ఆశిస్తున్న ధరల పెంపుకు ముందు ఫీచర్‌లలో మార్పులను పొందునున్న వోక్స్వాగన్ మోడల్‌లు
వోక్స్వాగన్ వర్చుస్ కోసం ansh ద్వారా మార్చి 24, 2023 03:48 pm ప్రచురించబడింది
- 67 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
విర్టస్ؚ సరికొత్త ఫీచర్‌తో రానుంది, టైగూన్ టాప్-స్పెక్ వేరియెంట్‌ల ఫీచర్‌లు మిడ్-స్పెక్ؚకు జోడించబడ్డాయి
-
వోక్స్వాగన్ విర్టస్ అన్ని వేరియెంట్ؚలకు రేర్ ఫాగ్ ల్యాంప్ؚలను అందిస్తున్నారు.
-
టైగూన్ మిడ్-స్పెక్ వేరియెంట్ؚలు కమింగ్/లీవింగ్ హోమ్ లైట్ ఫంక్షన్ؚతో LED హెడ్ ల్యాంప్ؚలను పొందుతాయి.
-
ఈ కారు తయారీదారు నుండి విడుదల కానున్న మూడు మోడల్‌ల ధర ఏప్రిల్ నుంచి పెరగనుంది.
-
విర్టస్, టైగూన్ؚల ధరలు వరుసగా రూ.11.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ.11.56 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నాయి.
వోక్స్వాగన్ తయారీదారు నుండి వస్తున్న రెండు భారతదేశ-ప్రత్యేక మోడల్‌లు, విర్టస్ మరియు టైగూన్, తమ ఫీచర్‌ల జాబితాలో తేలికపాటి అప్ؚడేట్ؚలను పొందాయి. కొన్ని టాప్-స్పెక్ ఫీచర్‌లను బేస్-స్పెక్ వేరియెంట్‌లకు జోడించడంతో ఇవి రెండూ మరిన్ని ఫీచర్‌లతో రానున్నాయి. అంతేకాకుండా, ఈ కారు తయారీదారు తన లైన్అప్ؚలోని అన్నీ వాహనాల ధరలను ఏప్రిల్ 2023 నుంచి పెంచవచ్చు.
ఫీచర్ మార్పులు
ఈ మార్పులు చిన్నవే కానీ సహాయకరంగా ఉంటాయి. విర్టస్ సెడాన్ విషయంలో, వోక్స్వాగన్ రేర్ ఫాగ్ ల్యాంప్ؚలను అన్ని వేరియెంట్ؚలలో ప్రామాణిక ఫీచర్‌ల జాబితాకు జోడించింది.
ఇది కూడా చదవండి: సరికొత్త హ్యుందాయ్ వెర్నా వేరియెంట్-వారీ ఫీచర్‌లను కనుగొనండి
మరొక వైపు, టైగూన్‌లో అదనపు ఫీచర్‌లు లేకపోయినా వేరియెంట్-వారీగా మార్పులు చేయబడ్డాయి. 1.0-లీటర్ హై లైన్ మరియు 1.5-లీటర్ GT వేరియెంట్ؚలలో మరియు ప్రీమియం కాంపాక్ట్ SUVలు ఇప్పుడు ఆటో కమింగ్/లీవింగ్ హోమ్ లైట్‌లతో LED హెడ్‌ల్యాంపులను కలిగి ఉంటాయి. ఈ ఫీచర్‌లు ఇంతకు ముందు కేవలం టాప్-స్పెక్ 1.0-లీటర్ టాప్ లైన్ మరియు 1.5-లీటర్ GT ప్లస్ వేరియెంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది.
మునపటి పవర్ؚట్రెయిన్
ఈ రెండు మోడల్‌లు ఒకే ఇంజన్ ఎంపికలతో రానున్నాయి: 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (115PS మరియు 178Nm) మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ (150PS మరియు 250Nm). టైగూన్ రెండు ఇంజన్‌లకు ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ ప్రామాణికంగా ఉంటుంది, విర్టస్ؚలో ఇది కేవలం చిన్న ఇంజన్ؚతో వస్తుంది. ఆటోమెటిక్ ఎంపికల కోసం, చిన్న యూనిట్ 6-స్పీడ్‌ల టార్క్ కన్వర్టర్ؚతో, పెద్ద యూనిట్ 7-స్పీడ్‌ల DCTను (డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్) రెండు మోడల్‌లు పొందుతాయి. ఇతర కారు తయారీదారుల విధంగానే, వోక్స్వాగన్ త్వరలోనే ఈ ఇంజన్‌లను బిఎస్6 ఫేస్ 2 నియమాలకు అనుగుణంగా ఉండేలా మరియు E20 ఇంధనాల కోసం సిద్ధంగా ఉండేలా చేస్తుంది.
మరొక ధర పెంపు
ప్రస్తుతం, విర్టస్ మరియు టైగూన్ؚల ధరలు వరుసగా రూ.11.32 లక్షల నుండి రూ.18.42 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు మరియు రూ.11.56 లక్షల నుండి రూ.18.96 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. అందిన సమచారం ప్రకారం, వోక్స్వాగన్ ఏప్రిల్ ప్రారంభంలో ధరల పెంపును అమలు చేయనుంది (సుమారు 2 నుండి 3 శాతం) రూ.33.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చే కారు తయారీదారు ఫ్లాగ్ షిప్ మోడల్ టైగూన్ కూడా మరింత ప్రియం కావచ్చు.
పోటీదారులు
విర్టస్ కొత్త జనరేషన్ హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ మరియు స్కోడా స్లావియాలతో పోటీ పడనుంది. హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ వంటి వాటితో టైగూన్ పోటీ పడుతుంది.
ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జా Vs గ్రాండ్ విటారా; మరింత ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉండే CNG SUV ఏది?
ఇక్కడ మరింత చదవండి: విర్టస్ ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful