ఫిబ్రవరి 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ బ్రాండ్‌లు
మార్చి 13, 2023 10:35 am ansh ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి తన విజయ పరంపరను కొనసాగించింది. హ్యుందాయ్, టాటాపై స్వల్ప ఆధిక్యతను సాధించింది.
కారు తయారీదారులు వెల్లడించిన అమ్మకాల గణాంకాలు జనవరి నెలలో భారతదేశ కారు మార్కెట్ వృద్ధి కనపరిచిందని స్పష్టం చేస్తుంది. అయితే, అనేక బ్రాండ్‌ల నెలవారీ (MoM) వృద్ధిలో తగ్గుదల ఆధారంగా చూస్తే, ఫిబ్రవరి నెలలో అమ్మకాలు మొదటి నెల కంటే మెరుగ్గా ఉండకపోవచ్చు.
ఇది కూడా చదవండి : ఫిబ్రవరి 2023 అమ్మకాల చార్ట్ؚలో మారుతి సుజుకి ఆధిపత్యం చూపింది.
ఫిబ్రవరి 2023లో టాప్ 10 బ్రాండ్‌ల విక్రయాల తీరును చూడండి:
కారు తయారీదారు |
ఫిబ్రవరి 2023 |
జనవరి 2023 |
MoM వృద్ధి (%) |
ఫిబ్రవరి 2022 |
YoY వృద్ధి (%) |
మారుతి సుజుకి |
1,47,467 |
1,47,348 |
0.1% |
1,33,948 |
10.1% |
హ్యుందాయ్ |
46,968 |
50,106 |
-6.3% |
44.050 |
6.6% |
టాటా |
42,865 |
47,990 |
-10.7% |
39.980 |
7.2% |
మహీంద్రా |
30,221 |
33,040 |
-8.5% |
27,536 |
9.8% |
కియా |
24,600 |
28,634 |
-14.1% |
18,121 |
35.8% |
టొయోటా |
15,267 |
12,728 |
19.9% |
8,745 |
74.6% |
రెనాల్ట్ |
6,616 |
3,008 |
119.9% |
6,568 |
0.7% |
హోండా |
6,086 |
7,821 |
-22.2% |
7,187 |
-15.3% |
MG |
4,193 |
4,114 |
1.9% |
4,528 |
-7.4% |
స్కోడా |
3,418 |
3,818 |
-10.5% |
4,503 |
-24.1% |
కొనుగోలు
-
మారుతి 10 శాతం వార్షికంగా (YoY) వృద్ధిని కనపరిచింది, కానీ MoM వృద్ధి కేవలం 0.1 శాతంగా ఉంది. 44 శాతం మార్కెట్ వాటాతో, ఫిబ్రవరి 2023లో మారుతి అమ్మకాల గణాంకాలు హ్యుందాయ్, టాటా మరియు మహీంద్ర మూడిటి అమ్మకాల మొత్తం కంటే ఎక్కువ.
- హ్యుందాయ్ YoY అమ్మకాలు 6.6 శాతం పెరిగాయి, కానీ MoM అమ్మకాలు 6.3 శాతానికి పడిపోయాయి.
- టాటా నెలవారీ అమ్మకాల గణాంకాలలో 10.7 శాతం తగ్గుదల కనిపించింది. కానీ వార్షిక అమ్మకాలు ఏడు శాతం పైనే పెరిగాయి.
- మహీంద్రా MoM అమ్మకాలు 8.5 శాతం తగ్గిపోగా, YoY గణాంకాలు దాదాపుగా 10 శాతం వరకు పెరిగాయి.
- కియా వార్షిక అమ్మకాల గణాంకాలు సుమారుగా 36 శాతం పెరిగాయి, దీని నెలవారీ అమ్మకాల గణాంకాలలో 14 శాతం కంటే ఎక్కువ తగ్గుదల కనిపించింది.
- MoM, YoY రెండిటి అమ్మకాలలో వృద్ధిని కనపరచిన రెండు బ్రాండ్‌లలో టయోటా ఒకటి, ఇది వరుసగా 19.9 శాతం మరియు 74.6 శాతంగా ఉంది. ఈ జాబితాలో 10,000 యూనిట్-సేల్స్ మార్క్ؚను దాటిన చివరి బ్రాండ్ ఇది.
- ఫిబ్రవరి 2023లో సంపూర్ణ సానుకూల గణాంకాలను కలిగి ఉన్న మరొక బ్రాండ్ రెనాల్ట్. నెలవారీ అమ్మకాలలో 119.9 శాతం వృద్ధిని సాధించి, ఈ బ్రాండ్ అధికంగా-విక్రయించిన బ్రాండ్ؚల జాబితాలో ఏడవ స్థానానికి ఎగబాకింది.
- హోండా MoM అమ్మకాలలో 22 శాతం, YOY అమ్మకాల గణాంకాలలో 15 శాతం కంటే ఎక్కువ నష్టాన్ని చూసింది.
- MoM గణాంకాలలో MG 1.9 శాతం వృద్ధిని కనపరించింది, దాని YoY అమ్మకాలు 7.4 శాతం పడిపోయాయి.
- స్కోడా నెలవారీ అమ్మకాలు 10.5 శాతం తగ్గాయి, దాని వార్షిక అమ్మకాల గణాంకాలలో 24.1 శాతం తగ్గుదల కనిపించింది.
మొత్తం మీద, ఫిబ్రవరిలో ప్రయాణీకుల వాహన పరిశ్రమ నెలవారీ అమ్మకాలు జనవరి 2023తో పోలిస్తే మూడు శాతం కంటే ఎక్కువ తగ్గాయని నివేదించబడింది.
ఇది కూడా చదవండి: ఈ 8 కార్‌లు, వాటి రంగురంగుల డ్యూయల్-టోన్ పెయింట్ ఎంపికలతో మీ హోలీని ప్రకాశవంతం చేసుకోండి
0 out of 0 found this helpful