• English
  • Login / Register

రూ.15 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయగల టాప్ 10 టర్బో-పెట్రోల్ కార్ؚలు ఇవే

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కోసం tarun ద్వారా మార్చి 31, 2023 06:13 pm ప్రచురించబడింది

  • 33 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అధిక పవర్ మరియు టార్క్, మెరుగైన ఇంధన సామర్ధ్యాల వంటి ప్రయోజనాలను కూడా ఈ టర్బోఛార్జెడ్ ఇంజన్ అందిస్తుంది.

Top 10 Turbo Petrol cars Under Rs 15 Lakh

ఒకప్పుడు ప్రత్యేక స్థానంలో ఉండే టర్బోఛార్జెడ్ పెట్రోల్ ఇంజన్‌లు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి. తయారీదారులు టర్బో-పెట్రోల్ కార్‌లను ప్రధాన వాహనాలుగా అందిస్తున్నారు, ఇవి తగిన ఇంధన సామర్ధ్యంతో అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని కూడా అందిస్తాయి. ప్రస్తుతం, రూ.15 లక్షల కంటే తక్కువ ధరతో 100PS పవర్ కంటే ఎక్కువ పనితీరును అందిస్తున్న అనేక టర్బో ఛార్జెడ్ పెట్రోల్ ఇంజన్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఈ బడ్జెట్‌లో పరిగణించగల టాప్ 10 టర్బో-పెట్రోల్ కార్‌ల వివరాలు క్రింద అందించబడ్డాయి:

మహీంద్రా XUV700 

ఉత్తమ వేరియెంట్ 

MX

ధర 

రూ. 13.95 లక్షలు 

ఇంజన్ 

2- లీటర్ టర్బో పెట్రోల్ 

పవర్ 

200PS

టార్క్ 

380Nm

ట్రాన్స్ؚమిషన్ 

6-స్పీడ్ MT

ఇంధన సామర్ధ్యం

-

ఈ జాబితాలో అత్యంత ఆకట్టుకునే ఎంపిక ఎంట్రీ లెవెల్ XUV700 కావచ్చు. చెప్పుకోదగిన   ప్రీమియం ఫీచర్‌లు లేకపోయినా, 200PS పవర్‌తో విశాలమైన మధ్య-పరిమాణం గల SUVని పొందవచ్చు. రోడ్ టెస్ట్ؚలో 9.48 సెకన్‌లలో 0-100kmph వేగాన్ని పొందగలిగాము. దీనిలో 185PS పవర్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది, ఇది ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలతో జోడించబడుతుంది. XUV700 టాప్-స్పెక్ వేరియెంట్ ధర రూ.25.48 లక్షల వరకు ఉంటుంది, ఇది ఆల్-వీల్-డ్రైవ్ మరియు ADAS ఫీచర్‌లతో వస్తుంది. 

మహీంద్రా స్కార్పియో N

ఉత్తమ వేరియెంట్ 

Z4 E

ధర

రూ. 14.74 లక్షలు

ఇంజన్ 

2-లీటర్ టర్బో పెట్రోల్ 

పవర్

203PS

టార్క్ 

380Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్‌ల MT

ఇంధన సామర్ధ్యం (క్లెయిమ్ చేసినది)

11.72kmpl (సగటున)

XUV700లో ఉన్న అదే 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను స్కార్పియో N కూడా కనిపిస్తుంది. ఈ SUV ప్రామాణికంగా ఏడు-సీట్‌లతో వస్తుండటంతో, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బేస్ వేరియెంట్ؚకు పై వేరియంట్ మాత్రమే బడ్జెట్‌లో ఉంటుంది, ఇది కూడా కేవలం మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే వస్తుంది, ఆరు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ధర రూ.1.5 లక్షలు ఎక్కువగా ఉంటుంది. నిర్వహించిన టెస్టులలో స్కార్పియో N పెట్రోల్-AT 10.16 సెకన్‌లలో 0-100 స్ప్రింట్ؚను అందుకుంది. ఇందులో 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపిక కూడా ఉంటుంది, వేరియెంట్ؚను బట్టి దీన్ని రెండు ట్యూన్ؚలలో పొందవచ్చు. దీని ధర రూ.12.74 లక్షల నుండి రూ.24.05 లక్షల వరకు ఉంటుంది. 

హ్యుందాయ్ వెర్నా 2023

Hyundai Verna

ఉత్తమ వేరియెంట్ 

SX టర్బో MT

ధర 

రూ. 14.84 లక్షలు

ఇంజన్ 

1.5-లీటర్ టర్బో పెట్రోల్

పవర్ 

160PS

టార్క్ 

253Nm

ట్రాన్స్ؚమిషన్ 

6-స్పీడ్ MT

ఇంధన సామర్ధ్యం (క్లెయిమ్ చేసినది)

20kmpl

సరికొత్త హ్యుందాయ్ వెర్నా టర్బో ఎంట్రీ-లెవెల్ SX టర్బో MT ధర బడ్జెట్‌లోనే ఉన్నాయి. ఆరవ-జనరేషన్ సెడాన్‌కు 160PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పవర్‌ను అందిస్తుంది, ఇది ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ మరియు ఏడు-స్పీడ్‌ల DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్) ఎంపికలతో వస్తుంది. 20kmpl ఇంధన సామర్ధ్యాన్ని క్లెయిమ్ చేయడంతో పాటు, వెర్నా టర్బో 0-100kmph సమయాన్ని 8.1 సెకన్‌లలో అందుకుంటుంది. దీన్ని 115PS 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మోటార్ؚతో కూడా పొందవచ్చు. దీని ధర రూ.10.90 లక్షల నుండి రూ.17.38 లక్షల వరకు ఉంటుంది. 

వోక్స్ؚవ్యాగన్ విర్టస్/టైగూన్

ఉత్తమ వేరియెంట్ 

విర్టస్ – టాప్ؚలైన్ / టైగూన్ – హైలైన్ AT

ధర

రూ. 14.70 లక్షలు / రూ. 14.96 లక్షలు

ఇంజన్ 

1-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్ 

115PS

టార్క్ 

178Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్‌ల MT / 6-స్పీడ్ ల AT

ఇంధన సామర్ధ్యం (క్లెయిమ్ చేసినది)

19.4kmpl / 18.12kmpl

టైగూన్ మరియు విర్టస్ؚలు రెండిటినీ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚలతో మాత్రమే అందిస్తున్నారు. కాబట్టి సాంకేతికంగా, మీరు వీటిలో ఏదైనా వేరియెంట్ؚను రూ.15 లక్షలు కంటే తక్కువకు పొందవచ్చు. అయితే, బడ్జెట్ؚలో కేవలం 1-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ మాత్రమే వస్తుంది. ఈ బడ్జెట్ؚలో టైగూన్‌లో ఉత్తమ వేరియెంట్‌గా మిడ్-స్పెక్ హైలైన్ AT నిలుస్తుంది మరియు విర్టస్ؚలో ఉత్తమ ఎంపిక మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడిన పైన పెరికొన్న ఇంజన్ؚతో వచ్చే టాప్ వేరియెంట్. ఈ సెడాన్‌లో వచ్చే పవర్‌ట్రెయిన్ ఎంపిక కేవలం 10.66 సెకన్‌లలో 0-100kmph స్ప్రింట్ؚను అందుకునేలా చేస్తుంది. ఈ రెండు మోడల్‌లలో, అధిక ధరలో వచ్చే మరొక టర్బో ఎంపిక 150PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, దీనిలో ఏడు-స్పీడ్‌ల DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్) ఎంపిక కూడా ఉంటుంది. 

స్కోడా స్లావియా / కుషాక్

ఉత్తమ వేరియెంట్ 

యాంబిషన్ MT

ధర

రూ.14.94 లక్షలు (స్లావియా)/రూ.14.99 లక్షలు (కుషాక్)

ఇంజన్ 

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 

పవర్ 

150PS

టార్క్ 

250Nm

ట్రాన్స్ؚమిషన్ 

6-స్పీడ్‌ల MT

ఇంధన సామర్ధ్యం (పరీక్షించబడినది)

15.85kmpl (సగటున)

ఇటీవలి నవీకరణ వలన, స్కోడా స్లావియా మరియు కుషాక్, వోక్స్ؚవ్యాగన్ ప్రత్యర్ధుల కంటే ముందంజలో ఉన్నాయి. ఈ స్కోడా జంట ఇప్పుడు, రూ.15 లక్షల కంటే తక్కువ ధరకు మిడ్-స్పెక్ యాంబిషన్ వేరియెంట్ؚలో, 150PS 11.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో అందుబాటులో ఉంటాయి, ఇవి ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ؚకు జోడించబడాయి. స్లావియా 1.5 టర్బో కేవలం  తొమ్మిది సెకన్‌లలో 0-100kmph చేరుకుంది. 

ఇదే బడ్జెట్ؚలో, మీకు ఆటోమ్యాటిక్ సౌకర్యం కావాలనుకుంటే, మీరు యాంబిషన్ 1-లీటర్ ATని పరిగణించవచ్చు లేదా మరిన్ని సౌకర్యాలు ఉండే వేరియెంట్ కోరుకుంటే టాప్-ఎండ్ స్టైల్ 1-లీటర్ MTని ఎంచుకోవచ్చు. స్కోడా స్లావియా ధర రూ.11.29 లక్షల నుండి రూ.18.40 లక్షల వరకు ఉంటుంది, కుషాక్ ధర రూ.11.59 లక్షల నుండి రూ.19.69 లక్షల మధ్య ఉంటుంది. 

మహీంద్రా థార్

ఉత్తమ వేరియెంట్ 

LX P MT హార్డ్ టాప్

ధర 

రూ. 14.28 లక్షలు

ఇంజన్

2-లీటర్ టర్బో-పెట్రోల్ 

పవర్ 

150PS

టార్క్ 

320Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్‌ల MT / 6-స్పీడ్‌ల AT

ఇంధన సామర్ధ్యం (పరీక్షించినది)

10.98kmpl (సగటున)

ఈ పెట్రోల్ ఆఫ్-రోడర్ ఔత్సాహికుల ప్రాధాన్యత కాకపోయినప్పటికీ, దీన్నీ SUVగా పరిగణించవచ్చు. ఈ ధరలో, పూర్తి ఫీచర్‌లతో 4WD థార్ మాన్యువల్ వేరియెంట్ؚను పొందగలరు. పెట్రోల్-ఆటోమ్యాటిక్ కాంబినేషన్ؚను పొందే థార్ రేర్-వీల్ డ్రైవ్ వేరియెంట్ؚను కూడా ఎంచుకోవచ్చు. థార్ LX P ATతో, 0-100kmphను 10.21 సెకన్‌లలో అందుకోగలిగాము. దీన్నీ 130PS 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో, RWD వేరియెంట్ 117PS 1.5-లీటర్ డీజిల్ యూనిట్ؚతో పొందవచ్చు. ఈ ఆఫ్ –రోడర్ ధర రూ.9.99 లక్షల నుండి రూ.16.49 లక్షల వరకు ఉంటుంది. 

హ్యుందాయ్ వెన్యూ N లైన్

Hyundai Venue N Line Review

ఉత్తమ వేరియెంట్ 

N8 DCT డ్యూయల్ టోన్

ధర 

రూ. 13.74 లక్షలు

ఇంజన్ 

1-లీటర్ టర్బో-పెట్రోల్ 

పవర్ 

120PS

టార్క్ 

172Nm

ట్రాన్స్ؚమిషన్ 

7-స్పీడ్‌ల DCT

ఇంధన సామర్ధ్యం 

-

హ్యుందాయ్ వెన్యూ N లైన్ టాప్-స్పెక్ వేరియెంట్ ధర, ఆన్-రోడ్ ధర కూడా బడ్జెట్ؚలోనే ఉంటుంది. ఈ SUVని 120PS 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు ఏడు-స్పీడ్‌ల DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్)తో అందిస్తున్నారు. ఇది N లైన్ కాబట్టి, కారు తయారీదారు దీని సస్పెన్షన్ మరియు స్టీరింగ్ వీల్ ఫీడ్ బ్యాక్ؚను కూడా స్పోర్టీగా ఉండే డ్రైవ్ మరియు హ్యాండ్లింగ్ కోసం మెరుగుపరిచారు. N లైన్ శ్రేణి ధరలు రూ.12.60 లక్షల నుండి రూ.13.74 లక్షల వరకు ఉన్నాయి. 

టాటా నెక్సాన్

ఉత్తమ వేరియెంట్ 

XZA ప్లస్ రెడ్ డార్క్ AMT

ధర

రూ. 13 లక్షలు

ఇంజన్ 

1.2-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్ 

120PS

టార్క్

170Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్‌ల MT / 6-స్పీడ్‌ల AMT

ఇంధన సామర్ధ్యం (క్లెయిమ్ చేసినది)

17.1kmpl

టాటా, నెక్సాన్ؚతో టర్బో-పెట్రోల్ؚ ఇంజన్‌ను ప్రామాణికంగా అందిస్తుంది. ఈ బడ్జెట్ؚలో లిమిటెడ్-రన్ రెడ్ డార్క్ ఎడిషన్ؚలో నెక్సాన్ టాప్-స్పెక్ వేరియెంట్ؚను మాన్యువల్ లేదా ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో ఎంచుకోవచ్చు. 120PS టర్బో-పెట్రోల్ మోటార్ؚతో, ఈ SUV మాన్యువల్ వేరియెంట్, సున్నా నుండి 100kmph వరకు వేగాన్ని 13.33 సెకన్‌లలో చేరుతుంది.  ఇందులో ఉన్న మరొక ఎంపిక 110PS 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, దీనిలో కూడా మాన్యువల్ లేదా AMT ఎంపికలు ఉంటాయి. ఈ సబ్-కాంపాక్ట్ SUV ధర రూ.7.80 లక్షల నుండి రూ.14.35 లక్షల వరకు ఉంటుంది. 

హ్యుందాయ్ i20 N లైన్

toyota glanza vs hyundai i20 n line vs tata altroz

ఉత్తమ వేరియెంట్ 

N8 DCT

ధర

రూ 12.27 లక్షలు

ఇంజన్ 

1-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్ 

120PS

టార్క్

172Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్‌ల iMT / 7-స్పీడ్‌ల DCT

ఇంధన సామర్ధ్యం (క్లెయిమ్ చేసినవి)

20kmpl / 20.25kmpl

టర్బో హ్యాచ్ కోరుకునే వారు హ్యుందాయ్ i20 N లైన్ؚను ఎంచుకోవచ్చు, భవిష్యత్తులో మరిన్ని యాక్సెసరీల మార్పు మరియు మెరుగుదలలకు అవకాశం ఉండే, పూర్తి ఫీచర్‌లతో టాప్ వేరియెంట్ؚను, ఇదే బడ్జెట్ؚలో సులభంగా పొందవచ్చు. ఇప్పటికే స్పోర్టీగా వస్తున్న ఈ హ్యాచ్‌బ్యాక్, N లైన్ వర్షన్ؚలో స్పోర్టియర్ అనుభవం కోసం ఇప్పుడు ధృఢమైన సస్పెన్షన్ మరియు వెయిటెడ్-స్టీరింగ్ వీల్ؚతో వస్తుంది. అంతేకాదు, దీని త్రోటియర్ ఎగ్జాస్ట్ నోట్ 'N లైన్' విలువను మరింత పెంచుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కోరుకునే వారికి, ఇక్కడ iMT (క్లచ్ పెడల్ లేని మాన్యువల్) ఎంపిక ఉంది. iMT వేరియంట్ 0-100kmph స్ప్రింట్‌ను 11.21 సెకన్‌లలో అందుకుంటుంది, అయితే సాధారణ i20 టర్బో-DCT వేరియంట్ 10.88 సెకన్‌లలో సాధించింది. హాట్ హ్యాచ్ రూ.10.16 లక్షల నుండి రూ.12.27 లక్షల వరకు విక్రయానికి అందుబాటులో ఉంది.

మహీంద్రా XUV300 టర్బోస్పోర్ట్ 

Mahindra XUV300

ఉత్తమ వేరియెంట్ 

W8 (O) టర్బోస్పోర్ట్

ధర

రూ. 12.90 లక్షలు

ఇంజన్ 

1.2-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్ 

130PS

టార్క్ 

250Nm వరకు

ట్రాన్స్ؚమిషన్ 

6-స్పీడ్‌ల MT

ఇంధన సామర్ధ్యం (క్లెయిమ్ చేసినది)

-

XUV300లో 110PS 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ప్రామాణికంగా ఉంటుంది, టర్బోస్పోర్ట్ వేరియెంట్ؚను మరింత శక్తివంతమైన 130PS వెర్షన్ؚతో పొందవచ్చు. XUV300 అన్నీ వేరియెంట్ؚలను టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో ఎంచుకోవచ్చు కానీ ఔత్సాహికులు పరిగణించవలసినది టర్బో స్పోర్ట్ؚను మాత్రమే. ఈ సబ్-కాంపాక్ట్ SUV ధర రూ.8.41 లక్షల నుండి రూ.14.07 లక్షల వరకు ఉంటుంది. 

రూ.10 లక్షల బడ్జెట్‌లో మరికొన్ని కొన్ని టర్బో-పెట్రోల్ కార్‌లను కూడా పొందవచ్చు, కానీ ఇవి ఎక్కువ బడ్జెట్ؚలో విక్రయానికి అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ఎంపికలు. 

(అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు)

గమనిక: సాధ్యమైన ప్రతిచోట, రోడ్ టెస్టులలో రికార్డ్ చేసిన పరీక్షించిన 0-100kmph సమయాలు మరియు ఇంధన సామర్ధ్య గణాంకాలను ఉపయోగించాము. 

ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ వెన్యూ N లైన్ ఆటోమ్యాటిక్

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai వెన్యూ ఎన్ లైన్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience