Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

భారతదేశంలో ప్రారంభమైన Volvo C40 Recharge EV డెలివరీలు

వోల్వో సి40 రీఛార్జ్ కోసం rohit ద్వారా సెప్టెంబర్ 15, 2023 03:32 pm ప్రచురించబడింది

మొదటి రెండు వోల్వో C40 రీఛార్జ్ మోడల్‌లను కేరళ మరియు తమిళనాడులో డెలివరీ చేశారు

  • C40 రీఛార్జ్ؚను రూ.61.25 లక్షలకు (ప్రారంభ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) వోల్వో విక్రయిస్తుంది.

  • ఈ EV, XC40 రీఛార్జ్‌లో ఉన్నటు వంటి ప్లాట్ఫార్మ్‌పై ఆధారపడింది మరియు ఇది కూపే వర్షన్.

  • 78kWh బ్యాటరీ ప్యాక్ؚతో WLTP క్లెయిమ్ చేసిన 530కిమీ పరిధితో వస్తుంది.

  • 9-అంగుళాల టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు ADAS వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

వోల్వో C40 రీఛార్జ్ విక్రయాలు సెప్టెంబర్ 4న ప్రారంభం అయ్యాయి మరియు దాదాపు 10 రోజుల తరువాత, కారు తయారీదారు కస్టమర్‌లకు ఈ EVని డెలివరీ చేయడం ప్రారంభించారు. వోల్వో EV మొదటి రెండు యూనిట్‌లను కేరళ మరియు తమిళనాడులో డెలివరీ చేశారు. ఇది XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV యొక్క కూపే వర్షన్, ఇది సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియెంట్ؚగా విక్రయించబడుతుంది, రూ. 61.25 లక్షల (ప్రారంభ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) ధరను కలిగి ఉంది.

దీన్ని ఏది నడిపిస్తుంది?

C40 రీఛార్జ్ؚలో వోల్వో 78kWh బ్యాటరీ ప్యాక్ؚను అందిస్తుంది, దీని WLTP క్లెయిమ్ చేసిన పరిధి 530కిమీ మరియు ICAT క్లెయిమ్ చేసిన పరిధి 683కిమీగా ఉంది. ఈ EV 408PS పవర్ మరియు 660Nm టార్క్‌ను అందించే డ్యూయల్-మోటార్ AWD సెట్అప్ؚను కలిగి ఉంది, దీని వలన 0-100 kmph వేగాన్ని 4.7 సెకన్‌లలో అందుకుంటుంది.

వోల్వో ఇందులో 150kW ఫాస్ట్ ఛార్జింగ్ؚకు మద్దతు ఇచ్చే సామర్ధ్యాన్ని అందించింది, ఇది బ్యాటరీని 10 నుండి 80 శాతం వరకు 27 నిమిషాలలో ఛార్జ్ చేస్తుంది. C40 రీఛార్జర్ؚను 11kW ఛార్జర్ؚతో అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: నాజూకైన లుక్ మరియు మెరుగైన క్యాబిన్ؚతో నవీకరించిన టెస్లా మోడల్ 3

ఆనందించేందుకు అనేక సాంకేతికతలు

C40 రీఛార్జ్ ఉపకరణల జాబితాలో 9-అంగుళాల నిలువుగా ఉండే టచ్‌స్క్రీన్, హీటింగ్ మరియు కూలింగ్ ఫంక్షన్‌లతో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 13-స్పీకర్ హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ మరియు పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఉన్నాయి. ముందు వైపు (31 లీటర్‌లు) మరియు వెనుక వైపు (413 లీటర్‌లు) లాగేజీ స్పేస్ؚ అందుబాటులో ఉంటుంది.

ఈ EVలో ఏడు ఎయిర్ బ్యాగ్ؚలు, హిల్ అసిస్ట్, 360-డిగ్రీల కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిజన్ అవాయిడెన్స్ మరియు బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) శ్రేణిని అందించడం ద్వారా ప్రయాణీకుల భద్రతకు వోల్వో హామీ ఇస్తుంది.

దీనితో పోటీపడేది ఎవరు?

భారతదేశంలో వోల్వో అందిస్తున్న రెండవ EVకి ప్రత్యక్షంగా పోటీదారులు ఎవరూ లేరు, అయితే ఇది BMW i4, కియా EV6, హ్యుందాయ్ అయోనిక్ 5 మరియు వోల్వో XC40 రీఛార్జ్ؚతో పోటీ పడుతుంది.

ఇది కూడా చదవండి: ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడిన కియా EV5, 2025 నాటికి భారతదేశానికి చేరుకోవచ్చు

ఇక్కడ మరింత చదవండి: వోల్వో C40 రీఛార్జ్ ఆటోమ్యాటిక్

Share via

Write your Comment on Volvo సి40 రీఛార్జ్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.7 - 9.84 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర