స్వల్ప ధర పెంపుతో కొత్త ఫీచర్‌లతో వస్తున్న వోక్స్వాగన్ టైగూన్
వోక్స్వాగన్ ఫ్లాగ్ؚషిప్ కారు మరింత సమర్ధమైన BS6 ఫేస్ 2కు అనుగుణమైన ఇంజన్ؚను కూడా పొందుతుంది
- నవీకరించబడిన టైగూన్ ప్రస్తుత ధర రూ.34.69 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.
- కొత్త డ్యూయల్-టోన్ ఇంటీరియర్, వైర్ؚలెస్ ఛార్జింగ్, పార్కింగ్ అసిస్ట్, మరియు వెనుక సీట్ బెల్ట్ రిమైండర్ؚలతో వస్తుంది.
- పనోరమిక్ సన్ؚరూఫ్, త్రీ-జోన్ AC, 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు వంటి ఫీచర్‌లు కూడా ఉంటాయి.
- 7-స్పీడ్‌ల DSG మరియు AWDతో మునపటి 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (కానీ నవీకరించబడింది) ఉంటుంది.
వోక్స్‌వ్యాగన్ BS6 ఫేస్ 2కు అనుగుణంగా ఉండే టైగూన్ SUVని రూ.34.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది, ఇది మునపటి వర్షన్ కంటే రూ.50,000 అధికం. ఈ SUVలో కొత్తగా అందిస్తున్నవి ఇవి:
కొత్తగా ఏం ఉన్నాయి?
నవీకరించబడిన టైగూన్ ఎక్స్ టీరియర్ స్టైలింగ్‌లో ఎటువంటి మార్పులు లేవు. అయితే, ఇంటీరియర్‌లో ప్రస్తుతం డ్యూయల్-టోన్ స్టార్మ్ గ్రే రంగు ఫినిషింగ్‌లో వస్తుంది. ఫీచర్‌ల విషయానికి వస్తే, ఇందులో వైర్ؚలెస్ ఛార్జింగ్ మరియు పార్క్ అసిస్ట్ ఉంటాయి. వీటిలో రెండవది లెవెల్ 1 ADAS ఫీచర్ మరియు కెమెరాలు మరియు సెన్సార్‌లపై ఆధారపడి పార్కింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ వీల్ؚను ఆపరేట్ చేస్తుంది. అదనపు భద్రత కోసం, వెనుక సీట్ బెల్ట్ రిమైండర్ؚను కూడా ప్రవేశపెట్టారు.
ఇది కూడా చదవండి: రూ.15 లక్షల కంటే తక్కువ ధరలో ఔత్సాహికులు కొనుగోలు చేయగలిగిన టాప్ 10 టర్బో-పెట్రోల్ కార్‌లు
ప్రస్తుతం ఉన్న ఫీచర్‌లు
టైగూన్‌లో ఇప్పటికే మాట్రిక్స్ LED హెడ్ؚలైట్‌లు, పనోరమిక్ సన్ؚరూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, హీటెడ్ ముందు సీట్‌లు, 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్‌లు ఉన్నాయి. భద్రత ఫీచర్‌లలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, హిల్ స్టార్ట్ అసిస్ట్, డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మరియు రేర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.
నవీకరించబడిన పవర్ؚట్రెయిన్
టైగూన్‌కు శక్తిని అందించేది మునపటి 2-లీటర్ టర్బో-పెట్రోల్ TSI ఇంజన్, ఇప్పుడు ఇది RDEకి అనుగుణంగా ఉంటుంది. ఇది 190PS మరియు 320NM టార్క్‌ను అందిస్తుంది మరియు 7-స్పీడ్‌ల DSG (డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్) ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడి వస్తుంది. 4మోషన్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ కోసం వోక్స్‌వ్యాగన్ స్పీక్ కూడా ప్రామాణికంగా అందించబడుతుంది. ఉద్గార నియమాల నవీకరణతో, టైగూన్ ఏడు శాతం మరింత ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందని, 13.54kmpl డెలివర్ చేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు,
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ వెర్నా టర్బో DCT Vs స్కోడా స్లావియా మరియు వోక్స్వాగన్ విర్టస్ 1.5 DSG: వాస్తవ-ప్రపంచ ఇంధన సామర్ధ్య పోలిక
పోటీదారులు
జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్, సిట్రియోన్ C5 ఎయిర్ؚక్రాస్ వంటి వాటితో వోక్స్వాగన్ టైగూన్ పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: వోక్స్వాగన్ టైగూన్ ఆటోమ్యాటిక్