మారుతి డిజైర్ వర్సెస్ హోండా అమేజ్ వర్సెస్ ఫోర్డ్ అస్పైర్: పోలికలు

Published On మే 13, 2019 By nabeel for మారుతి డిజైర్ 2017-2020

సరికొత్త పెట్రోల్ ఇంజిన్ తో కొత్త ఫోర్డ్ అస్పైర్, విభాగంలో అగ్ర శ్రేణితో దూసుకుపోనుందా?

సెడాన్ వాహనానికి నవీకరణ చేయడం వలన అందరి మన్నననూ ఆకట్టుకునే విధంగా ఉండనుంది. ఈ వాహనంతో మీ పొరుగువారిని అసూయపర్చడానికి తగినంతగా ఉంది. ఎస్యువి లను దూరంగా ఉండేందుకు మరియు ప్రజలు ప్రస్తుత బడ్జెట్ ఎక్కువ లేనటువంటి పెద్ద అలాగే మరింత ప్రీమియం లుక్ ను కలిగి ఉన్న వాహనం కోసం దీనిని ప్రారంభించారు. కానీ సెడాన్లు ఇప్పటికీ క్లాస్సియర్ ఎంపికగానే ఉంటాయి మరియు మీరు ఉప- 4 మీటర్ల వాహనాన్ని ఒక దానిని నవీకరణ చేస్తున్నట్లయితే, మీరు మారుతి సుజుకి డిజైర్ ను చూస్తున్నారని సూచించారు. డీజిల్ మాన్యువల్ వలె మా మునుపటి పోలికలతో ఇది చాలా మంచి కారు అని రుజువైంది. కానీ హోండా అమేజ్ ఒక ప్రధాన నవీకరణ రూపాన్ని పొందడానికి మరియు ఫోర్డ్ అస్పైర్ ఒక కొత్త 'డ్రాగన్' పెట్రోల్ ఇంజన్ పొందడానికి కృషి చేస్తున్నాయి, కానీ డిజీర్ ఇప్పటికీ సింహాసనాన్ని నిలబెట్టుకోగలదా?

కార్లు పరీక్షించబడ్డాయి

పెట్రోల్ వేరియంట్స్

ఫోర్డ్ అస్పైర్ టైటానియం +

హోండా అమేజ్ విఎక్స్

మారుతి డిజైర్ జెడ్ఎక్స్ఐ +

ధర

రూ .7.24 లక్షలు

రూ 7.68 లక్షలు

రూ. 8.00 లక్షలు

డిస్ప్లేస్మెంట్

1194 సిసి

1198 సిసి

1197 సిసి

ఇంధన రకం

పెట్రోల్

పెట్రోల్

పెట్రోల్

పవర్

96 పిఎస్ @ 6500 ఆర్పిఎమ్

90 పిఎస్ @ 6000 ఆర్పిఎమ్

83 పిఎస్ @ 6000 ఆర్పిఎమ్

టార్క్

120 ఎన్ఎమ్ @ 4250 ఆర్పిఎమ్

110 ఎన్ఎమ్ @ 4800 ఆర్పిఎమ్

113 ఎన్ఎమ్ @ 4200 ఆర్పిఎమ్

సిలిండర్లు

3

4

4

ట్రాన్సమిషన్లు

5- స్పీడ్ మాన్యువల్

5- స్పీడ్ మాన్యువల్

5- స్పీడ్ మాన్యువల్

లుక్స్

Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire

 • మూడు వాహనాలలో, మారుతి సుజుకి డిజైర్ దాని నిష్పత్తితో 'సెడాన్ వవ్లే కనిపిస్తుంది. ఇది ఎంతో ప్రముఖమైనదిగా ఉంది అలాగే ఇక్కడున్న కార్లలో చాలా విశాలమైన కారుగా ఉంది.

 • డిజైర్ వాహనం, ప్రయాణికులకు మరింత సహాయం చేయడానీ, పగలు మరియు రాత్రి అత్యద్భుతంలా పనిచేసే డే టైం రన్నింగ్ లైట్లతో ఎల్ ఈ డి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ అందించబడ్డాయి.

 • డిజైర్ కోసం అందించబడిన డ్యూయల్ టోన్ 15 అంగుళాల అల్లాయ్ చక్రాలు మిగిలిన రెండు కార్ల కంటే కూడా ఉత్తమంగా కనిపిస్తుంది. డిజైర్ యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, టైల్ ల్యాంప్ లలో లైట్ మార్గదర్శకాలు అందించబడ్డాయి, మరియు ఫ్లాట్ క్రోమ్ బార్ క్లాసి లుక్ ను సూచిస్తుంది.

Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire

 • ఇక్కడ అందించబడిన ఇతర కార్లలో హోండా అమేజ్, అతిచిన్న కారు మరియు పదునైన డిజైన్తో దూకుడుగా కనిపిస్తోంది. దీనితో పాటు, సాధారణ హాలోజన్ దీపాలను కలిగిన డే టైం రన్నింగ్ లైట్స్ వంటి అద్భుతమైన అంశాలు ఇవ్వబడ్డాయి. అలాగే చక్రాలు, బాగా రూపకల్పన చేయబడ్డాయి అయితే, ప్లేన్ జేన్, సిల్వర్ మోనోటోన్ లో ఉంది.

Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire

 • ఫోర్డ్ అస్పైర్, మూడు విషయాలలో అత్యంత ఉన్నతంగా కనిపిస్తుంది. అవి వరుసగా మెష్ క్రోమ్ గ్రిల్ మరియు సొగసైన ఎయిర్ డాం పైన మార్కెట్ ను సూచిస్తుంది కానీ హెడ్ల్యాంప్ క్లస్టర్ ఒక సాదారణ డిజైన్ ను కలిగి ఉంటుంది మరియు డి ఆర్ ఎల్ ఎస్ లు లేదా ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వంటివి అందించబడటం లేదు.

 • ఈ వాహనం యొక్క సైద్ ప్రొఫైల్ విషయానికి వస్తే స్పోర్టి లుక్ తో ఉన్న 16- స్పోక్ వీల్స్, రూపకల్పనకు కొంత జీవాన్ని అందిస్తాయి, కానీ ఇవి లేకుంటే ఇతర వాహనాలతో పోలిస్తే బోరింగ్ ఉంది. అంతేకాకుండా ఈ మూడు వాహనాలలో ఈ కారు యొక్క బూట్ చాలా సాధారణంగా ఉంటుంది మరియు అందరి దృష్టిని అరుదుగా ఆకర్షిస్తుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire

 • నిర్ధారణ విషయానికి వస్తే డిజైర్ ఉత్తమంగా కనిపిస్తుంది మరియు అత్యంత ఖచ్చితమైన నిష్పత్తిలో ఉంది. అమేజ్ యొక్క రూపకల్పన, పోలరైజింగ్ గా ఉన్నప్పటికీ, పదునైన ఉనికిని కలిగి ఉంది. మరియు హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఇక్కడ సరికొత్త కారు అయిన అస్పైర్, ఈ సంస్థలో పురాతనమైనది.

ఇంటీరియర్స్

Maruti Dzire

మొదట, అన్ని అగ్ర- కార్లలో ఉండే అన్ని సాధారణ లక్షణాలను చూద్దాం.

పుష్- బటన్ స్టార్ట్ / స్టాప్

కెమెరాతో వెనుక పార్కింగ్ సెన్సార్స్

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు

టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్

ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే

స్టీరింగ్- మౌంటెడ్ కంట్రోల్స్

డ్రైవర్ కోసం ఒక టచ్ అప్ / డౌన్ తో పవర్ విండోస్

 • లెధర్ స్టీరింగ్ వీల్, ఫాక్స్ వుడ్ ఎలిమెంట్లు మరియు లేత గోధుమరంగుతో కూడిన క్యాబిన్ చాలా ప్రీమియం అనుభూతిని అదిస్తుంది. మిగిలిన రెండు కార్లు కూడా రెండు టోన్ల కలయికతో కూడిన ఇంటీరియర్ ను కలిగి ఉంటుంది, వారి క్యాబిన్లను నలుపుతో ఆధిపత్యం చేస్తారు, అందువల్ల మారుతి వంటి స్థలం యొక్క భావాన్ని అందించదు.

 • డ్రైవర్ కు మంచి ఎర్గోనోమిక్స్ కోసం సెంటర్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కొద్దిగా డ్రైవర్ వైపు వంగి ఉంటుంది, కాని ఇక్కడ సుజుకి యొక్క స్మార్ట్ప్లే యూనిట్ నుండి స్పందన మిగిలిన రెండు వాహనాల లాంటి ఇంటర్ఫేస్ను కలిగి ఉండదు. అస్పైర్ వలె డిజైర్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్ లను కూడా పొందుతుంది.

​​​​​​​Honda Amaze

 • హోండా అమేజ్ యొక్క డాష్బోర్డ్, ఓల్డ్ స్కూల్ ఆకర్షణను కలిగి ఉంది. క్యాబిన్ యొక్క అమరిక మరియు ఫినిషింగ్ రెండూ బాగుంటాయి మరియు ఇన్ఫోటేయిన్మెంట్ స్క్రీన్ మరియు బటన్ల అమరిక శుభ్రంగా ఉంటుంది. అంతేకాక, అమేజ్ ఒక బడ్జెట్ కారు అయినప్పటికీ, పియానో మరియు మాట్ బ్లాక్ ప్లాస్టిక్ల వాడకం మరింత ప్రీమియంను చూస్తుంది.

 • అంతేకాక, సెంటర్ టన్నెల్ కి అనుసంధానం చేయని ఒకే ఒక కార్ అమేజ్, అందుచే ఇది చాలా నిల్వ స్థలాన్ని ఇస్తుంది.

​​​​​​​Honda Amaze

 • కానీ క్యాబిన్లో ఉపయోగించిన మెటీరియల్ రకాన్ని ప్రీమియస్ భావన కొద్దిపాటి క్రిందికి ఉంటుంది.

 • లక్షణాల పరంగా, క్రూజ్ నియంత్రణ కలిగి ఉన్న ఒకే ఒక కారు హోండా ఆమేజ్ మాత్రమే, ఇది రహదారులపై ఉపయోగపడుతుంది.

​​​​​​​Ford Aspire

 • ఫోర్డ్ అస్పైర్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ తో కూడిన డాష్ బోర్డ్ యొక్క స్మార్ట్ లేఅవుట్ను పొందుతుంది. పెద్ద సెంటర్ టన్నెల్ బాగుంది కానీ లెగ్ స్పేస్ ను ఎక్కువగా ఆక్రమిస్తుంది. అయితే, ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక ప్రత్యేక స్మార్ట్ఫోన్ ట్రే కూడా అందించబడుతుంది. లక్షణాల పరంగా కూడా, అస్పైర్ ఆటో డిమ్మింగ్ ఐ వి ఆర్ ఎం తో ఆకట్టుకుంటుంది, ఈ అంశం, ఇతర రెండు వాహనాలలో అందించబడటం లేదు.

 • కానీ స్టీరింగ్ వీల్ హార్డ్ ప్లాస్టిక్తో తయారు చేయబడుతుంది మరియు ప్రీమియంను కలిగి ఉండదు. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇతర రెండు పోలిస్తే తక్కువ వివరణాత్మక ఎం ఐ డి తో తక్కువగా కనిపిస్తుంది. డాష్ బోర్డ్ మరియు డోర్ల పై ఉన్న ప్లాస్టిక్ల యొక్క నాణ్యత కూడా మీరు కోరుకున్న విధంగా లేదు.

వెనుక సీటు

Ford Aspire

 •  మీరు వెనుకవైపు సీటులో ముగ్గురు కూర్చోవాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ ఉన్న వాటిలో ఉత్తమ కారు అస్పైర్. అంతేకాకుండా, ఇది చాలా నిశ్శబ్ద క్యాబిన్ ను పొందుతుంది.
 • వెనుక సీటు లక్షణాల పరంగా, అస్పైర్ ఎక్కువ సీటింగ్ స్థలాన్ని కలిగి ఉంటుంది. డోర్లు లేదా ఆర్మ్ రెస్ట్ లలో ఏ రకమైన కప్పు లేదా బాటిల్ హోల్డర్లు లేవు, ఏసి వెంట్స్ లేవు మరియు ఇది 12వి ఛార్జింగ్ సాకెట్ను కూడా అందించదు.

​​​​​​​Honda Amaze

 • మిగిలిన రెండు వాహనాలతో పోలిస్తే అమేజ్ లో సీటింగ్ మరియు లక్షణాలు ఉత్తమ సంతులనాన్ని అందిస్తాయి. మీరు ఆర్మ్ రెస్ట్లో, కప్ హోల్డర్స్ తో పుష్కలమైన స్థలం అందించబడుతుంది మరియు ఒక 12వి ఛార్జింగ్ సాకెట్ తో పాటు బాటిల్ హోల్డర్ కూడా అందించబడుతుంది.

 • మిగిలిన వాటిలో కన్నా ఆమేజ్ లో సీట్లు మెత్తగా ఉంటాయి మరియు మృదువైనది. మృదువైన సస్పెన్షన్తో కలిపి, గతుకుల రహదారులపై అమేజ్ చాలా సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని అందిస్తుంది. విండో లైన్ కూడా తక్కువగా ఉంది, ఇది క్యాబిన్ లో ఎక్కువ గాలి అనుభూతిని అందిస్తుంది. కానీ అమేజ్ వాహనంలో సర్దుబాటు వెనుక భాగపు హెడ్ రెస్ట్లు అందించబడటం లేదు. ఇక్కడ ఉన్న వాటిలో ఈ అంసం అందుభాటులో లేనిది ఈ ఒక్క వాహనంలోనే.

​​​​​​​Maruti Dzire

 • కానీ వెనుక భాగంలో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే మీ ప్రాధాన్యత ఉంటే, మారుతి డిజైర్ గో టూ సీట్లను కలిగి ఉంది. అమేజ్ లో ఉండే నిల్వ ఎంపికలు మరియు లక్షణాలు కూడా ఈ వాహనంలో అందించబడతాయి.

 • వెనుక భాగాన ఉండే ప్రయాణికులకు వెనుక ఏసి వెంట్లు మరియు మొబైల్ హోల్డర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ అధిక విండో లైన్ మరియు పెద్ద ఫ్రంట్ హెడ్ రెస్ట్లు కారణంగా, ఈ వాహనం యొక్క క్యాబిన్- ఇతర రెండిటితో పోలిస్తే కొద్దిగా ఇరుకైన అనుభూతిని కలిగిస్తుంది.

​​​​​​​Maruti Dzire

 • మీరు పుష్కలమైన హెడ్ మరియు నీ రూం ని కూడా పొందుతుంది. డిజైర్ పుష్కలమైన షోల్డర్ రూం ని కలిగి ఉంది, అలాగే డోర్ ఆర్మ్ రెస్ట్లు కొద్దిగా అనుచితంగా ఉంటాయి.

 • చివవ్రికి తేల్చి చెప్పింది ఏమిటంటే, అమేజ్ ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణికులకు సరిపోయే వెనుక సీటును కలిగి ఉంటుంది మరియు అందించబడిన అనేక లక్షణాల మధ్య ఉత్తమ సంతులనం అందించబడుతుంది. కానీ వెనుక భాగంలో కేవలం ఇద్దరు కూర్చోవడానికి మాత్రమే సీట్లను కలిగి ఉంటే, డిజైర్ ఉత్తమ అనుభూతిని అందిస్తుంది. అమేజ్ ముగ్గురు కూర్చోవడానికి సులభంగా ఉన్నప్పటికీ, ఇది లక్షణాలు మరియు ప్రాక్టికాలిటీను కోల్పోతుంది.

భద్రత

Ford Aspire

 • ఈ మూడు వాహనాలలో ఫోర్డ్ అస్పైర్, అత్యంత సమగ్రమైన భద్రతా సామగ్రిని అందిస్తుంది. ఇది ఏబిఎస్ మరియు ఈబిడి లతో పాటు 6 ఎయిర్బాగ్లను పొందుతుంది. దీనిలో మిస్ అయిన ఏకైక విషయం ఐసోఫిక్జ్ చైల్డ్ సీటు మౌంట్లు. పెట్రోల్ ఆటోమేటిక్ కోసం రోల్ ఓవర్ రక్షణ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి మరిన్ని అధునాతన లక్షణాలు ఈ వాహనం కోసం రిజర్వు చేయబడ్డాయి.

 • మిగిలిన రెండు కార్లు, ద్వంద్వ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు ఎబిఎస్ లతో సమాన కిట్ను అందిస్తున్నాయి. డిజైర్ మరియు అమేజ్ లు రెండూ కూడా ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్ లను పొందుతుంది.

 • క్రాష్ విషయంలో ఈ మూడు కార్లలో ఏది అధిక భద్రత కలిగినది అనే అంశంపై వ్యాఖ్యానించడం సాధ్యం కాదు. రెండు ఎయిర్బాగ్స్ తో ప్రీ- ఫేస్లిఫ్ట్ అస్పైర్ మాత్రమే గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్ట్ చేయబడింది, ఈ పరీక్షలలో 3 స్టార్ రేటింగ్ సాధించగా, మిగిలిన రెండు కార్లు ఈ పరీక్షను ఎదుర్కోలేవు.

ఇంజిన్ మరియు ప్రదర్శన

పెర్ఫామెన్స్ - టెస్టడ్

ఫోర్డ్ ఆస్పైర్

హోండా అమేజ్

మారుతి డిజైర్

0- 100 కెఎంపిహెచ్

12.01 సెకన్లు

12.00 సెకన్లు

11.88 సెకన్లు

30- 80 కెఎంపిహెచ్ 3 వ గేర్

11.47 సెకన్లు

11.70 సెకన్లు

10.39 సెకన్లు

40- 100 కెఎంపిహెచ్ 4 వ గేర్

21.35 సెకన్లు

19.98 సెకన్లు

19.82 సెకన్లు

100- 0 కెఎంపిహెచ్

3.16 సెకన్లు / 44.76 మీటర్లు

3.11 సెకన్లు / 40.31 మీటర్లు

3.45 సెకన్లు / 44.66 మీటర్లు

సిటీ మైలేజ్

15.92 కెఎంపిఎల్

15.14 కెఎంపిఎల్

15.85 కెఎంపిఎల్

హైవే మైలేజ్

19.52 కెఎంపిఎల్

20.01 కెఎంపిఎల్

20.90 కెఎంపిఎల్

 •  ఈ మూడు కార్లు, సంఖ్యలు ఎలా మోసగించవచ్చనేదానికి సరైన ఉదాహరణ. కాగితంపై, అస్పైర్ అత్యంత శక్తివంతమైన కారు, దీని హుడ్ కింద భాగం విషయానికి వస్తే దీని క్రింది ఉన్న ఇంజన్ గరిష్టంగా 96 పిఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అమేజ్ 90 పిఎస్ పవర్ ను విడుదల చేస్తుంది, అయితే డిజైర్ కేవలం 83 పిఎస్ పవర్ ను మాత్రమే విడుదల చేస్తుంది. కానీ మీరు పెడల్ను లోహానికి ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో ఊహించండి?

Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire 

 • 100 కె ఎం పి హెచ్ ను చేరుకోవడానికి డిజైర్ వేగవంతమైన కారుగా ఉంది, దీని తరువాతి స్థానాలలో దగ్గరగా అమేజ్ మరియు అస్పైర్ లు ఉన్నాయి (వి బాక్స్ పరీక్షించిన డేటా). డిజైర్ ఇక్కడ చిన్న గేరింగ్ ను పొందుతుంది, ఇది రివర్స్ తీసుకున్నప్పుడు త్వరిత అధిరోహణను అనుమతిస్తుంది. ఇది మిగిలిన రెండిటి కంటే వేగవంతమైన ఇన్- గేర్ త్వరణ సమయాలతో ఇన్పుట్లను థ్రోటల్ చేయటానికి ఇక్కడ అత్యంత రియాక్టివ్ కార్ గా డిజైర్ నిలిచింది.

 • మీరు ఎక్కువ సమయం నగరంలో గడుపుతుంటే, డిజైర్ వాహనం ఓవర్ టేక్లు చేయడానికి తక్కువ డౌన్ షిఫ్ట్ లతో నడపడం సులభతరంగా ఉంటుంది.

​​​​​​​Honda Amaze vs Ford Aspire

 • అమేజ్ మరియు అస్పైర్ రెండు వాహనాలూ, ఒకే రకమైన గేర్ త్వరణాన్ని కలిగి ఉంటాయి కానీ అది ఒక బలమైన మధ్యస్థాయి అమేజ్ లా ఉంది. ఇది నగరంలో అస్పైర్ కంటే బలంగా ఉంటుంది.

 • ఫ్రీస్టైల్ లో ఉండే అదే ఇంజిన్ను పొందుతుంది, కానీ ఈ ఇంజన్ పొడవైన గేరింగ్ తో అందుభాటులో ఉంది. ఇది నిరుత్సాహపూరితమైన అనుభూతిని అందిస్తుంది మరియు అస్పైర్ రివర్స్ ద్వారా పైకి ఎక్కడానికి కొంత సమయం పడుతుంది. ఇది 4వ గేర్ త్వరణంలో మిగిలిన రెండు వాహనాల కంటే దాదాపు 1.5 సెకన్లు నెమ్మదిగా ఉంటుంది.

​​​​​​​Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire

 • అస్పైర్ వాహనం, మూడు సిలిండర్ యూనిట్ తో కూడిన 1.2 లీటర్ డ్రాగన్ ఇంజిన్ ను కలిగి ఉంది, మరియు రివర్స్లో గేర్ ను పెంచడంతో ఫ్లోర్ బోర్డ్ లో క్రీప్ ను మొదలు పెట్టడంతో కొద్దిపాటి కంపనాల అనుభూతిని అస్వాదించవలసి వస్తుంది. మారుతి యొక్క 1.2- లీటర్ ఇంజిన్ ఇక్కడ ఉన్న వాటిలో ఉత్తమమైనది. అమైజ్ యొక్క ఐ వి టెక్ ఇంజన్ రెండవ స్థానంలో నిలచింది.

 • రహదారిలో, అమేజ్ వాహనం సౌకర్యవంతమైన వాహనంగా నిలుస్తుంది, మారుతి రెండవ స్థానంలో నిలుస్తుంది. అంతేకాకుండా, అమేజ్ లో అందించబడిన క్రూజ్ నియంత్రణ ఇక్కడ మరొక ప్రయోజనంగా ఉంది.

​​​​​​​Ford Aspire

 • మైలేజ్ విషయానికి వస్తే, మూడు కారులు నగరంలోని 15.5 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తాయి మరియు రహదారిపై 19.5 కిలోమీటర్ల మైలేజ్ వరకు అందిస్తాయి.

 • గేర్బాక్స్ విషయానికి వస్తే, మారుతి సున్నితమైన- షిఫ్టింగ్ సెటప్ను పొందుతుంది. అయితే అమేజ్ విషయానికి వస్తే కొద్దిపాటీ నాట్చీగా అనిపిస్తుంది. ఇక్కడ చెప్పుకోతగ్గ మరో విషయం ఏమిటంటే, అమేజ్ యొక్క అసాధారణ భారీ క్లచ్.

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

Honda Amaze

 • ఇక్కడ అత్యంత సౌకర్యవంతమైన కారు, మీరు నివసిస్తున్న ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది.

 • మీరు విరిగిన రోడ్లపై ప్రయాణించవలసి వస్తే, అమేజ్ యొక్క మృదువైన సస్పెన్షన్ అత్యంత సౌకర్యవంతమైనదిగా ఉంటుంది. ఇది గుంతలను బాగా శోషించి, మీకు సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని అందిద్స్తుంది.

 • కానీ ఈ వాహనంలో అధిక వేగంతో ప్రయాణిస్తే, కొంచెం ఎగిరిపడుతున్న అనుభూతి అందించబడుతుంది మరియు స్థిరపడటానికి కొంత సమయాన్ని తీసుకుంటుంది.

 • స్టీరింగ్ నుండి కొంచెం అస్పష్టమైన అభిప్రాయాలతో పాటు, ఇది నిర్వహణ అనుభవం నుండి దూరంగా ఉంటుంది.

​​​​​​​Ford Aspire

 • అమేజ్ తో పోల్చితే ఫోర్డ్ అస్పైర్ కొద్దిగా గట్టి అమరికను పొందుతుంది. ఈ సెటప్ చాలా చెడ్డ రహదారుల నుండి బాగా సమకూర్చినప్పటికీ, సస్పెన్షన్ రీబౌండ్ ఒక చిన్న గట్టిగా ఉంటుంది మరియు అధిక వేగంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అలాగే సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని అందిస్తుంది.

 • హ్యాండ్లింగ్ పరంగా, అస్పైర్ యొక్క స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఆమేజ్ కన్నా మెరుగైనది కానీ సస్పెన్షన్, విశ్వాసం నుండి శరీర రోల్ యొక్క బిట్కు తీసుకోవడానికి అనుమతిస్తుంది.

​​​​​​​Maruti Dzire

 • ఇక్కడ మారుతి డిజైర్ ఆశ్చర్యకరంగా ఉంది. అది నడపడానికి చాలా చురుకైనది మాత్రమే కాకుండా ఉత్తమమైన నిర్వహణాత్మక డైనమిక్ లను అందిస్తుంది.

 • ఇక్కడ ఉన్న వాటిలో ఈ వాహనం యొక్క సస్పెన్షన్ మాత్రమే గట్టిగా ఉంటుంది తరువాత ఇది త్వరగా గట్టిగా నిలబడటానికి సహాయపడుతుంది. మీరు క్యాబిన్ లో అంతులేని అంశాల అనుభూతులను అనుభవిస్తారు, కానీ ఇది అసౌకర్యంగా లేదు. కాబట్టి, టైర్ 1 ఉపయోగం కోసం, ఈ సస్పెన్షన్ సెటప్ ఒక అర్ధవంతంగా ఉంది.

 • అంతేకాకుండా, ఈ సెటప్- అధిక వేగంతో మరియు కార్నరింగ్లో కారును స్థిరంగా ఉంచుతుంది. మిగిలిన రెండిటిలో డిజైర్ కోసం స్టీరింగ్ ఫీడ్బ్యాక్, ఉత్తమమైనది మరియు మంచి నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.

తీర్పు

Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire

వాటి వాటి అగ్రశ్రేణి వేర్రియంట్లలో పరీక్షించిన కార్ల కోసం కచ్చితంగా మాట్లాడవలసి వస్తే, ఇక్కడ తీర్పు చాలా స్పష్టంగా ఉంది: డిజైర్ అత్యుత్తమ ఆల్ రౌండర్ మరియు ఇప్పటికీ అగ్ర స్థానంలోనె ఉంది. కానీ ఇది పెట్రోల్ మాన్యువల్ వేరియంట్స్ కు మాత్రమే. మీరు ఒక డీజిల్ వెర్షన్ ను కొనడానికి చూస్తున్నట్లయితే, అదే విభాగానికి చెందినది ఇక్కడ ఉంది మరియు ఇక్కడ ఉన్న మా మునుపటి పోలికలను చూడండి. మీరు ఒక ఆటోమేటిక్ కోసం ఎదురు చేస్తున్నట్లయితే, ఏ ఎం జెడ్ ట్రాన్స్మిషన్ తో డిజైర్ మాత్రమే వస్తుంది, అయితే అమేజ్ మరియు అస్పైర్ లు రెండూ కూడా మంచి సివిటి ను మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్స్ లను కలిగి ఉంటాయి.

అయితే, ఈ స్పెసిఫికేషన్లో, డిజైర్ వాహనం ఉత్తమ లక్షణాలను, లుక్స్ ను, డ్రైవింగ్ మరియు రైడ్ నాణ్యతల ఉత్తమ కలయికను పొందుతుంది. దీని ధర రూ. 8 లక్షల ధరను సమర్థిస్తుందని మేము భావించినప్పటికీ, ఇది మధ్యస్థాయి హ్యాచ్బ్యాక్ నుండి పైన ఉంది.

Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire

ఇది అస్పైర్ మరియు ఆమేజ్ ల మధ్య ఎంచుకోవడం కష్టం. రూ 7.24 లక్షలతో అస్పైర్ విలువకు తగిన వాహనంలా ఉంది. ఇది తక్కువ ధర ట్యాగ్లో ఒక ఆచరణాత్మక సెట్ లక్షణాన్ని పొందుతుంది మరియు ఉత్తమ భద్రతా సామగ్రిని కలిగి ఉంటుంది. కానీ క్యాబిన్ నాణ్యత మరియు వెనుక సీట్ అనుభవం మీద కొద్దిపాటి రాజీలను కలిగి ఉన్నాయి. భద్రత మీ ప్రాధమిక ఆందోళన గా ఉంటే దీనిని ఎంపిక చేసుకోవచ్చు. హోండా అమేజ్, అస్పైర్ కంటే రూ 44,000 ఎక్కువ ధరను కలిగి ఉంది, కానీ క్యాబిన్ నాణ్యత మరియు మరింత సౌకర్యవంతమైన ఇంజిన్లో దీనిని సమర్థిస్తుంది. ఇది నగరానికి ఉత్తమ కారు అని చెప్పవచ్చు మరియు మా పేలవమైన నగర రహదారులపై అత్యంత సౌకర్యవంతమైన కారుగా ఉంది. మీరు నగరంలో ఎక్కువ సమయము గడపాలని అనుకొంటే, అమేజ్ వాహనం సరిగ్గా సరిపోతుంది.

తాజా సెడాన్ కార్లు

రాబోయే కార్లు

తాజా సెడాన్ కార్లు

×
We need your సిటీ to customize your experience