టొయోటా ఇండియా వారు Q సర్వీసు పండగ ఆనందాలను అందిస్తున్నారు!
జైపూర్:
ఈ క్యాంపెయిన్ అక్టోబరు 1 నుండి నవంబరు 30 , 2015 వరకు కొనసాగుతుంది
టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TMK) వారు 'Q సర్వీసు ఫెస్టివ్ డిలైట్శ్ పేరిట భారతదేశం లోని అన్ని టొయోటా డీలర్షిప్ లలో విడుదల చేశారు. ఈ క్యాంపెయిన్ ద్వారా వచ్చే పండుగ కాలంలో కస్టమర్లకు ప్రయోజనాలను మరియూ బహుమతులను అందించనున్నారు. ఇది అక్టోబరు 1 న మొదలు అయ్యి నవంబరు 30 వరకు కొనసాగుతుంది.
క్యాంపెయిన్ ప్యాకేజీలు ఆఫర్లలో ఇవి కలవు
- లక్కీ విజేతలకి దుబాయ్ ట్రిప్ ప్యాకేజీ
- వారం వారం లక్కీ డ్రా లో EM 60 (ఎక్స్ప్రెస్ మెయిన్‌టెనన్స్ 60 నిమిషాలలో)
- మూడవ వాహన్ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇతియోస్ కస్టమర్లకి ఆకర్షనీయమైన బహుమతులు మరియూ ఆఫర్లు
- కారు కేర్ ఉత్పత్తులపై 35% తగ్గింపు
- ఎంపిక చేసుకున్న ఉపకరణాల ప్యాకేజీలపై 60% వరకు తగ్గింపు
- బ్యాటరీలు మరియూ టైర్ల కొనుగోలపై ఖచితమైన బహుమతులు
- U-ట్రస్ట్ పై ఆకర్షణీయమైన ఆఫర్లు
- రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA) పై 5% డిస్కౌంటు
మిస్ కాకండి
టొయోటా కిర్లోస్కర్ మోటర్ లో కస్టమర్ సర్వీసు గ్రూపు కి వైస్ ప్రెసిడెంట్ అయిన మిస్టర్.బ్. పద్మనాభన్ గారు ఈ క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ," టొయోటా కిర్లోస్కర్ మోటర్ వారు కస్టమర్లకీ ఎల్లప్పుడూ తమని తాము మెరుగు పరుచుకుంటూ వారి అంచనాలను అందుకుంటూ వస్తూ ఉంటాము. మా ఈ 'Q ఫెస్టివ్ డిలైట్స్ క్యాంపెయిణ్ ని ఆరంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నాము. మేము ఎప్పుడూ మా కస్టమర్లకు వాహనం కొనుగోలు చేసిన దగ్గర నుండి వారి అన్ని అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ పండుగ కాలం సందర్భంగా మేము మా కస్టమర్లకి మరిన్ని సేవలను ఆఫర్ల రూపంలో అందించగలము అని ఆశిస్తున్నాము," అని అన్నారు.