అమియో వాహనాన్ని, 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్న వోక్స్వాగన్
published on ఫిబ్రవరి 05, 2016 11:26 am by అభిజీత్ కోసం వోక్స్వాగన్ అమియో
- 9 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వోక్స్వాగన్ నుండి ఎంతగానో ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్యువి అమియో వాహనం మరియు ఇది, 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శింపబడుతుంది. అంతేకాకుండా ఈ వాహనం ఫిబ్రవరి 2 వ తేదీన బహిర్గతం అయ్యింది మరియు ఇది అనేక సార్లు బహిర్గతం అయ్యింది. ఈ వాహనం, పోలో హాచ్బాక్ ను పోలి ఉంటుంది. ఈ వాహనం లో అనేక అంశాలు ఒకేలా ఉంటాయి కానీ, ఈ వాహనాలను చూడటానికి వెర్వేరుగా ఉంటాయి. ఈ వోక్స్వాగన్ అమియో వాహనం, ఇదే విభాగంలో ఉండే స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 మరియు ఫోర్డ్ ఫిగో అస్పైర్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.
ఈ వాహనం చూడటానికి, ఈ సంస్థ యొక్క వెంటో వాహనాన్ని పోలి ఉంటుంది. ముందు భాగం ఒకేలా ఉంటుంది దీనిని ప్రక్కన పెడితే, సైడ్, వీల్స్ మరియు విండో లైన్లు వంటి అన్ని అంశాలు పోలో వాహనాన్ని పోలి ఉంటాయి. వెనుక భాగం మాత్రం వేరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం సబ్ 4 మీటర్ల వాహనం అని చెప్పవచ్చు. కానీ, స్విఫ్ట్ డిజైర్ వలే కాకుండా, రూఫ్ స్టిల్స్ బూట్ విభాగం లోనికి చొచ్చుకున్నట్లుగా కనిపిస్తాయి. డీప్ రెడ్ లైట్ల ను మినహాయిస్తే, బూట్ లిడ్ కు మాత్రం ఏ రకమైన కొత్తదనం అందించబడటం లేదు.
ఈ వాహనం యొక్క భద్రతా ప్రమాణాల విషయానికి వస్తే, వోక్స్వాగన్ సంస్థ, వారి లైనప్ లో ఉండే ప్రతి వేరియంట్ కు ఏబిఎస్, డ్యూయల్ ముందు ఎయిర్బాగ్లు, ఈబిడి వంటి అన్ని అంశాలు ప్రామాణికంగా అందించబడతాయి. ఈ జర్మన్ తయారీదారుడు ఈ వాహనం యొక్క లోపలి భాగానికి వెంటో వాహనానికి అందించబడిన నలుపు మరియు బీజ్ రంగు ఎంపికలతో ఉండే పధకం అందించబడుతుంది. ఈ అమియో వాహనానికి, సమాచార వ్యవస్థ, ఫ్లాట్ బోటం బహుళ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ డ్రైవర్ సమాచార క్లస్టర్ మరియు ఈ విభాగం లో మొదటి క్రూజ్ కంట్రోల్ వంటి అంశాలు అందించబడతాయి. వోక్స్వాగన్ సంస్థ ప్రకారం, ఈ వాహనానికి ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునే బారీ క్యాబిన్ అందించబడుతుంది.
ఈ అమియో వాహనం, ఒక పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ముందుగా పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ వాహనానికి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 74 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 88.7 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ మరియు డి ఎస్ జి ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.
- Renew Volkswagen Ameo Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful