• English
  • Login / Register

హైలక్స్‌పై భారీ డిస్కౌంట్‌లు అంటూ వచ్చిన కథనాలను అధికారికంగా ఖండించిన టయోటా, ఈ డిస్కౌంట్‌లు నిజమై ఉంటే బాగుండేదా?

టయోటా హైలక్స్ కోసం tarun ద్వారా జూలై 03, 2023 06:15 pm ప్రచురించబడింది

  • 71 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టయోటా హైలక్స్‌పై లక్షల రూపాయల విలువైన భారీ ప్రయోజనాలు అంటూ వచ్చిన కథనాలకు స్పందించిన కారు తయారీదారు

Toyota Hilux

  • హైలక్స్‌ను రూ.10 లక్షల వరకు డిస్కౌంట్ؚతో అందిస్తునట్లు అనేక కథనాలు వచ్చాయి.

  • ఈ కథనాలు నిజం కాదని, హైలక్స్‌పై ఎటువంటి డిస్కౌంట్ؚలు అందుబాటులో లేవని టయోటా నిర్ధారించింది.

  • ఇది 4x4 ప్రామాణికంగా 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌తో, మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలలో అందితున్నారు.

  • క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి సౌకర్యాలతో కేవలం రెండు వేరియెంట్ؚలలో అందించబడుతుంది.

  • హైలక్స్ ధర రూ.30.40 లక్షల నుండి రూ.37.90 లక్షలగా (ఎక్స్-షోరూమ్) ఉంది.

వేరియెంట్‌పై ఆధారపడి, టయోటా హైలక్స్‌ను రూ.6 లక్షల నుండి రూ.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్ؚలతో పొందవచ్చని అనేక కథనాలు వచ్చాయి. అయితే, అటువంటి ఆఫర్‌లు అందుబాటులో లేవని టయోటా నిర్దారించింది. 

ఒక అధికారిక ప్రకటనలో, టయోటా ఇలా స్పందించింది: టయోటా హైలక్స్‌ అధిక డిస్కౌంట్ ధరకు అందించబడుతోంది అని వచ్చిన కొన్ని మీడియా కథనాలలో ఎటువంటి నిజం లేదని అధికారికంగా తెలియజేస్తున్నాము. కంపెనీ అధికారికంగా ప్రకటించిన ధరల పట్టికను టయోటా కిర్లోస్కర్ మోటార్ ఖచ్చితంగా పాటిస్తుంది, ఈ ధరలు రూ.30,40,000 – రూ.37,90,000/- (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. 

క్లెయిమ్ చేసిన డిస్కౌంట్ؚలు

Toyota Hilux

డీలర్‌లు టాప్-ఎండ్ ఆటోమ్యాటిక్ హైలక్స్ వేరియెంట్ؚను సాధారణ ఆన్ؚరోడ్ ధర రూ.44 లక్షలకు బదులుగా భారీ డిస్కౌంట్ؚతో రూ.30 లక్షలకు అందిస్తున్నారు అంటూ కథనాؚలు వచ్చాయి. ఈ ధర ఫుల్లీ-లోడెడ్ ఇసుజు V-క్రాస్ ధరకు సమానంగా ఉంది. నిజమై ఉంటే ఇది చాలా అద్భుతమైన ఆఫర్ అని చెప్పవచ్చు, కానీ కారు తయారీదారు దీన్ని అధికారికంగా ఖండించారు. నిజానికి, ఈ వాహనంపై ఎటువంటి ఆఫర్‌లు లేవు, దీని సగటు వెయిటింగ్ పీరియడ్ మూడు నెలలుగా ఉంది.

ఇది కూడా చదవండి: టయోటా హైలక్స్‌పై ఆఫ్-రోడ్ సాహసయాత్ర 

టయోటా హైలక్స్ వివరాలు

Toyota Hilux

హైలక్స్ؚ 204PS పవర్ మరియు గరిష్టంగా 500Nm టార్క్‌ను అందించే 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ట్రాన్స్ؚమిషన్ ఎంపికలలో 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ యూనిట్‌లు ఉన్నాయి, 4 X 4 ప్రామాణికంగా ఉంటుంది. ఆఫ్-రోడింగ్ సామర్ధ్యాలకు సహాయపడే విధంగా ఈ వాహనం ట్రాన్స్ఫర్ కేస్‌తో తక్కువ పరిధి గల గేర్‌బాక్స్, ట్రాక్షన్ కంట్రోల్, మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ؚ వంటివి ఉపయోగిస్తుంది.

ఫీచర్‌ల విషయానికి వస్తే, టయోటా హైలక్స్‌లో LED హెడ్‌ల్యాంపులు, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. భద్రత పరంగా వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్/డిసెంట్ కంట్రోల్, ఏడు ఎయిర్ బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్‌లు మరియు రేర్ కెమెరాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: హైలక్స్ 5 టాప్ యాక్సెసరీల ధరలను వెల్లడించిన టయోటా – టెంట్, క్యానోపీ, ఇంకా మరిన్ని

టయోటా హైలక్స్ అత్యంత ఖరీదైనది మరియు ఇసుజు డి-మాక్స్ V-క్రాస్ వంటి వాటికి ప్రీమియం ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. 

ఇక్కడ మరింత చదవండి: టయోటా హైలక్స్ డీజిల్

was this article helpful ?

Write your Comment on Toyota హైలక్స్

explore మరిన్ని on టయోటా హైలక్స్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది పికప్ ట్రక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    Rs.1 సి ఆర్అంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience