• English
  • Login / Register

త్వరలోనే కొత్త టైగూన్ GT వేరియెంట్ؚలు మరియు ప్రత్యేక ఎడిషన్ؚలను అందించనున్న వోక్స్వాగన్

వోక్స్వాగన్ టైగన్ కోసం rohit ద్వారా ఏప్రిల్ 19, 2023 02:51 pm ప్రచురించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ అప్ؚడేట్ؚలు మరియు వేరియెంట్ؚలు జూన్ 2023 నుండి పరిచయం చేయనున్నాను

Volkswagen Taigun new variants and special editions

  • టైగూన్ పర్ఫార్మెన్స్ లైన్అప్‌కు వోక్స్వాగన్  GT+ MT మరియు GT DCT వేరియెంట్ؚలను జోడించనుంది. 

  • ఈ రెండూ, GT లైన్అప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను పొందుతాయి. 

  • టైగూను కొత్త “లావా బ్లూ” మరియు “డీప్ బ్లాక్ పర్ల్” షెడ్‌లలో లభ్యమవుతాయి. 

  • “కార్బన్ స్టీల్ గ్రే” రంగుగల మ్యాట్ ఫినిష్ؚను కూడా పొందునుంది. 

  • లుక్ పరంగా తేలికపాటి మెరుగుదలతో “ట్రెయిల్” మరియు “స్పోర్ట్” అని పిలిచే SUV రెండు కాన్సెప్ట్ؚలను కూడా వోక్స్వాగన్  ప్రదర్శించింది. 

  • ఏప్రిల్ 2023 నుండి ఉత్పత్తి అయ్యే మోడల్ అన్నిటిలో సీట్ బెల్ట్ రిమైండర్ ఇప్పటి నుండి ప్రామాణికంగా వస్తుంది. 

వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, వోక్స్వాగన్ తన స్థానిక భారతీయ ఉత్పత్తులు అయిన, టైగూన్ మరియు విర్టస్ؚల కోసం బహుళ ప్రణాళికలను వెల్లడించింది. ఈ కధనంలో, ఈ కాంపాక్ట్ SUVలో ప్రదర్శించిన, జూన్ నుండి అందుబాటులోకి రానున్న అప్ؚడేట్‌లపై దృష్టి పెడదాం. 

కొత్త GT వేరియెంట్ؚలు

Volkswagen Taigun GT Plus MT

SUV “పర్ఫార్మెన్స్ లైన్” GT వేరియెంట్ؚల కోసం రెండు కొత్త వేరియెంట్ؚలు GT Plus MT మరియు GT DCTలను వోక్స్వాగన్  పరిచయం చేసింది, ఇవి 150PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తాయి. ఇప్పటి వరకు, GT Plus వేరియెంట్ కేవలం 7-స్పీడ్ DCT గేర్ బాక్స్ؚతో వస్తుంది, GT కేవలం ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే వస్తుంది. 

Volkswagen Taigun GT DCT

ఇది దిగువ వేరియెంట్ؚలలో DCT ఎంపికను మరింత అందుబాటులో ఉండేలా చేస్తుంది మరియు మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో టాప్-స్పెక్ GT ప్లస్ వేరియెంట్ؚను మరింత చవకగా చేస్తుంది. 

          View this post on Instagram                      

A post shared by CarDekho India (@cardekhoindia)

ఇది కూడా చదవండి: విర్టస్ GT వేరియంట్‌కు మాన్యువల్ ఎంపికను జోడించనున్న వోక్స్వాగన్ 

లుక్ పరంగా సవరణలు 

Volkswagen Taigun Deep Black Pearl shade

VW SUV మూడు తాజా ఎక్స్టీరియర్ రంగు ఎంపికలతో వస్తుంది: లావా బ్లూ, డీప్ బ్లాక్ పర్ల్ మరియు కార్బన్ స్టీల్ మ్యాట్. స్కోడా-ఆధారిత బ్లూ రంగు, శ్రేణి అంతటా అందించబడుతుండగా, మిగిలిన రెండు పరిమిత సంఖ్యలో టైగూన్ GT వేరియెంట్ؚలలో మాత్రమే అందించబడుతుంది. డీప్ బ్లాక్ పర్ల్ ఫినిష్ రెడ్ బ్రేక్ క్యాలిపర్‌లు, సీట్ల కోసం ఎరుపు స్టిచింగ్ మరియు ఎరుపు ఆంబియెంట్ లైటింగ్ؚతో సహా సాధారణ GT-నిర్దిష్ట నవీకరణలను పొందుతుంది. మరొక వైపు. మ్యాట్ ఎడిషన్ కూడా ORVMల కోసం మెరిసే-బ్లాక్ ఫినిష్, డోర్ హ్యాండిల్స్ మరియు రేర్ స్పాయిలర్స్ؚతో వస్తుంది. 

ప్రత్యేక ఎడిషన్ؚలు

Volkswagen Taigun Trail concept

కొత్త వేరియెంట్ మరియు రంగు ఎంపికలతో పాటు, వోక్స్వాగన్  తన కొత్త ‘GT లిమిటెడ్ కలెక్షన్’ – ట్రెయిల్ మరియు స్పోర్ట్ؚలో భాగంగా ఈ SUV రెండు కాన్సెప్ట్ వర్షన్ؚలను కూడా ప్రదర్శించింది. “ట్రెయిల్” కాన్సెప్ట్, “ట్రెయిల్” నుండి ప్రేరణ పొందిన బాడీ సైడ్ గ్రాఫిక్ؚలు మరియు లెదర్ అపోలిస్ట్రీ, 16-అంగుళాల బ్లాకెడ్-అవుట్ అలాయ్ వీల్స్, రూఫ్ ర్యాక్ మరియు పడిల్ ల్యాంప్ؚలు వంటి కాస్మెటిక్ మార్పులతో వస్తుంది. 

Volkswagen Taigun Sport concept

“స్పోర్ట్” కాన్సెప్ట్ కొన్ని స్టైలింగ్ తేడాలను కూడా కలిగి ఉంటుంది, వీటిలో “స్పోర్ట్” నిర్దిష్ట బాడీ గ్రాఫిక్ؚలు మరియు లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ, 17-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ మరియు ఎరుపు ఇన్సర్ట్ؚలతో బ్లాకెడ్-అవుట్ ORVMలు ఉంటాయి. 

ఇది కూడా చదవండి: వేసవిలో మీ కారు కోసం ముఖ్యమైన టాప్ 7 చిట్కాలు 

సాధారణ అప్ؚడేట్ؚలు

ఏప్రిల్ 1, 2023 నుండి ఉత్పత్తి ఆయ్యే టైగూన్ అన్నీ వేరియెంట్‌లు ఇప్పుడు సీట్ బెల్ట్ రిమైండర్ؚను ప్రామాణికంగా పొందనున్నాయి. గ్లోబల్ NCAP పరీక్షించిన అన్నిటిలో ఇది ఇప్పటికే భారతదేశంలో తయారైన అత్యంత సురక్షితమైన SUVలలో ఒకటిగా ఉంది.

Volkswagen Taigun Trail concept side

ఈ SUV ధర ప్రస్తుతం రూ.11.62 లక్షల నుండి రూ.19.06 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) పరిధిలో ఉంది. ఇది మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, MG ఆస్టర్, స్కోడా కుషాక్ వంటి వాటితో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: టైగూన్ ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Volkswagen టైగన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience