతిని కలిగి ఉంది.
బాహ్య
డిజైర్ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, ఈ వాహనానికి అపారమైన విజయం ఉన్నప్పటికీ, పాత డిజైర్ ఎప్పుడూ ఆకర్షణీయమైన లుక్ ను కలిగి లేదు. కానీ కొత్త మూడవ తరం మోడల్ తో, డిజైర్ చివరికి కావాల్సిన విధంగా మారి - తాజాగా, ఆకర్షణీయమైన లుక్స్ తో సమకాలీన మరియు విభాగం నుండి ఒక సెడాన్ లా కనిపిస్తోంది.
ఈ వాహనం యొక్క పరిమాణం విషయానికి వస్తే, ఇది కొన్ని మార్గాల్లో చూసినట్లైతే పెద్దదిగా ఉంది - పాత వాహనం యొక్క పొడవునే కొనసాగుతుంది కాని వెడల్పు 40 మీ మీ పెరిగింది అయితే వీల్‌బేస్ 20 మీ మీ పెరిగింది. కొత్త డిజైర్ యొక్క ఎత్తు 40 మీ మీ తగ్గింది మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 170 మీ మీ నుండి 163 మీ మీ అమాంతం తగ్గించబడింది. మార్పులు డిజైర్ వాహనానికి మరింత నిష్పత్తిలో మరియు సొగసైన వైఖరి తెచ్చిపెట్టింది. ఉప 4- మీటర్ ల విభాగంలో లేకపోయినా, కొత్త డిజైర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది! గోవా రహదారులపై, కొత్త డిజైర్, సెడాన్ వాహనాన్ని పొందుటకు ప్రయత్నిస్తున్న వాహనదారులు శ్రద్ధను ఆకర్షించింది.
ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, మందపాటి ఒక క్రోమ్ రౌండ్ స్ట్రిప్ అందించబడింది దీని మధ్య భాగంలో ఒక కొత్త పౌటీ గ్రిల్ అమర్చబడి ఉంది. ఇది చూడటానికి, యుఎస్ ఫియట్ పుంటో ఇవో యొక్క గ్రిల్ ను గుర్తుచేస్తుంది. గ్రిల్ కు ఇరువైపులా డిఆర్ఎల్ఎస్ లను కలిగిన (డే టైం రన్నింగ్ లైట్లు) తో బ్రహ్మాండమైన ఎల్ఈడి ప్రొజెక్టార్ హెడ్‌ల్యాంప్‌లు పొందుపరచబడ్డాయి. - సాధారణంగా హోండా సిటీ వంటి ఉన్నత విభాగాలలో కనిపించే లక్షణాలు, ఇగ్నిస్ వంటి తక్కువ కార్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. హెడ్ ల్యాంప్ క్రింది భాగం విషయానికి వస్తే, ఫాగ్ ల్యాంప్స్ అమర్చబడ్డాయి. దీని క్రింది భాగంలో సన్నని క్రోం స్ట్రిప్ బిగించబడి ఉంది. ఈ ఎల్ ఆకారపు క్రోమ్ ఇన్సర్ట్ మరింత అందంగా ముందు భాగానికి మరింత ప్రాముఖ్యతను పెంచుతుంది. నిరాశాజనక విషయం ఏమిటంటే, కొత్త 15- అంగుళాల "ఖచ్చితత్వ-కట్" కలిగిన అల్లాయ్ వీల్స్ ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన వి వేరియంట్ లో 14- అంగుళాల స్టీల్ చక్రాలు అందించబడ్డాయి
ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, వెనుక బూట్ పొడవు భాగం అంతా క్రోం స్ట్రిప్ ఆకర్షణీయంగా అమర్చబడి ఉంది. దీనికి ఇరువైపులా క్రింది భాగంలో ఎల్ఈడి యూనిట్ లతో కూడిన టైల్ ల్యాంప్స్ పొందుపరచబడి ఉన్నాయి. బూట్ కూడా చాలా విశాలంగా అందించబడింది మరియు ఉప 4 మీటర్ విభాగంలో అందించబడిన బూట్ వలే కాకుండా చాలా సౌకర్యవంతంగా ఉంది. మీ సామాను ఎక్కువ మొత్తంలో పెట్టుకునేందుకు వీలుగా దీనిని 62 లీటర్లు పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు బూట్ పరిమాణం, 378 లీటర్లు, ఈ వాహనం యొక్క ప్రత్యర్థులు అయిన టాటా టిగార్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు హోండా అమేజ్ వాహనాల బూట్ పరిమాణం కంటే ఈ వాహన బూట్ పరిమాణం తక్కువగా ఉంది, ఇవన్నీ 400 లీటర్ల కార్గో స్పేస్ కలిగి ఉన్నాయి. అయితే, ఈ బూట్ లో పెద్ద పెద్ద సంచులు మరియు కెమెరా సామగ్రిని ప్యాక్ చేయటానికి సరిపోతుంది.
Exterior Comparison
Hyundai Xcent | Volkswagen Ameo | |
Length (mm) | 3995mm | 3995mm |
Width (mm) | 1660mm | 1682mm |
Height (mm) | 1520mm | 1483mm |
Ground Clearance (mm) | 165mm | 165mm |
Wheel Base (mm) | 2425mm | 2470mm |
Kerb Weight (kg) | 1120 | 1153kg |
Boot Space Comparison
Hyundai Xcent | ||
Volkswagen Ameo | ||
Volume | - | - |
అంతర్గత
ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, డిజైర్ యొక్క క్యాబిన్ ఎలా ఉద్భవించిందో చూడడానికి మీరు ఆశ్చర్యపోతారు. ముందుగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, రెండు రంగులను కలిగిన డాష్‌బోర్డ్ పై క్రోమ్ ఇన్సెర్ట్స్ మరియు ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్లతో స్టీరింగ్ వీల్ ఉన్నాయి, మీరు ఆశ్చర్యపడే మరో విషయం ఏమిటంటే, లోపలి భాగం చూడటానికి ఒక ఖరీదైన లుక్ ను అందిస్తుంది. ఫ్లాట్- బేస్డ్ స్టీరింగ్ వీల్ ఈ విభాగం యొక్క మొట్టమొదటి వేరియంట్ అయిన ఎల్ వేరియంట్ నుండి ప్రామాణికంగా అందించబడింది. అధిక వేరియంట్ లలో, స్టీరింగ్ వీల్ మరింత దృష్టి పొందుతుంది, ఫాక్స్ లెధర్ చుట్టబడి ఉంటుంది. ఆడియో నియంత్రణ మరియు టెలిఫోన్ ని నియంత్రించడానికి స్టీరింగ్ వీల్ పై బటన్లు ఉత్తమమైనవిగా పొందుపరచబడ్డాయి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి మరియు పవర్ విండో స్విచ్చులు డోర్ కి అమర్చబడి ఉన్నాయి. గేర్ లివర్ గొప్ప అనుభూతితో కొనసాగుతుంది, అంతేకాకుండా ఏఎంటి వెర్షన్ లో ప్రీమియం అనుభూతిని అందించడానికి ప్రీమియం లెధర్ తో స్టీరింగ్ వీల్ కప్పబడి ఉంటుంది మరియు క్రోమ్ ఇన్సెర్ట్స్ అందంగా పొందుపరచబడ్డాయి.
డాష్ బోర్డ్ విషయానికి వస్తే, సరైన ఎర్గోనామిక్స్ కోసం కొద్దిగా డ్రైవర్ వైపుకు వంపును కలిగి ఉంటుంది మరియు 7 అంగుళాల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైయిన్మెంట్ సిస్టమ్ తో పాటు ఆపిల్ కార్ ప్లే మరియు ఆటో యాండ్రాయిడ్ కు మద్దతు ఇస్తుంది. 6- స్పీకర్ సిస్టమ్ యొక్క ధ్వని నాణ్యత ఆకట్టుకునేది కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇది అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది. యూఎస్బి, ఆక్స్, సిడి మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో దిగువ శ్రేణి వేరియంట్స్ లో సాధారణ ఆడియో సిస్టమ్ అందించబడుతుంది. మేము వీటిని తనిఖీ చేయలేకపోయినా, మీరు చూసిన కొన్ని చిత్రాలు ప్రకారం, స్మార్ట్‌ప్లే వ్యవస్థ, ప్రీమియమ్ లుక్ ని వెలికి తీయడానికి అందిస్తున్నారు. అంతేకాకుండా, వాహనం యొక్క కొన్ని ప్రదేశాలలో ప్లాస్టిక్ అమరిక మరియు ముగింపులు స్పష్టమైన ప్యానెల్ ఖాళీలతో అందించబడింది.
డ్రైవర్, సీటు- ఎత్తు సర్దుబాటు సౌకర్యాన్ని, స్టార్ట్ - స్టాప్ బటన్, విధ్యుత్ తో సర్దుబాటయ్యే మరియు ఫోల్డబుల్ రేర్ వ్యూ మిర్రర్ లు, డ్రైవర్ సైడ్ ఆటో అప్- డౌన్ పవర్ విండో వంటి అసాధారణ సౌకర్యాలను పొందుతున్నాడు. ముందు సీట్లు పెద్దవిగా ఉంటాయి మరియు పెద్ద బుజాలను కలిగిన వారికి ముందు సీట్లు చాలా సౌకర్యంగా ఉంటాయి. మారుతి సుదీర్ఘ దశకు వెళ్లి, డ్రైవర్ కు ఆర్మ్ రెస్ట్ ను కనీసం ఏఎంటి వేరియంట్ లో అందించినా బాగుండేది!
వీల్ బేస్ ను పెంచడం వలన, క్యాబిన్ వెడల్పు మెరుగైయ్యింది. క్యాబిన్ వెనుక స్థలం చాలా విశాలంగా ఉంది, దీనిలో అతిపెద్ద లబ్ధిదారులు ఎవరు అంటే వెనుక సీట్ ప్రయాణీకులు. మీ కాళ్ళను సౌకర్యవంతంగా పెట్టుకోవడం కోసం నీ రూమ్ గణనీయంగా పెరిగింది. తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ, కాబిన్ లోపల 6 అడుగుల కంటే తక్కువగా ఉన్నవారికి ఎటువంటి అసౌకర్యం కలుగదు. షోల్డర్ రూం కూడా గణణీయంగా పెరిగింది, అయితే ఒక రహదారి పర్యటనలో ముగ్గురు పెద్దలు అసౌకర్యవంతమైన అనుభూతిని పొందుతారు, అయితే నగరం లోపల తక్కువ పర్యటనలకు సౌకర్యవంతంగా వెళ్ళవచ్చు. ముందుకు వెళ్ళాలి అనుకునేవారికి సౌకర్యం అందించడం కోసం క్యాబిన్ మరియు టెంపర్స్ చల్లగా ఉంచడానికి వెనుక భాగంలో ఒక కొత్త వెనుక ఏసి వెంట్లు అందించబడ్డాయి. వాడనప్పుడు, మధ్యస్థ సీటుకు కప్ హోల్డర్స్ తో కూడిన సెంటర్ ఆర్మ్రెస్ మూసివేయవచ్చు. డోర్ కు వెనుక బాటిల్ హోల్డర్లు, సీట్ బ్యాక్ పాకెట్ మరియు వెనుక ఏసి వెంట్లు పక్కన మొబైల్ హోల్డర్ వంటి మరిన్ని నిల్వ స్థలాలు ఉన్నాయి. మీ పరికరాల్లో దేనికైనా చార్జింగ్ లోపిస్తే, ఒక ఆలోచనాత్మకంగా జోడించిన పవర్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది.
భద్రత
డిజైర్ వాహనం యొక్క భద్రత విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎల్ నుండే అన్ని వేరియంట్ లకు ఇప్పుడు ద్వంద్వ ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఎబిఎస్ లను అందిస్తుంది. ఇది ఈ డిజైర్ యొక్క అతి పెద్ద అనుకూలత అని చెప్పవచ్చు. దిగువ శ్రేణివేరియంట్ అయిన ఎల్ వేరియంట్ యొక్క ధర తక్కువ అయినప్పటికీ పాత ఎల్ వేరియంట్ (ఆప్షనల్) లో అందించబడిన అంశాలన్నింటినీ రూ. 7000 రూపాయల ధర కే అందిస్తుంది. ఇది భద్రతపై దృష్టి సారించేందుకు మారుతి నుండి భారీ ప్రకటన విడుదల అయ్యిందిఅని చెప్పవచ్చు. గమనించదగ్గ మరో విషయమేమిటంటే, ఈ డిజైర్ వాహనం మారుతి యొక్క హార్టెక్ట్ ప్లాట్‌ఫాం పై నిర్మించబడింది అంటే, భవిష్యత్ భద్రత నిబంధనలకు ఇది సిద్ధంగా ఉంటుంది అని అర్ధం.
భద్రతా కిట్ యొక్క ఇతర ప్రామాణిక అంశాలలో మరోకటి, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్ అందించబడ్డాయి, మరింత భద్రత కోసం వెనుక మరియు ముందు సీటులో కూర్చునే వారికి బెల్ట్ ప్రీపెన్షనర్ మరియు ఫోర్స్ లిమిటార్స్ తో కూడిన ముందు సీటు బెల్ట్ లు ఇవ్వబడ్డాయి. అయితే, రివర్స్ పార్కింగ్ సెన్సార్, జెడ్ వేరియంట్ లో మాత్రమే ఇవ్వబడుతుంది మరియు మీరు రివర్స్ పార్కింగ్ కెమెరా అలాగే కావాలనుకుంటే మీరు జెడ్ + వేరియంట్ ను కొనుగోలు చేయండి. ఈ రోజుల్లో మన రోడ్డు పరిస్థితులకు ఎంత ముఖ్యమైనవి అయిన పార్కింగ్ సెన్సార్లను మనం కోరుకున్నట్టుగానే దిగువ శ్రేణి వేరియంట్ అయిన వి వేరియంట్ నుండే మారుతి అందించింది. సెంట్రల్ లాకింగ్, స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్స్ మరియు యాంటీ- థెఫ్ట్ వ్యవస్థ వంటి అంశాలు అవుట్గోయింగ్ మోడల్ లో ప్రామాణికంగా అందించారు కానీ, ఇప్పుడు వి వేరియంట్ నుండి మాత్రమే లభిస్తాయి.
ప్రదర్శన
పాత డిజైర్ లో అందించబడిన అదే నమ్మదగిన, విశ్వసనీయమైన 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ యూనిట్లు ఈ కొత్త డీజిల్ వాహనంలో కూడా ఉన్నాయి. శక్తి మరియు టార్క్ లు పరంగా ఏ మార్పు లేదు. మారిన విషయం ఏమిటంటే, మారుతి అగ్ర శ్రేణి వేరియంట్ లో 5- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను ముందుగా ప్రవేశపెట్టింది. తరువాత, ఈ వాహనంలో వి వేరియంట్ నుండి 5- స్పీడ్ ఏఎంటి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) యూనిట్ ఆన్ని వాహనాలలో అందించబడుతుంది. ఇంజన్ పై ఆధారపడి 85- 95 కిలోల బరువును కొత్త డిజైర్ వాహనం బరువును కోల్పోయింది.
ఇగ్నిస్ లో అందించబడిన ఏఎంటి, ప్రయాణికులను బాగా ఆకట్టుకుంది మరియు అందుచే డిజైర్ యొక్క సెటప్ నుండి అధిక అంశాలు ఇవ్వబడ్డాయి. మారుతి, డిజైర్ వాహనంలో, ఏఎంటి యొక్క గేరింగ్ ను మరియు అమరికను సవరించిందని పేర్కొంది. నగరంలో డిజైర్ డీజిల్ ఏఎంటి డ్రైవింగ్ ఒక మృదువైన వ్యవహారం మరియు క్రీప్ ఫంక్షన్ వాహనాన్ని ఆపినప్పుడు సౌలభ్యం జతచేస్తుంది మరియు వాహనం స్టార్ట్ చేసినప్పుడు కూడా సౌలభ్యం చేకూరుతుంది. కానీ బహిరంగ రహదారులపై, సాధారణంగా ఏఎంటి గేర్బాక్సులతో సంబంధం ఉన్న 'హెడ్- నోడింగ్' (ఇగ్నిస్లో ఆశ్చర్యకరంగా లేదు), 2000 ఆర్పిఎం వద్ద వెనుక భాగంలో ప్రయాణించేవారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అధిగమించటానికి చూస్తున్నారా? త్వరణాన్ని స్లామ్ చేయడం ద్వారా ముందుగానే మీ కదలికను ప్లాన్ చేయాలి లేదా ముందు డౌన్ షిఫ్ట్ ను మార్చడం అవసరం. సులభమయిన ఎంపిక ఏమిటంటే, మాన్యువల్ మోడ్ లోకి మారడం, అయితే మీ ఎడమ చేతికి పని ఎక్కువ అవుతుంది.
మీ డ్రైవింగ్ లో అధిక భాగం రహదారులలో ఉంటే, అప్పుడు మీరు డీజిల్ మాన్యువల్ ను ఎంపిక చేసుకోవాలి. గేర్‌బాక్స్ ప్రతిస్పందించే మరియు మార్పులు సజావుగా జరుగుతాయి. అంతేకాకుండా మీరు కేవలం ఏ లాగ్ అనుభూతిని పొందకుండా సౌకర్యంగా మీ డెస్టినీని చేరుకోగలుగుతారు. బరువు కోల్పోయినప్పటికీ, డీజిల్ ఇప్పటికీ బరువుగా ఉందని మరియు పేస్ ని చేరడానికి కొంచెం వేచి ఉండాలి. ఆ తరువాత, ఎటువంటి ఇబ్బంది లేకుండా 80- 100 కెఎంపిహెచ్ బ్యాండ్ వద్ద సంతోషంగా క్రూయిజ్ ఉంటుంది. మొత్తంమీద, ఇంజిన్ మృదువైన, మరింత శుద్ధి తక్కువ శబ్దంతో అందించబడింది, అయితే కొన్ని ముసుగులు ఇప్పటికీ ఉన్నాయి.
మీరు రహదారుల కోసం మరియు నగరాల రెండింటి కోసం ఒక కారు కావాలనుకుంటే, అది డిజైర్ పెట్రోల్ ఏఎంటి వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ ఇంజిన్ శుద్ధి చేయబడింది మరియు పెప్పీ గా, గేర్షీట్లు సున్నితంగా డ్రైవర్ అవసరాలు ప్రకారం అందించబడింది.
రైడ్మరియునిర్వహణ
డిజైర్ గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే, అది రైడ్ నాణ్యత. సస్పెన్షన్ చాలా నిశ్శబ్దంగా ఉంది, కాబట్టి రైడ్ గట్టిపట్టును మరియు అద్భుతమైన రైడ్ సౌకర్యాన్ని అందిస్తుంది. రైడ్ విషయంలో, ఈ సెడాన్ కంటే బహుశా ఏదీ లేదు అని చెప్పవచ్చు. కఠినమైన మరియు విరిగిన రోడ్లపై డిజైర్ లో వెళ్ళినప్పుడు, గతుకులను సస్పెన్షన్ తీసుకొని మనకు సౌకర్యాన్ని అందిస్తుంది, ముఖ్యంగా ఏఎంటి వేరియంట్ లలో చెప్పనవసరం లేదు ఎందుకంటే, మరింత నాణ్యమైన రైడ్ ను అందిస్తుంది. పాత డిజైర్‌లో వెనుక భాగంలో అసౌకర్యం ఇప్పుడు తాజా వెర్షన్లో ఏమి లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ 7 మిల్లీమీటర్ల మేరకు పడిపోయినప్పటికీ, ఎటువంటి ఇబ్బంది లేకుండానే వేగవంతమైన రోడ్లపై ప్రయాణికులు మంచి రైడ్నుకలిగి ఉంటారు. మీ ప్రాధాన్యతపై సౌలభ్యం ఎక్కువగా కావాలనుకుంటే, అప్పుడు డిజైర్ ను ఎంపిక చేసుకోండి.
నేరుగా రహదారులపై, 100 కెఎంపిహెచ్ వరకు వేగంగా వెళ్ళినా, డిజైర్ వాహనం స్థిరంగా ఉంటుంది, ఇది 186/ 65 టైర్ పరిమాణం కలిగి ఉండటం వలన రోడ్డుపై గట్టి పట్టును అందిస్తోంది. కానీ మూలల్లో అదే స్థాయిని అందించలేదు. తక్కువ వేగంతో డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ చక్రం ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు ముందు చక్రాలు ఏమి చేస్తాయనే దాని గురించి మనం ఆలోచించకుండా వాహనం తేలికగా వెళిపోతుంది. బ్రేక్‌లు ప్రతిస్పందిస్తాయి మరియు పనిని పూర్తి చేస్తాయి కాని పానిక్ బ్రేకింగ్ పరిస్థితులు ఉత్తమంగా లేవు.
ఇంధన సామర్ధ్యం
కొత్త మారుతి సుజుకి డిజైర్, 22 కెఎంపిఎల్ మైలేజ్ ని పెట్రోల్ మాన్యువల్ మరియు ఏఎంటి రెండింటికీ సమర్ధవంతంగా ఇస్తుంది. అవుట్గోయింగ్ మోడల్ కంటే ఇది, 1.1 కెఎంపిఎల్ ఎక్కువ మైలేజ్ ను ఇస్తుంది. కానీ డీజిల్ వాహనం 28.04 కెఎంపిఎల్ గల మైలేజ్ ను మాత్రమే ఇస్తుంది. ఇది కొంచెం పాత దాని కంటే తగ్గించబడింది. భారతదేశంలో అత్యంత ఇంధన సామర్ధ్యం గల కాంపాక్ట్ సెడాన్ గా మారుతి సంస్థ డిజైర్ ను అందించింది. రెండవ స్థానంలో ఫోర్డ్ అస్పైర్ ఉంది. ఈ వాహనం, 25.83 కెఎంపిఎల్ గల ఇంధన మైలేజ్ ను ఇచ్చే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయినా డిజైర్ పెట్రోల్ వాహనాన్ని, దాని ప్రత్యర్ధులతో పోలిస్తే ఎక్కువ మైలేజ్ ను అందిస్తుంది. ఇంతకీ దాని పోటీ వాహనాలు టిగోర్ మరియు ఎక్సెంట్ లు వరుసగా 20.3 కిలోమీటర్లు మరియు 20.14 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తున్నాయి. డిజైర్ నిజానికి అగ్ర స్థానంలో ఉందో లేదో నిరూపించడానికి ఒక సమగ్ర పరీక్ష మాత్రమే సిద్దంగా ఉంది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి.
వెర్డిక్ట్
కొత్త డిజైర్ దాని ప్రత్యర్థుల కంటే ఖరీదైనప్పటికీ, రాబోయే ఉద్గార మరియు క్రాష్ సమ్మతి నిబంధనలను కలిసే వేదిక సంసిద్ధత దాని ప్రీమియం ట్యాగ్ కు సరిపోతుంది.
"కొత్త మారుతి స్విఫ్ట్ డిజైర్ వాహనం ప్రీమియమ్ అనుభుతిని కలిగి ఉంది."
ధర ఎక్కువగా మరియు కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మారుతి సుజుకి యొక్క కొత్త డిజైర్ వాహనం, విభాగంలో తనకంటూ ఒక స్థానాన్ని సాధించుకుంటుంది.
మారుతి డిజైర్ 2017-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
- మనకు నచ్చిన విషయాలు
- మనకు నచ్చని విషయాలు
- ముందు అవుట్గోయింగ్ మోడల్ లో కంటే ఈ వాహనంలో ఎక్కువ ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చునే సధుపాయం మరియు విశాలమైన బూట్ స్పేస్
- ప్రామాణిక భద్రతా లక్షణాలు: ద్వంద్వ- ముందు ఎయిర్బాగ్లు, ఏబిఎస్ తో ఈబిడి మరియు వెనుక చైల్డ్ సీట్ మౌంట్ యాంకర్స్
- ఉత్తమంగా కనిపించే డిజైర్ వాహనం, మునుపటి వాహనం కన్నా ఎక్కువ అనురూప రూపకల్పన కలిగి ఉంది
- రాబోయే క్రాష్ పరీక్ష నిబంధనలకు కట్టుబడి ఉన్న కొత్త, తేలికైన మరియు దృడమైన బాలెనో బోరోడ్ ప్లాట్‌ఫాం ను కలిగి ఉంది
- ఏఎంటి సౌలభ్యంతో వాహనం యొక్క ధర- సమర్థవంతంగా ఉంది(దిగువ శ్రేణి వేరియంట్ ఎల్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది)
- అద్భుతమైన రైడ్ నాణ్యత - డిజైర్, గతుకుల రోడ్లపై మరియు విరిగిన రహదారులపై సౌకర్యవంతమైన రైడ్ ను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందిస్తుంది.
- కొన్ని ప్రదేశాలలో ప్లాస్టిక్ అపోలిస్ట్రీ అందించబడింది. దీనిని మార్చవలసిన అవసరం చాలా ఉంది
- శబ్ధ ఇన్సులేషన్ ను క్యాబిన్ లో ఇంజిన్ శబ్దం ఫిల్టరింగ్ చేస్తే బాగుండేది.
- కొత్త జెడ్ + వేరియంట్ ఎక్కువ ధరను కలిగి ఉంది.
- ఏఎంటి ఫైన్- ట్యూన్ చేయబడింది, కానీ అది ఇప్పటికీ సంప్రదాయ ఆటోమేటిక్ లతో సరిగ్గా సరిపోలడం లేదు
- పెట్రోల్ వాహనాలతో పోలిస్తే డిజైర్ డీజిల్ ఏఎంటి వాహనం మృదువైన అనుభూతిని అందించడం లేదు
- గత సంవత్సరంలో ప్రారంభించబడింది, కానీ ఇప్పటికీ వినియోగదారులను ఆకర్షితులను చేయలేకపోతుంది.
మారుతి డిజైర్ 2017-2020 car news
- తాజా వార్తలు
- Must Read Articles
- రోడ్ టెస్ట్
మారుతి, మహీంద్రా, టయోటా, కియా, MG మోటార్ మరియు స్కోడా అమ్మకాలలో వృద్ధిని సాధించగా, హ్యుందాయ్, టాటా, వోక్స్వాగన్ మరియు హోండా వంటి కార్ల తయారీదారులు తిరోగమనాన్ని చూశారు.
రిఫ్రెష్ లుక్స్, విశాలమైన ఇంటీరియర్స్ మరియు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అదనపు ఫీచర్లు అందించబడ్డాయి.
గత రెండు తరానికి చెందిన డిజైర్ మాదిరిగా కాకుండా, మారుతి సంస్థ 2017 డిజైర్ కు మొత్తం పునః రూపకల్పనను అందించడంలో శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
నెలవారీ విక్రయాలలో గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ ఎక్సెంట్ రెండో స్థానంలో అమేజ్ సౌకర్యవంతమైన స్థానాలలో కొనసాగించాయి
డిజైర్ దాని సెగ్మెంట్లో- 21,037 యూనిట్లు విక్రయించి ప్రధమ స్థానంలో నిలిచింది
కొత్త 2017 డిజైర్, సియాజ్ కంటే మరిన్ని అంశాలను ఎక్కువ మొత్తంలో అందిస్తుంది, ఎందుకంటే ఇది మధ్యస్థ నవీకరణకు దగ్గరగా ఉంది.
మారుతి డిజైర్ 2017-2020 వినియోగదారు సమీక్షలు
- All (1490)
- Looks (342)
- Comfort (463)
- Mileage (501)
- Engine (161)
- Interior (181)
- Space (231)
- Price (152)
- మరిన్ని...
- తాజా
- ఉపయోగం
- Verified
- Critical
- Better Than Xuv
Better than xuv in comfort , good milage, Low safety features. But good for middle class family. New dzire 2025 is not so good as old dzire. Old is best from new 2025 modelఇంకా చదవండి
- Youu Can Pick 2025 Model కోసం Sure
Not a safe car but the reliability is on point. I have done mount abu to goa with my wife and my daughter. Not a single problem i faced with the car. Driven 78000kms in 7 years still getting 22 23 avg on highways. But in city its 14 to 17kmpl. I will suggest to get the 2025 dzire for sure because its safer and all the necessary feturea are checked. I even in my 2017 model i just want to have android auto or apple carplay wireless. Everything else is just working fine.ఇంకా చదవండి
- Maintenance cost ఐఎస్ very minimum
Maintenance cost is very minimum. Mileage is fantastic. Service are available at every where. It is Suitable for city as wellas on highwayఇంకా చదవండి
- Car Experience
We drive the brand new 2017 Maruti Suzuki Dzire to see if the car is really worth the premium price tag that it comes with. The new Dzire looks nice, especially compared to the older versions, and it surely is a lot more feature-rich as well. AMT is now offered with both petrol and diesel variants as an option and the revised mileage makes the new Maruti Dzire the most fuel efficient car in India in both the categories.ఇంకా చదవండి
- Excellent Sedan Car
Excellent sedan car with comfort in riding and without affecting pocket. Low maintenance cost with high performance and comfort.ఇంకా చదవండి
డిజైర్ 2017-2020 తాజా నవీకరణ
మారుతి సుజుకి డిజైర్ ధర మరియు వైవిధ్యాలు: డిజైర్ ధరలు రూ .5.82 లక్షలతో ప్రారంభమై రూ .9.52 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి. మారుతి డిజైర్‌ను నాలుగు వేరియంట్లలో అందిస్తుంది: ఎల్, వి, ఝడ్ మరియు ఝడ్ + రెండు ఇంజన్ ఎంపికలతో.
మారుతి సుజుకి డిజైర్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ మరియు మైలేజ్: మారుతి యొక్క సబ్ -4 మీ సెడాన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికతో వస్తుంది. పెట్రోల్ యూనిట్ గరిష్టంగా 83 పిఎస్ శక్తి మరియు 113 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ 75పిఎస్ శక్తి మరియు 190ఎన్ఎం టార్క్ వద్ద రేట్ చేయబడింది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా వస్తాయి, అయితే 5-స్పీడ్ ఎఎంటి (ఆటోమేటెడ్-మాన్యువల్ ట్రాన్స్మిషన్) ఒక ఎంపికగా అందించబడుతుంది. మారుతి డిజైర్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లకు (మాన్యువల్ మరియు ఎఎమ్‌టి రెండింటికి) వరుసగా 21.21 కిలోమీటర్లు మరియు 28.40 కిలోమీటర్లు మైలేజీని పేర్కొంది.
మారుతి సుజుకి డిజైర్ లక్షణాలు: ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కో-డ్రైవర్ సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, ఎబిఎస్ విత్ ఇబిడి, మరియు బ్రేక్ అసిస్ట్‌తో పాటు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లతో పాటు దాని పరిధిలో ప్రామాణికంగా భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. దీని ఫీచర్ జాబితాలో ఆటోమేటిక్ ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్ఎల్లు, సెన్సార్లతో రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే అనుకూలతతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్ / స్టాప్, రియర్ ఎసి వెంట్స్‌తో ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ సర్దుబాటు మరియు ఫోల్డబుల్ ఒఆర్విఎం లతో నిష్క్రియాత్మక కీలెస్ ఎంట్రీని పొందుతుంది.
మారుతి సుజుకి డిజైర్ ప్రత్యర్థులు: మారుతి సుజుకి డిజైర్ వోక్స్వ్యాగన్ అమియో, హోండా అమేజ్, టాటా టైగర్ మరియు ఫోర్డ్ ఆస్పైర్ వంటి వాటిని తీసుకుంటుంది. ఇది రాబోయే హ్యుందాయ్ ఔరాకు వ్యతిరేకంగా కూడా పెరుగుతుంది.
Ask anythin g & get answer లో {0}
ప్రశ్నలు & సమాధానాలు
A ) Maruti Dzire is priced between Rs.5.82 - 9.52 Lakh (ex-showroom Samastipur). In ...ఇంకా చదవండి
A ) For the availability of Dzire petrol variant in Goa, we would suggest you walk i...ఇంకా చదవండి
A ) Maruti Dzire is offering 6 different colours for it's variants - Silky silver, S...ఇంకా చదవండి
A ) Maruti Dzire VXi is priced at Rs.6.73 Lakh (ex-showroom Bokakhat). In order to k...ఇంకా చదవండి
A ) For this, we would suggest you walk into the nearest dealership as they will be ...ఇంకా చదవండి