2024 Hyundai Creta యొక్క డిజైన్ స్కెచ్‌లు విడుదల
హ్యుందాయ్ క్రెటా కోసం shreyash ద్వారా జనవరి 09, 2024 04:02 pm ప్రచురించబడింది
- 2.3K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2024 క్రెటా యొక్క చివరి లుక్, ఇటీవల విడుదలైన డిజైన్ స్కెచ్‌లను పోలి ఉంటుంది.
-
క్రెటా ముందు భాగంలో కొత్త గ్రిల్, కొత్త హెడ్ లైట్లు మరియు మరింత శక్తివంతమైన సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.
-
ఈ కొత్త SUV లో ఇన్వర్టెడ్ L ఆకారంలో ఉన్న డిజైన్తో వెడల్పాటి LED DRLలు కూడా అందించబడ్డాయి.
-
ముందు భాగంలో మాదిరిగానే, వెనుక భాగంలో ఇన్వర్టెడ్ L-ఆకారంలో కొత్త కనెక్టెడ్ LED టెయిల్లైట్లతో సెటప్ చేయబడుతుంది.
-
ఇది కియా సెల్టోస్ మాదిరిగా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ను పొందుతుంది.
-
హ్యుందాయ్ యొక్క ఫేస్ లిఫ్ట్ కాంపాక్ట్ SUV ఇప్పుడు ఆప్షనల్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160 PS / 253 Nm) తో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడుతుంది.
జనవరి 16, 2024 న, హ్యుందాయ్ క్రెటా యొక్క కొత్త మోడల్ మార్కెట్లో విడుదల చేయబడుతుంది, దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు టీజర్లను కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు, హ్యుందాయ్ 2024 క్రెటా యొక్క రెండు డిజైన్ స్కెచ్ లను కూడా విడుదల చేశారు, దీని ద్వారా ఈ SUV యొక్క ముందు మరియు వెనుక డిజైన్ మనం చూడవచ్చు. ఈ డిజైన్ స్కెచ్ లలో కొత్త క్రెటా ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి:
ఫ్రంట్
నవీకరించిన తరువాత, హ్యుందాయ్ క్రెటా మునుపటి కంటే బోల్డ్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో కొత్త దీర్ఘచతురస్రాకార గ్రిల్ మరియు ముందు భాగంలో బలమైన స్కిడ్ ప్లేట్ అందించబడ్డాయి. ఇది బానెట్ యొక్క మొత్తం వెడల్పును కవర్ చేసే ఇన్వర్టెడ్ L-ఆకారంలో డిజైన్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ మరియు హెడ్లైట్ల కోసం నవీకరించిన చతురస్రాకారంలో ఉన్న హౌసింగ్తో అందించబడుతుంది. మొత్తం మీద, ఈ డిజైన్ స్కెచ్లు 2024 హ్యుందాయ్ క్రెటా యొక్క బాహ్య డిజైన్ యొక్క లీకైన చిత్రాలతో సరిపోలుతాయి.
రేర్
వెనుక నుండి కూడా, క్రెటా 2024 మోడల్ చాలా బోల్డ్గా కనిపిస్తుంది, ముందు భాగం మాదిరిగానే ఇది ఇన్వర్టెడ్ L-ఆకారంలో కొత్త కనెక్టెడ్ LED టెయిల్లైట్లతో సెటప్ చేయబడుతుంది. ఇది కాకుండా, బలమైన స్కిడ్ ప్లేట్ కూడా ఇక్కడ అందించబడుతుంది. ఈ కారును తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా దీని చక్రాలను సరైన నిష్పత్తిలో అమర్చుతారు.
ఇది కూడా చదవండి: కియా సోనెట్ ఫేస్లిఫ్ట్ ఇంధన సామర్థ్య గణాంకాలు వెల్లడి
సరికొత్త క్యాబిన్ & ఫీచర్లు
కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క డ్యాష్ బోర్డ్ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ మరియు 10.25 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లేతో డ్యూయల్ స్క్రీన్ సెటప్ తో సరికొత్త డిజైన్లో ఉంటుంది. కొత్త హ్యుందాయ్ క్రెటాలో 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త క్రెటాలో 6 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరాతో పాటు మరింత భద్రత కోసం అధునాతన డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఉన్నాయి.
కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్
హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ఇప్పుడు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160 PS / 253 Nm) 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో జతచేయబడింది. ఇది ప్రస్తుత మోడల్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది, ఇందులో 115 PS మరియు 144 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్ బాక్స్ ఎంపికతో అందించబడుతుంది, మరియు 116 PS మరియు 250 Nm ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో అందించబడుతుంది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ వేరియంట్లు మరియు పవర్ట్రెయిన్ ఎంపికల వివరాలు వెల్లడి
ఆశించిన ధర & ప్రత్యర్థులు
2024 హ్యుందాయ్ క్రెటా ధర రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్, హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
మరింత చదవండి : క్రెటా ఆటోమేటిక్