Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

రూ.12.39 లక్షలకు అందుబాటులో ఉన్న స్కోడా కుషాక్ ఒనిక్స్ ఎడిషన్

స్కోడా కుషాక్ కోసం ansh ద్వారా మార్చి 29, 2023 03:56 pm సవరించబడింది

ఈ కాంపాక్ట్ SUV ప్రత్యేక ఎడిషన్ కేవలం ఒక వేరియెంట్ؚ‌లో మాత్రమే వస్తుంది.

  • బేస్-వేరియెంట్‌పై ఆధారపడి, దీని ధర రూ.12.39 లక్షలుగా ఉంటుంది (ఎక్స్-షోరూమ్).

  • వెలుపల, సైడ్ ప్రొఫైల్ అంతటా డెకాల్స్ వంటి తేలికపాటి మార్పులతో వస్తుంది.

  • ఆటో AC మరియు LED హెడ్ؚల్యాంప్ؚల వంటి తేలికపాటి ఫీచర్ జోడింపులను పొందింది.

  • కేవలం ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ؚతో 115PS పవర్ మరియు 178Nm టార్క్‌ను అందించే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంటుంది.

కుషాక్ కోసం స్కోడా ఒక ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది, ఇతర ప్రత్యేక ఎడిషన్‌ల విధంగా కాకుండా, ఈ ఒనిక్స్ ఎడిషన్ బేస్-స్పెక్ యాక్టివ్ మాన్యువల్ వేరియెంట్‌పై ఆధారపడింది. కుషాక్ ఒనిక్స్ ఎడిషన్ బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి, మరియు దీని ధరలు ఇలా ఉన్నాయి:

కుషాక్ యాక్టివ్ MT

కుషాక్ ఒనిక్స్ ఎడిషన్ MT

తేడా

రూ. 11.59 లక్షలు

రూ. 12.39 లక్షలు

+ 80,000

ప్రత్యేక ఎడిషన్ బేస్-స్పెక్ యాక్టివ్ మరియు మిడ్-స్పెక్ యాంబిషన్ వేరియెంట్‌ల మధ్య స్థానంలో ఉంటుంది మరియు దీని ధర బేస్ వేరియెంట్ కంటే రూ.80,000 ఎక్కువ మరియు మిడ్-స్పెక్ వేరియెంట్ కంటే రూ.60,000 తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ ప్రత్యేక ఎడిషన్ కేవలం ఒక వేరియెంట్ؚగా మాత్రమే వస్తుంది.

View this post on Instagram

A post shared by CarDekho India (@cardekhoindia)

కొత్తవి ఏమిటి

ఈ ప్రత్యేక ఎడిషన్‌లో ఉన్న చాలా వరకు మార్పులు లుక్స్ పరంగా ఉంటాయి, అల్లాయ్ వీల్స్ؚలో కొత్త డిజైన్, ముందు మరియు వెనుక డోర్‌లు అంతటా బూడిద రంగు డెకాల్స్, B పిల్లర్‌లపై “ఒనిక్స్” బ్యాడ్జింగ్ؚ కనిపిస్తుంది.

ఫీచర్‌ల విషయానికి వస్తే, దీనికి కొన్ని ఫీచర్‌లు జోడించబడ్డాయి. ఒనిక్స్ ఎడిషన్ బేస్-స్పెక్ యాక్టివ్ వేరియెంట్‌పై ఆధారపడింది కాబట్టి, మరీ ఎక్కువగా ఫీచర్‌లను అందించడం లేదు. కానీ ప్రత్యేక ఎడిషన్ؚలో ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, DRLతో LED హెడ్ؚల్యాంపులు, కార్నరింగ్ ఫాగ్ ల్యాంపులు, వాషర్ؚతో వెనుక వైపర్ మరియు వెనుక డిఫోగ్గర్ వంటి అంశాలు ఉన్నాయి.

ఒక ఇంజన్

కుషాక్‌లో అందుబాటులో ఉన్న రెండు పెట్రోల్ యూనిట్‌లలో, ఈ ప్రత్యేక ఎడిషన్ 1.0-లీటర్ టర్బో-పెట్రో ఇంజన్‌ను (115PS మరియు 178 Nm) ఉపయోగిస్తుంది. ప్రత్యేక ఎడిషన్ؚలో ఈ యూనిట్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ؚతో మాత్రమే వస్తుంది, కానీ ఈ కాంపాక్ట్ SUV హయ్యర్ వేరియెంట్ؚలు ఈ ఇంజన్ؚతో 6-స్పీడ్‌ల టార్క్ కన్వర్టర్ؚؚను కూడా పొందుతాయి.

ఇది కూడా చదవండి: టయోటా హైరైడర్ Vs స్కోడా కుషాక్ Vs హ్యుందాయ్ క్రెటాVs మారుతి గ్రాండ్ విటారా Vs వోక్స్ؚవ్యాగన్ టైగూన్: స్పేస్ మరియు ప్రాక్టికాలిటీ పోలిక

ఈ కాంపాక్ట్ SUV టాప్ వేరియెంట్‌లు 150PS పవర్ మరియు 250 Nm టార్క్‌ను అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తాయి. ఈ యూనిట్ 6-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 7-స్పీడ్‌ల DCTతో జోడించబడుతాయి.

పోటీదారులు

రూ.11.59 లక్షల నుండి రూ.19.69 లక్షల ధరల శ్రేణితో (ఎక్స్-షోరూమ్) స్కోడా కుషాక్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్ؚవ్యాగన్ టైగూన్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ వంటి వాటితో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: స్కోడా కుషాక్ ఆన్ؚరోడ్ ధర

Share via

Write your Comment on Skoda కుషాక్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర