• English
  • Login / Register

మారుతి డిజైర్ వర్సెస్ హోండా అమేజ్ 2018: డీజిల్ పోలిక రివ్యూ

Published On మే 13, 2019 By nabeel for మారుతి డిజైర్ 2017-2020

మారుతి యొక్క ఉప- 4 మీటర్ ఆధిపత్యాన్ని అన్ని కొత్త అమేజ్ తో హోండా ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ, ఇది మనకు కావాల్సిన విధంగా సరిపోతుందా?

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

ఈ రెండు కొత్త డిజైర్ మరియు అమేజ్ కార్లు పూర్తిగా, కొనుగోలుదారులు మరియు ప్రీమియమ్లలో ఉన్న ప్యాకేజీల్లో అనేక అంశాలు కొనుగోలుదారులకు అందిస్తామని హామీ ఇస్తున్నారు. కానీ, పూర్తి సెడాన్ అనుభవాన్ని ఏ వాహనం అందిస్తుందో తెలుసుకుందాం?

కార్లు పరీక్షించబడ్డాయి

మారుతి సుజుకి డిజైర్

  •  వేరియంట్: జెడ్డిఐ +
  •  ఇంజిన్: 1.3 లీటర్ డీజిల్
  •  ట్రాన్స్మిషన్: మాన్యువల్
  •  ధర: రూ 8.96 లక్షలు (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ)

హోండా ఆమేజ్

  •  వేరియంట్: విఎక్స్
  •  ఇంజిన్: 1.5 లీటర్ డీజిల్
  •  ట్రాన్స్మిషన్: మాన్యువల్
  •  ధర: రూ 8.79 లక్షలు (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ)

అనుకూలతలు

మారుతి సుజుకి డిజైర్

  •  విభాగంలో ఉత్తమ రైడ్ నాణ్యత
  •  పెట్రోల్ మరియు డీజిల్ రెండింటిలో ఏఎంటి లభ్యమవుతుంది
  •  క్యాబిన్ నాణ్యత మరియు లేఅవుట్ ఉన్నత స్థాయిని కనబరుస్తుంది

హోండా ఆమేజ్

  •  రెస్పాన్సివ్ ఇంజిన్
  •  విశాలమైన బూట్
  •  వెనుక సీట్ సదుపాయం

ప్రతికూలతలు

మారుతి సుజుకి డిజైర్

  •  ఇంజన్ శబ్దం
  •  పొడవైన గేరింగ్ ప్రతికూలంగా త్వరణాన్ని ప్రభావితం చేస్తుంది
  •  లేత గోధుమరంగు లోపలి భాగాలను సులభంగా మురికిగా అవుతాయి

హోండా ఆమేజ్

  •  క్యాబిన్ ప్లాస్టిక్ నాణ్యత
  •  సీట్లు సాఫ్ట్ కుషనింగ్ తో అందించబడుతున్నాయి
  •  భారీ స్టీరింగ్

అత్య అద్భుతమైన లక్షణాలు

మారుతి సుజుకి డిజైర్

  •  వెనుక ఏసి వెంట్స్
  • ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్

హోండా ఆమేజ్

  •  క్రూజ్ నియంత్రణ

లుక్స్

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • ఈ రెండు వాహనాలు ఉప 4 మీటర్ల సెడాన్ పరిధిలో ఉన్నందున డిజైనర్లు ఈ వాహనాలకు నియంత్రిత సరిహద్దుల పరిధిలో రూపాన్ని అందించవలసిన అవసరం ఉంది, తద్వారా వాటి ముందు మరియు వెనుక భాగాలలో ఫ్లాట్గా కనబడుతుంది.

  • మారుతి డిజైర్ ఒక వంపును కలిగి ఉంటుంది మరియు ప్రవాహ రూపకల్పన అందించబడుతుంది, కొత్త అమేజ్ దాని బాక్సీ అంచులతో ఆకర్షణీయమైన అలాగే దాదాపు ఎస్యువి రూపకల్పనను కలిగి ఉంది.

  • డిజైర్ రూపకల్పన విభాగంలో సురక్షితంగా వ్యవహరిస్తుంది, కొనుగోలుదారుల చాలామందికి కళ్ళు ఈ వాహనాన్ని తేలికగా ఆకట్టుకుంటుంది, కానీ ప్రజలు దానితో ప్రేమలో పడలేరు.

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • డిజైర్ యొక్క అత్యంత అద్భుతమైన కోణం, ముందు భాగంలో ఉన్న ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్. అంతేకాకుండా, ఇది అమేజ్ కంటే విస్తృతంగా ఉంటుంది ఎందుకంటే, ఇది మరింత గంభీరమైనదిగా కనిపిస్తుంది.

  • సైడ్ నుండి కూడా, డిజైర్ దాని బహుళ స్పోక్, రెండు టోన్ ఆర్15 అల్లాయ్ వీల్స్ అందరి కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • అమేజ్ యొక్క అత్యంత అద్భుతమైన కోణం దాని పక్క ప్రొఫైల్ అని చెప్పవచ్చు. మందపాటి షోల్డర్ లైన్తో ఈ కారు పదునైనదిగా కనిపిస్తుంది ఈ షోల్డర్ లైన్ కారు మొత్తం ఉంటుంది మరియు ఇది తక్కువగా ఉన్న సెడాన్ 'నిష్పత్తులను కలిగి ఉంది, మరియు డిజైర్ కంటే సుదీర్ఘ వీల్ బేస్ ను కలిగి ఉంది.

  • అమేజ్ యొక్క వెనుక భాగం అద్భుతంగా ఉంటుంది, కానీ హాలోజన్ బల్బులను డిజైర్ యొక్క ఎల్ఈడి ఎలిమెంట్స్ తో పోలిస్తే అది ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు.

  • అమేజ్ యొక్క మొత్తం డిజైన్ కొద్దిగా ఎక్కువ పోలరైజింగ్ గా ఉంది, కానీ హార్ట్ స్ట్రింగ్ పుల్ సామర్ధ్యం ఉంది. 

ఇంటీరియర్స్

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • రెండు కార్లు ఎక్కువ ఫీచర్లతో కూడిన క్యాబిన్లను మరియు స్పోర్ట్ ద్వంద్వ- టోన్ లేఅవుట్లను కలిగి ఉండటం వలన రెండు వాహనాలు ప్రీమియంగా కనిపిస్తాయి.

  • కానీ, డిజైర్ లేత గోధుమరంగు కలిగిన ఇంటీరియర్స్ను కలిగి ఉంటుంది, అదే అమేజ్ యొక్క డాష్బోర్డ్ బ్లాక్ ఇన్సర్ట్స్ తో ఆధిపత్యంలో ఉంది.

  • సీట్ల విషయానికి వస్తే, డిజైర్ మరింత సౌకర్యవంతంగా మరియు మెరుగైన అనుభూతిని ఇస్తుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • అమేజ్ సీట్లు మెత్తగా ఉండే అనుభూతిని అందిస్తుంది మరియు దీర్ఘ ప్రయాణాలలో ఒక రకంగా అసౌకర్య అనుభూతి ఉంటుంది. వారు విస్తృత భుజాలతో ఉన్నవారు సౌకర్యవంతంగా కూర్చోలేరు. అంతేకాక, అమేజ్ తో పోలిస్తే  డిజైర్ యొక్క ముందు భాగంలో ఉన్న స్థలం ఉత్తమం అని చెప్పవచ్చు మరియు మీ మోకాలు కోసం మంచి డాష్బోర్డ్ కంటరింగ్ ను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. మీరు అందరూ పొడవుంటే, డిజైర్ ఒక మంచి కారు అని చెప్పవచ్చు.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • వెనుక బెంచ్ సీటు విషయానికి వస్తే, రెండు కార్లు సెంటర్ ఆర్మ్ రెస్ట్ లను కలిగి ఉంటుంది, కానీ డిజైర్ యొక్క వెనుకవైపు ఏసి వెంట్లను పొందుతుంది.

  • సౌకర్యాల విషయానికి వస్తే, మళ్లీ డిజైర్ వాహనమే మంచి పాడింగ్ ను అందిస్తుంది మరియు సర్దుబాటు హెడ్ రెస్ట్ లతో మరింత సౌకర్యవంతమైన సీటింగ్ను అందిస్తుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • అమేజ్ లో అద్భుతమైన పనితీరును అందించడమే కాకుండా, తక్కువ విండో లైన్ మరియు చిన్న ఫ్రంట్ హెడ్ రెస్స్ట్లతో ఈ వాహనం యొక్క క్యాబిన్ ముందు కంటే పెద్దదిగా ఉంటుంది.

  • అమేజ్ లో వెనుక సీటు, విస్తృతంగా  ఉంటుంది మరియు ప్రయాణికులకు పుష్కలమైన మోకాలి గది అందించబడుతుంది. కానీ ముందు భాగంలో ఉండే స్థలం తక్కువగా ఉన్నందున, వారు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వారి సీటును వెనక్కి జరుపవలసి ఉంటుంది, అందువల్ల ఈ అంశం అమేజ్ కు ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు.

  • మనం సమయాన్ని ఎక్కూగా గడపడానికి రెండు వాహనాలలో ఒకదాన్ని తీసుకోవలసి వస్తే, అది డిజైర్ వాహనమే అవుతుంది. ఈ వాహనంలో వుడ్ యాక్సెంట్స్, లెధర్ తో చుట్టిబడిన ఫ్లాట్- బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు సెంటర్ కన్సోల్ లేఅవుట్లతో ఈ వాహనం మెరుగైన ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • అమేజ్ యొక్క క్యాబిన్ కూడా అద్భుతంగా ఉండగా, గేర్ నాబ్, రబ్బరు గేర్ స్టిక్ కవర్ మరియు డాష్బోర్డ్ పై పియానో బ్లాక్ యాక్సెంట్స్ వంటి అంశాలు బడ్జెట్ కార్ల వలే ఉన్నట్లు భావిస్తున్నారు. 

ఫీచర్లు

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • డిజైర్ దాని లైటింగ్ సెటప్ తో ముందంజలో ఉంది. ఇది ఎల్ఈడి ప్రొజెక్టర్ ఆటో హెడ్ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ మరియు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ తో అందించబడుతుంది.

  • మరియు ఇది కేవలం మంచిగా మాత్రమే కనబడుతుంది, కానీ రహదారి ప్రకాశవంతంగా మెరుగ్గా కనబడటానికి సహాయపడతాయి.

  • క్యాబిన్ లోపల భాగం విషయానికి వస్తే, అమేజ్ నాలుగు స్పీకర్లతో పోలిస్తే, మంచి ఆడియో అవుట్పుట్ ను అందించడం కోసం డిజైర్ లో 6 స్పీకర్ల సెటప్ అందించబడుతుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • అమేజ్లో 175/65 తో పోలిస్తే డిజైర్ లో 15- అంగుళాల 185/65 టైర్లను పొందుతుంది.

  • డిజైర్ కంటే అమేజ్ లో క్రూజ్ నియంత్రణ అంశం మాత్రమే అధనంగా అందించబడుతుంది.

  • బూట్ స్పేస్ విషయానికి వస్తే, అమేజ్ విజయం సాధించింది. ఎందుకంతే డిజైర్ వాహనం 378 లీటర్ల కార్గో స్థలాన్ని పొందుతుంటే, అమేజ్ క్లాస్- లీడింగ్ తో 420 -లీటర్ బూట్తో ముందు స్థానంలో ఉంది.

  • ఇది ఇద్దరి సులభ ప్రయాణం కోసం సూట్కేసులు మరియు సంచులు మరిన్ని సామాన్లను పెట్టుకునేందుకు వీలు కల్పించబడుతుంది. డిజైర్ తో పొలిస్తే ఇది ఉత్తమ బూట్ స్పేస్ ను కలిగి ఉంది అని చెప్పవచ్చు.

  • మొత్తంమీద, ఈ రెండు కార్లు లక్షణాల పరంగా గట్టి పోటీని కలిగి ఉన్నప్పటికీ, దాని అన్ని ఎల్ఈడి లైటింగ్ల కారణంగా డిజైర్ అగ్ర స్థానంలో ఉంది అని చెప్పవచ్చు.

ఇంజన్ అండ్ పెర్ఫామెన్స్

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • రెండు కార్ల ఇంజిన్ స్పెసిఫికేషన్ లను పోల్చినప్పుడు, అమేజ్ ఒక పంచ్ డ్రైవ్ ను అందించడంలో వాగ్దానం చేసింది.

  • మారుతికి చెందిన 1.3 లీటర్ మోటర్తో పోలిస్తే హోండా, పెద్ద 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్, డిజైర్ కంటే 25 పిఎస్ పవర్ ను అలాగే 10 ఎనెం గల టార్క్ ను ఎక్కువ విడుదల చేస్తుంది. మరియు ఈ రెండు ఉత్పాదనలు తక్కువ ఆర్పిఎం వద్ద కూడా పంపిణీ చేయబడతాయి.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • మీరు ఈ కార్లను వెనక్కి డ్రైవ్ చేస్తున్నప్పుడు, పవవ్ర్ లో దాని వ్యత్యాసం నిజంగా ముందుకు వస్తుంది. అమేజ్ యొక్క ఇంజిన్ 1750 ఆర్పిఎం వద్ద అద్భుతంగా పనిచేస్తుంది.

  • మరోవైపు, డిజైర్ మరింత ఉత్తమ పనితీరును కలిగి ఉంది. ఇది సజావుగా, దాని సొంత పేస్ వద్ద 2,000 ఆర్పిఎం దాటినప్పుడు మంచి పనితీరును అందిస్తుంది.

  • రోజువారీ ప్రయాణాలలో, రెండు ఇంజిన్లు సులభంగా పని చేస్తాయి కాని ఇది త్వరగా, మరింత సులభతరంగా ఓవర్ టేక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • పరీక్షించినప్పుడు, డిజైర్ యొక్క త్వరణం విషయానికి వస్తే, 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని చేరుకోవడానికి 12.38 సెకన్ల సమయం పడుతుంది, అమేజ్ త్వరణం విషయానికి వస్తే, 0- 100 కెఎంపిహెచ్ వేగాన్ని చేరుకోవడానికి 10.21 సెకన్ల సమయం పడుతుంది. రోల్-ఆన్ లో కూడా, మూడవ గేర్లో 30- 80 కెఎంపిహెచ్ వరకు డిజైర్ కంటే అమేజ్ వాహనం, ఒక సెకన్లు వేగవంతమైనది.

  • ఇప్పుడు, దాని మెరుగైన పనితీరుతో, డిజైర్ కంటే అమేజ్ తక్కువ సమర్థతను కలిగి ఉంటుందని మీరు అనుకోవచ్చు.

  • కానీ కాదు. మైలేజ్ విషయానికి వస్తే, అమేజ్ నగరంలో 19.68 కెఎంపిఎల్ మైలేజ్ ను అలాగే డిజైర్ సిటీలో 19.74 కెఎంపిఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ రహదారిపై వీటి వ్యత్యాసం చాలా ఎక్కువ. డిజైర్ 4 కెఎంపిఎల్ ఎక్కువ మైలేజ్ తో 27.38 కెఎంపిఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

  • ఇంజిన్ శుద్ధీకరణ విషయానికి వస్తే, అమేజ్ అంగుళాల పరంగా పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా డిజైర్ క్యాబిన్ లో ఎక్కువ ధ్వనిని ఇస్తుంది, ముఖ్యంగా కారును రివర్స్ చేసినప్పుడు కటినంగా ఉంటుంది. మరోవైపు అమేజ్ ఇంజిన్ విషయానికి వస్తే, ఎక్కువ ఆర్పిఎం వద్ద కూడా ఇంజన్ శబ్దం లేకుంగా పని చ్చేస్తుంది. ఒక ఫిర్యాదు ఉంది అది ఏమిటంటే అమేజ్ డీజిల్ వెర్షన్ లో కంపనాలు ఫ్లోర్బోర్డ్ ద్వారా క్యాబిన్లోకి వచ్చి స్టీరింగ్ వీల్ ద్వారా వింత శబ్దాన్ని కలుగ జేస్తాయి.

  • త్వరణం మరియు పనితీరును మీరు విలువకట్టినట్లయితే, ఈ రెండు వాహనాలలో అమేజ్ స్పష్టమైన విజయాన్ని సాధిస్తుంది. ఇంకొక వైపున డిజైర్ ఒక ప్రశాంతంగా పనిచేస్తుంది కాని ఇప్పటికీ నగరంలో ఎటువంటి ఫిర్యాదు లేదు. 

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, రెండు కార్లు భిన్నమైన పనితీరును కలిగి ఉంటాయి. హోండా, డిజైర్ కంటే మృదువైన పనితీరును కలిగి ఉంటాయి, దీని అర్ధం ఏమిటంటే స్పీడ్ బ్రేకర్స్ మరియు గుంతల వద్ద మంచి పనితీరును కలిగి ఉండాల్సి ఉంది అవునా?

  • ఇది, నెమ్మదిగా ఉండే వేగం వద్ద మాత్రమే. అమేజ్ ఫిల్టర్లు, విరిగిన రోడ్లు మరియు గుంతలు వద్ద డిజైర్ కంటే అద్భుతంగా పనిచేస్తాయి. కానీ వేగం పెరుగుతున్న కొద్దీ, రైడ్ కొంచెం ఎగిరినట్టుగా అనిపిస్తుంది.

  • డిజైర్ యొక్క సస్పెన్షన్ బాగా ఉత్తమంగా అమర్చబడి ఉంది. వెనక్కి నడిపినప్పుడు, రహదారి ఉపరితలంపై, అమేజ్ మరింత ఆందోళన కలిగించేలా ఉంటుంది, కానీ మీకు ఇబ్బంది కలిగించేదిగా ఉండౌ. అంతేకాక, స్టిఫ్ఫర్ డ్యాంపింగ్, విరిగిపోయిన రోడ్లపై వాహనం స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది మరియు స్పీడ్ బ్రేకర్స్ తర్వాత త్వరగా స్థిరపడుతుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • హ్యండ్లింగ్ విషయానికి వస్తే, రెండు కార్లు ఒకేలాంటి లక్షణాలను ప్రదర్శిస్తాయి - నగర ప్రయాణాలలో సాదారణ పనితీరును కలిగి ఉంటాయి. కానీ, డిజైర్- ఒక తేలికపాటి స్టీరింగ్ వీల్ ను మరియు ఒక తేలికపాటి క్లచ్ కలిగి ఉంటుంది మరియు తక్కువ బాడీ రోల్ తో మూలల్లో మరింత విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది.

  • డిజైర్ తో పోలిస్తే అమేజ్ యొక్క స్టీరింగ్, అనవసరంగా భారీగా మరియు అస్పష్టంగా అనిపిస్తుంది.

సేఫ్టి

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

  • రెండు కార్లు ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్, ఐసోఫిక్స్ మౌంట్లను మరియు ఏబిఎస్ తో ఈబిడి లను ప్రామాణికంగా పొందుతాయి.

  • అంతేకాకుండా, ఈ రెండు వాహనాల యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో వెనుకవైపు పార్కింగ్ కెమెరాలు అందించబడతాయి, కానీ అమేజ్ లో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ప్రామాణికంగాగా అందించబడతాయి.

తీర్పు

Maruti Dzire vs Honda Amaze 2018: Diesel Comparison Review

ఈ రెండు కార్ల మధ్య ఒకదానిని ఎంచుకోవడం కష్టం. రెండు వాహనాలు నగర ప్రయాణాలకు అద్భుతమైనవి, మరియు ఇతర పారామితుల్లో ఒకదాని కంటే మరొకటి మెరుగ్గా ఉంటాయి, ఇది చాలా చిన్న తేడాతో ఉంటుంది. మరియు వ్యత్యాసం యొక్క తేడా చాలా తక్కువగా ఉండటం వలన, మేము ఒక విజేతను ఎంచుకునేందుకు మీకు సహాయం చేయడానికి ఒక పట్టికను అందించాలని నిర్ణయించుకున్నాము.

అస్పెక్ట్

మారుతి డిజైర్

హోండా అమేజ్

లుక్స్

ఇంటీరియర్స్

 

ఫీచర్స్

 

ఇన్ క్యాబిన్ స్పేస్

 

ఇన్ క్యాబిన్ ఇన్సులేషన్

 

వెనుక సీట్ల అనుభవము

 

బూట్ స్పేస్

 

ఇంజన్ & ప్రదర్శన

 

(క్లియర్ విన్నర్)

మైలేజ్

 

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

(క్లియర్ విన్నర్)

 

భద్రత

హోండా ఆమేజ్ చాలా చక్కని అనేక ఫీచర్లను కలిగిన వాహనం. ఇది ఆధునిక ఫీచర్లు, తాజా భద్రతా సాంకేతికతను కలిగి ఉంటుంది మరియు ఇది ప్రయాణికులకు చాలా సౌకర్యాన్ని ఇస్తుంది. కానీ, డిజైర్ ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం మంచి పనితీరును కలిగిన ఇంజిన్. ఇది ఖచ్చితమైన పనితీరును ఇస్తుంది. కానీ దాదాపు ప్రతి సంఖ్యలో, డిజైర్ వాహనం- అమేజ్ కంటే ముందంజలో ఉంది, అందువల్ల ఇది మా ఎంపికగా ఉంది.

 

తాజా సెడాన్ కార్లు

రాబోయే కార్లు

తాజా సెడాన్ కార్లు

×
We need your సిటీ to customize your experience