Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

విర్టస్ GT వేరియంట్‌కు మాన్యువల్ ఎంపికను జోడించనున్న వోక్స్వాగన్

వోక్స్వాగన్ వర్చుస్ కోసం ansh ద్వారా ఏప్రిల్ 19, 2023 02:55 pm ప్రచురించబడింది

ఈ సెడాన్ కొత్త రంగు ఎంపికలను కూడా పొందనుంది, మెరుగైన పనితీరును కనపరిచే GT ప్లస్ వేరియాంట్ కొన్ని నెలలలో మరింత చవకగా లభించనుంది

  • విడుదల అయినప్పటి నుండి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ GT ప్లస్ వేరియాంట్ DSC ఆటోకు పరిమితం అయ్యింది.

  • రానున్న కొత్త GT ప్లస్ MT వేరియెంట్ కూడా, “డీప్ బ్లాక్ పర్ల్” రంగు ఎంపికను కూడా పొందనుంది.

  • అన్నీ వేరియెంట్ؚలలో కొత్త “లావా బ్లూ మెటాలిక్” రంగును అందిస్తున్నారు.

  • ప్రస్తుతం, విర్టస్ ధర రూ.11.48 లక్షల నుండి రూ.18.57 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

ఇటీవల తమ ప్రత్యర్థుల నవీకరణల కారణంగా, వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్ؚలో వోక్స్వాగన్ ఇండియా, తమ స్థానిక లైన్అప్ؚను కూడా నవీకరించే ప్రణాళికల గురించి తెలియజేశారు. రాబోయే అన్నీ మార్పులలో, విర్టస్ కొత్త వేరియెంట్‌ను మరియు రెండు కొత్త రంగు ఎంపికలను పొందనుంది. వాటి వివరాలను తెలుసుకుందాం:

ధర తగ్గింపుతో అందుబాటులోకి రానున్న GT పర్మార్మెన్స్

విర్టస్ టాప్-స్పెక్ పర్ఫార్మెన్స్ వేరియంట్‌లలో, కేవలం GT ప్లస్ వేరియెంట్ మాత్రమే ఉంటుంది, ఇది త్వరలో మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికను కూడా పొందనుంది. ఈ వేరియెంట్‌కు కారు తయారీదారు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚ 150PS పవర్‌ను అందిస్తుంది మరియు త్వరలోనే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో వస్తుంది. ఈ జోడింపు, టాప్-స్పెక్ విర్టస్ؚని మరింత చవకైనదిగా చేస్తుంది మరియు డ్రైవింగ్ ఔత్సాహికులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

సరికొత్త రంగులు

ఈ కొత్త వేరియెంట్‌తో పాటు, విర్టస్ రెండు కొత్త రంగు ఎంపికలను కూడా పొందుతుంది: డీప్ బ్లాక్ పర్ల్, ఇది టాప్-స్పెక్ GT ప్లస్ వేరియెంట్ؚలో మాత్రమే అందించబడుతుంది, అది కూడా పరిమిత సమయనికే అందుబాటులో ఉంటుంది, రెండవది లావా బ్లూ మెటాలిక్, ఇది ఇటీవల స్కోడా స్లావియా కలర్ పరిధికి జోడించబడింది, ఇది విర్టస్ అన్నీ వేరియెంట్ؚలకు అందించబడుతుంది. ఈ కొత్త వేరియెంట్ మరియు కొత్త రంగులు జూన్ 2023 నుండి మార్కెట్‌లో లభ్యమవుతాయి.

ఫీచర్‌లు

GT ప్లస్ వేరియెంట్ వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేؚతో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS|) మరియు రేర్-వ్యూ కెమెరాతో వస్తుంది. ఈ ఫీచర్‌లు అన్నీ GT ప్లస్ మాన్యువల్ వేరియెంట్ؚలో కూడా అందించబడతాయి.

ఇది కూడా చదవండి: త్వరలోనే కొత్త టైగూన్ GT వేరియెంట్ؚలను మరియు ప్రత్యేక ఎడిషన్ؚలను అందించనున్న వోక్స్వాగన్

ప్రయాణీకులు అందరికీ సీట్ బెల్ట్ రిమైండర్‌లను ఏప్రిల్ ప్రారంభం నుండి ఒక సరికొత్త ఫీచర్‌గా ప్రామాణికంగా అందిస్తున్నారు. ఇది కాకుండా, ఎటువంటి ఫీచర్ జోడింపులు లేవు.

పవర్ؚట్రెయిన్

“పార్మార్మెన్స్ లైన్” GT వేరియెంట్‌లు కారు తయారీదారు అందిస్తున్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150PS పవర్ మరియు 250 Nm టార్క్‌ను అందిస్తుంది. పైన పేర్కొన్నట్లుగా, ఇవి త్వరలోనే 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో వస్తాయి. ఈ కాంపాక్ట్ సెడాన్ ఇతర వేరియెంట్ؚలు 115PS పవర్ మరియు 178NM టార్క్‌ను అందించే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడుతుంది.

ధర పోటీదారులు

GT ప్లస్ మాన్యువల్ వేరియెంట్ దాని ఆటోమ్యాటిక్ సహచర వాహనం కంటే, రూ.1.5 లక్షల వరకు మరింత చవకగా లభించనుంది. విర్టస్ ధర ప్రస్తుతం రూ.11.48 లక్షల నుండి రూ.18.57 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా మరియు ఇది హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు స్కోడా స్లావియాలతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: వోక్స్వాగన్ విర్టస్ ఆన్ؚరోడ్ ధర

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 39 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన వోక్స్వాగన్ వర్చుస్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర