నాజూకైన లుక్, మెరుగైన క్యాబిన్ؚతో నవీకరించబడిన Tesla Model 3
టెస్లా మోడల్ 3 కోసం ansh ద్వారా సెప్టెంబర్ 04, 2023 11:09 am ప్ర చురించబడింది
- 46 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మునపటి బ్యాటరీ ప్యాక్ؚలతో కొత్త మోడల్-3 629 కిమీల అత్యధిక పరిధిని అందిస్తుంది
-
టెస్లా రోడ్ؚస్టర్ؚలో ఉన్నట్లుగానే నాజూకైన హెడ్ؚల్యాంపుల సెట్ؚను పొందింది.
-
సరికొత్త డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్ؚతో క్యాబిన్ ఆధునికీకరించబడింది.
-
మునపటి రెండు పవర్ ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది: 279PS, రేర్-వీల్ డ్రైవ్ మరియు 315PS, ఆల్-వీల్ డ్రైవ్.
-
ఈ కారు తయారీదారు తన కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించినప్పుడు దీన్ని పరిచయం చేయవచ్చు.
పశ్చిమంలో EV విప్లవానికి టెస్లా మోడల్ 3 ఒక సూచిక, 2017లో మార్కెట్ؚలో విడుదలైన తరువాత మొదటి నవీకరణను ప్రస్తుతం పొందింది. ప్రస్తుత అప్‌డేట్‌లో, ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ؚలో మార్పులను పొందింది, అంతేకాకుండా అవే పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అధిక పరిధిని హామీ ఇస్తుంది. కొత్త మోడల్ 3 ఏం అందిస్తుందో ఇప్పుడు చూద్దాం.
కొత్త ఎక్స్ؚటీరియర్
ఈ కారు తయారీదారు మోడల్ 3 డిజైన్‌లో తేలికపాటి మార్పులను చేశారు. ప్రస్తుతం ఫ్రంట్ ప్రొఫైల్ నాజూకైన హెడ్ؚల్యాంప్ సెట్ؚను పొందింది, ఇవి రోడ్ؚస్టర్ؚలో ఉన్న వాటికి సారూప్యంగా ఉన్నాయి. మునపటి మోడల్‌లో బంపర్ పై విడిగా ఉండే ఫాగ్ ల్యాంపులు ప్రస్తుత నవీకరణలో లేవు. మిగిలిన ఫ్రంట్ ప్రొఫైల్ؚలో ఎలాంటి మార్పులు లేవు.
సైడ్ ప్రొఫైల్ మునపటి డిజైన్‌ను పోలి ఉంటుంది, కానీ కొత్త అలాయ్‌ను అందిస్తున్నారు. ఈ వీల్స్ సైజ్ 18 అంగుళాల నుంచి 19 అంగుళాల వరకు ఉంటుంది. మరొక వైపు, రేర్ ఎండ్ؚలో కొన్ని మార్పులు చేశారు. నవీకరణకు ముందు వర్షన్ؚలో విభజించబడినట్లుగా కాకుండా కొత్త C-ఆకారపు టెయిల్ ల్యాంప్ؚలతో సింగిల్ యూనిట్ؚగా ఉంటుంది, మరిన్ని క్రీజ్ؚలు మరియు డిఫ్యూజర్‌ను అమర్చేందుకు బంపర్ డిజైన్ కూడా మార్చబడింది.
ఖరీదైన క్యాబిన్
టెస్లా క్యాబిన్ؚ ఎల్లప్పుడూ ఆధునికంగా మరియు సరళంగా ఉంటుంది. ఈ కొత్త క్యాబిన్ కూడా సరళంగా మరియు ఖరిదైనదిగా కనిపిస్తుంది, కానీ కొంత ఆధునికరణను జోడించారు. కొత్త స్టీరింగ్ వీల్, మార్చిన డ్యాష్ؚబోర్డు లేఅవుట్, క్యాబిన్ అంతటా కనిపించే LED స్ట్రిప్ ఉన్నాయి, దీన్ని మీకు నచ్చినట్లు అనుకూలీకరించుకోవచ్చు, ఇదే కాకుండా అప్ؚడేట్ చేసిన టచ్ؚస్క్రీన్ డిస్ప్లే కూడా వస్తుంది.
మెరుగైన పనితీరుతో టచ్ؚస్క్రీన్ అదే సైజ్ؚలో వస్తుంది. సెంటర్ కన్సోల్ అదనపు స్టోరేజ్ؚతో క్యాబిన్ ఇప్పుడు మరింత ఆచరణాత్మకంగా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ మరియు క్లైమేట్ కంట్రోల్ కోసం సెంట్రల్ కన్సోల్ టన్నల్ చివరిలో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ؚతో వెనుక ప్రయాణీకులు అదనపు సౌకర్యాన్ని పొందుతారు. చుట్టుపక్కల అకౌస్టిక్ గ్లాస్ؚతో క్యాబిన్ అనుభవం కూడా మరింత ప్రశాంతంగా ఉంటుందని టెస్లా చెప్తోంది.
పవర్ؚట్రెయిన్
ఇది ఇప్పటికీ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది: 279PS, సింగిల్-మోటార్ రేర్-వీల్ డ్రైవ్ మరియు 315PS, డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్. ప్రస్తుతానికి, బ్యాటరీ ప్యాక్ؚల వివరాలు వెల్లడించలేదు, కానీ డ్రైవింగ్ పరిధిని వెల్లడించారు. WLTP ప్రకారం, రేర్-వీల్-డ్రైవ్ మోడల్ 513కిమీ మరియు ఆల్-వీల్-డ్రైవ్ 629కిమీ పరిధిని అందిస్తుంది.
విడుదల
కొత్త టెస్లా మోడల్ 3 ఈ రోజు నుండి యూరోపియన్ మార్కెట్ؚలో లభిస్తుంది మరియు దీని డెలివరీలు ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం అవుతాయి. టెస్లా త్వరలోనే భారతీయ మార్కెట్ؚలోకి ప్రవేశించే ప్రణాళికను కూడా కలిగి ఉంది, కొత్త మోడల్ 3ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టవచ్చు. భారత మార్కెట్ؚలో విడుదల అయితే, BNW i4తో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful