Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హోండా ఎలివేట్ؚలో కనిపించని 10 ముఖ్యమైన ఫీచర్‌లు

హోండా ఎలివేట్ కోసం tarun ద్వారా జూన్ 09, 2023 06:51 pm ప్రచురించబడింది

హోండా ఎలివేట్‌ను ప్రీమియం ఆఫరింగ్ؚగా అందించనున్నారు, కానీ దిని పోటీదారులలో ఉన్న సౌకర్యాలు ఇందులో అందుబాటులో లేవు.

భారతదేశ కాంపాక్ట్ SUV విభాగంలో కొత్తగా వస్తున్న, హోండా ఎలివేట్ؚను ఆవిష్కరించారు. దీన్ని ఈ సంవత్సరం పండుగ సీజన్ؚలో సుమారు రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయనున్నారు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, సిట్రియోన్ C3 ఎయిర్ؚక్రాస్, స్కోడా కుషాక్, మరియు MG ఆస్టర్ వంటి వాటితో ఎలివేట్ పోటీ పడునుంది.

121 PS పవర్, 145 Nm టార్క్‌ను అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ హోండా ఎలివేట్ؚకు శక్తిని అందిస్తుంది, 6-స్పీడ్‌ల మాన్యువల్ లేదా CVT ఆటోమ్యాటిక్ ఎంపికతో వస్తుంది. ADAS, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సింగిల్-పేన్ సన్ؚరూఫ్ వంటి ఫీచర్‌లతో వస్తుంది. ఎలివేట్ అనేక ప్రీమియం ఫీచర్‌లు మరియు డిజైన్ డీటైల్స్ؚతో వస్తున్నపటికి, పోటీదారులతో పోలిస్తే 10 ముఖ్యమైన ఫీచర్‌లను అందించడం లేదు, అవి ఏమిటో చూద్దాం:

పనోరామిక్ సన్ؚరూఫ్

తన పోటీదారులు పనోరమిక్ సన్ؚరూఫ్ యూనిట్ؚను అందిస్తుందగా, ఎలివేట్ కేవలం సింగిల్-పేన్ సన్ؚరూఫ్‌తో వస్తుంది. హ్యుందాయ్ క్రెటా, MG ఆస్టర్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా అన్నిటిలో పనోరమిక్ సన్ؚరూఫ్ ఉంది. ప్రస్తుతం కాంపాక్ట్ మరియు భారీ SUVలలో ఈ ఫీచర్ ప్రజాదరణ పొందినది, ఇది క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. హోండా SUV ఆలస్యంగా వస్తున్నందున, ఈ ఫీచర్ తప్పకుండా ఉంటుంది అని భావించాము.

360-డిగ్రీ కెమెరా

హోండా రేర్ వ్యూ కెమెరా మరియు ‘లేన్‌వాచ్’ కెమెరా ఫీచర్ؚను అందిస్తుంది, కానీ 360-డిగ్రీల వ్యూ సెట్అప్ అందించడం లేదు. 360-డిగ్రీల కెమెరాతో, ఇరుకైన ప్రదేశాలలో కారును పార్క్ చేయడం లేదా బయటకు తీయడం సులభంగా ఉంటుంది. కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, MG ఆస్టర్ؚలలో ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి.

సంబంధించినది: SUVలు/e-SUVలను భారతదేశంలో ప్రవేశపెట్టనున్న హోండా, జులై 2023లో ప్రారంభం కానున్న ఎలివేట్ బుకింగ్ؚలు

పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే

ఆధునిక ఫీచర్‌లు అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో, ఎలివేట్‌ను 7-అంగుళాల TFT గల సెమీ-డిజిటల్ యూనిట్ؚతో అందిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అందుబాటులో ఉన్న వాటిలో ఉత్తమమైనది మరియు సిటీ సెడాన్ؚలో కూడా అందిస్తున్నపటికి, ప్రస్తుతానికి ఇది అప్‌డేట్‌డ్ ఫీచర్ మాత్రం కాదు. చాలా కాలం తర్వాత ఈ పోటీ విభాగంలో వస్తున్న సరికొత్త హోండాలో పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను అందిస్తే ఎలివేట్ క్యాబిన్ؚకు మెరుగైన జోడింపుగా ఉండేది. స్కోడా కుషాక్, వోక్స్ؚవ్యాగన్ టైగూన్, MG ఆస్టర్, సిట్రియోన్ C3 ఎయిర్ؚక్రాస్ؚలు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే సౌకర్యంతో అందిస్తున్నారు.

బ్రాండెడ్ ఆడియో సిస్టమ్

బ్రాండెడ్ ఆడియో సిస్టమ్, ఇది ఈ విభాగంలో చాలా సాధారణమైన ఫీచర్ అయినప్పటికీ హోండా ఎలివేట్‌లో మాత్రం అందుబాటులో లేదు. ఇతర మోడల్‌లలో విధంగా కనీసం టాప్-స్పెక్ ఫిట్ؚమెంట్ؚగా కూడా ఇది అందుబాటులో లేదు. క్రెటా మరియు సెల్టోస్ బోస్ సౌండ్ సిస్టమ్ؚను అందిస్తున్నాయి, గ్రాండ్ విటారా మరియు హైరైడర్ క్లారియన్ నుండి తమ సౌండ్ సిస్టమ్ؚలను అందిస్తున్నాయి.

పవర్డ్ డ్రైవర్ సీట్

ఎలివేట్‌లో హోండా అందించగలిగిన మరొక సౌకర్యవంతమైన ఫీచర్ పవర్డ్ డ్రైవర్ సీట్. ఈ విభాగంలో మరిన్ని ఫీచర్‌లతో వస్తున్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్‌ వాహనాలు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ؚను అందిస్తున్నాయి. వినియోగదారుల అనుభూతిని నిజంగానే మెరుగుపరచగల చెపుకోదగిన సౌకర్యం ఇది.

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు

భారతదేశ వాతావరణ పరిస్థితులకు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు ఎంతో ఉపయోగకరమైన జోడింపు. ఆస్టర్ మరియు C3 ఎయిర్ؚక్రాస్‌లో కాకుండా, ఇతర అన్నీ కాంపాక్ట్ SUVలో ఈ ఫీచర్ వస్తుంది. అంతేకాకుండా, దీన్ని ప్రస్తుతం అన్నీ విభాగాలలో అందిస్తున్నారు.

సంబంధించినవి: హోండా ఎలివేట్ ఎక్స్ؚటీరియర్ؚను ఈ 10 చిత్రాలలో పరిశీలించండి

టైప్ C USB పోర్ట్ؚలు

యాపిల్ మరియు ఇతర మొబైల్ ఫోన్ తయారీదారులు సాధారణ USB పోర్ట్ؚల నుండి టైప్-Cకి మారినప్పటికీ, హోండా ఇప్పటికీ ముందు వైపు సాధారణ పోర్ట్ؚలనే కొనసాగిస్తోంది. ప్రీమియం SUV అయినప్పటికీ, ఎలివేట్ కేవలం పాత జనరేషన్ సాంకేతికతకే ఎందుకు అందిస్తుందనే విషయం ప్రశ్నార్థకం.

ముందు వైపు 12V సాకెట్‌తో రెండు సాధారణ USB పోర్ట్‌లతో వస్తుంది, యాక్సెసరీ ద్వారా ఏదైనా ఆధునిక పరికరాన్ని ఛార్జ్ చేయడానికి ఇదే ఏకైక మార్గం. ఆశ్చర్యకరంగా, వెనుక, 12V సాకెట్‌ను అందించారు కానీ USB ఛార్జింగ్ పోర్ట్ లేదు.

రేర్ సన్ؚబ్లైండ్స్

హ్యుందాయ్ ఎలివేట్ؚలో అందుబాటులో లేని మరొక హీట్-ఫ్రెండ్లీ ఫీచర్ రేర్ విండో సన్‌బ్లైండ్. ఈ విభాగంలో ఎక్కువ ప్రజాదరణ పొందనప్పటికీ, క్రెటా మరియు సెల్టోస్ؚలు ఈ ఫీచర్‌ను తమ హై-ఎండ్ వేరియెంట్ؚలలో అందిస్తున్నాయి. ఈ విభాగంలో హోండా దీన్ని అందిస్తే పోటీదారులపై చేయి సాధించేది.

టర్బో పెట్రోల్ ఇంజన్ లేదు

సిటీలో ఉన్న 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ I-VTEC ఇంజన్ 121PS పవర్ అవుట్‌పుట్‌తో ఎలివేట్‌కు శక్తిని అందిస్తుంది. మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ వంటి సారూప్య ఇంజన్ ఎంపికలతో పోలిస్తే ఇందులో మరింత శక్తి ఉన్నప్పటికీ, ఈ విభాగంలోని ఇతర పోటీదారులు అందరూ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికను అందిస్తున్నారు. నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్‌తో పోలిస్తే టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ ఎంపిక టాప్-స్పెక్ కొనుగోలుదారులకు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది.

కొత్త హోండా SUVని ప్రయత్నించిన తరువాత, సిటీ సెడాన్ؚలో అందించే ఏకరితి ఎలివేట్ పవర్ؚట్రెయిన్ ఖచ్చితమైన అనుభవాన్ని తెలియజేస్తాము.

హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ లేదు

హోండా సిటీ బలమైన-హైబ్రిడ్ సాంకేతికత ఎంపికను పొందింది, ఇది 27.13kmpl వరకు ఇంధన సామర్ధ్యాన్ని క్లెయిమ్ చేస్తుంది. ఎలివేట్ సిటీ ప్లాట్ఫారంపై ఆధారపడి, i-VTEC ఇంజన్ؚను ఉపయోగిస్తున్నప్పటికీ, దీనిలో హైబ్రిడ్ ఎంపిక అందుబాటులో లేదు. అత్యధిక ఇంధన-సామర్ధ్య పవర్ؚట్రెయిన్ؚతో వచ్చే రెండు ఇతర SUVలు గ్రాండ్ విటారా మరియు హైరైడర్, ఈ ఫీచర్ؚను అందిస్తే ఈ విభాగంలోని ఇతర SUVలతో పోలిస్తే ఎలివేట్ ప్రత్యేకంగా నిలిచేది.

అయితే, ఎలివేట్ EV వర్షన్ కూడా వస్తుందని హోండా నిర్ధారించింది, ఇది 2026 నాటికి మార్కెట్‌లోకి వస్తుంది అని అంచనా. బహుశా ఈ కారణంతో SUV పూర్తిగా హైబ్రిడ్ ఎలక్ట్రిఫికేషన్ దశను దాటవేసింది.

హోండా ఎలివేట్ؚలో లేని ముఖ్యమైన ఫీచర్‌లు ఇవి. విడుదల కానున్న ఈ SUV అనుభవాన్ని త్వరలోనే మీతో పంచుకుంటాము, మరింత తెలుసుకునేందుకు CarDekhoను చూడండి. కొత్త హోండా SUVలో మీరు ఏ ఫీచర్‌లను ఆశిస్తున్నారు? క్రింద కామెంట్‌లో మాకు తెలియజేయండి.

t
ద్వారా ప్రచురించబడినది

tarun

  • 84 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హోండా ఎలివేట్

V
varunesh
Jun 8, 2023, 10:10:07 AM

Had great expectations from this car and I was eagerly waiting to update from my Honda City. Little disappointed with all misses on Elevate. Have to look out for an alternate compact Suv.

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర