2017 మారుతి డిజైర్: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
Published On మే 13, 2019 By cardekho for మారుతి డిజైర్ 2017-2020
- 0 Views
- Write a comment
ఇది ప్రవేశపెట్టబడిన దాదాపు దశాబ్దం తర్వాత, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కాంపాక్ట్ సెడాన్ లలో, మారుతి సుజుకి డిజైర్ ఒకటి, అన్ని-కొత్త మరియు నవీకరించబడిన అవతార్లో కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. ఇది పెద్దగా, మరింత విశాలంగా, అనేక లక్షణాలతో మరియు చాలా స్టైలిష్ గా విడుదల అయ్యింది. అయితే ఈ మారుతి సుజుకి డిజైర్ వాహనం, టాటా టిగార్, హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్లిఫ్ట్ వంటి ఇటీవల విడుదల అయిన పోటీదారులైన ప్రత్యర్ధి వాహనాలకు ఎంత పోటీను ఇవ్వగలుగుతుంది? ఇది ప్రజల హృదయాలను ఎంత వరకు ఆకట్టుకుంటుంది మరియు అమ్మకాల పట్టికలలో ఏ విధంగా కొనసాగుతుంది? అన్న విషయాలను తెలుసుకుందాం.
ఎక్స్టీరియర్స్
ఈ వాహనం అపారమైన విజయాన్ని సాధించినప్పటికీ, పాత డిజైర్ ఎప్పుడూ ఆకర్షణీయంగా లేదు. కానీ మూడవ తరం కొత్త మోడల్ తో, డిజీర్ చివరికి – కొనుగ్లెలుదారులకు కావాల్సిన విధంగా మారి, తాజాగా, సమకాలీన మరియు సెగ్మెంట్ పైన ఉండే సెడాన్ లాగా కనిపిస్తోంది.
ఇది కొన్ని రకాలిగా పెద్దదిగా కనిపిస్తుంది – కానీ పొడవు పరంగా కాదు వెడల్పు 20 మిల్లీ మీటర్లు పెరిగింది అయితే ఈ కొత్త డిజైర్ వాహనం ఎత్తు పరంగా 40 మిల్లీ మీటర్లు తగ్గింది మరియు 170 మిల్లీ మీటర్లు నుండి 163 మిల్లీ మీటర్లు వరకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తగ్గించబడింది. డిజైర్ యొక్క మార్పులు, మరింత అద్భుతమైన నిష్పత్తిలో, సొగసైన వైఖరితో అందంగా కనబడుతుంది. ఉప 4- మీటర్ పరిమితుల కోసం లేకపోతే, కొత్త డిజైర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది! గోవా యొక్క రహదారులపై, కొత్త డిజైర్ సెడాన్- ఒక సంగ్రహావలోకనం పొందుటకు ప్రయత్నిస్తున్న వాహనదారులను చాలా ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి: 2017 మారుతి సుజుకి డిజైర్ కోసం ఉపకణాలు
ఈ వాహనం యొక్క భాహ్య భాగం విషయానికి వస్తే ముందు భాగంలో, గ్రిల్ చుట్టూ ఒక మందపాటి క్రోమ్ స్ట్రిప్ అందించబడింది. కొన్ని విధాలుగా దీన్ని చూసినట్లయితే, ఇది ఫియట్ పుంటో ఇవో యొక్క గ్రిల్ ను గుర్తుచేస్తుంది. ఇప్పుడు ఇది, ఎల్ఈడి లతో కూడిన (డే టైం రన్నింగ్ లైట్లు) అద్భుతమైన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు ఉన్నాయి - సాధారణంగా ఇవి, హోండా సిటీ వంటి ఉన్నత విభాగాలలో కనిపించే లక్షణాలు, కానీ ఇగ్నిస్ వంటి కార్లు తక్కువ విభాగానికి చెందిన కార్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఫాగ్ లాంప్స్ కింద భాగంలో సన్నని, మీసం వంటి క్రోమ్ ఇన్సర్ట్ అందించబడ్డాయి. ఇవి ముందు భాగానికి మరింత ప్రాముఖ్యాన్ని పెంచుతాయి. నిరాశాజనకమైన విషయం ఏమిటంటే, కొత్త 15- అంగుళాల "ప్రెసిషన్ కట్" అల్లాయ్ వీల్స్ ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లలో మాత్రమే అందించబడ్డాయి. దిగువ శ్రేణి వి వేరియంట్ విషయానికి వస్తే, 14 అంగుళాల స్టీల్ వీల్స్, కవర్లతో పాటు అందించబడతాయి.
వెనుక భాగం విషయానికి వస్తే ఎల్ఈడి లతో కూడిన టైల్ లాంప్లు బూట్ విభాగాన్ని మరింత అందంగా కనబడేలా చేస్తాయి. అంతేకాకుండా ఒక సన్నని క్రోమ్ స్ట్రిప్ వెనుకవైపు ఉన్న బూట్ భాగం మొత్తం కొనసాగించబడి ఉంటుంది. బూట్ విభాగం కూడా చాలా బాగా అమర్చబడింది మరియు ఇది ఉప 4 మీటర్ కిందకి వస్తాయి. కొట్టొచ్చినట్టుండే అనుభూతి లేదు. మీ సామాను మరింత ఎక్కువ పెట్టుకునేందుకు, బూట్ స్థలం 62 లీటర్ల పొడిగించగా ప్రస్తుతం 378 లీటర్ల వద్ద నిలుస్తుంది. టాటా టిగార్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు హోండా అమేజ్ వాహనాలు 400 లీటర్ల బూట్ స్థలాన్ని కలిగి ఉండటం వలన వాటి కంటే ఈ డిజైర్ తక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది . అయితే, కొన్ని పెద్ద సంచులు మరియు కెమెరా పరికరాలు ప్యాక్ చెయ్యడానికి తగినంత పెద్ద బూట్ సామర్ధ్యం అందించబడింది (సూచన కోసం పిక్చర్ గ్యాలరీ ను శోధించండి).
ఇంటీరియర్స్
కావాల్సిన విధంగా లోపల భాగం చూడటానికి ఆశ్చర్యం కలిగించేలా డిజైర్ యొక్క క్యాబిన్ ఉద్భవించబడింది. ఈ క్యాబిన్ లో ముందుగా కనిపెట్టే అంశం ఏమిటంటే క్రోమ్ చేరికలు మరియు ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్లతో డ్యూయల్- టోన్ డాష్బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్ అద్భుతంగా ఇవ్వబడ్డాయి (ఇవి చవకగా లేవు). ఫ్లాట్- బేస్డ్ స్టీరింగ్ వీల్ ఈ సెగ్మెంట్కు మొట్టమొదటిసారిగా అందించబడిన అంశం. కానీ ఇది, దిగువ శ్రేణి ఎల్ వేరియంట్ నుంచి అందుబాటులో ఉన్నాయి. అగ్ర శ్రేణి వేరియంట్లలో, స్టీరింగ్ వీల్ మరింత దృష్టిని పొందుతుంది, ఇది ఫాక్స్ లెదర్లో చుట్టబడి, మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. క్యాబిన్ మరింత అద్భుతంగా కనిపించడం కోసం స్టీరింగ్ వీల్ పై ధ్వని మరియు టెలిఫోన్ ని నియంత్రించడానికి బటన్లు స్టీరింగ్ వీల్ పై ఉత్తమమైనవిగా పనిచేసే విధంగా అందించబడ్డాయి. పవర్ విండోలకు తలుపు మీద స్విచ్లు అందించడం సాధ్యం కానప్పటికీ, మృదువైన అనుభూతికి మరియు మంచి పనితీరును కలిగి ఉంటాయి. గేర్ లివర్ వద్ద గొప్ప అనుభూతి కొనసాగుతుంది, ఇది ఏఎంటి లో మాత్రమే అందుబాటులో ఉంది మరియు ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది అలాగే లోపలి భాగం మరింత ఆడంబరంతో నిండిపోవడానికి క్రోమ్ చేరికలు అధిక మొత్తంలో ఉపయోగించడం జరిగింది.
ఇది కూడా చదవండి: 2017 మారుతి సుజుకి డిజైర్: మనం ఇష్టపడే 5 అంశాలు
డాష్బోర్డు సరైన ఎర్గోనోమిక్స్ కోసం డ్రైవర్ వైపుకు బిగించబడి ఉంటుంది మరియు 7 అంగుళాల స్మార్ట్ప్లే ఇన్ఫోటైయిన్మెంట్ సిస్టమ్ ను వీక్షించడంతో పాటు ఇప్పుడు ఆపిల్ కార్ప్ మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ ఆటోకు కూడా మద్దతు ఇస్తుంది. 6- స్పీకర్ సిస్టమ్ యొక్క ధ్వని నాణ్యత ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఇది అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది. యూఎస్బి, ఆక్స్, సిడి మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో సాధారణ ఆడియో సిస్టమ్ను దిగువ వేరియంట్స్ పొందుతాయి. మేము దీనిని తనిఖీ చేయలేకపోతుండగా, మీరు చూసేందుకు ప్రీమియమ్ లుక్ తో కూడిన కొన్ని చిత్రాలు ద్వారా స్మార్ట్ప్లే వ్యవస్థ ను అందించాము. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ యొక్క ఫిట్ మరియు ఫినిషింగ్ స్పష్టమైన ప్యానెల్ ఖాళీలతో ఖచ్చితమైన కంటే తక్కువ అనుభూతిని ఉంది.
డ్రైవర్, ఎత్తు సర్దుబాటు సీటు, స్టార్ట్ -స్టాప్ బటన్, ఎలక్ట్రికల్ గా మడత సర్దుబాటు మరియు సర్దుబాటు వెలుపలి వెనుక అద్దాలు మరియు డ్రైవర్ యొక్క సైడ్ ఆటో అప్-డౌన్ పవర్ విండో వంటి సౌకర్యాలను పొందుతాడు. ముందు సీట్లు పెద్దవిగా ఉంటాయి మరియు పెద్ద పరిమాణం గల ప్రయాణికులు కూడా సౌకర్యంగా కూర్చోగలుగుతారు. మారుతి సుజుకి మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది మరియు డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ కనీసం ఏఎంటి రకాల్లో అయినా చేర్చి ఉంటే బాగుండేది.
ఇవి కూడా చదవండి: 2017 మారుతి సుజుకి డిజైర్ ఓల్డ్ వర్సెస్ న్యూ: ఏ ఏ అంశాలు మార్చబడ్డాయి
పెరిగిన వీల్ బేస్ మరియు వెడల్పు ఫలితంగా మెరుగైన క్యాబిన్ స్థలం అందించబడింది, కాని అతి పెద్ద లబ్ధిదారులు ఎవరంటే వెనుక సీటు ప్రయాణీకులు. మీ కాళ్ళను సౌకర్యవంతంగా ముందుకు సాగదీయడానికి మీరు నీ రూమ్ గణనీయంగా పెరిగింది. తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ, కాబిన్ లోపల ఉన్న గదిలో 6 అడుగుల కంటే తక్కువగా, ఉన్న ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోగలుగుతారు. షోల్డర్ రూం కూడా ఒక వంతు పెరిగింది, అయితే, రహదారిలో ప్రయాణించడానికి ముగ్గురు పెద్దలు సౌకర్యవంతమైన రైడ్ ను అందిదంచడానికి మాత్రమే సంస్థ వారు తయారు చేయలేదు, అయితే నగరం లోపల కూడా తక్కువ ప్రయాణాలకు అద్భుతమైన పనితీరు అందించే విధంగా తయారు చేసారు. వారు మరింత ముందుకు వెళ్ళి, క్యాబిన్ మరియు టెంపర్స్ చల్లగా ఉంచడానికి ఒక కొత్త వెనుక ఏసి వెంట్ ను అందించారు. ఉపయోగంలో లేనప్పుడు, మధ్యస్థ సీటును క్రింది వైపుగా తీసినట్లైతే కప్ హోల్డర్స్తో కూడిన సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, మధ్య సీటును ఉపయోగించుకోవాలనుకుంటే ఆర్మ్ రెస్ట్ ను మూసివేయవచ్చు. అయితే వెనుక భాగంలో మరిన్ని నిల్వ స్థలాలు ఉన్నాయి- అవి ఎమిటంటే, వెనుక డోర్లకు సీసా హోల్డర్లు, సీట్ బ్యాక్ పాకెట్లు మరియు వెనుక ఏసి వెంట్ పక్కన మొబైల్ హోల్డర్ వంటి మరికొన్ని నిల్వ స్థలాలు ఉన్నాయి. మరియు మీ పరికరాల్లో ఏదైనా చార్జింగ్ అయిపోతే, ఒక ఆలోచనాత్మకంగా జోడించిన పవర్ సాకెట్ కూడా అందించారు.
పెర్ఫామెన్స్
కొత్త డిజైర్ యొక్క ఇంజన్ నమ్మదగినది మరియు విశ్వసనీయమైనది. అవి వరుసగా 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ యూనిట్లు ఉన్నాయి. శక్తి మరియు టార్క్ ఉత్పత్తులు కూడా ఏ విధమైన మార్పులను కలిగి లేవు. మారిన విషయం ఏమిటంటే, మారుతి లో తాజాగా మధ్యస్థ వి వేరియంట్ నుంచి 5- స్పీడ్ ఏ ఎంటి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) యూనిట్ రూపంలో ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ అందించబడుతుంది. ఇంజన్ పై ఆధారపడి కొత్త డిజైర్ యొక్క బరువు 85- 95 కిలోలు తగ్గించబడింది
ఇగ్నిస్ వాహనంలో అందించిన ఏ ఎంటి చేత మేము బాగా ఆకట్టుకున్నాము, అందుచేత డిజైర్ యొక్క సెటప్ నుండి అధిక అంచనాలను కలిగి ఉన్నాము. మారుతి సంస్థ, డిజైర్ లో ఏఎంటి యొక్క గేరింగ్ మరియు అమరికను సవరించిందని పేర్కొంది. నగరంలో డిజైర్ డీజిల్ ఏఎంటి డ్రైవింగ్, ఒక మృదువైన పనితీరును మరియు క్రీప్ ఫంక్షన్ వెళుతూ ఆగుతూ ఉండే రహదారి ప్రయాణాలలో మరింత సౌలభ్యాన్ని జత చేస్తుంది. కానీ బహిరంగ రహదారులపై, సాధారణంగా ఏ ఎంటి గేర్బాక్సులతో సంబంధం ఉన్న 'హెడ్-నోడింగ్' ( ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇగ్నిస్ లో ఉండదు), 2000 ఆర్పిఎం మార్క్ చుట్టూ మీరు అప్షైఫ్ట్ చేసినప్పుడు అసౌకర్యమైన రైడ్ ను అందిస్తుంది. అధిగమించటానికి చూస్తున్నారా? యాక్సిలరేటర్ను స్లామ్ చేయడం ద్వారా ముందుగానే మీ కదలికను ప్లాన్ చేయాలి లేదా ఆ పాస్ని చేయడానికి ముందు డౌన్షీట్కు తగ్గించడ అవసరం. మనము మాన్యువల్ మోడ్ కి మారిపోవడమే అనేది సులభమైన ఎంపిక. కానీ అది మీ ఎడమ చేతికి ఈకువ పని కల్పించినట్టుగా ఉంటుంది.
మీ డ్రైవింగ్ యొక్క అధిక భాగం రహదారులలో ఉన్నట్లయితే, మీరు డీజిల్ మాన్యువల్ ను ఎంపిక చేసుకోవాలి. గేర్బాక్స్ ప్రతిస్పందనలు మరియు మార్పులు సజావుగా జరుగుతాయి మరియు మీరు ఏ రకమైన సమస్యలను అయిన్నా సులభంగా ఎదుర్కోగలరు. బరువు కోల్పోయినప్పటికీ, డీజిల్ ఇప్పటికీ బరువుగా ఉందని మరియు పేస్ను సేకరించడానికి, ఈ కారు కోసం కొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత, అది ఎటువంటి ఇబ్బందులు లేకుండా 80- 100 కెఎంపిహెచ్ బ్యాండ్ వద్ద సంతోషకరమైన క్రూజ్ ఉంటుంది. మొత్తం మీద, ఇంజిన్ మృదువైన, మరింత శుద్ధిచేయబడినదిగా మరియు ఇప్పుడు తక్కువ శబ్దాన్ని అందిస్తుంది, అయితే కొన్ని ముసుగులు (సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: 2017 మారుతి సుజుకి డిజైర్: వేరియంట్ల వివరాలు
కానీ మీరు నగరంలో మరియు అధిక డ్రైవింగ్ ఉన్న ఒక కారు కావాలనుకుంటే, అది డిజైర్ పెట్రోల్ ఏ ఎంటి ను సిఫార్సు చేస్తున్నాము. ఇంజిన్ శుద్ధి చేయబడినది మరియు ఉన్నత పనితీరును తో ఉంది మరియు గేర్ షిఫ్ట్లు సున్నితమైనవి అలాగే డ్రైవర్ యొక్క అవసరాలకు అనుగుణంగా ఉంటాయి.
రైడ్ & హ్యాండ్లింగ్
డిజైర్ గురించి చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, అది రైడ్ నాణ్యత. సస్పెన్షన్ చాలా నిశ్శబ్దంగా ఉంది, రైడ్ పట్టును, మరియు ఉత్తమ పనితీరును అందిస్తుంది. మేము నిజంగా కఠినమైన మరియు విరిగిన రోడ్ల పై ప్రయాణించాము కానీ డిజైర్ సస్పెన్షన్ ఏ రకమైన సమస్యలను, శబ్దాలను క్యాబిన్ లోనికి అందించకుండా అన్నింటినీ శోషించుకుంటుంది, ముఖ్యంగా ఏ ఎంటి వేరియంట్లలో దీనిని ప్రత్యేకంగా చూడవచ్చు. పాత డిజైర్ లో అనుభవించిన అనుభూతి కొత్త డిజైర్ వెనుక భాగంలో ఎటువంటి సమస్యలూ లేవు. గ్రౌండ్ క్లియరెన్స్ 7 మిల్లీమీటర్లు పడిపోయినప్పటికీ, డిజైర్ గతుకుల రోడ్లపై సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని అందిస్తుంది. మీ ప్రాధాన్యతపై సౌలభ్యం ఎక్కువగా కావాలనుకుంటే, అప్పుడు డిజైర్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి: ఐదు అంశాలు కొత్త మారుతి డిజైర్ ను మరింత అద్భుతంగా చూపించడానికి వచ్చ్హాయి
సమాంతర రహదారులపై, 100 కెఎంపిహెచ్ వేగం వరకు డిజైర్ వాహనం స్థిరంగా ఉంటుంది, ఇది 186/65 టైర్లను కలిగి ఉండటమ వలన రొడ్లపై గట్టి పట్టును కలిగి ఉంటుంది. కానీ మూలల్లో అదే స్థాయిని అందించదు. తక్కువ వేగంతో డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ తగినంత ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. మీరు పేస్ను సేకరించి, ముందు చక్రాలు ఏమి చేస్తాయనే దాని గురించి మీకు సరిగ్గా తెలియకుండా ఒక వంతు తేలికగా మారుస్తుంది. బ్రేక్లు ప్రతిస్పందిస్తాయి మరియు పనిని పూర్తి చేస్తాయి కానీ పానిక్ బ్రేకింగ్ పరిస్థితులు ఉత్తమంగా ఉంటాయి.
ఇంధన సామర్ధ్యం
కొత్త మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ మాన్యువల్ మరియు ఏ ఎంటి లు రెండూ కూడా ముందు వెర్షన్ కంటే 1.1 కెఎంపిఎల్ మైలేజ్ మాత్రమే తేడా ఉంది. రెండు వెర్షన్ లలోనూ 22 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తుంది. కానీ డీజిల్ యొక్క మైలేజ్ 28.04 కెఎంపిఎల్ గా ఉంది! భారతదేశంలో అత్యంత ఇంధన సామర్ధ్యం కలిగిన కాంపాక్ట్ సెడాన్ లలో మారుతి సుజుకి డిజైర్ అగ్ర స్థానంలో ఉంది, ఇది రెండవ స్థానంలో ఉన్న ఫోర్డ్ అస్పైర్ కంటే ఎక్కువ మైలేజ్ ను అందిస్తుంది, ఇది 25.83 కెఎంపిఎల్ మైలేజ్ ను పంపిణీ చేస్తుంది. టిగార్ మరియు ఎక్సెంట్ లు వరుసగా 20.3 కెఎంపిఎల్ మరియు 20.14 కెఎంపిఎల్ మైలేజ్ ను అందించగా పెట్రోల్ డిజైర్ కూడా దాని ప్రత్యర్థుల తో పోలిస్తే ఎక్కువ మైలేజ్ ను అందిస్తుంది. కొత్త డిజైర్ వాహనాన్ని సమగ్ర పరీక్ష చేసి మైలేజ్ నిరూపించబడింది, మరిన్ని విషయాల కోసం ఎదురు చ్చూస్తూ ఉండండి.
సేఫ్టీ
డిజైర్ యొక్క అతి పెద్ద ప్లస్ పాయింట్లలో భద్రత ఒకటి. ఇప్పుడు ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్ మరియు ఏబిఎస్ వంటి అంసాలు దిగువ శ్రేణి వేరియంట్ ఎల్ నుండి ప్రామాణికంగా అందించబడ్డాయి. పాత ఎల్ (ఆప్షనల్) వెర్షన్, దాని ధరను తగ్గించుకుంది ఇది కేవలం రూ 7000 రూపాయల కంటే తక్కువ ధరను నిర్ణయించడం ద్వారా భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఇది భద్రతపై దృష్టి సారించి అనేక అంశాలను అందించడం అనేది మారుతి నుండి భారీ ప్రకటన అని చెప్పవచ్చు. గమనించదగ్గ విషయమేమిటంటే, మారుతి హార్ట్టెక్ట్ ప్లాట్ఫారమ్ పై డిజైర్ ను నిర్మించబడటం అనేది, భవిష్యత్తులో భద్రతా నిబంధనలకు సిద్ధంగా ఉంటుందని అర్ధం.
భద్రతా కిట్ యొక్క ఇతర ప్రామాణిక అంశాలు ఏమిటంటే, మీ పిల్లలు ప్రయాణ సమయంలో సురక్షితంగా ఉండేందుకు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లు మరియు ప్రీటెన్షినార్లు మరియు ఫోర్స్ లిమిటెర్ తో కూడిన ముందు సీటు బెల్ట్లు వంటి అంశాలు అందించబడ్డాయి. అయితే, రివర్స్ పార్కింగ్ సెన్సార్ జెడ్ వేరియంట్ లో మాత్రమే ఇవ్వబడుతుంది మరియు మీరు ఒక రివర్స్ పార్కింగ్ కెమెరా కావాలనుకుంటే జెడ్ + వేరియంట్ ను కొనుగోలు చేయాలి. ఈ రోజుల్లో రోడ్ పరిస్థితుల కోసం ముఖ్యమైన అంశాలు కావాలనుకుంటే, మారుతికి పార్కింగ్ సెన్సార్లను కనీసం వి వేరియంట్ నుండే అందించాలని మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ లాకింగ్, స్పీడ్- సెన్సింగ్ డోర్ లాక్స్ మరియు యాంటీ థెఫ్ట్ వ్యవస్థ వంటి లక్షణాలు ప్రామాణికమైనవి, కానీ ఇవి ఇప్పుడు వి వేరియంట్ నుండి మాత్రమే అందించబడతాయి.
తీర్పు
కొత్త డిజీర్ అందరినీ ఆకట్టుకునే ప్రీమియం లుక్ ను కలిగి ఉంది. మారుతి సంస్థ, డిజైర్ వాహనం యొక్క సౌకర్యం మరియు ప్రశాంతమైన ప్రయాణంలో స్పష్టంగా దృష్టి సారించింది, మరియు మారుతి ఖరీదైన అనుభూతిని కూడా నిర్వహిస్తుంది. దాని కొన్ని లోపాలను గురించి ఏటువ్వంటి ఫిర్యాదు లేదు. డిజైర్ దాని ప్రత్యర్ధి వాహనాల కంటే ఎక్కువ ఖరీదైనప్పటికీ, రాబోయే నిబంధనలకు అనుగుణంగా దాని ప్లాట్ఫాం అధారంగా ఇప్పటికే దానిలో అనేక అంసాలు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి, ధర మరియు కొన్ని సమష్యల విషయంలో ఇబ్బంది ఉన్నప్పటికీ, మారుతి సుజుకి యొక్క కొత్త డిజైర్ విభాగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించింది.
రచయిత: అజిత్ మీనన్
ఫోటోగ్రఫి: విక్రాంట్ డేట్
ఇవి కూడా చదవండి: లక్షణాల పోలికలు: కొత్త మారుతి సుజుకి డిజైర్ వర్సెస్ ప్రత్యర్ధులు