'న్యాషనల్ సేల్స్ స్కిల్ కాంటెస్ట్' తో టొయోటా ఇండియా వారు వారి 2వ ఎడిషన్ ని నిర్వహించనున్నారు

అక్టోబర్ 14, 2015 10:19 am cardekho ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: కంపెనీ లోని సేల్స్ ఉద్యోగుల యొక్క నైపుణ్యం ప్రదర్శించే వేదికగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) వారు 'నేషనల్ సేల్స్ స్కిల్ కాంటెస్ట్' పేరిట సెకండ్ ఎడిషన్ ని నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ మూడు స్థాయిల్లో - డీలర్షి, రీజినల్ ఇంకా న్యాషనల్ గా జరిగాయి. అవగాహన, నిర్వహన, సాఫ్ట్ స్కిల్స్ వంటి విషయాలలో పోటీదారులను పరీక్షించారు.

ఈ ఏడాది కొత్త మరియూ వాడిన కార్ల అమ్మకాల ఉద్యోగులు టోయోటా డీలర్షిప్ ల నుండి వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కంపెనీ వారి సీనియర్ మ్యానేజ్‌మెంట్, టొయోటా పసఫిక్ ఆసియా యొక్క ప్రతినిధులు కూడా హాజరు అయ్యారు. డీలర్ ప్రిన్సిపల్స్ ఇంకా డీలర్ హెడ్లు కూడా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం, ఉద్యోగుల నైపుణ్యాన్ని ప్రదర్శించే ఒక వేడుక గా నిలుస్తుంది. కొత్త కార్ల విభాగంలో ముగ్గురు, పాత కార్ల విభగంలో ముగ్గురుగా విజేతలను ఎంపిక చేసి ఒక చెక్కు, మెడల్ ఇంకా ట్రోఫీని అందించారు. ఈ చాంపియన్లు జపాన్ లోని నగోయా లో జరిగే న్యాషనల్ చాంపియన్స్ అసెంబ్లీ లో పోటీ చేఅసె అవకాశం దక్కించుకున్నారు.

టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & డైరెక్టర్ అయిన మిస్టర్. ఎన్. రాజా గారు," పాల్గొన్న పోటీదారుల నిబద్దత ఇంకా ఉత్సాహం చూసి ఆనందంగా ఉంది. కస్టమర్ సంతృప్తి కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం. దీనికి ఉద్యోగులకు ఎంతో నేర్పు అవసరం. ఇందుకోసమే ఈ పోటీలు. టొయోటా టెక్నికల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ (TTTI) , టొయోటా టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (TTEP) ఇంకా ఇతర ట్రెయినింగ్ కార్యక్రమాలను నైపుణ్యం పెంచేందుకై నిర్వ్హిస్తున్నాము. ట్రెయినింగ్ ఎలా ఉంది, ఎంత వరకు ఇది ఉపయోగపడుతోంది వంటి విషయాలు వెలికి రావడానికే ఈ పోటీలు," అని అన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience